ఆంధ్రప్రదేశ్ మండలాలు
ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ 2022 తరువాత రాష్టంలో 679 మండలాలు ఉన్నాయి.[1]
చరిత్ర[మార్చు]

2002 ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్విభజనకు ముందు 670 మండలాలు వుండేవి. ఒక్కొక్క మండలపరిధిలోని సుమారు జనాభా 20,000 నుండి 50,000 వరకు ఉంది. సుమారు 7 మండలాల నుండి 15 మండలాలు వరకు కలిపి ఒక రెవెన్యూ డివిజనుగా ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ లో 2021 మార్చి ఆఖరునాటికి రాష్ట్రంలో మొత్తం 50 రెవిన్యూ డివిజన్లు ఉన్నాయి.రాష్ట్రం 3 జోనులుగా విడగొట్టబడింది. మండలాల పేర్లను అలాగే ఉంచి, మండల వ్యవస్థ ఏర్పడినప్పుడు పెట్టిన మండల రెవెన్యూ కార్యాలయాల పేరును తహశీల్దార్ కార్యాలయంగా తిరిగి పూర్వ స్థితికి మార్చి, మండల రెవిన్యూ అధికారి (ఎం.ఆర్.ఓ) పేరును తహశీల్దారుగా మార్చారు.
జిల్లాల వారిగా మండలాలు, రెవెన్యూ డివిజన్లు గణాంకాలు[మార్చు]
2022 పునర్య్వస్థీకరణ ప్రకారం రాష్ట్రంలో జిల్లాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్లు గణాంకాలు ఈ విధంగా ఉన్నాయి.[2]
- జిల్లాల సంఖ్య: 26 (మరిన్ని వివరాలకు ఆంధ్రప్రదేశ్_జిల్లాలు#జిల్లాల_గణాంకాలు చూడండి.)
- మొత్తం మండలాలు: 679 (2022 పునర్య్వస్థీకరణలో గతంలో ఉన్న మండలాలకు జగిగిన మార్పులు:
- గుంటూరు మండలం -> గుంటూరు తూర్పు మండలం, గుంటూరు పశ్చిమ మండలం (2)
- కర్నూలు మండలం -> కర్నూలు పట్టణ, కర్నూలు గ్రామీణ మండలం (2)
- విజయవాడ పట్టణ మండలం -> విజయవాడ మధ్య మండలం, విజయవాడ ఉత్తర మండలం, విజయవాడ తూర్పు మండలం, విజయవాడ పశ్చిమ మండలం (4)
- నెల్లూరు మండలం -> నెల్లూరు పట్టణ మండలం , నెల్లూరు గ్రామీణ మండలం (2)
- విశాఖపట్నం పట్టణ మండలం + విశాఖపట్నం గ్రామీణ మండలం -> సీతమ్మధార మండలం, గోపాలపట్నం మండలం, ములగాడ మండలం, మహారాణిపేట మండలం (4)
వివరణ:2022 పునర్య్వస్థీకరణలో గతంలో ఉన్న 670 మండలాలలో విశాఖపట్నం పట్టణ మండలం, విజయవాడ పట్టణ మండలం, గుంటూరు మండలం, నెల్లూరు మండలం, కర్నూలు మండలం ఈ 5 మండలాలు రద్దై, వాటిస్థానంలో పైన వివరించిన ప్రకారం 14 మండలాలు కొత్తగా ఏర్పడ్డాయి. వాటితో రాష్ట్రం లోని మండలాలసంఖ్య 679కి చేరుకుంది.
- రెవెన్యూ డివిజన్లు: 75 (మరిన్ని వివరాలకు ప్రధాన వ్యాసం: ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ డివిజన్లు జాబితా చూడండి)
2022 ఏప్రిల్ 4 న జిల్లా పరిధి మారిన మండలాలు[మార్చు]
రాష్ట్రంలోని ప్రస్తుత మండలాలు[మార్చు]
To display all pages click on the "►": |
---|
ఇవీ చూడండి[మార్చు]
- ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ డివిజన్లు జాబితా
- తెలంగాణ రెవెన్యూ డివిజన్లు జాబితా
- ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితా
- తెలంగాణ మండలాలు
మూలాలు[మార్చు]
- ↑ "ఆంధ్రప్రదేశ్ రాజపత్రము" (PDF). ahd.aptonline.in. Archived from the original (PDF) on 2022-09-06. Retrieved 2022-09-06.
- ↑ "AP: కొత్త జిల్లాల స్వరూపమిదే.. పెద్ద జిల్లా ఏదంటే?". Sakshi. 2022-04-03. Retrieved 2022-04-03.
వెలుపలి లంకెలు[మార్చు]
వికీడేటా[మార్చు]
(జిల్లా మారినందున కొన్ని మండలాల పేర్లలో మార్పు, చేర్పులు చేయవలసివుంది)