ఆంథోని బౌర్డెన్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

మూస:Infobox Chef

ఆంథోని మైకేల్‌ 'టోని' బౌర్డెన్ ‌ (1956, జూన్‌ 25న జన్మించారు) ఒక అమెరికన్‌ రచయిత మరియు వంటవాడు. అతడు 2000లో రచించిన కిచెన్‌ కాన్ఫిడెన్షిల్‌: అడ్వంచెర్స్‌ ఇన్‌ ద కలినరీ అండర్‌బెల్లీ అనే పుస్తక రచయితగా సుపరిచుతుడు. ట్రావెల్‌ చానెల్స్‌లో కలినరీ మరియు సాంస్కృతిక సాహస కార్యక్రమం నిర్వహించే వ్యక్తిగా కూడా సుపరిచుతుడు.Anthony Bourdain: No Reservations

1978లో కలినరీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అమెరికా నుంచి గ్రాడ్యుయేషన్‌ సంపాదించిన బౌర్డెన్‌, ప్రొఫెషనల్‌ కిచెన్స్‌లో 28 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తి.[1] ప్రస్తుతం బౌర్డెన్‌ అతడి హెమ్‌బేస్‌ బస్రెరీ లెస్‌ హాలెస్‌లో చెఫ్‌ ఎట్‌ లార్జ్‌గా పని చేస్తున్నారు.[2] ఇక్కడ ఆయన అనేక సంవత్సరాల పాటు ఎగ్జిక్యూటివ్‌ చెఫ్‌గా పని చేశారు.

బాల్యం‌ మరియు కుటుంబం[మార్చు]

ఆంథోని న్యూయార్క్‌ నగరంలో పియెరి (డి.1988) మరియు గ్లాడిస్‌ బౌర్డెన్‌ దంపతులకు జన్మించారు. న్యూజెర్సీలోని లియోనియాలో పెరిగారు. అతడి తండ్రి పూర్వీకుల తరఫు నుంచి ఫ్రెంచ్‌ వారసత్వం ఉంది. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత అతడి తాత (తండ్రి తరఫు) ఫ్రాన్స్‌ నుంచి న్యూయార్క్‌కు వలస వచ్చారు.[3] బౌర్డెన్‌ ఇంగ్లివుడ్‌ స్కూల్‌ ఫర్‌ బాయ్స్‌లో చదువుకున్నారు, 1973లో అక్కడి నుంచి గ్రాడ్యుయేషన్‌ పొందారు.[4] వాసెర్‌ కళాశాల‌కు వెళ్లి, రెండు సంవత్సరాల తర్వాత మానేశారు. 1978లో కలినరీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అమెరికా నుంచి గ్రాడ్యుయేషన్‌ సంపాదించారు. ప్రస్తుతం బౌర్డెన్‌ బస్రెరీ లెస్‌ హాలెస్‌లో చెఫ్‌ ఎట్‌ లార్జ్‌గా పని చేస్తున్నారు. ఆయన అక్కడ దశాబ్దం పాటు ఎగ్జిక్యూటివ్‌ చెఫ్‌ టైటిల్‌తో పని చేశారు. ప్రయాణాలు లేని సమయంలో బౌర్డెన్‌ మాన్‌హట్టన్‌లో నివసిస్తారు.

తన హైస్కూల్‌ గర్ల్‌ఫ్రెండ్‌ పుట్‌కోస్కిని బౌర్డెన్‌ 1980ల్లో పెళ్లి చేసుకున్నారు. రెండు దశాబ్దాల పాటు కలిసి ఉన్న తర్వాత వీరు విడాకులు తీసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా చేసిన ప్రయాణాల వల్ల తనలో వచ్చిన మార్పులను తిరిగి మార్చుకోలేకపోవడమే, భార్యతో విడిపోవడానికి కారణమని బౌర్డెన్‌ భావించారు.[5] ప్రస్తుతం ఆయన తన రెండో భార్య ఒటావియా బుసియాతో కలిసి నివసిస్తున్నారు. వీరిని అరియేన్‌ అనే కూతురు ఉంది. ఆమె 2007 ఏప్రిల్‌ 9న జన్మించింది. బౌర్డెన్‌కు రెండో పెళ్లి 2007 ఏప్రిల్‌ 20న జరిగింది.[6] ఒటావియా నో రిజర్వేషన్స్‌ కార్యక్రమంలోని అనేక ఎపిసోడ్స్‌లో కనిపించారు. ఆమె జన్మస్థలం సర్డినియా ఎపిసోడ్‌తో పాటు, టుస్కని ఎపిసోడ్‌ చెప్పుకోదగ్గవి. ఇందులో ఆమె ఇటాలియన్‌ డిన్నర్‌ పట్ల సంతృప్తి చెందని పాత్ర పోషించారు.

కలినరీ శిక్షణ మరియు వృత్తి జీవితం[మార్చు]

కిచెన్‌ కాన్ఫిడెన్షియల్ ‌లో, ఫ్రాన్స్‌ ఆహారం పట్ల తనకు ప్రేమ ఎలా పెరిగిందీ బౌర్డెన్‌ వివరించారు. యుక్త వయసులో ఉండగా కుటుంబంతో కలిసి సెలవులు గడపడానికి వెళ్లిన సమయంలో ఓ ఫిషర్‌మెన్‌ పడవలో ఆయన అక్కడి ఆఎస్టర్ రుచి చూశారు. తర్వాత, వాసెర్‌ కళాశాలకు వెళుతున్నప్పుడు మసాచుచెట్స్‌, ప్రొవిన్స్‌ టౌన్‌లోని సీ ఫుడ్‌రెస్టారెంట్‌లో పని చేశారు. వంటను వృత్తి జీవితం‌గా ఎంచుకోవడానికి దోహదం చేసింది ఇదే. బౌర్డెన్‌ 1978లో కలినరీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అమెరికాలో గ్రాడ్యుయేట్‌ అయ్యారు. తర్వాత న్యూయార్క్‌ నగరంలో సూపర్‌ క్లబ్‌, ఒన్‌ ఫిఫ్త్‌ ఎవెన్యూ, సులివాన్స్‌ తదితర రెస్టారెంట్‌లలోని కిచెన్‌లలో పని చేశారు. మాన్‌హట్టన్‌లోని బస్రెరీ లెస్‌ హాలెస్‌లో ఎగ్జిక్యూటివ్‌ చెఫ్‌గా 1998లో చేరారు. మాన్‌హట్టన్‌లోని ఈ రెస్టారెంట్‌కు మియామితో పాటు బౌర్డెన్‌ చేరిన సమయంలో వాషింగ్టన్‌ డి.సి., మరియు జపాన్‌లోని టోక్యోలో కూడా శాఖలు ఉన్నాయి.

మీడియా వృత్తి జీవితం[మార్చు]

లేఖనం[మార్చు]

అతడు 2000లో రచించిన కిచెన్‌ కాన్ఫిడెన్షిల్‌; అడ్వంచెర్స్‌ ఇన్‌ ద కలినరీ అండర్‌బెల్లీ పుస్తకం న్యూయార్క్‌ టైమ్స్‌ లో అత్యధికంగా అమ్ముడైన పుస్తకం. ప్రస్తుతం ది న్యూయార్కర్‌లో ఆయన ప్రఖ్యాత ఆర్టికల్‌ 'డోంట్‌ ఈట్‌ బిఫోర్‌ రీడింగ్‌ దిస్‌' దీని నుంచే వచ్చింది.[7] ఈ పుస్తకం కలినరీ ప్రపంచంలో ఉన్న వెలుగుచూడని, చీకటి నిజాలను, హాస్యాన్ని బయటకు తెచ్చింది. బౌర్డెన్‌ వృత్తి‌ జీవితాన్ని కూడా ఇది బయట పెట్టింది.

తర్వాత కాలంలో బౌర్డెన్‌ మరో రెండు న్యూయార్క్‌ టైమ్స్ ‌ ఉత్తమంగా అమ్ముడైన‌ నాన్‌ ఫిక్షన్‌ పుస్తకాలను రాశారు. ఎ కుక్స్‌ టూర్‌ (2001), అతడి ఆహారం, ప్రపంచ వ్యాప్త ప్రయాణాల గురించిన పుస్తకం ఇది. అతడి తొలి టెలివిజన్‌ సిరీస్‌తో పాటు ఇది వచ్చింది. మరొక పుస్తకం ది నాస్టీ బిట్స్‌ (2006). ఇందులో ఆహారం గురించి ప్రధాన వ్యాసాలతో పాటు, నవ్వు తెప్పించే అనేక్దోత్స్ సహా అనేక అంశాలు ఉన్నాయి. ఆయన రాసిన ఇతర పుస్తకాలు ఆంథోని బౌర్డెన్స్‌ లెస్‌ హాలెస్‌ కుక్‌బుక్‌ , కలినరీ మిస్టరీస్‌ బోన్‌ ఇన్‌ ద థ్రోట్‌ , మరియు గాన్‌ బేంబూ ; చారిత్రక పరిశోధన ఉన్న టైఫాయిడ్‌ మేరీ-ఏన్‌ అర్బన్‌ హిస్టారికల్‌ ; మరియు నో రిజర్వేషన్స్‌- ఎరౌండ్‌ ద వరల్డ్‌ ఆన్‌ ఎంప్టీ స్టమక్‌ . తాజా పుస్తకం మీడియమ్‌ రా- ఎ బ్లడీ వాలంటైన్‌ టు ద వరల్ట్‌ ఫుడ్‌ అండ్‌ ద పీపుల్‌ హూ కుక్‌. ఇది కిచెన్‌ కాన్ఫిడెన్సియల్‌ కు సీక్వెల్‌గా వచ్చిన పుస్తకం. 2010లో ప్రచురణకు వచ్చింది.

బౌర్డెన్‌ యొక్క ఆర్టికల్స్‌ మరియు ఎస్సేస్‌ అనేక చోట్ల వచ్చాయి. వీటిలో ద న్యూయార్కర్‌ , ద న్యూయార్క్‌ టైమ్స్‌ , ద టైమ్స్‌ , ద లాస్‌ ఏంజిలెస్‌ టైమ్స్‌ , ద అబ్జర్వర్‌ , గౌర్మెట్‌ , మాగ్జిమ్‌ , ఎస్కైర్‌ (UK), స్కాట్లాండ్‌ ఆన్‌ సండే, ద ఫేస్ ‌, ఫుడ్‌ ఆర్ట్స్‌ , లింబ్‌ బై లింబ్‌ , బ్లాక్‌ బుక్‌ , ద ఇండిపెండెంట్‌ , బెస్ట్‌లైఫ్‌ , ద ఫినాన్షియల్‌ టైమ్స్‌ మరియు టౌన్‌ అండ్‌ కంట్రీ కూడా ఉన్నాయి. ఇంటర్‌నెట్‌లో బౌర్డెన్‌ యొక్క సీజన్‌ 3 బ్లాగ్‌ టాప్‌ చెఫ్‌ [8], 2008లో కల్చరల్‌ / పర్సనల్‌ బ్లాగ్‌ విభాగంలో బెస్ట్‌ బ్లాగ్‌ వెబ్బీ అవార్డుకు నామినేట్‌ అయింది.[9]

టెలివిజన్[మార్చు]

కిచెన్‌ కాన్ఫిడెన్షియల్‌ పుస్తకం ద్వారా బౌర్డెన్‌కు లభించిన ప్రచారం, మెమొఇర్ స్పందన కారణంగా ఫుడ్‌ నెట్‌వర్క్‌ నుంచి, ఫుడ్‌ అండ్‌ వరల్డ్‌ ట్రావెల్‌ షో నిర్వహించేందుకు ప్రతిపాదన వచ్చింది. 2002 జనవరి 8న ఎ కుక్స్‌ టూర్‌ ప్రసారమయింది. ది ట్రావెల్‌ చానెల్‌లో 2005 జులైలో ఆయన టెలివిజన్‌ సిరీస్‌Anthony Bourdain: No Reservations లకు సమాంతరంగా ఉండేలా కొత్త ప్రీమియర్‌ షో నిర్వహించారు. కిచెన్‌ కాన్ఫిడెన్షియల్‌ కు మంచి పేరు వచ్చిన తర్వాత, ఫాక్స్‌ సిట్‌కామ్‌ కిచెన్‌ కాన్ఫిడెన్షియల్‌ 2005లో ప్రసారం అయింది. ఇందులోని జాక్‌ బౌర్డెన్‌ క్యారెక్టర్‌, ఆంథోని బౌర్డెన్‌ ఆత్మకథ నుంచి వచ్చింది.

2006 జులైలో, బీరుట్‌లో నో రిజర్వేషన్స్‌ ఎపిసోడ్‌ చేస్తున్నప్పుడు ఇజ్రాయెల్‌, లెబనాన్‌ల విభేదాలు తారాస్థాయికి చేరాయి. జులై 20 ఉదయం యునైటెడ్‌ స్టేట్స్‌ మెరైన్స్‌తో బౌర్డెన్‌తో పాటు అతడి సిబ్బంది, మరి కొంతమంది అమెరికన్‌ పౌరులతో కలిసి వారు ఆ ప్రాంతాన్ని వీడాల్సి వచ్చింది.[10] వారి ప్రణాళికలో ఉన్న తొలి రెస్టారెంట్‌లో చిత్రీకరించిన కొద్ది పాటి ఫుటేజ్‌ మాత్రమే వారి దగ్గర ఉంది. యుద్ధం కారణంగా మిగిలిన చిత్రీకరణ పూర్తి కాలేదు. 2006 ఆగస్టు 21న ప్రసారమైన నో రిజర్వేషన్స్‌ లో ఈ బీరుట్‌లో చిత్రీకరించిన కొద్ది ఫుటేజిని ఉపయోగించారు. ఈ పుటేజ్‌లో బౌర్డెన్‌, అతడి నిర్మాణ సిబ్బందితో పాటుహజ్‌బుల్లా మద్దతుదారుల ఫస్ట్‌హ్యాండ్‌ ఎన్‌కౌంటర్స్‌ కూడా ఉన్నాయి. ఇందులో వారు బీరుట్‌లోని ఓ హెAటల్‌లో వార్తల కోసం నిరీక్షిస్తుంటారు. వారు తప్పించుకోవడానికి ఓ క్లీనర్‌ (ఫుటేజ్‌లో కనిపించడు) సహాయం చేస్తాడు. ఇతడిని బౌర్డెన్‌ మిస్టర్‌ ఊల్ఫ్‌గా డబ్‌ చేశారు. ఈ క్యారెక్టన్‌ను హార్వీ కీటెల్‌ పల్ప్‌ ఫిక్షన్‌ లో పోషించారు. ఈ ఎపిసోడ్‌ 2007లో ఎమ్మి అవార్డుకు నామినేషన్‌ సంపాదించింది.

బ్రేవో యొక్క టాప్‌ చెఫ్‌ రియాలిటీ కుకింగ్‌ కాంపిటీషన్‌ కార్యక్రమంలో బౌర్డెన్‌ ఐదుసార్లు గెస్ట్‌ జడ్జ్‌గా వ్యవహరించారు. 2006 నవంబరులో సీజన్‌ 2లో తొలిసారి 'థ్యాంక్స్‌ గివింగ్‌' ఎపిసోడ్‌లో, మరోసారి జూన్‌ 2007లో సీజన్‌ 3 తొలి ఎపిసోడ్‌లో ఆయన జడ్జ్‌గా వ్యవహరించారు. ఎబలోన్‌, ఎలిగేటర్‌, బ్లాక్‌ చికెన్‌, జియోడక్‌ మరియు ఈల్‌లను ఇంగ్రెడియంట్స్‌గా ఉపయోగించి నిర్వహించిన ఎక్సోటిక్‌ సర్ఫ్‌ అండ్‌ టర్ఫ్‌ పోటీలో ఈయన జడ్జ్‌. ఆయన మూడోసారి కనిపించింది కూడా సీజన్‌ 3లోనే. ఎయిర్‌ ట్రావెల్‌ నిపుణుడిగా, పోటీలోని ఎయిర్‌ప్లేన్‌ మీల్స్‌కు జడ్జ్‌గా వ్యవహరించారు. సీజన్‌ 3లోని అనేక ఎపిసోడ్స్‌కు బౌర్డెన్‌ వీక్లీ బ్లాగ్‌ కామెంటరీస్‌ రాశారు. టాప్‌ చీఫ్‌ జడ్జ్‌ టామ్‌ కొలిచియో ఓ కొత్త రెస్టారెంట్‌ ప్రారంభించడంలో బిజీగా ఉండటంతో బ్లాగ్‌లను బౌర్డెన్‌ పూర్తి చేశారు. సీజన్‌ 4 ఓపెనింగ్‌ ఎపిసోడ్‌కు బౌర్డెన్‌ గెస్ట్‌ జడ్జ్‌గా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో చెఫ్‌లు జంటలుగా విడిపోయి రకరకాల క్లాసిక్‌ డిషెస్‌ తయారు చేయడంలో ముఖాముఖి తలపడ్డారు. ఆ తర్వాత సీజన్‌ 4లోనే రెస్టారెంట్‌ వార్స్‌ ఎపిసోడ్‌లో, హెడ్‌ జడ్జ్‌ టిమ్‌ కొలిచియో చారిటీ ఈవెంట్‌కు వెళ్లడంతో, ఆయన స్థానంలో తాత్కాలికంగా హెడ్‌ జడ్జ్‌గా వ్యవహిరించారు.

2006 ఆగస్టు 8న ప్రసారమైన టిఎల్‌సీ యొక్క రియాలిటీ షో మియామి ఇంక్‌ ఎపిసోడ్‌లో బౌర్డెన్‌ కనిపించారు. బౌర్డెన్‌ కుడి భుజంపై ఆర్టిస్ట్‌ క్రిస్‌ గార్వర్‌ స్కల్‌ టాటూ వేశారు. ఇది తన నాలుగో టాటూగా బౌర్డెన్‌ చెప్పారు. స్కల్‌ టాటూ వేయించుకోవడానికి కారణం, తన మరో భుజం పై ఉన్న ఓరోబోరోస్‌ టాటూను బ్యాలెన్స్‌ చేయడమేనని చెప్పారు. ఆ టాటూమలేషియాలో ఆంథోని బౌర్డెన్‌; నో రిజర్వేషన్స్‌ కార్యక్రమాన్ని చిత్రీకరిస్తుండగా వేశారు.

2007 ఆగస్టు 6న న్యూయార్క్‌ సిటీ ఎపిసోడ్‌ బిజేర్‌ ఫుడ్స్‌ అండ్‌ ఆండ్రూ జిమ్మెర్న్‌ ఎపిసోడ్‌లో గెస్ట్‌గా వచ్చారు. జిమెర్న్‌ బౌర్డెన్స్‌ నో రిజర్వేషన్స్‌ న్యూయార్క్‌ ఎపిసోడ్‌లో గెస్ట్‌గా వచ్చారు. ఈ రెండూ ఒకే రోజు ప్రసారమయ్యాయి. 2008, అక్టోబరు 20న బౌర్డెన్‌ 'ఎట్‌ ద టేబుల్‌ విత్‌ ఆంథోని బౌర్డెన్‌' పేరుతో ట్రావెల్‌ చానెల్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. 2008లో వచ్చిన సినిమా ఫార్‌ క్రై సినిమాలోనూ బౌర్డెన్‌ కమీఓ అప్పియారెన్సు చేసారు.[11]

పబ్లిక్ పెర్సొన[మార్చు]

లో బౌర్దేన్ ఇన్ చికాగో

ఎక్సోటిక్‌ ఎథినిక్‌ డిషెస్‌ వినియోగించడంలో బౌర్డెన్‌ చాలా ప్రఖ్యాతి చెందారు. మొరాకోలో గొర్రె టెస్టికిల్స్‌, మెక్సికో, పుబెలాలో చీమ గుడ్లు, సంప్రదాయ ఇన్‌యుట్‌ సీల్‌ హంట్‌లో పచ్చి సీల్‌ ఐబాల్‌, మొత్తం కోబ్రా-బీటింగ్‌ హార్ట్‌, నెత్తురు, బైల్‌, మరియు మాంసం-వియత్నాం తిన్నారు. తాను తిన్న చెత్త ఆహారం చికెన్‌ మెక్‌నగెట్‌ అని బౌర్డెన్‌ అంటారు[12]. అంతే కాదు, తాను తిన్న 'తన జీవితంలోనే అతి చెత్త ఆహారం' నమీబియా[13] లో తాను తిన్న కడగని వార్తోగ్‌ రెక్టమ్‌, ఐస్‌లాండ్[14]‌లో తిన్న ఫెర్మెంటెడ్‌ షార్క్‌ అని బౌర్డెన్‌ చెబుతారు.

బౌర్డెన్‌ డ్రింకర్‌, స్మోకర్‌గా కూడా అనేక మందికి తెలుసు. ఓ దశలో బౌర్డెన్‌ రోజుకు రెండు పెట్టెలు సిగిరెట్లు తాగేవారు. ప్రఖ్యాత చెఫ్‌ థామస్‌ కెల్లర్‌ ఒకసారి బౌర్డెన్‌కు 20 పదార్థాలున్న మిడ్‌ మీల్‌ ఇచ్చారు. ఇందులో కాఫీ అండ్‌ సిగరెట్‌ కూడా ఉన్నాయి. కాఫీ కస్టర్డ్‌లో పొగాకు కలిపి, దానికి ఫోయి గ్రాస్‌ [15] జోడించి దీనిని సర్వ్‌ చేశారు. 2007 వేసవి నాటికి బౌర్డెన్‌ స్మోకింగ్‌ మానేశారు. అతడికి కూతురు పుట్టడమే దీనికి కారణం.[16]

తన టెలివిజన్‌ షో నో రిజర్వేషన్స్‌ లో బౌర్డెన్‌ సెక్సువల్‌ రిఫరెన్స్‌లను, చెత్త ప్రవర్తతను చాలా తరచుగా ప్రయోగించేవారు. దీంతో ది నెట్‌వర్క్‌ వీయర్‌ డిస్క్రిషన్‌ సలహాదారులను, ప్రతి ఎపిసోడ్‌లోని ప్రతి సెగ్మెంట్‌కు నియమించింది. ఇటీవల సెషన్‌లలో, ఎపిసోడ్‌తో కొంత సంబంధం ఉండే ఏనిమేషన్‌కు కూడా ఈ సలహాదారులు పని చేశారు.

బౌర్డెన్‌ ఒకప్పుడు కొకైన్‌, హెరాయిన్‌, ఎల్‌ఎస్‌డీ వినియోగించారు. కిచెన్‌ కాన్ఫిడెన్షియల్‌ లో 1981లో ఎస్‌ఓహెచ్‌ఓ రెస్టారెంట్‌లో తన అనుభవాలను కూడా ఆయన రాశారు. 'మేం అప్పుడు చాలా హైటైమ్‌లో ఉండేవాళ్లం. వినియోగించుకోవడానికి ఏ చిన్న అవకాశం దొరుకుతుందా అని చూసేవాళ్లం. కదిలే రెఫరీజిరాతోర్ ను కూడా తీసుకేల్లెవాళ్ళం. డ్రగ్స్‌ లేకుండా అసలు ఏ నిర్ణయం తీసుకునేవాళ్లం కాదు. కానిబాస్‌, మెథక్యుయలోన్‌, కొకైన్‌, ఎల్‌ఎస్‌డీ, టీని తీయగా చేయడానికి తేనేలో ముంచిన సిలోసి పుట్టగొడుగులు,సెకోబార్బిటల్‌, టునల్‌, ఆంఫటమైన్‌, కొడైన్‌, హెరాయిన్‌, ఇలా అనేక డ్రగ్స్‌ను స్పానిష్‌ మాట్లాడే ఒక బస్‌బాయ్‌తో ఆల్ఫాబాట్ నగరం నుంచి తెప్పించుకునేవాళ్లం' అని రాశారు.[17] అదే పుస్తకంలో తన పూర్వపు అలవాట్ల గురించి బౌర్డెన్‌ చాలా స్పష్టంగా తెలిపారు. డ్రగ్స్‌ కొనడానికి సరిపడా డబ్బు లేక, తన రికార్డు కలెక్షన్‌ను రోడ్డుమీద అమ్మిన విషయాన్ని ప్రస్తావించారు.

సెలబ్రిటీ చెఫ్‌ల పుట్‌డౌన్స్‌కు కూడా బౌర్డెన్‌ పేరుపొందారు. ఎమిరిల్‌ లగాస్సె (లగాస్సె అంటే ఇష్టం ఉంది. నో రిజర్వేషన్స్ ‌లో ఒక ఎపిసోడ్‌లో బౌర్డెన్‌తో కలిసి ఆయన పని చేశారుకూడా) మరియు బాబీ ఫ్లే, మరియు ఫుడ్‌ నెట్‌వర్క్‌ వ్యక్తులు సండ్రా ల, రాచెల్‌ రే (నో రిజర్వేషన్స్‌లో అనేక జోక్‌లకు మూలం) తదితరులు ఈయన బాధితులు. ఫిబ్రవరి 2007 [18] నుంచి పాపులారిటీ బ్లాగ్‌లో ఫుడ్‌నెట్ వర్క్‌లోని ఈ వ్యక్తులందరి గురించీ తన భావాలను వ్యక్తం చేశారు. సెలబ్రిటీ కుకింగ్‌ ఇండస్ట్రీలో ఉన్న వ్యాపార ధోరణి గురించి, కలినరీ సంప్రదాయాలు లోపించడం గురించి తన చిరాకును బాహాటంగానే చూపించారు. అక్టోబరు 2009లో అలిస్‌ వాటర్స్‌ 'పోల్‌ పాట్‌ ఇన్‌ ఏ ముము' అని కామెంట్‌ చేశారు.[19][20][21] సెలబ్రిటీ చెఫ్‌కు ఉండే బాధలను ఆయన క్రమంగా గుర్తించారు. కొంతవరకూ తనకు ఎదురవబోతున్న అవమానాలను గుర్తించారు. దీంతో తనకు నచ్చిన చెఫ్‌ల గురించి బహిరంగంగా పొగడ్తలు ప్రారంభించారు. థామస్‌ కెల్లెర్‌, మసా టకయామ, ఆల్టన్‌ బ్రౌన్‌, ఎరిక్‌ రిపెర్ట్‌, ఫెరాన్‌ ఆడ్రియా, ఫెర్గుస్‌ హెండర్సన్‌, మార్కో పియరె వైట్‌ మరియు మారియో బటాలను ప్రశంసించారు.[22] జులియా చైల్డ్‌ గురించి చాలా ఎక్కువగా పొగిడారు. నేను పెరగడంలో, నా వాల్యూ సిస్టమ్‌పై ఆమె ప్రభావం చాలా ఉందని చెప్పారు.[23]

వేగన్స్‌ గురించి, శాకాహారుల గురించి వ్యంగ్య వ్యాఖ్యలు చేయడంలోనూ బౌర్డెన్‌ చాలా ఫేమస్‌. తాను సందర్శించిన అనేక దేశాల్లో ఇది కఠినమైన లైఫ్‌స్టైల్‌ అన్నారు. 'ఫస్ట్‌ వరల్డ్‌ లగ్జరీ'గా తాను భావించే భారత్‌లో మతపరమైన నిర్మాణం వల్ల తాను వెజిటేరియనిజమ్‌ను పరిగనణలోకి తీసుకుంటానని బౌర్డెన్‌ తెలిపారు.[24]

బౌర్డెన్‌ సంగీత అభిరుచులు ప్రజల్లో గుర్తింపు వచ్చిన పెద్ద విషయం. అతడి పుస్తకం ది నాస్టీబైట్స్‌ లో, 'జోయె, జానీ అండ్‌ డీ డీ' ని రొమనీస్‌కు అంకితం చేశారు. వారి సంగీతానికి బౌర్డెన్‌ చాలా పెద్ద అభినందనలు తెలిపారు. ఎర్లీ పంక్‌ బ్యాండ్స్‌ డెడ్‌ బాయ్స్‌, టెలివిజన్‌, దన్యూయార్క్‌ డాల్స్‌ మరియు వయోడియోడ్స్‌నూ ప్రశంసించారు. అదనంగా కిచెన్‌ కాన్ఫిడెన్షియల్‌ లో బిల్లీ జోయెల్‌ సంగీతం తన కిచెన్‌లో తక్షణమే మంటలు తెప్పిస్తుందని రాశారు. (జోయల్‌ కూడా బౌర్డెన్‌ అభిమాని కావడం, అతడి రెస్టారెంట్‌కు వెళ్లడం అనుకోకుండా జరిగిన సంఘటన).[25] స్వీడన్‌లో 2006 నో రిజర్వేషన్స్‌ ఎపిసోడ్‌లో, తన ఆల్‌టైమ్‌ ఫేవరెట్‌ ఆల్బమ్‌ (తన డెసర్ట్‌ ఐలాండ్‌ డిస్క్‌) ది స్టోజెస్‌ యొక్క ఫన్‌ హౌస్‌ గ్రౌండ్‌ బ్రేకింగ్‌ పంక్‌ రికార్డు అని చెప్పారు. స్వీడిష్‌ పాప్‌ గ్రూప్‌ అబ్బా కూడా తనకు ఇష్టమని స్పష్టంగా చెప్పారు. 2007లో హాలిడే స్పెషల్‌ నో రిజర్వేషన్స్‌ ఎపిసోడ్‌కు స్టోన్‌ ఏజ్‌ గ్రూప్‌ రాక్‌బ్యాండ్‌ క్వీన్స్‌ డిన్నర్‌ గెస్ట్‌లుగా వచ్చారు. ఎపిసోడ్‌ సౌండ్‌ ట్రాక్‌లో హాలిడే సాంగ్స్‌తో స్ఫూర్తిని పెంచారు.

అమితమైన ఆసక్తులు[మార్చు]

పీసంట్‌, సంప్రదాయ ఆహారం యొక్క రుచి గురించి కమ్యూనికేట్‌ చేయడానికి బౌర్డెన్‌ ఒక న్యాయవాదిలా పనిచేశారు. 21వ శతాబ్దంలో పాశ్చాత్యులు సాధారణంగా తినని రకరకాల రుచులు, జంతువుల భాగాలను ఆయన పరిచయం చేశారు. అమెరికాలోని ఫాస్ట్‌ఫుడ్‌ చైన్‌లతో పోలిస్తే ఎదుగుతున్న దేశాల్లో రోడ్ల మీద తాజాగా తయారుచేసే, బాగా నాణ్యమైన, రుచిగల ఆహారం బాగుంటుందని ఎప్పుడూ వాదిస్తూ ఉండేవారు.

స్పానిష్‌ మాట్లాడే వలసవాదులకు మద్దతుగా నిలవడం బౌర్డెన్‌ గురించి చెప్పుకోదగ్గ అంశాల్లో ఒకటి. మెక్సికక్ష, ఈక్వెడార్‌ల నుంచి వచ్చిన వారికి కూడా అప్పుడప్పుడు మద్దతు ఇచ్చేవారు. వారిని బౌర్డెన్‌ నైపుణ్యం ఉన్న, విలువకట్టలేని వంటవారిగా అభివర్ణించేవారు. వారికి తక్కువ వేతనాలు ఇస్తున్నారని, అమెరికాలోని రెస్టారెంట్‌ పరిశ్రమకు వెన్నుముకగా నిలుస్తున్నా గుర్తింపు రావడం లేదని విమర్శించేవారు.[26][27][28]

పురస్కారాలు మరియు ప్రతిపాదనలు[మార్చు]

2001లో కిచెన్‌ కాన్ఫిడెన్షియల్‌ పుస్తకానికి, బాన్‌ అపెటిట్‌ మ్యాగజైన్‌ బౌర్డెన్‌కు ఫుడ్‌ రైటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డు ఇచ్చింది.[29]


2002లో బ్రిటిష్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఫుడ్‌ రైటర్స్‌ ఎ కుక్స్‌ టూర్‌ ను ఫుడ్‌ బుక్‌ ఆఫ్‌ ద ఇయర్‌గా ప్రకటించింది.[30]

2006లో ఇజ్రాయెల్‌, లెబనాన్‌ యుద్ధం సమయంలో బౌర్డెన్‌, అతడి సిబ్బంది అనుభవాలను ప్రసారం చేసిన బీరుట్‌ ఎపిసోడ్‌Anthony Bourdain: No Reservations }, 2007లో ఎమ్మీ అవార్డులో అవుట్‌స్టాండింగ్‌ ఇన్ఫర్మేషనల్‌ ప్రోగ్రామ్‌ విభాగంలో నామినేట్‌ అయింది.

2008లో టాప్‌ చెఫ్‌ [8] రియాలిటీ షో పోటీలో బౌర్డెన్‌ యొక్క బ్లాగ్‌, వెబ్బీ అవార్డ్‌ ఫర్‌ బెస్ట్‌ బ్లాగ్‌ -కల్చరల్‌ అండ్‌ పర్సనల్‌కు నామినేట్‌ అయింది.[9]

2008లో బౌర్డెన్‌ను జేమ్స్‌ బెరార్డ్‌ ఫౌండేషన్‌ యొక్క హూ ఈజ్‌ హూ ఆఫ్‌ ఫుడ్‌ అండ్‌ బేవరేజ్‌ ఇన్‌ అమెరికాలో చేర్చారు.

2009లో Anthony Bourdain: No Reservations నాన్‌ ఫిక్షన్‌ ప్రొగ్రామింగ్‌లో అవుట్‌స్టాండింగ్‌ సినిమాటోగ్రఫీ విభాగంలో క్రియేటివ్‌ ఆర్ట్స్‌ ఎమ్మీ అవార్డును గెలుచుకున్నారు.

గ్రంథ పట్టిక[మార్చు]

కల్పన-కానిది
 • Bourdain, Anthony (2000). Kitchen Confidential. New York: Bloomsbury. ISBN 158234082X. 
 • Bourdain, Anthony (2001). A Cook's Tour. New York: Bloomsbury. ISBN 1582341400. 
 • Bourdain, Anthony (2001). Typhoid Mary: An Urban Historical. New York: Bloomsbury. ISBN 1582341339 Check |isbn= value (help). 
 • Bourdain, Anthony (2004). Anthony Bourdain's Les Halles Cookbook. Bloomsbury. ISBN 9781582341804. 
 • Bourdain, Anthony (2006). The Nasty Bits. New York: Bloomsbury. ISBN 978-1596913608. 
 • Bourdain, Anthony (2007). No Reservations. New York: Bloomsbury. ISBN 9781596914476. 
 • బౌర్డెన్‌ ఆంథోని (2010). మీడియమ్‌ రా; ఎ బ్లడీ వాలంటైన్‌ టు ద వరల్డ్‌ ఆఫ్‌ ఫుడ్‌ అండ్‌ ద పీపుల్‌ హూ కుక్‌, ఎకో / హార్పెర్‌ కొలిన్స్‌. ISBN ‌0262081504
కల్పన
 • Bourdain, Anthony (1995). Bone in the Throat. New York: Villard Books. ISBN 0679435522. 
 • Bourdain, Anthony (1997). Gone Bamboo. New York: Villard Books. ISBN 0679448802. 
 • Bourdain, Anthony (2001). Bobby Gold. Edinburgh: Canongate Crime. ISBN 1841951455. 

ఫుట్ నోట్స్[మార్చు]

 1. బౌర్డెన్‌యొక్క బయోగ్రాఫి TravelChannel.com
 2. "Les Halles Homepage". Brasserie Les Halles. Retrieved June 18, 2007. 
 3. Anthony Bourdain: No Reservations , ఎపిసోడే 5.4: ఉరుగువే ; జూలై 28, 2008Anthony Bourdain: No Reservations
 4. http://www.nndb.com/people/783/000028699/
 5. The Observer (April 30, 2006). "Regrets? He's had a few ...". London: Guardian. Retrieved June 16, 2007. 
 6. Lindsay Soll (May 11, 2007). "Monitor". Celebrity Baby Blog.  Unknown parameter |is dumbaccessdate= ignored (help)
 7. సీక్రెట్‌ ఇండిగ్రెంట్స్‌; ది న్యూయార్కర్‌ బుక్‌ ఆఫ్‌ ఫుడ్‌ అండ్‌ డ్రింక్‌ - పూర్తి టెక్ట్స్‌
 8. 8.0 8.1 ఆంథోనీస్‌ బ్లాడ్‌; రీడ్‌ ఆంథోని బౌర్డెన్స్‌ ఆన్‌లైన్‌ బ్లాడ్‌ - టాప్‌ చెఫ్‌ టీవీ షో - అఫీషియల్‌ బ్రావో టీవీసైట్‌
 9. 9.0 9.1 వెబ్బీ నామినీస్‌
 10. Anthony Bourdain (July 23, 2006). Twelve Days of Conflict Between Israel and Hezbollah. Interview with Larry King. Larry King Live. CNN. Retrieved June 16, 2007. 
 11. ఫార్‌ క్రై (2008)
 12. ఆంథోని బౌర్డెన్‌ ద ఎ.వి.క్లబ్‌
 13. ఎపిసోడ్‌ 3.4 నమీబియా, జనవరి 22, 2007Anthony Bourdain: No Reservations
 14. ఎపిసోడ్‌ 1.2 'ఐస్‌ల్యాండ్‌' ఆగస్టు 1, 2005Anthony Bourdain: No Reservations
 15. Bourdain, Anthony (2001). A Cook's Tour. New York: Bloomsbury. pp. 248–9. ISBN 1582341400. 
 16. Hudak, Joseph (January 7, 2008). "Anthony Bourdain Speaks His Mind with No Reservations". TV Guide. Retrieved March 20, 2008. 
 17. Bourdain, Anthony (2000). Kitchen Confidential. New York: Bloomsbury. p. 123. ISBN 158234082X. 
 18. గెస్ట్‌ బ్లాగింగ్‌; ఎ బౌర్డెన్‌ త్రోడౌన్‌ Ruhlman.com
 19. ఫుడ్‌ అండ్‌ వైన్‌. కామ్‌ మౌతింగ్‌ ఆఫ్‌ ఆంథోని అన్‌సెన్సార్డ్‌
 20. Yoo, Aileen (October 30, 2009). "The Scavenger : Bourdain likens Alice Waters to Cambodian dictator". The San Francisco Chronicle. 
 21. http://టాపిక్సు.ఎన్ఫైఆర్.ఆర్గ్/quote/0fcd6gc2fq3uA?q=Jamie+Oliver
 22. The Serious Eats Team (March 2, 2007). "Meet & Eat: Anthony Bourdain". Serious Eats. Retrieved June 16, 2007. 
 23. Squires, Kathleen (August 3, 2009). "Dish from the Julie & Julia Premiere". Zagat.com. 
 24. రచయితలు@ గూగుల్
 25. "Sound Opinions". American Public Media. June 26, 2009. 
 26. Bourdain, Anthony (2000). Kitchen Confidential. New York: Bloomsbury. 
 27. బౌర్డెన్‌, ఆంథోని (2001). ఎ కుక్స్‌ టూర్‌, న్యూయార్క్‌; బ్లూమ్స్‌బరి
 28. బౌర్డెన్‌, ఆంథోని (2006) ద నాస్టీ బైట్స్‌ , న్యూయార్క్‌, బ్లూమ్స్‌బరి pp. 42–46.
 29. బాన్‌ అపెటిట్‌ నేమ్స్‌ అవార్డు విజేత
 30. గిల్డ్‌ ఆఫ్‌ ఫుడ్‌ రైటర్స్‌

సూచనలు[మార్చు]

బాహ్య లింకులు[మార్చు]

Wikiquote-logo-en.svg
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.

అధికారిక సైట్‌లు

బ్లాగ్స్

ఇంటర్వ్యూలు

మూస:Anthony Bourdain