అస్సాం టీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మూస:Infobox Tea

అస్సాం (మూస:Lang-asహిందీ: आसामహిందీ: असम) ఇదో బ్లాక్ టీ భారతదేశంలోని అస్సాం లోగల ప్రాంతం పేరు మీదుగా దీనికి ఆ నామం వచ్చింది. బంగ్లాదేశ్, బర్మా (మయన్మార్) సరిహద్దుల్లో బ్రహ్మపుత్ర నది పరీవాహక ప్రాంతంలో వున్నఅస్సాం ప్రపంచంలోనే అత్యధికంగా చాయ్ పండించే ప్రదేశంగా ఖ్యాతి గాంచింది. ఈ ప్రాంతంలో ఎక్కువ ఆర్ధ్రత ఉండటంతో పాటు వర్షాకాలంలో రోజుకి 10-12 అంగుళాల (250-300mm) వర్షపాతం నమోదవుతుంది. పగటి పూట ఉష్ణోగ్రతలు 103 ఫారెన్ హీట్ (40 డిగ్రీ సెంటి గ్రేడ్) వరకు వుండటంతో ఎక్కువ వేడి, తేమ నెలకొని గ్రీన్ హవుస్ లాంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఈ తరహా వాతావరణ పరిస్థితులు అస్సాం టీకి విశిష్ట రుచిని ఆపాదించాయి.

1850లోని ఈ దృశ్యం అస్సాంలో టీ తయారి ప్రక్రియ లోని వివిధ దశలను వివరిస్తోంది.

అస్సాం చాయ్ (మూస:Lang-as, హిందీ: असमिया चाय లేదా హిందీ: आसामी चाय లేదా హిందీ: असमी चाय) ని కామేలియా సినెన్సిస్ వార్. అస్సామికా (మాస్టర్స్) అనే మొక్క ద్వారా రూపొందుతుంది.[1][2] సముద్రమట్టం ఎత్తులో పండించే ఈ తేనీరు తన విశిష్ట రుచి, సువాసన, పొడి బారుతనం, ఘాఢ తనానికి ప్రసిద్ధి. అస్సాం టీ లేదా దాని ఉత్పత్తులను "అల్పాహార" టీగా విక్రయిస్తారు. దీన్ని ఇంగ్లీష్ బ్రేక్ ఫాస్ట్ టీ, ఐరిష్ బ్రేక్ ఫాస్ట్ టీ, స్కాటిష్ బ్రేక్ ఫాస్ట్ టీ అని కూడా పిలుస్తారు.

ప్రధానంగా "అస్సాం" బ్లాక్ టీకి ప్రసిద్ధి కానీ ఇక్కడ దీంతో పాటు గ్రీన్, వైట్ టీలను కూడా కొద్ది మొత్తంలో పండిస్తారు. వీటి రుచులు వీటికే ప్రత్యేకం.

చారిత్రకంగా చుస్తే టీ పొడి ఉత్పత్తులలో దక్షిణ చైనా తరువాత అస్సాందే రెండవ స్థానం. ప్రపంచంలో దక్షిణ చైనా, అస్సాం ఈ రెండు ప్రాంతాలు మాత్రమే స్థానిక టీ మొక్కలకు ప్రసిద్ధి. 19వ శతాబ్దంలో చాయ్ తాగే అలవాట్లలో అస్సాం టీ విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చింది. వేరువేరు మొక్కల ద్వారా రకరకాలైన రుచులు గల టీ పొడి ఉత్పత్తి అవడమే ఇందుకు కారణం.

పుట్టుక కథ ఇది[మార్చు]

దీని పుట్టుక వెనుక ఓ కథ ప్రచారంలో ఉంది. స్కాట్లాండ్ దేశానికి చెందిన సాహసికుడు రాబర్ట్ బ్రూస్ 1823లో దీనిని కనుగొన్నారు. వ్యాపార నిమిత్తం అస్సాంలో పర్యటిస్తుండగా అడవుల్లో సంచరిస్తుండగా యాదృచ్ఛికంగా దీని జాడ తెలుసుకున్నారని అంటారు. స్థానిక గిరిజనులు (సింగ్ పాస్) పోదల నుంచి తీసిన ఆకులతో టీ తయారు చేయడాన్ని ఆయన గమనించారు. అక్కడి తెగ నాయకుల నుంచి కొన్ని ఆకులు, విత్తనాలను సేకరించగలిగారు. వాటిని శాస్త్రీయ పద్ధతిలో పరిశీలించాలనేది ఆయన ప్రయత్నం. కాని అది నెరవేరకుండానే రాబర్ బ్రూస్ మరణించినట్టుగా చెబుతారు. ఆ తరువాత 1830లొ ఆయన సోదరుడైన చార్లెస్ కోల్‌కతాలోని బొటానికల్ గార్డెన్స్ కు పరీక్ష నిమిత్తం పంపారు. అక్కడ దీన్ని ఒక ప్రత్యేక తరహా టీ మొక్క కామెల్లియా సినెన్సిస్గా గుర్తించారు. ఇది చైనాకు చెందిన కామెల్లియా సినెన్సిస్ వార్ కు భిన్నంగా ఉంది అని తేల్చారు.

యునైటెడ్ కింగ్డంలో విక్రయాలు[మార్చు]

తేనీటి గురించి శాస్త్రీయ అధ్యయనం, వాణిజ్య సామర్థ్యం గురించి తెలుసుకోవడానికి ఈస్ట్ ఇండియా కంపెనీ వారు టీ నిపుణుల కమిటిని (1834లో) వేశారు. చైనా పద్ధతులను (ఆ తరహా మొక్కలు, తయారి విధానం) అనుసరించాలని నిపుణుల కమిటి సూచించింది. ఈ మేరకు అక్కడి విత్తనాలు, తయారిదారులను ఇక్కడికి రప్పించాలని, ఇక్కడి పద్ధతులు, మొక్కలను వాటితో మార్పు చేయాలని తలపోశారు. కొద్ది కాలానికి చైనా, అస్సాంల మొక్కల కలయికతో హైబ్రిడ్ వంగడం రూపొందించారు. ఇది ఈ ప్రాంతానికి, వాతావరణానికి సరిగ్గా సరిపోయి మెరుగైన ఫలితాలను ఇచ్చింది.

1830 తరువాత లండన్ లో దీనికి మార్కెట్ దొరికింది. దీంతో ఈస్ట్ ఇండియా కంపెనీ కొత్త ఆలోచన చేసింది. వ్యవసాయ, అటవీ భూములను టీ తోటలుగా మలిచేందుకు గాను "వేస్ట్ ల్యాండ్ యాక్ట్"ను అమలులోకి తెచ్చింది. పెద్ద వ్యాపారుల చేతికి చాలా భూములు ఇలా వెళ్ళడంతో ఈ చట్టంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. కంపెనీ, వ్యాపారుల ఈ సంబంధం గట్టిపడి ప్లాంటర్-రాజ్ గా గుర్తింపు పొందింది.

ఉత్పత్తి[మార్చు]

మొదటి రెండు దశాబ్దాలలో (1840-1860) దీని పెంపకం, ఉత్పత్తి వ్యవహారాలన్నీ అస్సాం కంపెనీ గుత్తాధిపత్యం కింద సాగేవి. ఎగువ అస్సాం ప్రాంతంలో స్థానిక కచారి కూలీలతో అది ఉత్పత్తి ప్రక్రియ సాగేది. ఈ సంస్థ మెరుగైన ఫలితాలు సాధించడంతో బ్రిటిష్ కాలనీ విధానాల్లో మార్పులు వచ్చాయి. తేయాకు ఉత్పత్తిదారులకు భూములు అందించడం (సరళ నిబంధనలతో) మొదలు పెట్టారు. దీంతో ఈ రంగం 1860లో వ్యాప్తి చెంది మరింత ఉన్నతిని సాధించింది. కాని చైనాలో లాగా గణనీయమైన మార్పులు పొందలేదు. ఇందుకు కారణం టీ పాదుల తరలింపు (తరలింపులో ఎక్కువగా మృతి చెందేవి లేదా వాడి పోయేవి) వ్యవహారం పెద్ద ప్రహసనంగానూ ఉండేది. దాంతో పాటు అప్పటి మార్కెట్ పరిస్థితులు అనుకూలంగా లేవు. దీని ఉత్పత్తి పై చాలా మంది ఉదాసీనంగా ఉండేవారు.

భౌగోళిక స్థితి[మార్చు]

టీ మొక్కలు (కామిలియా సినెన్సిస్ వార్. అస్సామిక ) అస్సాంలోని లోతట్టు ప్రాంతాల్లో పెరుగుతాయి. అదే డార్జిలింగ్, నీలగిరిలో మాత్రం ఎత్తైన ప్రదేశాల్లో పండుతాయి. బ్రహ్మపుత్ర నది వరదల సమయంలో తీసుకోచ్చ్చే మట్టి సారవంతంగా ఉండటంతో లోతట్టు ప్రాంతాల్లో ఇది బాగా పండటానికి ఆస్కారం ఏర్పడింది. ఇక్కడ వాతావరణం చల్లగా, వేడిగా, ఆర్ధ్రతతో కూడుకొని ఉండటంతో మొక్కలు ఎదగడానికి అనుకూలంగా వుంటుంది. పంట కాలం ఎక్కువ వ్యవధితో కూడుకొని ఉండటంతో పాటు వర్షాలు బాగా కురవడంతో ప్రపంచంలోనే ఎక్కువ టీ ఉత్పత్తి చేసే ప్రాంతంగా వినుతికెక్కింది. అస్సాంలోని అన్ని తోటలు కలిపి సంవత్సరానికి సరాసరి 1.5 మిలియన్ పౌండ్ల (680,400 కిలోల) ఉత్పత్తి సాధిస్తాయి.

ముఖ్యంగా ఈ పంట ఏటా రెండు సార్లు కాపునకు వస్తుంది. దీన్ని "మొదటి ఫ్లష్", "రెండో ఫ్లష్"గా వ్యవహరిస్తారు. మొదటి పంట మార్చిలో చేతికొస్తుంది. ఆ తరువాత రెండో పంట చేతికొస్తుంది. "టిప్పి టీ"గా వ్యవహరించే ఈ పంట ఖరీదైనదిగా వ్యవహరిస్తారు. మొక్క ఆకులకు బంగారు వర్ణంతో బొడిపెలు రావడంతో ఈ పేరు వచ్చింది. ఇది మరింత మధురంగా ఉండి, ఎక్కువ వ్యాసం ఆకులు కలిగి ఉంటాయి. దీంతో దీన్ని మొదటి ఫ్లష్ తో పోలిస్తే మేలైన రకంగా పరిగణిస్తారు. చైనా మొక్కతో పోలిస్తే అస్సాం టీ మొక్క ఆకుల రంగు ముదురు ఆకు పచ్చగా వుండి వెడల్పుగా ఉంటాయి. మెరుపుదనమూ ఎక్కువే. ఈ మొక్కకు శ్వేత పుష్పాలు వస్తాయి.

వీటిని పరిశీలించండి[మార్చు]

  • నీలగిరి తేయాకు
  • డార్జిలింగ్ తేయాకు
  • ఇయల్ గ్రే తేయాకు
  • కూలి
  • అస్సాం

సూచనలు[మార్చు]

  1. [9] ^ టీ వర్గీకరణ Archived 2012-04-21 at the Wayback Machine. టీ రీసర్చ్ అసోసియేషన్, తోక్లై ద్వారా జరిగింది (2009/03/25న పునరుద్దరించబడింది).
  2. ఐ టి ఐ ఎస్ ప్రామాణిక పత్రం కామెల్లియా సినెన్సిస్ వార్. అస్సామికా(2009-03-28న పునరుద్దరించబడింది).

మూలం[మార్చు]

  • కిప్లె, కెన్నెత్ ఎఫ్ .; ఒర్నేలాస్, క్రేఇం హిల్డ్ సి . (అక్టోబర్ 2000 ది కేంబ్రిడ్జ్ వరల్డ్ హిస్టరీ అఫ్ ఫుడ్ (సంపుటి 1). కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ ముద్రణ. ISBN 0262081504
  • టీ చరిత్ర ప్లాంట్ కల్చర్స్

బాహ్య లింకులు[మార్చు]

మూస:Teas

"https://te.wikipedia.org/w/index.php?title=అస్సాం_టీ&oldid=2820987" నుండి వెలికితీశారు