అస్తిత్వనదం ఆవలి తీరాన

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అస్తిత్వనదం ఆవలి తీరాన
కృతికర్త: మునిపల్లె రాజు
దేశం: భారతదేశం
భాష: తెలుగు
విభాగం (కళా ప్రక్రియ): మేజికల్ రియలిజం కథలు
ప్రచురణ: నవోదయ బుక్ హౌస్
విడుదల:

అస్తిత్వనదం ఆవలి తీరాన కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు పొందిన పుస్తకం. దీనిని మునిపల్లె రాజు రాసారు. ఇందులో మొత్తం పదిహేను కథలు, ఒక మినీ నవల ( ‘పూజారి ‘. ఇదే 1964 లో బి.ఎన్.రెడ్డి గారి దర్శకత్వంలో నాగేశ్వరరావు హీరోగా పూజాఫలం సినిమాగా వచ్చింది),కొన్ని స్వగతాలు ఉన్నాయి. [1]

విశేషాలు[మార్చు]

ఈ పుస్తకానికి 2006లో కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది.[2] ఈ కథలలోని "వీరకుంకుమ" లో రాయలసీమ కరవు సమస్యలను తెలియజేసాడు. "నైమిశారణ్యంలో సత్రయాగం" కథలో విఫల ప్రేమతో అభయానంద గోస్వామి గా మారి నైమిశారణ్యంలో అధ్యాత్మిక పరివేదనలో మునిగిపోయి ఏళ్ళు గడిపి ఆఖరుకి అదే అరణ్యంలో ఒకప్పటి తన ప్రియురాలిని అంత్యదశలో కలుసుకొనే చక్రి, "చేనేత చిత్రం" లో కుగ్రామం నుంచి ఎంతో ఉత్సాహంగా ముంబయిలోని హస్తకళలపోటికి వచ్చి ద్వితీయ బహుమతి గెలుచుకొని,ఆ తర్వాత నగరంలోని జౌళిమిల్లులు,బట్టల ఖార్ఖానాలు చూసి వాటి ముందు తన చేనేత వృత్తి నిలబడగలదా అని పరితాపం చెందే ఓబయ్య, "స్తపతి మహోత్సవం" కథలో యానాది కుష్టుమహిళకు ఆలయంలోని బంగారు పంచామృత పాత్రలో పాయసం తినిపించే సీతారాం, "ఒక బాకీ తీరలేదు" లో బాల్యంలో తనకు అన్నం పెట్టి ఆదుకున్న కమలమ్మ రుణం తీర్చుకోవడం కోసం విదేశాలనుంచి వచ్చే డాక్టర్ మురళి,వారు గతించారని చెప్పి మళ్ళీ అతనికి ఆతిథ్యమిచ్చే ఆ ఇంటి ముసలమ్మ, "మహాబోధి ఛాయలో" లో చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయి చెరువు గట్టునున్న ఒక మహావృక్షంతో అనుబంధాన్ని అల్లుకొని, ఆ వృక్ష ఛాయలోనే తన జీవితాన్ని మలచుకొని, అనేక ఆటుపోట్లకు తట్టుకొని పరాయి రాష్ట్రంలో స్థిరపడి, చివరికో పని మీద మళ్ళీ స్వగ్రామం వచ్చి ఆ చెట్టు కనబడక తల్లడిల్లే కథానాయకుడు. ఇలా ప్రతి పాత్రా మానసాకాశంలో కారుమబ్బులా కదిలిపోతూ భావుకత్వపు కుంభవృష్టిలో మనల్ని తడిపి ముద్ద చేస్తుంది.[3]

మూలాలు[మార్చు]

  1. "మునిపల్లె రాజు – ' అస్తిత్వనదం ఆవలి తీరాన'". Archived from the original on 2016-03-24. Retrieved 2016-02-07.
  2. Munipalle Raju[permanent dead link]
  3. "మునిపల్లె రాజు – ' అస్తిత్వనదం ఆవలి తీరాన'". pustakam.net. Archived from the original on 24 మార్చి 2016. Retrieved 7 February 2016.

ఇతర లింకులు[మార్చు]