Jump to content

అహ్మదాబాద్ మెట్రో

వికీపీడియా నుండి
అహ్మదాబాద్ మెట్రో
అహ్మదాబాద్ మెట్రోలో రెండ్ లైనులో రైలు
Background
Ownerగుజరాత్ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్
Area servedఅహ్మదాబాద్, గాంధీనగర్, గిఫ్ట్ సిటీ
Transit typeవేగ రవాణా
Number of lines4[1]
Number of stations49 (ఆపరేషన్లో), 6 (నిర్మాణంలో)
Annual ridership46,35,600 (2024 నవం- 2025 అక్టో)[2]
Headquartersబ్లాక్ నం.1, మొదటి అంతస్థు, కర్మయోగి భవన్, సెక్టర్ 10/A, గాంధీనగర్-382010[3]
Operation
Began operation2019 మార్చి 4; 7 సంవత్సరాల క్రితం (2019-03-04)
Operator(s)గుజరాత్ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్
Train length3 కోచ్‌లు
Technical
System length60.06 km (37.32 mi) (Phase-1)[4]
5.42 km (3.37 mi) (Phase-2) (under construction)
No. of tracks2
Track gauge1,435 mm (4 ft 8+12 in) standard gauge[5]
Electrification750 V DC థర్డ్ రైల్
Average speed33 km/h (21 mph)
Top speed80 km/h (50 mph)
రూట్ మ్యాపు

అహ్మదాబాద్ మెట్రో, గుజరాత్ రాష్ట్ర రాజధాని అహ్మదాబాద్, గాంధీనగర్, గిఫ్ట్ సిటీ నగరాల కోసం ఏర్పాటు చేసిన మెట్రో రవాణా వ్యవస్థ. ప్రస్తుతం ఈ నెట్‌వర్కులో 60.06 km (37.320 mi) మార్గం, 47 ఆపరేషనల్ స్టేషన్లూ ఉన్నాయి.[6]

గుజరాత్ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్‌ను 2010 ఫిబ్రవరిలో స్థాపించారు. 40.03 km (24.873 mi) పొడవైన ప్రాజెక్టు మొదటి దశను ఉత్తర–దక్షిణ, తూర్పు–పశ్చిమ కారిడార్లతో 2013 అక్టోబరులో ఆమోదించారు. దీని నిర్మాణం 2015 మార్చి 14 న ప్రారంభమైంది. ఒక 6.5 km (4.039 mi) తూర్పు-పశ్చిమ కారిడార్ విభాగాన్ని 2019 మార్చి 4 న ప్రారంభించి, 2019 మార్చి 6 న ప్రయాణాలు మొదలుపెట్టింది. మిగిలిన మొదటి దశ 2022 సెప్టెంబరు 30 న ప్రారంబం జరుపుకుని, 2022 అక్టోబరు 2, 6 తేదీల్లో ఆపరేషన్లు మొదలుపెట్టింది.[7]

2022 సెప్టెంబరు 30న మెట్రోను ప్రారంభిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.

2003లో, గుజరాత్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ బోర్డ్ గాంధీనగర్, అహ్మదాబాద్ ల మధ్య పట్టణ రవాణా కోసం ఒక అధ్యయనాన్ని నిర్వహించింది. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్, RITES లు సంయుక్తంగా వివరణాత్మక ప్రాజెక్టు నివేదికను తయారుచేసి, 2005 జూన్‌లో సమర్పించాయి. అదే సంవత్సరంలో దీనికి కేంద్ర ప్రభుత్వ ఆమోదం కూడా లభించింది.[8][9] ప్రాజెక్టు ఆచరణీయతపై అధ్యయనం జరిగాక, అంచనా వ్యయం 4,295 crore (US$540 million) అని తేలాక, దీన్ని 2005 లో పక్కనపెట్టారు. దీని స్థానంలో అహ్మదాబాద్ BRTS, సబర్బన్ రైల్వే ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చారు. 2008 లో, అహ్మదాబాద్, గాంధీనగర్ చుట్టుపక్కల భవిష్యత్తు అభివృద్ధిని పరిగణనలోకి తీసుకుని, ఈ ప్రాజెక్టును పునరుద్ధరించి, ఈ ప్రాజెక్టును ఆచరణీయంగా మార్చడానికి కొత్త కారిడార్లను రూపొందించారు.[10][11]

2010 ఫిబ్రవరి 4 న గుజరాత్ ప్రభుత్వం, రూ 202 కోట్లతో మెట్రో లింక్ ఎక్స్‌ప్రెస్ ఫర్ గాంధీనగర్ అండ్ అహ్మదాబాద్ కంపెనీ లిమిటెడ్ అనే ప్రత్యేక ప్రయోజన వాహక సంస్థను ఏర్పాటు చేసారు. తరువాత 2018లో దీన్ని గుజరాత్ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (GMRC)గా పేరు మార్చారు. 2014 లో, కేంద్ర ప్రభుత్వం ఈ కంపెనీలో 50% వాటా తీసుకుంటుందని నిర్ణయించారు.[12][13]

నిర్మాణం

[మార్చు]

మొదటి దశ

[మార్చు]

2014 అక్టోబరు 19న భారత కేంద్ర మంత్రివర్గం మొదటి దశ కోసం 10,773 crore (US$1.3 billion) ఆమోదించింది.[13] 2014 నవంబరులో కేంద్ర ప్రభుత్వం, బోటాడ్-సబర్మతి మీటర్ గేజ్ లైన్ వెంబడి ఉపయోగించకుండా పడి ఉన్న పశ్చిమ రైల్వే భూమిని ఉపయోగించుకోడానికి ఆమోదం తెలిపింది.[14] ఆశ్రమ రోడ్డు వెంబడి మెట్రో తొలి ప్రణాళికను సర్దుబాటు చేసి, ట్రాక్‌ను పశ్చిమ దిశగా తరలించారు. కొత్త ప్రణాళికకు 600 crore (US$75 million) ఖర్చు, మరో రెండు స్టేషన్లు పెరిగాయి. కొత్త ప్రణాళిక వలన భూసేకరణలో సమస్యలు తగ్గడమే కాక, ఆశ్రమ రోడ్డులో రద్దీ తగ్గించడానికి సహాయపడింది. 2015 గుజరాత్ బడ్జెట్‌లో, 611 crore (US$77 million) మెట్రో కోసం అదనంగా కేటాయించారు. 6.5 km (4.039 mi) పొడవైన వస్త్రల్ - అపెరల్ పార్క్ స్ట్రెచ్ ఆఫ్ ఈస్ట్-వెస్ట్ కారిడార్ (బ్లూ లైన్) నిర్మాణానికి 2015 మార్చి 14న అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందిబెన్ పటేల్ సమక్షంలో భూమిపూజ జరిగింది. నార్త్-సౌత్ కారిడార్ (రెడ్ లైన్) కు భూమి పూజ కార్యక్రమం 2016 జనవరి 17 న జరిగింది. ఈ పని 2016 మార్చిలో ప్రారంభమైంది.[15][16][17][18] భారత రైల్వేలు 2016 జూన్‌లో తన భూమిలో నార్త్-సౌత్ కారిడార్ స్ట్రెచ్ నిర్మాణాన్ని అనుమతి నిచ్చింది.[19] 2015 నవంబరులో జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (JICA), ప్రాజెక్టు మొదటి దశకు 5,968 crore (US$750 million) నిధులు సమకూర్చడానికి అంగీకరించింది. అందులో మొదటి విడత 4,456 crore (US$560 million) 2016 లో విడుదల చేసింది.[20]

2019 ఫిబ్రవరిలో బ్లూ లైన్‌లో 6.5 km (4.039 mi) పొడవైన వస్త్రల్ - అపెరల్ పార్క్ విభాగంలో ట్రయల్ రన్‌లు మొదలయ్యాయి.[21][22] ఈ విభాగాన్ని 2019 మార్చి 4 న భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించాడు.[23][24] దీనిని 2019 మార్చి 6 న ప్రజల ప్రయాణాలకు తెరిచారు[25] థల్తేజ్-థల్తేజ్ గామ్ విభాగం, మూడు మెట్రో స్టేషన్లు (కంకారియా తూర్పు, థల్తేజ్ గామ్, సబర్మతి రైల్వే) మినహా,[26][27][28][29] మిగిలిన మొదటి దశను 2022 సెప్టెంబరు 30 న ప్రధాన మంత్రి మోడీ ప్రారంభించాడు.[30] ఈ బ్లూ, రెడ్ లైన్లను వరుసగా 2022 అక్టోబరు 2, అక్టోబరు 6, తెరిచారు.[31] మొదటి దశ నిర్మాణ వ్యయం 12,900 crore (US$1.6 billion) కు చేరింది.[30] కంకారియా ఈస్ట్ స్టేషన్ను 2024 మార్చి 5 న ప్రారంభించారు.[32] థాల్తేజ్ గామ్ స్టేషన్, థాల్తేజ్ స్టేషన్‌ల మధ్య ఉన్న 1.4 కిమీ (0.870 మైళ్ళు) పొడవైన విభాగాన్ని 2024 డిసెంబరు 8 న ప్రారంభించారు.[33]

రెండవ దశ

[మార్చు]

గుజరాత్ ప్రభుత్వం 2017 అక్టోబరులో రెండవ దశను ఆమోదించింది. 2018 అక్టోబరులో దానిని సవరించింది. 2019 ఫిబ్రవరిలో కేంద్ర మంత్రివర్గం 5,384.17 crore (US$670 million) విలువైన రెండవ దశను ఆమోదించింది. . అహ్మదాబాద్‌లోని మోటేరా నుండి గాంధీనగర్‌లోని మహాత్మా మందిర్ వరకు కారిడార్-1 (ఎల్లో లైన్) ( 23.838 km (14.812 mi) ) గుజరాత్ నేషనల్ లా యూనివర్సిటీ (GNLU) నుండి పండిట్ దీన్‌దయాళ్ ఎనర్జీ యూనివర్సిటీ (PDEU), GIFT సిటీ ( 5.416 km (3.365 mi) ) లను కలిపే బ్రాంచింగ్ కారిడార్-2 (వైలెట్ లైన్)లతో దీన్ని ఖరారు చేసారు. రెండవ దశలో మొత్తం 28.26 km (17.560 mi) మార్గం, 22 స్టేషన్లు ఉన్నాయి.[34][35][24]

దశ-2 కు టెండర్లు 2020 జనవరిలో ప్రారంభమయ్యాయి. 2021 జనవరి 18న, రెండవ దశకు ప్రధానమంత్రి మోడీ శంకుస్థాపన చేశాడు.[36]

రెండవ దశ కోసం రోలింగ్ స్టాక్ అందించడానికి టిటాగఢ్ రైల్ సిస్టమ్స్, 2023 ఫిబ్రవరిలో 350 crore (US$44 million) విలువైన కాంట్రాక్టును గెలుచుకుంది. .[37][38]

2024 ఫిబ్రవరిలో దశ-2 GNLU, ధోలకువా సర్కిల్ స్టేషన్ల మధ్య ట్రయల్ రన్ ప్రారంభమైంది.[39][40] గాంధీనగర్‌లోని సెక్టర్-1 స్టేషన్‌ను రెడ్ లైన్, బ్రాంచ్ వైలెట్ లైన్‌తో అనుసంధానించే యెల్లో లైన్‌ను ఎనిమిది స్టేషన్లతో పాటు ప్రధాన మంత్రి మోడీ 2024 సెప్టెంబరు 16 న ప్రారంభించాడు.[41][42] యెల్లో లైన్‌లోని ఏడు కొత్త స్టేషన్‌లను 2025 ఏప్రిల్ 27 న తెరిచారు.[43] యెల్లో లైన్‌లోని జునా కోబా, కోబా గామ్ స్టేషన్‌లను 2025 సెప్టెంబరు 28 న ప్రారంభించారు.[44]

ప్రతిపాదిత మూడవ దశ

[మార్చు]
అహ్మదాబాద్ మెట్రో హ్యుందాయ్ రోటెం

అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మెట్రో వ్యవస్థతో అనుసంధానించడానికి 1,800 crore (US$230 million) ఖర్చుతో GMRC ఒక ప్రణాళికను ప్రతిపాదించింది.[45][46] ఇది కోటేశ్వర్ రోడ్ స్టేషన్ తో ఇంటర్ చేంజ్ గా విడిపోయే 4 to 6 km (2.5 to 3.7 mi) పొడవైన కారిడార్. ఈ కారిడార్ కోటేశ్వర్ రోడ్ నుండి తాజ్ హోటల్ సర్కిల్ వరకు ఎత్తున నిర్మిస్తారు. అక్కడి నుండి విమానాశ్రయం వరకు భూగర్భంలో ఉంటుంది. దీనికి విమానాశ్రయంలో ఒక భూగర్భ స్టేషన్ తో సహా మొత్తం 4 మెట్రో స్టేషన్లు ఉంటాయి.[47][48]

వైలెట్ లైన్‌ను 6 to 10 km (3.7 to 6.2 mi) నిర్మించడానికి విస్తరించాలని GMRC, గృహనిర్మాణ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ఒక ప్రతిపాదనను సమర్పించింది. GIFT సిటీ లోని ఎలివేటెడ్ సర్క్యులర్ లూప్ నిర్మాణానికి వ్యయం 2,000 crore (US$250 million) గా అంచనా వేసారు. ఈ ప్రాజెక్టు నాలుగు నుండి ఆరు మెట్రో స్టేషన్లతో గిఫ్ట్ సిటీ లోని వివిధ క్యాంపస్‌లను అనుసంధానిస్తుందని భావిస్తున్నారు.[49][47] మరో ప్రతిపాదనలో వైలెట్ లైన్‌ను IIT గాంధీనగర్‌కు విస్తరించడం కూడా ఉంది. ఈ 7 km (4.3 mi) మార్గంలో ఆరు స్టేషన్లు ఉంటాయి. దాదాపు 1,750 crore (US$220 million) ఖర్చవుతుంది.[50]

థాల్తేజ్ గామ్ నుండి గోధావి వరకు బ్లూ లైన్‌ను విస్తరించే ప్రణాళికను కూడా GMRC సమర్పించింది. దీని 8 km (5.0 mi) మార్గానికి 2,500 crore (US$310 million) ఖర్చు అవుతుంది.[50]

నెట్‌వర్కు

[మార్చు]
అహ్మదాబాద్ మెట్రో
లైను పేరు ఆపరేషన్లు మొదలుపెట్టినది చివరి సారి పొడిగించినది స్టేషన్లు పొడవు తొలి, తుది స్టేషన్లు రోలింగ్ స్టాక్ ట్రాక్ గేజ్ (MM) విద్యుదీకరణ ఆ చివరి నుండి ఈ చివరికి ప్రయాణ సమయం మూలాలు
Blue Line 2019 మార్చి 4 2024 డిసెంబరు 8 18 20.30 km (12.61 mi) తల్తేజ్ గమ్ వస్త్రల్ గామ్ హ్యుందాయ్ రోటెమ్ ప్రామాణిక గేజ్ (1,435 మి. మీ.)   750వి డిసి థర్డ్ రైల్ 45 నిమిషాలు[51] [52]
Red Line 2022 సెప్టెంబరు 30 2022 సెప్టెంబరు 30 14 16.64 km (10.34 mi) మొతెరా స్టేడియం ఏపీఎంసీ 67 నిమిషాలు[51] [52]
Yellow Line 2024 సెప్టెంబరు 16 2025 ఏప్రిల్ 27 15 17.40 km (10.81 mi) సచివాలయం మొతెరా స్టేడియం [52]
Violet Line 2024 సెప్టెంబరు 16 2024 సెప్టెంబరు 16 3 4.54 km (2.82 mi) గిఫ్ట్ సిటీ జిఎన్ఎల్యు [52]
మొత్తం 40 58.87 km

ఆపరేషన్లు

[మార్చు]
దూరదర్శన్ కేంద్ర మెట్రో స్టేషన్

2019 మార్చిలో మెట్రో వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించింది. 2022 జూన్ వరకు 7.1 లక్షలకు పైగా ప్రజలు మెట్రోలో ప్రయాణించారు. కానీ నెలవారీ ప్రయాణికుల సంఖ్య ఎప్పుడూ 38,137 మించలేదు. ఇది 2019 మార్చిలో నమోదైన అత్యధిక ప్రయాణికుల సంఖ్య. అప్పుటికి తెరిచిన కారిడార్ పొడవు తక్కువగా ఉండడం దీనికి కారణం. ఎక్కువ మంది ప్రయాణీకులు సరదాగా ప్రయాణించేవారేనని గుర్తించారు.[28]

2022 సెప్టెంబరులో మొదటి దశ పూర్తిగా ప్రారంభించిన తర్వాత, ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో (ఏప్రిల్ 2024 నుండి మార్చి 2025 వరకు) 40,06,800 మందికి మించి మెట్రోలో ప్రయాణించారు. 2025 జనవరిలో సగటున రోజువారీ ప్రయాణికుల సంఖ్య 1,29,710.[2]

వివాదం

[మార్చు]

పశ్చిమాన ఉన్న థాల్తేజ్ గామ్ సమీపంలో, 300 మంది దుకాణ యజమానులు భూసేకరణను వ్యతిరేకించారు. ప్రాజెక్టు డిపో కోసం, పార్కింగ్ కోసం భారీ భూమి అవసరమని అధికారులు తెలిపారు.[53] వేజల్పూర్ ప్రాంతంలోని జీవరాజ్ పార్క్ నివాసితులు, దుకాణ యజమానులు కూడా భూసేకరణను వ్యతిరేకించారు. వారు గుజరాత్ హైకోర్టులో కేసు దాఖలు చేశారు.[54][55] వారు 2017 సెప్టెంబరులో కేసును పరిష్కరించుకున్నారు.[56]

మాజీ IAS అధికారి, ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ సంజయ్ గుప్తా, అతని ఏడుగురు అనుచర అధికారులపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి, వారిలో ఇద్దరు 113 crore (US$14 million) మేర మోసం చేసినట్లు ఆరోపించబడి, 2015 మేలో అరెస్టయ్యారు. 2012లో ఈ ప్రాజెక్టు కోసం గ్రౌండ్ ఫిల్లింగ్ మెటీరియల్స్ సేకరణ, వినియోగంలో ఈ అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చాయి. 2.62 crore (US$3,30,000) విలువైన 603 టన్నుల TMT స్టీలు సేకరణకు సంబంధించిన మరో కేసును కూడా దర్యాప్తు చేస్తున్నారు.[57][58][59][60]

నెట్‌వర్క్ మ్యాపు

[మార్చు]

పటం

ఇవి కూడా చూడండి

[మార్చు]
  • అహ్మదాబాద్ మెట్రో స్టేషన్ల జాబితా

మూలాలు

[మార్చు]
  1. "Ahmedabad Metro Phase 2 gets Modi Cabinet clearance ahead of Phase 1 inauguration on March 4". 21 February 2019.
  2. 1 2 "Ahmedabad Metro Rail Passenger journey". GMRC (in అమెరికన్ ఇంగ్లీష్). 2025-04-05. Retrieved 2025-04-05.
  3. "Contact Us – MEGA". gujaratmetrorail.com. Retrieved 7 April 2018.
  4. "MEGA Map 2014". MEGA. Archived from the original on 25 July 2015. Retrieved 25 July 2015.
  5. "Ahmedabad launches metro train tender". IRJ. 1 February 2014.
  6. "Ahmedabad Metro - Information, Route Maps, Fares, Tenders & Updates". The Metro Rail Guy (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2024-09-22.
  7. "Ahmedabad Metro Route Map, Station List, Progress and Latest Updates - Infra Info Hub" (in అమెరికన్ ఇంగ్లీష్). 2024-06-06. Retrieved 2024-07-15.
  8. "From 2015, ride Metro from Ahmedabad to Gandhinagar". dna (in అమెరికన్ ఇంగ్లీష్). 2012-09-29. Retrieved 2018-10-21.
  9. "Ahmedabad metro rail project put on fast track". Business Standard. Retrieved 2010-07-27.
  10. John, Paul (October 24, 2009). "Metro rail project holds huge potential for realty biz: DMRC". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-09-30.
  11. John, Paul (June 11, 2009). "Ahmedabad-Gandhinagar Metro project: Is there light at the end of Metro tunnel?". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-09-30.
  12. "Ahmedabad Metro Phase 2 gets Modi Cabinet clearance ahead of Phase 1 inauguration on March 4". 21 February 2019.
  13. 1 2 "Ahemedabad Metro project gets green signal". The Times of India. 17 October 2014. Retrieved 2014-10-18.
  14. India (5 November 2014). "Modi government clears Railway land for Ahmedabad metro project". The Indian Express. Retrieved 2015-02-25.
  15. Avinash Nair (5 February 2015). "Mumbai-based firm wins bid for Ahmedabad metro construction". The Indian Express. Retrieved 2015-02-25.
  16. DeshGujarat (14 March 2015). "First 6 km works of Ahmedabad Metro to complete by September 2016:CM". DeshGujarat. Retrieved 2015-04-12.
  17. "IL&FS; Engineering Services Bags Rs. 374.64 Cr Metro Rail Contract in Gujarat". The Hans India. 15 December 2015. Retrieved 16 December 2015.
  18. DeshGujarat (22 October 2014). "MEGA invites tender for Vastral-Apparel Park stretch of Ahmedabad METRO Rail project". DeshGujarat. Retrieved 2015-02-25.
  19. "Railways green-lights north-south Metro work in Ahmedabad". The Times of India. 11 June 2016. Retrieved 13 June 2016.
  20. "Ahmedabad Metro Phase 1 gets ₹5,968-crore Japanese funding". Business Line. 27 November 2015. Retrieved 16 December 2015.
  21. "Ahmedabad Metro Phase 2 gets Modi Cabinet clearance ahead of Phase 1 inauguration on March 4". 21 February 2019.
  22. "Contact Us – MEGA".
  23. "PM Narendra Modi inaugurates Ahmedabad Metro first phase, takes a ride". Mint (in ఇంగ్లీష్). 2019-03-04. Retrieved 2019-03-08.
  24. 1 2 "Ahmedabad Metro Phase 2 gets Modi Cabinet clearance ahead of Phase 1 inauguration on 4 March". The Financial Express. 2019-02-21. Retrieved 2019-03-04.
  25. "Ahmedabad Metro to open for public on Wednesday". The Times of India. 5 March 2019. Retrieved 10 March 2019.
  26. "3 new metro stations in Ahmedabad likely to open later this year". DeshGujarat (in అమెరికన్ ఇంగ్లీష్). 2023-04-28. Retrieved 2023-05-28.
  27. "Ahmedabad Metro - Information, Route Maps, Fares, Tenders & Updates". The Metro Rail Guy (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2024-09-22.
  28. 1 2 "Chugging in, clearing hurdles: Prime Minister to inaugurate Phase I of Ahmedabad Metro in August this year". The Indian Express (in ఇంగ్లీష్). 2022-07-11. Retrieved 2022-07-13.
  29. "Ahmedabad Metro Route Map, Station List, Progress and Latest Updates - Infra Info Hub" (in అమెరికన్ ఇంగ్లీష్). 2024-06-06. Retrieved 2024-07-15.
  30. 1 2 "PM Modi to launch Ahmedabad Metro Phase 1, flag off Vande Bharat Express during two-day Gujarat visit". 28 September 2022.
  31. "From 2015, ride Metro from Ahmedabad to Gandhinagar". dna (in అమెరికన్ ఇంగ్లీష్). 2012-09-29. Retrieved 2018-10-21.
  32. "Ahmedabad metro rail project put on fast track". Business Standard. Retrieved 2010-07-27.
  33. John, Paul (October 24, 2009). "Metro rail project holds huge potential for realty biz: DMRC". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-09-30.
  34. "Ahmedabad Metro Phase 2 gets Modi Cabinet clearance ahead of Phase 1 inauguration on March 4". 21 February 2019.
  35. "Contact Us – MEGA".
  36. "'Very important gifts for Ahmedabad, Surat': PM Modi launches metro rail projects in Gujarat". www.timesnownews.com (in ఇంగ్లీష్). 18 January 2021. Retrieved 2021-01-18.
  37. "Ahmedabad Metro Phase 2 gets Modi Cabinet clearance ahead of Phase 1 inauguration on March 4". 21 February 2019.
  38. "Contact Us – MEGA".
  39. "Ahmedabad Metro Phase 2 gets Modi Cabinet clearance ahead of Phase 1 inauguration on March 4". 21 February 2019.
  40. "Contact Us – MEGA".
  41. "Ahmedabad Metro - Information, Route Maps, Fares, Tenders & Updates". The Metro Rail Guy (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2024-09-22.
  42. "Ahmedabad Metro Route Map, Station List, Progress and Latest Updates - Infra Info Hub" (in అమెరికన్ ఇంగ్లీష్). 2024-06-06. Retrieved 2024-07-15.
  43. "From 2015, ride Metro from Ahmedabad to Gandhinagar". dna (in అమెరికన్ ఇంగ్లీష్). 2012-09-29. Retrieved 2018-10-21.
  44. "Ahmedabad metro rail project put on fast track". Business Standard. Retrieved 2010-07-27.
  45. "Ahmedabad Metro Phase 2 gets Modi Cabinet clearance ahead of Phase 1 inauguration on March 4". 21 February 2019.
  46. "Contact Us – MEGA".
  47. 1 2 "How Will New Metro Route from Koteshwar Road to Ahmedabad Airport Benefit Commuters?". Times Now (in ఇంగ్లీష్). 2024-09-15. Retrieved 2024-12-07.
  48. "Ahmedabad Metro - Information, Route Maps, Fares, Tenders & Updates". The Metro Rail Guy (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2024-09-22.
  49. "Ahmedabad Metro Phase 2 gets Modi Cabinet clearance ahead of Phase 1 inauguration on March 4". 21 February 2019.
  50. 1 2 "GMRC eyes metro link to Olympics venue". Ahmedabad Mirror (in ఇంగ్లీష్). 2025-04-07. Retrieved 2025-04-26.
  51. 1 2 DeshGujarat (2023-09-29). "Ahmedabad Metro Rail completes one year; Average upto 90,000 daily passengers riding it". DeshGujarat (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-11-22.
  52. 1 2 3 4 "Route Information and Time Table". AHMEDABAD METRO RAIL PROJECT (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 20 May 2024. Retrieved 2024-12-07.
  53. "Tenders issued for Metro construction - TOI Mobile". The Times of India Mobile Site. 30 January 2015. Retrieved 2015-02-25.
  54. "Ahmedabad metro project: MEGA offers relocation option to residents". ETRealty.com. 23 March 2016. Retrieved 8 April 2016.
  55. "Metro rail project: Residents of Vejalpur junk relocation offer". The Indian Express. 30 March 2016. Retrieved 8 April 2016.
  56. "Ahmedabad Metro Phase 2 gets Modi Cabinet clearance ahead of Phase 1 inauguration on March 4". 21 February 2019.
  57. "Ahmedabad metro: Top officer held for 'fraud'". The Indian Express. 2015-05-15. Retrieved 2015-05-15.
  58. "Executive chairman of Metrolink Express for Gandhinagar and Ahmedabad seeks ban on media coverage". The Times of India. 20 May 2015. Retrieved 20 May 2015.
  59. "Former IAS officer involved in Ahmedabad metro scam released on bail". The Indian Express. 8 December 2015. Retrieved 16 December 2015.
  60. "Metro rail scam: Ex-IAS officer Sanjay Gupta gets bail". The Times of India. 5 April 2016. Retrieved 8 April 2016.