అశోక మెహతా (రాజకీయవేత్త)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అశోక మెహతా
అశోక మెహతా (రాజకీయవేత్త)


పదవీ కాలం
1954-1962, 1967–1971

ప్రణాళిక, పెట్రోలియం, రసాయనాల మంత్రి
పదవీ కాలం
1966-1969
ముందు బలి రామ్ భగత్ (ప్రణాళిక మంత్రి)
తరువాత తెలియదు
ముందు ఓ. వి. అలగేసన్ (పెట్రోలియం, రసాయనాల మంత్రి)
తరువాత తెలియదు

వ్యక్తిగత వివరాలు

జననం (1911-10-24)1911 అక్టోబరు 24
భావనగర్, బ్రిటిష్ రాజ్
మరణం 1984 డిసెంబరు 10(1984-12-10) (వయసు 73)
న్యూఢిల్లీ, భారతదేశం
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్

అశోక మెహతా (1911 అక్టోబరు 24 - 1984 డిసెంబరు10) గుజరాత్ లోని భావనగర్ జన్మించాడు. అతను ఒక భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, సోషలిస్ట్ రాజకీయవేత్త. అతను భారత జాతీయ కాంగ్రెస్ సంస్థ సోషలిస్ట్ వింగ్ కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీని, రాంబ్రీక్ష్ బేణిపురి, జయ ప్రకాష్ నారాయణ్‌తో కలిసి నిర్వహించడానికి సహాయం చేసాడు. బొంబాయి నగరరాజకీయాలు, ప్రభుత్వంలో చురుకుగా పాల్గొన్నాడు.[1]

జీవితం తొలి దశ

[మార్చు]

అశోక్ మెహతా 1911 అక్టోబరు 24న భావ్‌నగర్‌లో గుజరాతీ రచయిత రంజిత్రమ్ మెహతాకు జన్మించాడు.[2] అతను తన ప్రాథమిక విద్యను అహ్మదాబాద్, షోలాపూర్ నగరాలలో పూర్తి చేశాడు. అతను 1931లో ముంబాయి విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రుడయ్యాడు.అక్కడ అతనికి స్వదేశీ ఉద్యమానికి ఆకర్షితుడయ్యాడు.[3][4][5]

జీవిత గమనం

[మార్చు]

అతను 1932లో శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొన్నందుకు జైలుపాలయ్యాడు.1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో మెహతా చురుకుగా పాల్గొన్నాడు. బ్రిటిష్ వారు అతనిని నిర్బంధించారు. అతనికి ఐదుసార్లు కఠిన కారాగార శిక్ష విధించారు.[5][6] భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత, అతను బొంబాయిలో ట్రేడ్ యూనియన్లను నిర్వహించడానికి సహాయం చేసాడు.ఐ.ఎన్.టి.యు.సి వ్యవస్థాపకులలో అతను ఒకడు.[7] అతను 1946 నుండి 1947 వరకు బొంబాయి నగర మేయర్‌గా పనిచేశాడు.1950 ల ప్రారంభంలో మెహతా క్రియాశీల రాజకీయాల నుండి కొంతకాలం విరమణ అయ్యాడు. అతని అనుభవాలు, భారతదేశ స్వాతంత్ర్య పోరాటం, సోషలిస్ట్ సంస్కరణల ప్రాముఖ్యతపై అనేక పుస్తకాలు రాశాడు.1950 లో,అతను సోషలిస్ట్ పార్టీ ఎనిమిదవ సెషన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.[8]

తిరిగి రాజకీయ జీవితం

[మార్చు]

అశోక మెహతా సోషలిస్ట్ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు.1952 సెప్టెంబరులో, కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ, సోషలిస్ట్ పార్టీ కలిసి ప్రజాసోషలిస్ట్ పార్టీ (పి.ఎస్.పి) లో విలీనం చేయబడ్డాయి. ఇందులో రామ్ మనోహర్ లోహియా, మెహతా ప్రధాన పాత్ర పోషించారు.[9] అశోక మెహతా కొత్త పార్టీ ప్రధాన కార్యదర్శి అయ్యాడు.[10] అతను 1959-1963లో ప్రజాసోషలిస్ట్ పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరించాడు.1956లో స్థాపించబడిన భారతదేశపు మొట్టమొదటి స్వతంత్ర ఆర్థిక విధాన సంస్థ కొత్త ఢిల్లీలోని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ మొదటి పాలకమండలి వ్యవస్థాపక సభ్యుడిగా అశోక మెహతా పనిచేసాడు.[11] 1963లో,అతను ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ ఛైర్మన్‌గా పనిచేశాడు.1964 తర్వాత కేంద్ర మంత్రిగా పనిచేశాడు.[5] ప్రజా సోషలిస్ట్ పార్టీ నుండి బహిష్కరించబడిన తరువాత, అతను 1964లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌లో చేరాడు.1969లో కాంగ్రెస్ విడిపోయిన తరువాత ఇందిరాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ (ఐ) కూటమి తరువాత, మెహతా కాంగ్రెస్ (ఒ) కూటమిలో చేరాడు.

లోక్‌సభ సభ్యుడు

[మార్చు]

అతను 1954-1957,1957-1962 మొదటి, రెండువ లోక్‌సభల సభ్యుడుగా పనిచేసాడు.[12][13] అతను 1967-1070 జరిగిన 4వ లోక్‌సభకు భండారా నుండి మూడోసారి ఎన్నికయ్యాడు.[14] అతను 1966 ఏప్రిల్ 3 నుండి 1967 ఫిబ్రవరి 26 వరకు రాజ్యసభ సభ్యుడుగా వ్యవహరించాడు.[5][15] అతను 1975 జూన్ 26న ఎమర్జెన్సీ సమయంలో అరెస్టయ్యాడు.హర్యానాలోని రోహ్‌తక్ జైలులో నిర్బంధించబడ్డాడు.[6] 1977లో అతను జనతా ప్రభుత్వంలో అశోక్ మెహతా కమిటీ ఛైర్మన్‌గా ఉన్నాడు.

మరణం

[మార్చు]

అతను 1984 డిసెంబరు 10న న్యూఢిల్లీలో మరణించాడు.[16]

ప్రధాన పనులు

[మార్చు]
  • భారతదేశంలో ఆర్థిక ప్రణాళిక
  • భారతదేశానికి ఎవరు యజమాని? (1950)
  • ప్రజాస్వామ్య సోషలిజం (భారతీయ విద్యా భవన్)
  • సోషలిజంలో అధ్యయనాలు (భారతీయ విద్యా భవన్)
  • సోషలిస్ట్ యుగంలో ప్రతిబింబాలు (సి. చాంద్, కో. )

మూలాలు

[మార్చు]
  1. "Members Bioprofile". loksabhaph.nic.in. Retrieved 2022-10-08.
  2. "Asoka Mehta". veethi.com. Retrieved 2021-09-19.
  3. Mainstream. N. Chakravartty. 1994. p. 36.
  4. Himmat. Vol. 2. May 1976. p. 496.
  5. 5.0 5.1 5.2 5.3 Grover, Verinder (1994). Asoka Mehta. Deep & Deep Publications. ISBN 978-81-7100-567-3.
  6. 6.0 6.1 Case Studies on Human Rights and Fundamental Freedoms: A World Survey, Volume 3, 1987
  7. Career Launcher India Ltd (2009). India Business Yearbook. p. 284. The Congress INTUC was born on 3 May 1947 as a historic necessity, just before India attained independence. ... Its founders included Ashok Mehta, RS Ruikar, Maniben Klater, ...
  8. Verinder Grover (1994). Asoka Mehta. Deep & Deep Publications. pp. 11–. ISBN 978-81-7100-567-3.
  9. S.N. Pandey; A.K. Thakur (2009). Economic Ideas of Dr. Ram Manohar Lohia. p. 64.
  10. N. Jayapalan (2000). Indian Political Thinkers: Modern Indian Political Thought.
  11. National Council of Applied Economic Research
  12. "Members : Lok Sabha". loksabhaph.nic.in. Retrieved 2021-09-19.
  13. "Members : Lok Sabha". loksabhaph.nic.in. Retrieved 2021-09-19.
  14. "Member's Profile". Lok Sabha Secretariat, New Delhi. Archived from the original on 14 March 2012. Retrieved 23 February 2012.
  15. "Member's Profile" (PDF). Rajya Sabha Secretariat, New Delhi. Retrieved 23 February 2012.
  16. "1st Session of the 8th Lok Sabha" (PDF). Lok Sabha Debates. 1 (4): 13–14. 18 January 1985.

వెలుపలి లంకెలు

[మార్చు]