Jump to content

అశోక్ కుమార్ పటేల్

వికీపీడియా నుండి
అశోక్ కుమార్ పటేల్

పదవీ కాలం
1998 – 2004
ముందు విశ్వంభర్ ప్రసాద్ నిషాద్
తరువాత మహేంద్ర ప్రసాద్ నిషాద్
నియోజకవర్గం ఫతేపూర్

వ్యక్తిగత వివరాలు

జననం (1954-06-30) 1954 జూన్ 30 (age 70)
హరియాపూర్, ఫతేపూర్ జిల్లా, ఉత్తర ప్రదేశ్, భారతదేశం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు సమాజ్‌వాది పార్టీ
జీవిత భాగస్వామి కుసుమ్ సింగ్
సంతానం అభినవ్ పటేల్, స్వప్నిల్ సింగ్, ప్రియాంక సింగ్, రుచి సింగ్, ప్రతీక్ సింగ్

అశోక్ కుమార్ పటేల్ (జననం 30 జూన్ 1954) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు.[1] ఆయన ఫతేపూర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2]

రాజకీయ జీవితం

[మార్చు]

అశోక్ కుమార్ పటేల్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1998లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఫతేపూర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి సమీప ప్రత్యర్థి బీఎస్‌పీ అభ్యర్థి విశ్వంభర్ ప్రసాద్ నిషాద్‭పై పై 46,436 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 1999 లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి సమీప ప్రత్యర్థి బీఎస్‌పీ అభ్యర్థి సూర్య బలి నిషాద్‭పై 1063 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండవసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

అశోక్ కుమార్ పటేల్ 2004లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఫతేపూర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి 1,01,484 ఓట్లతో మూడోస్థానంలో నిలిచాడు.

మూలాలు

[మార్చు]
  1. "Ashok Kumar Patel" (in ఇంగ్లీష్). Digital Sansad. 4 June 2024. Archived from the original on 26 June 2025. Retrieved 26 June 2025.
  2. "Lok Sabha 2019 constituency: VP Singh won from Fatehpur, BJP holds it now" (in అమెరికన్ ఇంగ్లీష్). Hindustan Times. 30 April 2019. Archived from the original on 9 June 2025. Retrieved 9 June 2025.