Jump to content

అహింస

వికీపీడియా నుండి
Gautama Buddha, known for his philosophy of ahimsa

ఒక జీవిని చంపడం, ఒకరికి ఇష్టము లేని కార్యాన్ని బలవంతంగా చేయించి, తద్వారా దుఃఖాన్ని కలిగించడం, మనోవాక్కాయ కర్మలచేత బాధ కలిగించడం హింస. సర్వకల సర్వావస్థలలో ఇతర ప్రాణికి ఏ రకమైన కష్టాన్ని కలిగించకుండా ఉండడం అహింస. హింస మూడు రకాలు: మానసిక హింస, వాచిక హింస, కాయిక హింస. పరులకు హాని తలపెట్టడం, మనో నిగ్రహం లేకపోవడం, పాపభీతి లేకుండా ప్రవర్తించడం అనేవి మానసిక హింస. అసత్యాన్ని పలకడం, అహితముగా లేదా కఠినంగా మాట్లాడడం వాచిక హింస. ఒక జీవిని చంపడం, గాయపరచడం, దుష్క్రియలచేత పీడించడం, పరస్త్రీ సహవాసం, పరధనాపహరణం, మాంస భక్షణ కాయిక హింస అనబడతాయి.

హిందూ మతంలో అహింస

[మార్చు]
అహింసా పరమో ధర్మః అహింసా పరమం తపః
దయా సమం నాస్తి పుణ్యం పాపం హింసా సమం నహి.

"జీవో జీవస్య జీవనమ్" - అనగా ఒక జీవి మరొక జీవిని చంపి తనడం జంతు ప్రవృత్తి.

  • అహింస, సత్యం, కోపము లేకపోవడం, మృదుస్వభావం, సిగ్గు, చాపల్యం లేకపోవడం, తేజస్సు, ఓర్మి, పట్టుదల, శుచిత్వం, ద్రోహచింతన లేకపోవడం, అభిమాన రాహిత్యం దైవ గుణ సంపద
  • అహింస, సమత్వము, తృప్తి, తపస్సు, దానము, యశస్సు మొదలైన భావాలు దైవం వల్లనే కలుగుతాయి.ధర్మాలు అన్నింటిలో అహింస శ్రేష్ఠమైన ధర్మం. భూతదయను మించిన పుణ్యం, హింసను మించిన పాపం లేదని వేదోపనిషత్తులు చెబుతున్నాయి.

అహింస (Ahimsa) మహావిష్ణువునకు ప్రీతికరమైన ఎనిమిది పుష్పాలలో మొట్టమొదటిది. అహింస, ఇంద్రియ నిగ్రహం, భూతదయ, సహనం, శాంతం, తపస్సు, ధ్యానం, సత్యం అనేవి ఈ ఎనిమిది పుష్పాలు.

బౌద్ధమతంలో అహింస

[మార్చు]

బుద్ధదేవుడు అహింసా ప్రవచనం చేసినది మనదేశంలోనే. అలాగే మహాత్మా గాంధీ ఆచరించిన సత్యాగ్రహం అహింస యొక్క ఒకానొక రూపం.

జైనమతంలో అహింస

[మార్చు]

జైన మతస్తులు గాలి పీలిస్తే గాల్లోని సూక్ష్మజీవులు చచ్చిపోతాయని మూతికి గుడ్డ కట్టుకుంటారు. నీళ్ళు వడగట్టుకుని తాగుతారు, అడుగు తీసి అడుగువేసేటప్పుడు కాలికింద పడి సూక్ష్మజీవులు చచ్చిపోతాయని నెమలీకలతో చేసిన పొరకతో నడిచినంతమేరా అడుగేసేముందు నేలను ఊడ్చుకుంటూపోతారు. మొక్కలు, పొదలు, చెట్లు, వాటి బెరడు, కాండం, ఆకులు, విత్తనాలు...వీటిలో ఆత్మ ఉంటుందట.

ఇస్లాం లో అహింస

[మార్చు]

ఇస్లాం అనే పదానికి అర్ధమే అహింస, శాంతి. ముస్లిం అంటే శాంతి కాముకుడు.ముహమ్మదు గారి ప్రవచనాలలో ఆత్మరక్షణ కోసం యుద్ధప్రబోధాలున్నాయి.మామూలు వాతావరణంలో ఎంతో శాంతిగా ఉంటూ పొరుగువారి హక్కులను కాపాడుతూ ఉండాలనే బోధనలున్నాయి.

క్రైస్తవంలో అహింస

[మార్చు]

ఏసుక్రీస్తు శాంతికి చిహ్నం అయ్యాడు.అహింసను బోధించాడు.కత్తిపట్టినవాడు కత్తికే బలౌతాడని చెప్పాడు.ఒకచెంపమీదకొడితే మరోచెంపచూపించమన్నాడు.

మూలాలు

[మార్చు]
  • అహింసాపుష్పము, డా.ఎడ్ల బాలకృష్ణారెడ్డి 2006 జూలై సప్తగిరి సచిత్ర మాసపత్రికలో ప్రచురించిన వ్యాసం
"https://te.wikipedia.org/w/index.php?title=అహింస&oldid=4010647" నుండి వెలికితీశారు