ఆంధ్రప్రశస్తి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆంధ్ర ప్రశస్తి[1] అన్నది విశ్వనాథ సత్యనారాయణ రాసిన తెలుగు పద్య కావ్యం. ఈ కావ్యం నిండా ఇలాటి తెలుగుదనమే. ఈ కావ్యాన్ని రచయిత మల్లంపల్లి సోమశేఖరశర్మ కు అంకితం చేసాడు. అంకితం చేస్తూ మల్లంపల్లితో “ఇంతకు ముందెప్పుడో – ఇక్కడ, యీ ఆంధ్రదేశంలో, గడ్డిపోచలు కూడా వాడి కత్తులై శత్రువుల కుత్తుకలను ఉత్తరించిన కాలంలో, నువ్వూ నేనూ తోడి సైనికులమై చేసిన స్నేహం కాబోలు మన ఈ అనుబంధం” అని అన్నాడు. [2]

ఈ పుస్తకం చెన్నపురి లో కేసరి ముద్రాక్షరశాలలో ముద్రించబడినది. [3]

ఆంధ్రప్రశస్తి లోని కొన్ని ముఖ్య ఘట్టముల జాబితా[మార్చు]

విశ్వనాథ సత్యనారాయణ ఈ పుస్తకంలో ఆంధ్ర మహావిష్ణువుతో మొదలుపెట్టి, శాతవాహనుడు, గౌతమీపుత్ర శాతకర్ణి, మాధవవర్మ, వేంగీ క్షేత్రము, ముఖలింగము, నన్నయ భట్టు, ప్రోలరాజు, కొండవీటి పొగమబ్బులు, చంద్రవంక యుద్ధము, అళియరామరాయల వరకూ తెలుగు చరిత్రలోని ముఖ్య సన్నివేశాలని, ముఖ్య ప్రదేశాలని, వ్యక్తులని కథలు కథలుగా కవితాత్మకంగా మనకి పరిచయం చేసాడు.

ముందు మాటలో పద్యం[మార్చు]

మా పూర్వాంధ్ర ధరాధినాయక కధా మంజూషికా రత్నగా
ధా పద్యావలి పేరి హారి సుమనో దామంభు మా ధ్వీక భా
షా పృక్తంబు మహాప్రబంధ రచనా సౌందర్యపున్ వాసనల్
తీపై క్రమ్మగ నాంధ్ర సోదరుల కందితున్ కళాంకమ్ముగన్

ఆధ్ర విష్ణువు లో మొదటి పద్యం[మార్చు]

జో! సామీ! మముగన్న యేలిక! యదో!జోహారు!మా
శ్రీశైలంబున బెద్దకొండదరి గర్వీభూతచేతస్కుడై
యాశారాధనలబ్ధదోర్బలుడు దైత్యేంద్రుండు లేడా! బుభు
క్షాసంపూర్తికి నోచుకోముగద కక్కా వాని దుశ్చేష్టలన్.

మూలాలు[మార్చు]

  1. ఆంధ్రప్రశస్తి
  2. "నేనెఱిగిన విశ్వనాథ | పొద్దు" (in ఇంగ్లీష్). Retrieved 2021-05-02.
  3. విశ్వనాథ సత్యనారాయణ. ఆంధ్రప్రశస్తి.

భాహ్య లంకెలు[మార్చు]