అసౌష్ఠవత

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


సాంఖ్యకశాస్త్రం (statistics) లో రెండు విభాజనాల ( distributions) ను పోల్చడానికి, వర్ణపట కేంద్రీయ ప్రవృత్తి మాపనాలు ( measure of central tendency), విస్తరణ కొలతలు ( measure of dispersion) సరిపోవు, అదనపు వర్ణన కొలతలు అవసరము. రెండువ విభాజనాల అంకమద్యమము, క్రమవిచలనము సమానముగా ఉన్నపటికి ఆకృతిలో అవి విభేదించవచ్చు. అటువంటి విభేదాన్ని కొలవదానికి మరొక మాపకం కావలి. అదే అసౌష్ఠవత ( skewness) .

అసౌష్ఠవతా నిర్వచనాలు[మార్చు]

అసౌష్థవత
  • ఒక విభాజనములో సౌష్ఠవత లోపిస్తే దానిని అసౌష్ఠవత అంటారు అని క్రాక్స్ టన్, కౌడన్ మహాశయుల అభిప్రాయము.
  • సింప్సన్, కాఫ్కాల అభిప్రాయం ప్రకారం "అసౌష్ఠవత గుణకాలు( measure of skewness), అసౌష్ఠవత పరిమాణాన్నె గాక దాని దిశను తేలియజేస్తుంది. సౌష్ఠవ(symmetric) విభాజనాలలో అంకమద్యమము( arthematic mean), బాహుళకము(mode) , మధ్యగతము (median )లు సమానము. భాహుళకం విలువ అంకమద్యమముకు ఎంత దూరంమైతే అసౌష్ఠవత ఎంత ఎక్కువగా ఉంటుంది.

అసౌష్ఠవతలొని రకాలు[మార్చు]

అసౌష్ఠవత రకాలు

సౌష్ఠవ విభాజనము[మార్చు]

సౌష్ఠవ విభాజనము బాహుళక విలువకు ఇరువైపులా సమానముగ విస్తరించి ఉంటుంది. దీని అసౌష్ఠవ గుణక విలువ సున్న అవుతుంది.

ధనాత్మక విభాజనము[మార్చు]

ధనాత్మక విభాజనము బాహుళక విలువకు కుడివైపుకు విస్తరించి ఉంటుంది. దీని అసౌష్ఠవ గుణక విలువ ధనాత్మక అవుతుంది.

ఋణాత్మక విభాజనము[మార్చు]

ఋణాత్మక విభాజనము బాహుళక విలువకు ఎడమవైపుకు విస్తరించి ఉంటుంది. దీని అసౌష్ఠవ గుణక విలువ ఋణాత్మక అవుతుంది.

మూలకాలు[మార్చు]

  1. సుసమన్ దేన్,బర్బర ఇల్లౌస్క్ "Descriptive Statistics: Skewness and the Mean, Median, and Mode[permanent dead link]", Connexions website
  2. జొహ్ంసొన్, ఎన్.ఎల్., కొత్జ్, స్, బలకృష్ణన్.ఎన్. (1994) Continuous Univariate Distributions, Vol 1, 2nd Edition Wiley ISBN 0-471-58495-9
"https://te.wikipedia.org/w/index.php?title=అసౌష్ఠవత&oldid=3872193" నుండి వెలికితీశారు