ఆంధ్రప్రభ
స్వరూపం
| రకం | ప్రతిదినం |
|---|---|
| రూపం తీరు | బ్రాడ్షీట్ |
| యాజమాన్యం | దిన్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ |
| ప్రచురణకర్త | దిన్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ |
| స్థాపించినది | 1938-08-15 మద్రాసు,[1] |
| ముద్రణ నిలిపివేసినది | 1958-59 |
| జాలస్థలి | http://www.prabhanews.com/home |
ఆంధ్రప్రభ ఒక ప్రముఖ తెలుగు దినసరి వార్తాపత్రిక. ఇది 1938 సంవత్సరం ఆగష్టు 15న ఇండియన్ ఎక్స్ ప్రెస్ యజమాని రామనాథ్ గోయంకా మద్రాసులో ప్రారంభించారు [1]. అప్పుడు ఖాసా సుబ్బారావు సంపాదకులుగా ఉన్నాడు. అతని తరువాత న్యాపతి నారాయణమూర్తి సంపాదకులైనాడు. 1942లో నార్ల వెంకటేశ్వరరావు సంపాదకత్వ బాధ్యతలు స్వీకరించాడు. కొంతకాలం విద్వాన్ విశ్వం సంపాదకత్వంలో ఆంధ్రప్రభ వెలిగిపోయింది. 1958-59లో కార్మిక వివాదం కారణంగా పత్రిక యాజమాన్యం లాకౌట్ ప్రకటించింది. నార్ల వెంకటేశ్వర రావు సంపాదకత్వానికి రాజీనామా చేశాడు. నార్ల సంపాదకులుగా పనిచేసిన సుమారు పదహారు సంవత్సరాలు ఆంధ్రప్రభ చరిత్రలో స్వర్ణయుగంగా పేర్కొంటారు.