Jump to content

అస్తాద్ దేబూ

వికీపీడియా నుండి
అస్తాద్ దేబూ
2009లో దేబూ
జననం(1947-07-13)1947 జూలై 13
నవ్‌సారి, గుజరాత్, బ్రిటిష్ ఇండియా
మరణం2020 డిసెంబరు 10(2020-12-10) (వయసు: 73)
ముంబై, భారతదేశం
Dancesకాంటెంపరరీ డాన్స్  కథక్, కథకళిల కలయిక

అస్తాద్ దేబూ (13 జూలై 1947 – 10 డిసెంబర్ 2020) గా ప్రసిద్ధి చెందిన ఈయన పూర్తి పేరు అస్తాద్ అదెర్బాద్ దేబూ. ఒక భారతీయ సమకాలీన నృత్యకారుడు, కొరియోగ్రాఫర్. భారతదేశంలో ఆధునిక నృత్యానికి ఆయన ఆద్యుడిగా పరిగణించబడతారు.[1] తన వృత్తి జీవితంలో ఆయన పినా బౌష్, అలిసన్ బెకర్ చేజ్, పింక్ ఫ్లాయిడ్ వంటి కళాకారులతో కలిసి పనిచేశారు, ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శనలు ఇచ్చారు.[2][3][4]

ఆయనకు 1995లో సంగీత నాటక అకాడమీ పురస్కారం, 2007లో భారత ప్రభుత్వం చే పద్మశ్రీ పురస్కారం లభించాయి.[5]

తొలినాటి జీవితం

[మార్చు]

దేబూ 1947 జూలై 13న భారతీయ రాష్ట్రమైన గుజరాత్ లోని నవ్‌సారిలో ఒక పార్సీ కుటుంబంలో జన్మించారు.[6] ఆరు సంవత్సరాల వయసు వచ్చే వరకు ఆయన కోల్‌కతాలో పెరిగారు, ఆ తర్వాత ఆయన కుటుంబం జంషెడ్‌పూర్కు మారింది. అక్కడ ఆయన తండ్రి టాటా స్టీల్ లో ఉద్యోగం చేసేవారు. ఆయన తల్లి గృహిణి, ఆయనకు కమల్, గుల్షన్ అనే ఇద్దరు సోదరీమణులు ఉన్నారు.[6]

ఆరేళ్ల వయసులో, ఆయన దివంగత ఇంద్ర కుమార్ మొహంతి, దివంగత ప్రహ్లాద్ దాస్ వద్ద కథక్ నృత్యం నేర్చుకోవడం ప్రారంభించారు. ఆయన జంషెడ్‌పూర్‌లోని లయోలా స్కూల్‌లో చదువుకున్నారు. 1964లో అక్కడ ఉత్తీర్ణుడైన తర్వాత,[7] ముంబై వెళ్లి ముంబై విశ్వవిద్యాలయానికి చెందిన పోదార్ కళాశాలలో కామర్స్‌లో బ్యాచిలర్స్ కోర్సులో చేరారు.[6]

నృత్య ప్రస్థానం

[మార్చు]

ముంబై (అప్పటి బాంబే)లో డిగ్రీ చదువుతున్న సమయంలో, అమెరికన్ ముర్రే లూయిస్ డాన్స్ కంపెనీ ప్రదర్శించిన సమకాలీన నృత్యం చూసి ఆయన స్ఫూర్తి పొందారు. కొంతకాలం తర్వాత, న్యూయార్క్‌లో నృత్యం అభ్యసిస్తున్న కళాకారిణి ఉత్తర ఆశా కూర్లావాలా బాంబేను సందర్శించి, న్యూయార్క్‌లోని మార్తా గ్రాహం సెంటర్ ఆఫ్ కాంటెంపరరీ డాన్స్‌లో ఆయన చేరడానికి సహాయం చేశారు.[3] దేబూ 1969లో బాంబే నౌకాశ్రయం నుండి బయలుదేరిన కార్గో పడవలో ప్రయాణించి బాంబే విడిచిపెట్టారు, ఆ తర్వాత ఐరోపా గుండా హిచ్‌హైకింగ్ చేస్తూ 1974లో న్యూయార్క్ చేరుకున్నారు.[3]

తదుపరి దశాబ్దంలో, ఆయన లండన్ స్కూల్ ఆఫ్ కాంటెంపరరీ డాన్స్‌కు వెళ్లి అక్కడ మార్తా గ్రాహం ఆధునిక నృత్య పద్ధతులను నేర్చుకున్నారు. ఆ తర్వాత న్యూయార్క్‌లో జోస్ లిమోన్ పద్ధతిని నేర్చుకున్నారు.[8] జర్మనీలోని వుప్పెర్టల్ డాన్స్ కంపెనీలో పినా బౌష్ వద్ద, పిలోబోలస్ డాన్స్ కంపెనీకి చెందిన అలిసన్ బెకర్ చేజ్ వద్ద కూడా ఆయన శిక్షణ పొందారు, యూరప్, అమెరికా ఖండాలు, జపాన్, ఇండోనేషియాలలో పర్యటించారు.[8] 1977లో తిరిగి వచ్చిన తర్వాత, కేరళలోని తిరువల్లలో గురువు ఇ. కృష్ణ పణిక్కర్ వద్ద కథకళి అభ్యసించారు. అనంతరం ప్రసిద్ధ గురువాయూరు దేవాలయంలో ప్రదర్శన ఇచ్చారు.[8] ఈ అన్వేషణలన్నీ ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన నృత్య శైలి సృష్టికి దారితీశాయి. ఇది భారతీయ శాస్త్రీయ నృత్యం, పాశ్చాత్య బృంద నృత్య పద్ధతుల కలయిక.[7][9][10][11]

1986లో ఆయన కెరీర్‌లో ఒక మలుపు చోటుచేసుకుంది. బోల్షోయ్ థియేటర్ బ్యాలెట్ కంపెనీ ప్రైమా బాలేరినా అయిన మాయా ప్లిసెట్స్కాయా కోసం కొరియోగ్రఫీ చేయమని పియరీ కార్డిన్ ఆయనను నియమించారు.[3] కాలక్రమంలో ఆయన లండన్‌లోని చెల్సియా టౌన్ హాల్‌లో పింక్ ఫ్లాయిడ్‌తో, గుండెచా బ్రదర్స్‌తో, జర్మనీలోని వుప్పెర్టల్ డాన్స్ కంపెనీకి చెందిన పినా బౌష్‌తో, మణిపూర్ కు చెందిన థాంగ్-టా (మార్షల్ ఆర్ట్), పుంగ్ చోలోమ్ నృత్యకారులతో కలిసి పనిచేశారు.[8] వాషింగ్టన్‌లోని గల్లాడెట్ విశ్వవిద్యాలయంలో చెవిటివారి కోసం ఉద్దేశించిన ప్రదర్శక కళల కార్యక్రమం కోసం టిమ్ మెక్‌కార్తీతో కలిసి ఆయన చాలా సంవత్సరాలు పనిచేశారు. గల్లాడెట్, దేబూ భారతీయ విద్యార్థులతో కూడిన బృందంతో 1995లో "రోడ్ సైన్స్" నిర్మాణం భారతదేశంలో పర్యటించింది.[2][12][13][14]

2005 జనవరిలో, చెన్నైలోని క్లార్క్ స్కూల్ ఫర్ ది డెఫ్‌కు చెందిన 12 మంది వినికిడి లోపం ఉన్న యువతుల బృందంతో కలిసి ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో జరిగిన 20వ వార్షిక డెఫ్ ఒలింపిక్స్‌లో ప్రదర్శన ఇచ్చారు.[15] చిత్రకారుడు ఎం. ఎఫ్. హుసేన్ తీసిన 2004 హిందీ చిత్రం మీనాక్షి: ఎ టేల్ ఆఫ్ త్రీ సిటీస్ కు ఆయన కొరియోగ్రఫీ చేశారు.[16] 2009లో, ఆయన సలామ్ బాలక్ ట్రస్ట్ అనే ఎన్జీఓకు చెందిన పద్నాలుగు మంది వీధి పిల్లలతో కలిసి 'బ్రేకింగ్ బౌండరీస్' ప్రదర్శన ఇచ్చారు. ఈ పిల్లలు ఆరు నెలల పాటు ఆయన బృందంతో శిక్షణ పొందారు.[10][17] 2019లో, చికాగోలోని నాట్య డాన్స్ థియేటర్‌తో కలిసి "INAI" ప్రదర్శన కోసం హేమ రాజగోపాలన్, సిక్కిల్ గురుచరణ్, జార్జ్ బ్రూక్స్ (సంగీతకారుడు) లతో కలిసి పనిచేశారు.[18]

మరణం

[మార్చు]

నాన్-హోడ్జికిన్ లింఫోమా వ్యాధి నిర్ధారణ జరిగిన నెల రోజుల తర్వాత, 2020 డిసెంబర్ 10న 73 ఏళ్ల వయసులో ఆయన ముంబైలో మరణించారు.[19][20]

పురస్కారాలు

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]
  • నృత్యకారుల జాబితా

మూలాలు

[మార్చు]
  1. Pioneer of modern dance[usurped], The Hindu, 31 December 2002.
  2. 1 2 Blending the Modern with the Traditional Archived 18 ఏప్రిల్ 2009 at the Wayback Machine SPAN magazine.
  3. 1 2 3 4 Astad Deboo: In step with life The Times of India, 28 April 2002.
  4. Astad Deboo to Oslo Archived 5 అక్టోబరు 2008 at the Wayback Machine Embassy of Norway, India.
  5. 1 2 Astad Deboo, 60 Rediff.com, 13 July 2007.
  6. 1 2 3 "Astad deboo". www.sruti.com. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 10 December 2020.
  7. 1 2 Alumni arrow Padma Shri for Astad Deboo Archived 20 అక్టోబరు 2008 at the Wayback Machine Loyola School, Jamshedpur
  8. 1 2 3 4 "Modern Indian Dance Pioneer Astad Deboo Passes Away at 73". The Quint. 10 December 2020. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 10 December 2020.
  9. Astad Deboo: is the most recognizable figure of modern dance here Mint, 11 August 2007.
  10. 1 2 Dancing To A Revolution Archived 8 మార్చి 2012 at the Wayback Machine Tehelka, 9 May 2009.
  11. "नवनृत्यनायक". Loksatta (in మరాఠీ). 12 December 2020. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 28 December 2020.
  12. Astad Deboo Profile and Interview narthaki.com.
  13. Astad Deboo Awarded Padma Shri Archived 7 జనవరి 2010 at the Wayback Machine By arzan sam wadia, 29 January 2007.
  14. Astad Deboo Profile Lingalayam Dance Company.
  15. Deaf Olympics: Astad Deboo to perform MiD DAY, 24 December 2004.
  16. "Contemporary – Ananya Dance Festival 2009". www.sehernow.in. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 10 December 2020.
  17. Wah! Astad The Hindu, 1 May 2009.
  18. Warnecke (9 November 2019). "Natya Dance's world premiere 'Inai' asks, what if there were no differences, racial or otherwise?". Chicago Tribune.
  19. "Astad Deboo passes away: He talked with every muscle in body — and with his stillness". The Indian Express (in ఇంగ్లీష్). 2020-12-12. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2020-12-14.
  20. "Dance Pioneer Astad Deboo". NDTV.com. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 10 December 2020.
  21. Dance-Creative Dance/Choreography Archived 5 అక్టోబరు 2008 at the Wayback Machine Sangeet Natak Akademi Award Official listings.