Jump to content

అశ్విన్ చితలే

వికీపీడియా నుండి
అశ్విన్ చితలే
2024 లో అశ్విన్
జననం1996 ఏప్రిల్ 18
పూణే, మహారాష్ట్ర, భారతదేశం
జాతీయతభారతీయుడు
వృత్తినటుడు, కవి
క్రియాశీలక సంవత్సరాలు2004–ప్రస్తుతం
Notable workశ్వాస్ (2004)

ట్యాక్సీ నం. 9211 (2006)

ఆశాయే (2010)
పురస్కారాలుజాతీయ ఉత్తమ బాలనటుడు పురస్కారం

అశ్విన్ చితలే భారతీయ కవి, రచయిత, కథకుడు, నటుడు.[1][2][3] ఇతన్ని అశ్విన్ అఫ్రాద్ అని కూడా అంటారు. అతను మరాఠీ భాషా చిత్రం శ్వాస్ (2004)లో తన నటనకు ఉత్తమ బాల నటుడిగా జాతీయ అవార్డును గెలుచుకున్నాడు.[4] నగేష్ కుకునూర్ దర్శకత్వం వహించిన హిందీ చిత్రం ఆశాయేలో గోవింద పాత్రను పోషించాడు.[5] అతను నటించిన ఇతర హిందీ చిత్రాలు జోర్ లగా కే... హైయా! (2009), ఆహిస్తా ఆహిస్తా (2006). టాక్సీ నంబర్ 9211 (2006)లో రాఘవ్ శాస్త్రి (నానా పటేకర్) కుమారుడు రిషబ్ శాస్త్రి పాత్రను పోషించాడు.

చితలే పూణేకు చెందినవాడు.[6] నూతన్ మరాఠీ విద్యాలయంలో పాఠశాల విద్యను పూర్తి చేశాడు.[6] ఇండాలజీ, తత్వశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేశాడు.[7]

అశ్విన్ భారతదేశంలో చరిత్ర, వారసత్వం, కళ, సాంస్కృతిక అవగాహనకు అంకితమైన ఆశ్విన్ హెరిటేజ్ అనే సంస్థను స్థాపించారు. చరిత్రకు ప్రాణం పోసేలా కథ, కథనాలను మిళితం చేస్తూ ఆయన దేశవ్యాప్తంగా వారసత్వ నడకలు, పర్యటనలూ నిర్వహించాడు. పూణేలో ఉన్న ఈ సంస్థ, ముఖ్యంగా మహమ్మారి తర్వాత నగరంలోను, చుట్టుపక్కలా వారసత్వ నడకలను తరచుగా నిర్వహిస్తుంది.[8]

అశ్విన్‌కు పర్షియన్ భాషపై లోతైన ఆసక్తి ఉంది. రూమీ హై అనే ప్రదర్శనను సృష్టించాడు. ఇది రూమీ జీవితం, రచనలను చిత్రీకరిస్తుంది. తన రంగస్థల కలం పేరు అఫ్రాద్‌తో ప్రదర్శన ఇస్తూ అశ్విన్ చితలే, ఈ నిర్మాణానికి ప్రాణం పోశాడు.[9]

2024 లో, అశ్విన్‌కు సింధీ భాషపై ఆసక్తి పెరిగింది. సూఫీ కవి షా అబ్దుల్ లతీఫ్ భిట్టై రాసిన ఏడు సింధీ ప్రేమకథల ఆధారంగా షా జో రిసాలో అనే ప్రదర్శనను సృష్టించాడు.[3]

అశ్విన్ పర్షియన్, ఉర్దూ భాషలను కూడా బోధిస్తాడు. వారసత్వ పర్యటనలు నిర్వహిస్తాడు. పిల్లల కోసం కథ చెప్పే వర్క్‌షాప్‌లను నిర్వహిస్తాడు. రూమీ, సూఫీయిజం, ఒమర్ ఖయ్యామ్, పర్షియన్ సాహిత్య సంప్రదాయంపై ఆయన అనేక ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ఉపన్యాసాలు ఇచ్చాడు.

2005లో అశ్విన్ చితలేకు ఉత్తమ బాల నటుడు పురస్కారాన్ని ప్రదానం చేస్తున్న రాష్ట్రపతి డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలాం.

మూలాలు

[మార్చు]
  1. "Ruminating over Rumi". punemirror.com (in ఇంగ్లీష్). 2021-11-08. Retrieved 2025-01-13.
  2. "Pune This Week: From searching for love on stage to exploring the poetry of Rumi and travelling to the valley of flowers". The Indian Express (in ఇంగ్లీష్). 2022-09-15. Retrieved 2025-01-13.
  3. 3.0 3.1 "National Award winner to bring Sindhi love sagas to Pune". The Indian Express (in ఇంగ్లీష్). 2024-03-31. Retrieved 2025-01-13.
  4. Rajadhyaksha, Mukta (2004-10-09). "Breath of hope". Frontline. Retrieved 4 May 2013.
  5. Paw. "Ashayein". filmytown.com. Archived from the original on 17 సెప్టెంబర్ 2012. Retrieved 4 May 2013. {{cite web}}: Check date values in: |archive-date= (help)
  6. 6.0 6.1 Nadar, Ganesh (2004-11-02). "At home with Shwaas star Ashwin Chitale". rediff.com. Retrieved 4 May 2013.
  7. "Ruminating over Rumi". punemirror.com (in ఇంగ్లీష్). 2021-11-08. Retrieved 2025-01-13.
  8. "Ruminating over Rumi". punemirror.com (in ఇంగ్లీష్). 2021-11-08. Retrieved 2025-01-13.
  9. "Ruminating over Rumi". punemirror.com (in ఇంగ్లీష్). 2021-11-08. Retrieved 2025-01-13.