ఆంధ్రప్రదేశ్ హిందీ అకాడమీ
Appearance
ఆంధ్రప్రదేశ్ హిందీ అకాడమీ [1] 2007 ఏప్రిల్ 12 న మరల ప్రారంభించబడింది. దీని అధ్యక్షుడిగా ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ నియమించబడ్డాడు. ఆంధ్రప్రదేశ్ లో హిందీ ప్రచారం, హిందీలో రచనలు చేసే తెలుగువారిని ప్రోత్సహించడం, తద్వారా, తెలుగు భాషా సంస్కృతులను జాతీయ స్థాయికి చేర్చడం దీని ముఖ్యోద్దేశాలు.
అనువదించి హిందీలో ప్రచురించిన కొన్ని గ్రంథాలు
[మార్చు]- 'బారిష్టరు పార్వతీశము' (హిందీ అనువాదం)
- 'తెలుగు హీ ప్రాచీన హై' ('తెలుగే ప్రాచీనం' గ్రంథానువాదం)
- 'వేమన శతి' (ఎంపిక చేయబడ్డ వేమన తెలుగు పద్యాల హిందీ అనువాదం)
- 'మేరీ జీవన్ యాత్ర' (టంగుటూరి ప్రకాశం పంతులుగారి ఆత్మకథ హిందీ అనువాదం)
- సహస్ర వర్షాంకా తెలుగు సాహిత్య ('వెయ్యేళ్ల తెలుగు వెలుగు' హిందీ అనువాదం)
- ఆంధ్రప్రదేశ్ మే హిందీ సాహిత్య కే వికాస్ కా ఇతిహాస్ (ఆంధ్రప్రదేశ్ లో హిందీ సాహిత్య వికాసచరిత్ర)
- ఆంధ్రప్రదేశ్ మే హిందీ ప్రచార్ ఆందోళనా కా ఇతిహాస్ (ఆంధ్రప్రదేశ్ లో హిందీ ప్రచార ఆందోళన చరిత్ర)
- ఆంధ్ర కా సామాజిక్ ఇతిహాస్ (ఆంధ్రుల సామాజిక చరిత్ర హిందీ అనువాదం)
- దాక్షిణాత్యం కి నృత్యకళా కా ఇతిహాస్ (దాక్షిణాత్యుల నృత్యకళా చరిత్ర అనువాదం)
- ఆంధ్రప్రదేశ్ కా సాంస్కృతిక్ పర్యటన్ క్షేత్ర ఔర్ లోక్ కళాయేం ('ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక పర్యటన క్షేత్రము , జానపద కళలు' హిందీ అనువాదం)
- 'తెలుగు భాషా కా ఇతిహాస్' ('తెలుగు భాషా చరిత్ర' గ్రంథ హిందీ అనువాదం)
- తెలంగాణ - ఇతిహాస్, సంస్కృతి, జనజీవన్ (తెలంగాణ చరిత్ర, సంస్కృతి, జనజీవనం)
- డా. బెజవాడ గోపాల రెడ్డి కీ ఆత్మకథ (ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి , ఉత్తర ప్రదేశ్ మాజీ గవర్నరు డా.బి.గోపాల రెడ్డి ఆత్మకథ)
వనరులు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-08-02. Retrieved 2020-09-19.