ఆంధ్రప్రదేశ్ రాజ్యాభిలేఖ పరిశోధనాలయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
16 వ శతాబ్దం కోదండరామ ఆలయం, ఒంటిమిట్ట, ఆంధ్రప్రదేశ్

ఆంధ్ర ప్రదేశ్ రాజ్యాభిలేఖ పరిశోధనాలయం (Andhra Pradesh State Archives and Research Institute) ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సంస్థ. ఇది హైదరాబాదులో తార్నాక ప్రాంతంలో ఉంది.

చరిత్ర[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజ్యాభిలేఖ పరిశోధనాలయం 1894లో ప్రారంభించబడింది. ఈ సంవత్సరం కొందరు జాగీర్దార్లు స్వాధీనంలో ఉన్న దఫ్తర్-ఇ-దివానీ, దఫ్తర్-ఇ-మాల్ రికార్డులను నిజాం ప్రభుత్వం సొంతం చేసుకున్నది. వీటిని భద్రపరచడానికి దఫ్తర్-ఇ-దివానీ అను పేరుతో కొత్త కార్యాలయం ఏర్పాటుచేయబడింది. 1924 సంవత్సరంలో దీని స్థాయిని డైరెక్టరేటుకు పెంచబడి, హైదరాబాదు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ పేరును కేంద్ర రికార్డు కార్యాలయం అని మార్చబడింది.

ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత 1953లో కొన్ని రికార్డులను మద్రాసు నుండి కర్నూలుకు మార్చబడినవి.


ఆంధ్ర ప్రదేశ్ అవతరించిన తరువాత నవంబరు 1, 1956 నుండి ఆంధ్ర రికార్డు కార్యాలయం, కేంద్ర రికార్డు కార్యాలయం విలీనం చేయబడ్డాయి. చివరగా 1962లో ఈ డిపార్టుమెంటు జాతీయ రాజ్యాభిలేఖ పద్ధతిలో పునర్వ్యవస్థీకరించబడింది.

బయటి లింకులు[మార్చు]

అధికారిక వెబ్ సైటు.