ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పోరేషన్ లిమిటెడ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎపిజెన్‌కో
తరహా
స్థాపన1998
ప్రధానకేంద్రముహైదరాబాదు, ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం
కీలక వ్యక్తులుఎస్.వి.ప్రసాద్ ఛైర్మన్, కె.విజయానంద్ మేనేజింగ్ డైరెక్టర్
పరిశ్రమవిద్యుత్ ఉత్పాదన
ఉత్పత్తులువిద్యుత్
మొత్తం ఆస్తులుIncreaseINR 173.44 బిలియన్ (2008) లేదా USD 3.5 బిలియన్
మొత్తం ఈక్విటీIncreaseINR 21.17 బిలియన్ (2008) లేదా USD 500 మిలియన్
ఉద్యోగులు10889 (2008)
నినాదముది పవర్ జనరేటింగ్ కంపెనీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్
వెబ్ సైటుhttp://apgenco.gov.in/

ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పోరేషన్ లిమిటెడ్ (ఎపిజెన్‌కో) భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ ఉత్పాదన కంపెనీ.[1] ఆంధ్రప్రదేశ్  పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్, పూర్వపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కీలక సంస్థలలో ఇది ఒకటి. ఇది విద్యుత్ ఉత్పత్తి వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తుంది.అందులో భాగంగా విద్యుత్ ప్లాంట్ల నిర్వహణ, సామర్థ్యం ఎదుగుదల చేరిక కార్యక్రమం కింద కొనసాగుతున్న ప్రాజెక్టులను ఆధునీకరించటం,  కొత్త విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం,  పాత విద్యుత్ కేంద్రాల పునరుద్ధరణ పనులను చేపడుతోంది.[1]

ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పోరేషన్ లిమిటెడ్ 01.02.1999న ఏర్పడి,అప్పటి నుండి నుండి కార్యకలాపాలను ప్రారంభించింది. విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, విద్యుత్ పంపిణీకి సంబంధించిన కార్యకలాపాలను విడదీయడానికి విద్యుత్ రంగంలో ప్రభుత్వాల సంస్కరణలకు ఇది తొలిమెట్టు అని చెప్పుకోవచ్చు. పూర్వపు ఎపిఎస్ఇబి యాజమాన్యంలోని అన్ని జనరేషన్ స్టేషన్లు ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పోరేషన్ లిమిటెడ్ నియంత్రణకు బదిలీ చేయబడ్డాయి.

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ తరువాత, ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పోరేషన్ లిమిటెడ్ ఆస్తులు, బాధ్యతలు, ఉద్యోగులు మొదలైనవి రెండు వారసత్వ రాష్ట్రాల మధ్య విభజించారు.

2810. మెగావాట్ల థర్మల్, 1797.6 మెగావాట్ల హైడ్రో, 5 మెగావాట్ల సౌర విద్యుత్ కేంద్రాలతో కూడిన 4612.6 మెగావాట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ తరువాత 05.01.2017 నాటికి ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పోరేషన్ లిమిటెడ్ వ్యవస్థాపిత సామర్థ్యం ఆంధ్రప్రదేశ్ మొత్తం విధ్యత్ అవసరాలలో 41% తోడ్పాటునందిస్తుంది.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "APGENCO". apgenco.gov.in. Archived from the original on 2020-02-05. Retrieved 2020-02-05.

వెలుపలి లంకెలు[మార్చు]