ఆండ్ర శేషగిరిరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆండ్ర శేషగిరిరావు
Andra Seshagirirao.jpg
ఆండ్ర శేషగిరిరావు
జననంఫిబ్రవరి 8, 1902
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం తాలూకా కొడమంచిలి గ్రామం
మరణం1965
వృత్తిపాలకొల్లు హైస్కూలులో తెలుగు పండితులు
ఆంధ్రభూమి మాసపత్రికకు సంపాదకత్వం
ప్రసిద్ధిసుప్రసిద్ధ కవి, నాటకకర్త మరియు పత్రికా సంపాదకులు.

ఆండ్ర శేషగిరిరావు (ఫిబ్రవరి 8, 1902 - 1979) సుప్రసిద్ధ కవి, నాటకకర్త మరియు పత్రికా సంపాదకులు.

జీవిత సంగ్రహం[మార్చు]

వీరు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంతాలూకా కొడమంచిలి గ్రామంలో 1902 సంవత్సరం ఫిబ్రవరి 8వ తేదీన జన్మించారు. నరసాపురం టైలర్ ఉన్నత పాఠశాలలో చదివారు.

వీరు సంస్కృతాంధ్ర భాషలు అభ్యసించారు. వీరు పాలకొల్లు హైస్కూలులో తెలుగు పండితులుగా 34 సంవత్సరాలు పనిచేశారు. హిందూ యువజన సంఘం స్థాపించి ఏడాదికి ఆరు నాటకాలు ప్రదర్శించేవారు.

వీరు కొంతకాలంఆనందవాణి వారపత్రికకు అసోసియేట్ ఎడిటర్‌గా ఉన్నారు. ఆంధ్రభూమి మాసపత్రికకు సంపాదకత్వం వహించారు.

సాహితీ తపస్విగా ప్రసిద్ధులైన వీరు 1979 ప్రాంతంలో పరమపదించారు.

రచనలు[మార్చు]

రచించిన నాటకాలు[మార్చు]

 • భక్త నందనార్,
 • దుర్గావతి లేదా గడామండల వినాశము,
 • చిత్తూరు ముట్టడి
 • సాయిబాబా
 • త్యాగరాజు
 • భారతిపుత్రి
 • వధిన

రచించిన కావ్యాలు[మార్చు]

 • రామలింగేశ్వర శతకము
 • శంకరస్తవము (శివానందలహరి అనువాదము)
 • లలితా సుప్రభాతము
 • ఆత్మపుష్పాంజలి

ఇతర గ్రంధాలు[మార్చు]

మూలాలు[మార్చు]

 • బులుసు, వేంకటరమణయ్య (1950-09-01). "పుస్తక సమీక్ష". కిన్నెర. 2 (8): 42–43. Retrieved 20 March 2015.
 • ఆండ్ర, శేషగిరిరావు. కేయూరబాహుచరిత్ర. Retrieved 8 March 2015. |first2= missing |last2= (help)