అశ్వరాజ్ పిక్చర్స్
Appearance
అశ్వరాజ్ పిక్చర్స్ ఒక సినీ నిర్మాణ సంస్థ. దీనిని కె.గోపాలరావు స్థాపించాడు.[1]
నిర్మించిన సినిమాలు
[మార్చు]- అన్నదాత : 1954 డిసెంబరు 17న విడుదలైంది. వేదాంతం రాఘవయ్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు, అంజలీదేవిలు నటించారు.
- వినాయక చవితి (1957) సముద్రాల రాఘవాచార్య (రచయిత) దర్శకత్వం వహించిన మూడు చిత్రాలలో ఒకటి.
- దీపావళి (1960) నిర్మాత కె. గోపాలరావు, రజనీకాంత్ దర్శకత్వంలో భారీ తారాగణంతో ‘దీపావళి’ సినిమా నిర్మించారు.[2]
- శ్రీ సత్యనారాయణ మహత్మ్యం (1964) పి.సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమాకు ఎస్.రజనీకాంత్ దర్శకత్వం వహించాడు. నందమూరి తారక రామారావు, టి.కృష్ణముమారి లు ప్రధాన తారాగణంగా నటించగా ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీతాన్నందించాడు.
మూలాలు
[మార్చు]- ↑ "Indiancine.ma". Indiancine.ma. Retrieved 2021-06-19.
- ↑ "సితార - తెలుగు సినీ రాకుమారుడు... కత్తి కాంతారావు - సినీ మార్గదర్శకులు - టాలీవుడ్". సితార. Retrieved 2020-04-20.