అశోక్ గెహ్లాట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Shri Ashok Gehlot
అశోక్ గెహ్లాట్

Hon'ble Mr. Ashok Gehlot, Chief Minister, Rajasthan, INDIA


పదవీ కాలము
December 01, 1998 – December 8, 2003
ముందు Bhairon Singh Shekhawat
తరువాత Vasundhara Raje Scindia
నియోజకవర్గము Sardarpura, Jodhpur
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
December 13, 2008
ముందు Vasundhara Raje Scindia
తరువాత Incumbent

వ్యక్తిగత వివరాలు

జననం 03 May 1951
Mahamandir, Jodhpur
రాజకీయ పార్టీ Indian National Congress
జీవిత భాగస్వామి Sunita Gehlot
నివాసము 8, Civil Lines, Jaipur 302006 (INDIA)

అశోక్ గెహ్లాట్ (Ashok Gehlot) భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్ర 21వ & 23వ ముఖ్యమంత్రి.

వ్యక్తిగత జీవితం[మార్చు]

దివంగత లక్ష్మణ్ సింగ్ గెహ్లాట్ కుమారుడైన అశోక్ గెహ్లాట్ మే 3, 1951న జోధ్‌పూర్ (రాజస్థాన్) లో జన్మించారు. విజ్ఞానశాస్త్రం మరియు న్యాయవాద విద్యలో పట్టభద్రుడైన గెల్హాట్ అర్థశాస్త్రంలో M.A. కూడా పూర్తి చేశారు. శ్రీమతి సునీతా గెహ్లాట్‌ను ఆయన నవంబరు 27, 1977లో వివాహం చేసుకున్నారు, ఈ దంపతులకు ఒక కుమారుడు (వైభవ్) మరియు ఒక కుమార్తె (సోనియా) ఉన్నారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఫోటో గ్యాలరీ . రాజస్థాన్‌లోని సైనీ వర్గానికి చెందిన గెహ్లాట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (INS) పార్టీలో సభ్యుడు.

విద్యా వివరాలు[మార్చు]

అశోక్ గెహ్లాట్ B.Sc. (బ్యాచులర్ ఆఫ్ సైన్స్) డిగ్రీ, L.L.B. (బ్యాచులర్ ఆఫ్ లాస్) మరియు అర్థ శాస్త్రంలో M.A. (మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్) పూర్తిచేశారు.

రాజకీయ జీవితం[మార్చు]

విద్యార్థి జీవితం నుంచే ఆయన రాజకీయాలు మరియు సంఘ సేవా కార్యక్రమాల్లో క్రియాశీలక పాత్ర పోషించారు, గెహ్లాట్ 1980లో 7వ లోక్‌సభకు (1980–84) జోధ్‌పూర్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి మొట్టమొదటిసారి ఎన్నికయ్యారు. 8వ లోక్‌సభ (1984–1989), 10వ లోక్‌సభ (1991–1996), 11వ లోక్‌సభ (1996–1998), మరియు 12వ లోక్‌సభ (1998–1999) ల్లో గెహ్లాట్ జోధ్‌పూర్ పార్లమెంటరీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు.

సర్దార్‌పురా (జోధ్‌పూర్) శాసనసభ నియోజకవర్గం నుంచి ఎన్నికకావడం ద్వారా ఆయన ఫిబ్రవరి 1999లో 11వ రాజస్థాన్ శాసనసభ సభ్యుడయ్యారు. గెహ్లాట్ ఇదే శాసనసభ నియోజకవర్గం నుంచి 4.12.2003న 12వ రాజస్థాన్ విధానసభకు మరియు 8.12.2008న 13వ రాజస్థాన్ విధానసభకు తిరిగి ఎన్నికయ్యారు.

కేంద్ర మంత్రిగా[మార్చు]

అశోక్ గెహ్లాట్ మాజీ భారత ప్రధానమంత్రులు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, పివి నరసింహారావు మంత్రివర్గాల్లో కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఆయన మూడుసార్లు కేంద్ర మంత్రిగా వ్యవహరించారు. ఇందిరా గాంధీ భారతదేశ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో సెప్టెంబరు 2, 1982 నుంచి ఫిబ్రవరి 7, 1984 వరకు ఆయన పర్యాటక మరియు పౌర విమానయాన శాఖ ఉపమంత్రిగా ఉన్నారు. ఆ తరువాత ఆయన క్రీడా శాఖ ఉపమంత్రిగా నియమితులయ్యారు. గెహ్లాట్ క్రీడా మంత్రిత్వ శాఖలో ఫిబ్రవరి 7, 1984 నుంచి అక్టోబరు 31, 1984 వరకు మరియు తిరిగి నవంబరు 12, 1984 నుంచి డిసెంబరు 31, 1984 వరకు సేవలు అందించారు. ఇక్కడి నుంచి ఆయన సహాయమంత్రిగా మారారు. గెహ్లాట్ డిసెంబరు 31, 1984 నుంచి సెప్టెంబరు 26, 1985 వరకు పర్యాటక మరియు పౌర విమానయాన శాఖ సహాయమంత్రిగా పనిచేశారు. తరువాత, ఆయన ప్రధానమంత్రి నియంత్రణలోని టెక్స్‌టైల్స్ శాఖకు స్వతంత్ర హోదాలో సహాయమంత్రిగా పనిచేశారు. జూన్ 21, 1991 నుంచి జనవరి 18, 1993 వరకు గెహ్లాట్ ఈ పదవిలో కొనసాగారు.

రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా[మార్చు]

రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వంలో కొద్దికాలంపాటు జూన్ 1989 నుంచి నవంబరు 1989 వరకు హోం మరియు PHED శాఖ మంత్రిగా పనిచేశారు.

AICC/CWC చరిత్ర[మార్చు]

కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రోత్సహించడం మరియు ప్రచారం చేయడంలో గెహ్లాట్ చేసిన అలుపెరగని కృషికి ఫలితంగా, ఆయనను జూలై 17, 2004న ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఫిబ్రవరి 18, 2009 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగారు. కాంగ్రెస్ పార్టీకి నమ్మినబంటుగా పనిచేసిన కార్యకర్తగా గెహ్లాట్‌ను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (ప్రత్యేక ఆహ్వానితుడు) సభ్యుడిగా చేశారు, అంతేకాకుండా ఆయనకు హిమాచల్‌ప్రదేశ్ మరియు చత్తీస్‌గఢ్ రాష్ట్రాల పార్టీ ఇన్‌ఛార్జి బాధ్యతలను అప్పగించారు. జనవరి 2004 నుంచి జూలై 2004 వరకు ఆయన ఈ బాధ్యతలను నిర్వహించారు.

RPCC అధ్యక్షుడిగా[మార్చు]

అశోక్ గెహ్లాట్ 34 సంవత్సరాల వయస్సులోనే రాజస్థాన్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడయ్యారు. ఆయన సెప్టెంబరు 1985 నుంచి జూన్ 1989 వరకు RPCC అధ్యక్షుడిగా మొదటిసారి పనిచేశారు. డిసెంబరు 1, 1994 నుంచి ఏప్రిల్ 14, 1999 వరకు ఆయన RPCC అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు నిర్వహించారు.

1973 నుంచి 1979 వరకు రాజస్థాన్ NSUI అధ్యక్షుడిగా గెహ్లాట్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగాన్ని పటిష్ఠపరిచారు. 1979 నుంచి 1982 వరకు జోధ్‌పూర్ నగర జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేశారు. దీనితోపాటు, 1982లో రాజస్థాన్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (I) ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు.

దాతృత్వ చరిత్ర[మార్చు]

1971లో బంగ్లాదేశ్ విమోచన యుద్ధం సందర్భంగా గెహ్లాట్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని‌ బాంగావ్ మరియు 24 పరగణాల జిల్లాల్లో శరణార్థ శిబిరాల్లో సేవలు అందించారు. సంఘ సేవపై ఉన్న ఆసక్తితో గెహ్లాట్ మురికివాడలు, జుగ్గీ ప్రాంతాల అభివృద్ధికి సేవలు చేశారు, సేవాగ్రామ్, వర్ధా, ఔరంగాబాద్, ఇండోర్ మరియు అనేక ఇతర ప్రదేశాల్లో తరుణ్ శాంతి సేన ఆధ్వర్యంలో జరిగిన శిబిరాల్లో క్రియాశీలంగా వ్యవహరించారు. నెహ్రూ యువ కేంద్రా ద్వారా యువజన విద్య విస్తరణకు ఆయన కృషి చేశారు. కుమార్ సాహిత్య పరిషత్ మరియు రాజీవ్ గాంధీ మెమోరియల్ బుక్ బ్యాంక్, జోధ్‌పూర్‌లలో కూడా ఆయన క్రియాశీల సభ్యుడిగా పనిచేశారు.

భారత్ సేవా సంస్థాన్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఆయన ఉన్నారు. ఇది సంఘ సేవా కార్యక్రమాలకు ఉద్దేశించబడింది, సంస్థాన్ పేద విద్యార్థులకు రాజీవ్ గాంధీ మెమోరియల్ బుక్ బ్యాంక్ ద్వారా ఇచిత పుస్తకాలు మరియు యాంబులెన్స్ సేవలు ఏర్పాటు చేసింది. జోధ్‌పూర్‌లోని శ్రీ రాజీవ్ గాంధీ సేవా సదన్‌లో ఒక రీడింగ్ రూమ్‌ను ఏర్పాటు చేసింది.

రాజీవ్ గాంధీ స్టడీ సర్కిల్, న్యూఢిల్లీ ఛైర్మన్‌గా కూడా ఉన్నారు, ఈ సంస్థ దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయ/కళాశాల విద్యార్థులు మరియు అధ్యాపకుల ప్రయోజనాల కోసం పనిచేస్తుంది.

లోక్‌సభ అనుభవం[మార్చు]

గెహ్లాట్ తనను ఎల్లప్పుడూ ప్రభుత్వ నిధులు మరియు సంపదకు ధర్మకర్తగా పరిగణించుకున్నారు. ఆయన ప్రజా పద్దుల కమిటీ (లోక్‌సభ) లో 1980 నుంచి 1982 వరకు సభ్యుడిగా ఉన్నారు. ఆయన కమ్యూనికేషన్స్‌కు సంబంధించిన సంప్రదింపుల కమిటీ (10వ లోక్‌సభ) సభ్యుడిగా కూడా వ్యవహరించారు. రైల్వేలకు సంబంధించిన స్థాయీ సంఘం (10వ మరియు 11వ లోక్‌సభ) లో సభ్యుడిగా పనిచేయడంతోపాటు, విదేశీ వ్యవహారాల సంప్రదింపుల కమిటీ (11వ లోక్‌సభ) సభ్యుడిగా కూడా ఉన్నారు.

రాజస్థాన్ ముఖ్యమంత్రిగా[మార్చు]

అశోక్ గెహ్లాట్ ముఖ్యమంత్రిగా మొదటి హయాంలో (1-12-1998 నుంచి 8-12-2003) అసాధారణ కరువు నిర్వహణ వ్యవస్థ, విద్యుత్ ఉత్పత్తి, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఉద్యోగాల సృష్టి, పారిశ్రామిక మరియు పర్యాటక రంగాలకు ప్రోత్సాహం, ఆర్థిక నిర్వహణ మరియు మంచి పాలన అందించడంలో విజయవంతమయ్యారని ఆయన మద్దతుదారులు ప్రశంసిస్తున్నారు. 2003లో, రాజస్థాన్ రాష్ట్ర శాసనసభ (విధాన సభ) ఎన్నికల్లో గెహ్లాట్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ పరాజయం పాలైంది, ప్రధాన ప్రతిపక్షమైన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వసుంధరా రాజే సింధియా ఈ ఎన్నికల్లో తమ పార్టీకి విజయం సాధించిపెట్టారు, ఆపై ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

గెహ్లాట్ యొక్క ప్రసిద్ధ నినాదం "సేవ్ వాటర్, సేవ్ ఎలక్ట్రిసిటీ, ఎడ్యుకేట్ ఆల్ (నీటిని పొదుపు, విద్యుత్ పొదుపు, అందరినీ విద్యావంతులు చేయండి)".

రాజస్థాన్ ముఖ్యమంత్రిగా గెహ్లాట్ రెండోసారి డిసెంబరు 13, 2008న పదవీ బాధ్యతలు స్వీకరించారు.

నిర్వహించిన పదవులు[మార్చు]

పార్లమెంట్ సభ్యుడు (లోక్‌సభ) :

 • 1980 - 84 - ఏడో లోక్‌సభ
 • 1984 - 89 - ఎనిమిదో లోక్‌సభ
 • 1991 - 96 - పదో లోక్‌సభ
 • 1996 - 98 - పదకొండో లోక్‌సభ
 • 1998 - 99 - పన్నెండో లోక్‌సభ

ఇతరాలు:

 • 1980 - 82 - సభ్యుడు, ప్రజా పద్దుల కమిటీ, లోక్‌సభ
 • 1982 - 83 - కేంద్ర ఉపమంత్రి, పర్యాటక శాఖ
 • 1983 - 84 - కేంద్ర ఉపమంత్రి, పర్యాటక మరియు పౌర విమానయాన శాఖ
 • 1984 - 84 - కేంద్ర ఉపమంత్రి, క్రీడా శాఖ
 • 1984 - 85 - కేంద్ర సహాయమంత్రి, పర్యాటక మరియు పౌర విమానయాన శాఖ
 • 1989 - 89 - మంత్రి, హోం మరియు PHED శాఖ, రాజస్థాన్ ప్రభుత్వం
 • 1991 - 93 - కేంద్ర సహాయమంత్రి, టెక్స్‌టైల్స్ శాఖ (స్వయంప్రతిపత్తి)
 • 1991 - 96 - కమ్యూనికేషన్ సంప్రదింపుల కమిటీ (లోక్‌సభ)
 • 1991 - 98 - రైల్వే స్థాయీ సంఘం (10వ & 11వ లోక్‌సభ)
 • 1996 - 98 - విదేశీ వ్యవహారాల సంప్రదింపుల కమిటీ (లోక్‌సభ)
 • 01-12-98 to 04-12-03 - ముఖ్యమంత్రి, రాజస్థాన్
 • 13-12-2008 నుంచి ప్రస్తుతం - ముఖ్యమంత్రి, రాజస్థాన్

నిర్వహించిన ఇతర పదవులు:

 • 1974 - 79 - అధ్యక్షుడు, రాజస్థాన్ NSUI
 • 1979 - 82 - అధ్యక్షుడు, నగర జిల్లా కాంగ్రెస్ కమిటీ, జోధ్‌పూర్
 • 1982 - ప్రధాన కార్యదర్శి - రాజస్థాన్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ
 • 1985 - 89, 1994–97, 1997 - 99 - అధ్యక్షుడు, రాజస్థాన్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ
అంతకు ముందువారు
భైరాన్‌సింగ్ షెకావత్
రాజస్తాన్ ముఖ్యమంత్రులు
1998—2003
తరువాత వారు
వసుంధర రాజే
అంతకు ముందువారు
వసుంధర రాజే
రాజస్తాన్ ముఖ్యమంత్రులు
2008—ప్రస్తుతం
తరువాత వారు
ఉంచుతారు

సూచనలు[మార్చు]

బాహ్య లింకులు[మార్చు]

 • ఆల్ ఎబైట్ మిస్టర్ అశోక్ గెహ్లాట్, చీఫ్ మినిస్టర్, రాజస్థాన్, ఇండియా వెబ్‌సైట్ : www.cmo.rajasthan.gov.in
 • అశోక్ గెహ్లాట్ ఆన్ టీఓఐ అశోక్ గెహ్లాట్ టుక్ ఎవిరివన్ బై సర్‌ప్రైజ్ ఎర్లియర్ దిస్ మంత్ వెన్ హి డిసైడెట్ టు క్లాంప్ డౌన్ ఆన్ ప్రవీన్ తోగాడియా ఆఫ్ వీహెచ్‌పీ. ది ఫైర్‌బ్రాండ్ హిందుత్వా లీడర్ వాజ్ అరెస్టెడ్ ఫర్ డిస్ట్రబింగ్ ట్రిషుల్స్ అండ్ మేకింగ్ ఇన్‌ఫ్లమేటరీ స్పీచెస్. ఇన్ ఎ కాన్వర్జేషన్ విత్ నీలాభ్ మిశ్రా, ది చీఫ్ మినిస్టర్ డిఫెండ్స్ హిజ్ గవర్నమెంట్ యాక్షన్: [1]
 • Ashok Gehlot on ZEE TV (RU-BA-RU) [2]
 • [3]
 • అశోక్ గెహ్లాట్ డీటైల్స్- http://rajassembly.nic.in/ashok-gehlot.htm