అశోక్ ఖేనీ
అశోక్ ఖేనీ | |||
నంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కారిడార్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ చైర్మన్
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 1995 | |||
పదవీ కాలం 2013 మే 9 – 2018 మే 15 | |||
ముందు | బందెప్ప కాశెంపూర్ | ||
---|---|---|---|
తరువాత | బందెప్ప కాశెంపూర్ | ||
నియోజకవర్గం | బీదర్ సౌత్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జాతీయత | ![]() | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ (5 March 2018 నుండి ) | ||
ఇతర రాజకీయ పార్టీలు | కర్ణాటక మక్కల పక్ష (5 మార్చి 2018 వరకు) | ||
తల్లిదండ్రులు | మహరుద్రప్ప ఖేనీ[1] | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
అశోక్ శంకరప్ప ఖేనీ భారతదేశానికి చెందిన సినీ నిర్మాత, నటుడు, దర్శకుడు, వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు & కర్ణాటక బుల్డోజర్స్ క్రికెట్ జట్టు యజమాని.[2][3] ఆయన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్టూనిస్ట్స్ కు చైర్మన్ & బెంగళూరులో ఉన్న నంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కారిడార్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ కు మేనేజింగ్ డైరెక్టర్.[4][5]
అశోక్ ఖేనీ కర్ణాటక మక్కల్ పక్ష పార్టీని స్థాపించి 2013 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో బీదర్ సౌత్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై 2013 మే 9 నుండి 2018 మే 15 వరకు శాసనసభ్యుడిగా పని చేశాడు.
జననం, విద్యాభాస్యం
[మార్చు]అశోక్ ఖేనీ 1960 అక్టోబర్ 5న జన్మించి సూరత్కల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి ఎలక్ట్రికల్ ఇంజనీర్, మసాచుసెట్స్‌లోని వూస్టర్ పాలిటెక్నిక్ కాలేజీ నుండి మేనేజ్‌మెంట్ సైన్స్ & ఇంజనీరింగ్‌లో ఏం.ఎస్ పట్టా పొందాడు. ఆయన అమెరికన్ సంస్థలతో కలిసి పని చేసి, సొంతంగా ఒక సంస్థను స్థాపించి, తన పనిని కర్ణాటకకు మార్చాడు.[6]
రాజకీయ జీవితం
[మార్చు]అశోక్ ఖేనీ కర్ణాటక మక్కల్ పక్ష పార్టీని స్థాపించి[7] 2013 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో బీదర్ సౌత్ శాసనసభ నియోజకవర్గం నుండి కర్ణాటక మక్కల పక్ష పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి[8] తన సమీప ప్రత్యర్థి జేడీఎస్ అభ్యర్థి బందెప్ప కాశెంపూర్ పై 15788 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత 2018లో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[9][10]
అశోక్ ఖేనీ 2018 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి 35131 ఓట్లతో మూడో స్థానంలో, 2023 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి శైలేంద్ర బెల్డాలే చేతిలో 1,263 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయాడు.[11]
మూలాలు
[మార్చు]- ↑ "Kheny sweating it out in Bidar South" (in Indian English). The Hindu. 4 May 2013. Archived from the original on 20 April 2025. Retrieved 20 April 2025.
- ↑ "I lost Rs 100 crore in films: Kheny" (in ఇంగ్లీష్). Bangalore Mirror. 2 November 2014. Retrieved 20 April 2025.
- ↑ "When Ashok Kheny gave a bite instead of a byte". The Times of India. 4 February 2014. Archived from the original on 20 April 2025. Retrieved 20 April 2025.
- ↑ "Kheny says Gowda made him an offer" (in Indian English). The Hindu. 7 March 2010. Archived from the original on 20 April 2025. Retrieved 20 April 2025.
- ↑ "Ashok Kheny: miles of uncertainty" (in ఇంగ్లీష్). Mint. 25 April 2013. Archived from the original on 20 April 2025. Retrieved 20 April 2025.
- ↑ "The many facets of MLA and businessman Ashok Kheny". The Economic Times. 8 June 2016. Archived from the original on 20 April 2025. Retrieved 20 April 2025.
- ↑ "Yeddyurappa's new party another headache for BJP" (in ఇంగ్లీష్). India Today. 3 April 2012. Archived from the original on 20 April 2025. Retrieved 20 April 2025.
- ↑ "It's an unpredictable fight in Bidar South, Karnataka" (in Indian English). The Hindu. 25 April 2018. Archived from the original on 20 April 2025. Retrieved 20 April 2025.
- ↑ "I hereby declare: Businessman Ashok Kheny declares assets worth Rs 188.93 crore; Balachandra Jarkiholi's total worth at Rs 35.69 crore" (in ఇంగ్లీష్). The Indian Express. 7 May 2023. Archived from the original on 20 April 2025. Retrieved 20 April 2025.
- ↑ "Karnataka industrialist-MLA Ashok Kheny joins Congress, party eyes Lingayat votes" (in ఇంగ్లీష్). The Indian Express. 7 March 2018. Archived from the original on 20 April 2025. Retrieved 20 April 2025.
- ↑ "Karnataka Assembly Elections 2023: Bidar South". Election Commission of India. 13 May 2023. Archived from the original on 20 April 2025. Retrieved 20 April 2025.