ఆండోయా స్పేస్
| Agency overview | |
|---|---|
| Abbreviation | ASC |
| Formed | 1962 |
| Type | Space agency |
| Owner | రాయల్ నార్వేజియన్ వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ, కాంగ్స్‌బెర్గ్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ |
| Employees | 100 |
| Website | http://andoyaspace.no |
| Lua error in మాడ్యూల్:Location_map at line 699: Unable to find the specified location map definition: "Module:Location map/data/Nordland" does not exist. | |
ఆండోయా స్పేస్, నార్వేలో, నార్డ్ల్యాండ్ కౌంటీ, ఆండోయ్ మునిసిపాలిటీ లోని ఆండోయా ద్వీపం ( వెస్టెరోలెన్ ద్వీపసమూహంలో ఉత్తరాన ఉన్నది)లో ఒక రాకెట్ ప్రయోగ ప్రదేశం, అంతరిక్ష నౌకాశ్రయం. దీన్ని ఆండోయా స్పేస్ సెంటర్ అని కూడా అంటారు. గతంలో ఆండోయా రాకెట్ రేంజ్ అనేవారు. 1962 నుండి వివిధ కాన్ఫిగరేషన్లకు చెందిన 1,200 కి పైగా సౌండింగ్, సబ్-ఆర్బిటాల్ రాకెట్లను ఈ సైట్ నుండి ప్రయోగించారు.
ఆండోయా స్పేస్ ఒక పౌర, పరిమిత బాధ్యత సంస్థ, దీని యాజమాన్యాన్ని రెండు గ్రూపులుగా విభజించారు: 90% వాటా రాయల్ నార్వేజియన్ వాణిజ్య, పరిశ్రమ మంత్రిత్వ శాఖకు, 10% కోంగ్స్‌బర్గ్ డిఫెన్స్ సిస్టమ్స్ కంపెనీకి ఉంటుంది. [1] ఇది వాణిజ్య ప్రాతిపదికన పనిచేస్తుంది. ఆండోయా స్పేస్, ఉత్తరాన స్వాల్బార్డ్లోని నై-అలేసుండ్లోని స్వాల్రాక్ ప్రయోగ సౌకర్యాన్ని కూడా నిర్వహిస్తోంది. ఈ కేంద్రం ESA, NASA, JAXA. DLR మిషన్లకూ, సంబంధిత శాస్త్రీయ పరిశోధనలకూ సౌకర్యాలను కల్పిస్తోంది.
చరిత్ర
[మార్చు]కక్ష్య ప్రయోగ ప్రణాళికలు
[మార్చు]కక్ష్య లోకి వెళ్ళే నానోసాటిలైట్ వాహక నౌకలను (NLVలు) ప్రయోగించడానికి ఆండోయాను అంతరిక్ష నౌకాశ్రయంగా ప్రతిపాదించారు.
నార్త్ స్టార్
[మార్చు]2013 జనవరిలో నమ్మో కంపెనీ, ఆండోయా స్పేస్ సెంటర్ నార్త్ స్టార్ అనే రాకెట్ వ్యవస్థను అభివృద్ధి చేయబోతున్నట్లు ప్రకటించాయి. ప్రామాణిక హైబ్రిడ్ మోటారును ఉపయోగించి, రెండు రకాల సౌండింగ్ రాకెట్లను, 10 కిలోగ్రాముల బరువున్న ఉపగ్రహాలను ధ్రువ కక్ష్య లోకి పంపేలా ఒక ఆర్బిటల్ లాంచర్‌ను నిర్మించడం లక్ష్యాలు. [2]
ఆండోయ అంతరిక్ష నౌకాశ్రయం
[మార్చు]చిన్న ఉపగ్రహాల కోసం మొదటి యూరోపియన్ ప్రయోగ స్థావరాన్ని స్థాపించే లక్ష్యంతో 2018లో [3] ఆండోయా స్పేస్‌పోర్ట్‌ను ఒక ప్రాజెక్టుగా స్థాపించారు. ఇది ప్రధానంగా భూమి పరిశీలనకు, సమాచార మార్పిడి కోసం ఉపగ్రహాలను ఆండోయా నుండి ధ్రువ లేదా సుర సమన్వయ కక్ష్యలోకి ప్రయోగించాలని తలపెట్టారు. ధ్రువ కక్ష్యలో ఉన్న ఉపగ్రహం ప్రతి పరిభ్రమణం లోనూ భూమి ధ్రువాల పైగా గానీ వాటికీ సమీపంలో గానీ వెళుతుంది. ఇది నార్వేకు అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే అవి నార్వేజియన్ ప్రాంతాలకు మంచి ఉపగ్రహ కవరేజ్, మంచి కమ్యూనికేషన్ అందిస్తూ, ఉత్తరాన సముద్ర పర్యవేక్షణకు వీలు కల్పిస్తాయి. ఈ సైట్ కు నార్వే NOK 365.6 మిలియన్లతో నిధులు సమకూర్చింది, పెట్టుబడికి వాణిజ్యపరమైన రాబడిని ఆశించింది.[4]
వాణిజ్య భాగస్వామ్యాలు
[మార్చు]2020-ప్రస్తుతం
[మార్చు]ఇసార్ ఏరోస్పేస్
[మార్చు]జర్మనీకి చెందిన ఇసార్ ఏరోస్పేస్, ఆండోయా స్పేస్‌తో ఒక ఒప్పందంపై సంతకం చేసింది. ఆండోయా ద్వీపంలోని ఒక లాంచ్ ప్యాడ్‌ను ఇరవై సంవత్సరాల పాటు వాడుకోవడం ఈ ఒపందం లోని అంశం. ఆండోయా స్పేస్‌పోర్ట్, లాంచ్ ప్యాడ్లూ, పేలోడ్ ఇంటిగ్రేషన్ సౌకర్యాలతో పాటు సైట్‌లోని సాంకేతిక మౌలిక సదుపాయాలను ఇసార్కు అందిస్తుంది.[5]
ఆండోయా స్పేస్‌పోర్ట్ అధ్యక్షుడు ఇంగున్ బెర్గెట్ ఇలా అన్నారు: “ఆండోయా ద్వీపంలో స్పేస్‌పోర్ట్ ప్రారంభం నార్వేకూ, యూరోపియన్ న్యూ స్పేస్ పరిశ్రమకూ ఇసార్ ఏరోస్పేస్తో మా భాగస్వామ్యానికీ ఒక ముఖ్యమైన మైలురాయి వంటిది. ఐరోపా నేల నుండి జరిగే మొట్టమొదటి ఉపగ్రహ ప్రయోగాలు ఆండోయా నుండే జరుగుతాయి. క్రౌన్ ప్రిన్స్ హాకోన్ ఈరోజు ప్రారంభోత్సవానికి హాజరు కావడం మా ప్రయత్నం లోని ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. మమ్మల్ని యూరప్‌లోని న్యూ స్పేస్ మ్యాప్‌లో ఉంచుతుంది.” [6]
ఇసార్ ఏరోస్పేస్ CEO, సహ వ్యవస్థాపకుడు డేనియల్ మెట్జ్లర్ ఇలా అన్నారు: “నేడు, నార్వే, ఆండోయా ప్రాంతం, ఇసార్ ఏరోస్పేస్ అంతరిక్షం వైపు ఒక పెద్ద అడుగు వేశాయి. గత ఐదు సంవత్సరాలుగా, యూరోపియన్ అంతరిక్ష పరిశ్రమలో అత్యంత కీలకమైన అడ్డంకిని పరిష్కరించడానికి సహాయపడే రాకెట్‌ను మేము నిర్మించాము. ఆండోయా స్పేస్పోర్ట్తో కలిసి, మా బృందం ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ భాగాన్ని సృష్టించింది. ఇది ఖండాంతర ఐరోపాలోని మొదటి కక్ష్యా ప్రయోగ ప్రదేశం. ఇది నార్వేకు, యూరప్‌కూ అంతరిక్షం లోకి వెళ్ళే వీలుకల్పిస్తుంది. ఇసార్ ఏరోస్పేస్‌కు ఇది, మొదటి ప్రయోగం చేసే క్రమంలో చివరి దశల్లోకి ప్రవేశించడం కాగా, అంతరిక్ష వేదికను ఉపయోగించుకోగలగడం యూరప్‌కు కలిగే ప్రయోజనం.”[6]
ప్యాడ్లు
[మార్చు]ఆండోయా తన జీవితాంతం లేదా కొంత భాగం ప్రయోగ ప్రదేశంగా ఆరు ప్రయోగ ప్యాడ్లను కలిగి ఉంది:
- LC5 69°17′40″N 16°01′11″E / 69.2944°N 16.0198°E
- LC9 69°17′39″N 16°01′08″E / 69.2941°N 16.0188°E
- LC10[ఎప్పుడు?] 69°17′38″N 16°01′07″E / 69.2940°N 16.0185°E
- అథేనా 69°17′39″N 16°01′15″E / 69.2943°N 16.0207°E
- Haugnes 69°16′48″N 16°10′48″E / 69.2800°N 16.1800°E
- U3 69°17′39″N 16°01′15″E / 69.2943°N 16.0207°E
- Orbital Launch Pad A 69°06′31″N 15°35′19″E / 69.1087°N 15.5887°E
ప్రమాదాలు, సంఘటనలు
[మార్చు]2025 మార్చి 30 న, ఇసార్ ఏరోస్పేస్ నుండి మొట్టమొదటి అంతరిక్ష ప్రయోగమైన స్పెక్ట్రమ్ రాకెట్ ప్రారంభ ప్రయోగం ఒక సమస్యను ఎదుర్కొంది. దాంతో పైకి లేచిన 30 సెకండ్ల తరువాత దాన్ని యాత్రను ఆపేసారు. అది నేలపై పడి పేలిపోయింది. [7] [8] [9]
మూలాలు
[మార్చు]- ↑ "About ASC". Archived from the original on 14 మార్చి 2018. Retrieved 13 March 2018.
- ↑ Lindsey, Clark (2013-01-28). "North Star rocket family with hybrid propulsion". NewSpace Watch. Archived from the original on 2013-06-20. Retrieved 2013-01-28.
- ↑ fiskeridepartementet, Nærings-og (2019-12-13). "Meld. St. 10 (2019–2020)". Regjeringen.no (in నార్వేజియన్). Retrieved 2020-03-12.
- ↑ "Grønt lys for satellittoppskyting fra Andøya". Tu.no (in నార్వేజియన్). Teknisk Ukeblad. 8 October 2021.
- ↑ "Launch site secured: Isar Aerospace signs exclusive launch pad in Norway for up to 20 years". Isar Aerospace (in ఇంగ్లీష్). Retrieved 2024-05-22.
- 1 2 "Andøya Spaceport, future launch site of Isar Aerospace, opened in official ceremony with Crown Prince Haakon of Norway". Isar Aerospace (in ఇంగ్లీష్). Retrieved 2024-05-22.
- ↑ Martin Smith (24 March 2025). "Launch Roundup: Alpha, Spectrum, Electron, and Falcon 9 set to fly". NasaSpaceFlight.
- ↑ Justin Davenport (30 March 2025). "Isar Aerospace set for second attempt at first orbital launch from continental Europe". NasaSpaceFlight.
- ↑ Schmitt, Tina. "Isar Aerospace lifts off successfully during first test flight of orbital launch vehicle". Isar Aerospace. No. 30 March, 2025.