ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం
High Court of Andhra Pradesh, Amaravati (May 2019) 1.jpg
అమరావతిలో ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం బిల్డింగ్
Established1 జనవరి 2019[1]
Country India
Locationఅమరావతి, ఆంధ్రప్రదేశ్
Coordinates16°31′10″N 80°29′08″E / 16.5195°N 80.4856°E / 16.5195; 80.4856Coordinates: 16°31′10″N 80°29′08″E / 16.5195°N 80.4856°E / 16.5195; 80.4856
Composition methodPresidential with confirmation of Chief Justice of India and Governor of respective state.
Authorized byభారత రాజ్యాంగం
Decisions are appealed toభారత అత్యున్నత న్యాయస్థానం
Judge term length62 సంవత్సరాల వయసులో తప్పనిసరి పదవీ విరమణ
Number of positions37
{Permanent 28 ; Addl. 9}
Websitehc.ap.nic.in
ఛీఫ్ జస్టిస్
Currentlyజె.కె. మహేశ్వరి
Since7 అక్టోబర్ 2019

ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం అన్నది భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం. హైకోర్టు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నెలకొని ఉంది.[2] ప్రస్తుతం హైకోర్టు కోసం ఉపయోగిస్తున్న కోర్టు కాంప్లెక్స్‌కు "జ్యుడిషియల్ కాంప్లెక్స్" అని పేరు పెట్టారు. శాశ్వత హైకోర్టు భవనం ప్రారంభించిన తరువాత "సిటీ సివిల్ కోర్టు" కోసం ఈ జ్యూడీషియల్ కాంప్లెక్స్ వాడతారు.

చరిత్ర[మార్చు]

1954 సంవత్సరంలో మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి విడిపోయి, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డప్పుడు దీన్ని స్థాపించారు. 1956 నాటికి ఆంధ్ర హైకోర్టు గుంటూరులో ఉండేది. ఆంధ్ర రాష్ట్రం, హైదరాబాద్ రాష్ట్రం తర్వాత కలిసిపోయి ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాకా దీన్ని ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్‌కు తరలించారు. 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లుగా విడిపోయాకా, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం ఆంధప్రదేశ్‌కు ప్రత్యేకించి హైకోర్టు ఏర్పాటుచేసేదాకా, హైదరాబాద్‌లోని హైకోర్టు ఉమ్మడి న్యాయస్థానంగా కొనసాగింది. రాష్ట్రపతి ఉత్తర్వులతో 2019 జనవరి 1న ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పాటైంది. దీన్ని ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నెలకొల్పారు.

భౌగోళికం[మార్చు]

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అమరావతిలో అంతర్భాగమైన నేలపాడు వద్ద నెలకొంది.[3] కృష్ణా నదికి 6.4 కిలోమీటర్ల దూరంలో ఉంది.[4]

మూలాలు[మార్చు]

  1. "New Andhra High Court to function at Amaravati from Jan 1, President issues notification". Thenewsminute.com. Retrieved 28 December 2018.
  2. "CJI Ranjan Gogoi to open Judicial Complex, lay stone for permanent HC in Amaravati today". The New Indian Express. 3 February 2019. Retrieved 25 August 2019.
  3. Reporter, Staff (2019-02-02). "CJI to inaugurate judicial complex today". The Hindu (in ఆంగ్లం). ISSN 0971-751X. Retrieved 2019-02-03.
  4. Google (28 January 2019). "Distance between High Court and Krishna river". Google Maps (Map). https://www.google.com/maps/@16.5442862,80.4880183,7185m/data=!3m1!1e3. 

ఇవి కూడా చూడండి.[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]