అశోక్ కె. వైద్
| అశోక్ కె. వైద్ | |
|---|---|
| జననం | జమ్మూ కాశ్మీర్, భారతదేశం |
| వృత్తి | మెడికల్ ఆంకాలజిస్ట్ |
| ప్రసిద్ధి | బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కీమోథెరపీ |
| పురస్కారాలు | పద్మశ్రీ పురస్కారం |
అశోక్ కె. వైద్, భారతీయ ఆంకాలజిస్ట్. ఎముక మజ్జ మార్పిడి (Hematopoietic stem cell transplantation) ఆయన ప్రత్యేకత.[1] ఉత్తర భారతదేశంలోని ప్రైవేట్ రంగంలో మొదటి 25 ఎముక మజ్జ మార్పిడుల ఘనత ఆయనదే.[2] ఆయన మేదాంత ది మెడిసిటీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్-డివిజన్ ఆఫ్ మెడికల్ ఆంకాలజీ అండ్ హేమోటాలజీకి నాయకత్వం వహిస్తున్నాడు.[3]
జీవితచరిత్ర
[మార్చు]1983లో జమ్మూ విశ్వవిద్యాలయం నుండి వైద్యశాస్త్రంలో పట్టభద్రుడైన తరువాత, 1989లో అదే సంస్థ నుండి ఇంటర్నల్ మెడిసిన్లో ఎండి పొందాడు. ఆ తరువాత, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఢిల్లీ ఆంకాలజీ విభాగంలో సీనియర్ రెసిడెంట్ గా పనిచేసాడు. తమిళనాడు లోని అడయార్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో సీనియర్ రెసిడెన్సీ చేస్తున్నప్పుడు ఆయన, చెన్నై లోని డాక్టర్ ఎం. జి. ఆర్. మెడికల్ యూనివర్శిటీ నుండి మెడికల్ ఆంకాలజీలో డిఎం చదువుకున్నాడు.[4] జమ్మూకి తిరిగి వచ్చిన తరువాత, ఆయన ప్రభుత్వ వైద్య కళాశాలలో కన్సల్టెంట్ ఆంకాలజిస్టుగా, ఇంటర్నల్ మెడిసిన్ విభాగంలో అధ్యాపకుడిగా చేరాడు. 1997 వరకు అక్కడ పనిచేశాడు, ఆ తరువాత ఆయన న్యూఢిల్లీలోని రాజీవ్ గాంధీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అండ్ రీసెర్చ్ సెంటర్లో మెడికల్ ఆంకాలజీలో సీనియర్ కన్సల్టెంట్ గా చేరాడు. ఆ తరువాత, 2007లో గుర్గావ్ లోని ఆర్టెమిస్ హెల్త్ ఇన్స్టిట్యూట్లో మెడికల్ ఆంకాలజీ విభాగానికి అధిపతిగా పనిచేసి, రెండు సంవత్సరాల తరువాత మేదాంతలో చేరాడు.[5]
అశోక్ కె. వైద్ ఆంకాలజీపై అనేక పరిశోధనా వ్యాసాలు రాసాడు. వాటిలో 30 వ్యాసాలు, శాస్త్రీయ వ్యాసాల ఆన్లైన్ రిపోజిటరీ అయిన రీసెర్చ్ గేట్లో ఉన్నాయి.[6] ఆయన ఇండియన్ కోఆపరేటివ్ ఆంకాలజీ నెట్వర్క్ (ICON) వ్యవస్థాపక సభ్యుడు. బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ గైనెక్ ఆంకాలజిస్ట్స్ (IAGO), ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IAMA), ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ క్లినికల్ మెడిసిన్ (IACM) వంటి సంస్థలలో ఆయన జీవితకాల సభ్యుడు. ఇండియన్ సొసైటీ ఆఫ్ మెడికల్ అండ్ పీడియాట్రిక్ ఆంకాలజీ (ISMPO), అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియా (API), అమెరికన్ సొసైటీ ఆఫ్ క్లినికల్ ఆంకాలజీ, యూరోపియన్ సొసైటీ ఫర్ మెడికల్ ఆంకాలజీ, యూరోపియన్ హెమటాలజీ అసోసియేషన్ (EHA) లలో కూడా ఆయన సభ్యుడు. ఆయన జెకె సైన్స్ కన్సల్టెంట్ ఎడిటర్, కరెంట్ ట్రెండ్స్ ఇన్ ఏషియన్ ఆంకాలజీ పత్రిక సంపాదకీయ బోర్డులో ఉన్నాడు.[7]
వైద్యశాస్త్రానికి ఆయన చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం 2009లో నాలుగో అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ ప్రదానం చేసింది.[8]
మూలాలు
[మార్చు]- ↑ "Ashok Vaid on Credihealth". Credihealth. 2016. Retrieved 21 February 2016.
- ↑ "Vaid on Medical Tourism Corporation". Medical Tourism Corporation. 2016. Retrieved 21 February 2016.
- ↑ "Our Doctors". Medanta. 2016. Archived from the original on 13 జూన్ 2017. Retrieved 21 February 2016.
- ↑ "Indian Cancer Care profile". Indian Cancer Care. 2016. Archived from the original on 7 August 2018. Retrieved 21 February 2016.
- ↑ "Vaid on India Cancer Surgery Site". India Cancer Surgery Site. 2016. Retrieved 21 February 2016.
- ↑ "ResearchGate listing". 2016. Retrieved 21 February 2016.
- ↑ "Editorial Board". JK Science. 2016. Archived from the original on 16 ఫిబ్రవరి 2020. Retrieved 21 February 2016.
- ↑ "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2016. Archived from the original (PDF) on 15 October 2015. Retrieved 3 January 2016.