ఆంధ్రప్రదేశ్

వికీపీడియా నుండి
(ఆంధ్ర దేశము నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ఆంధ్రప్రదేశ్
Anthem: "మా తెలుగు తల్లికి మల్లె పూదండ"
భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ స్థానం
భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ స్థానం
నిర్దేశాంకాలు: 16°30′N 80°38′E / 16.50°N 80.64°E / 16.50; 80.64Coordinates: 16°30′N 80°38′E / 16.50°N 80.64°E / 16.50; 80.64
దేశం భారతదేశం
రాష్ట్రావతరణ1956 నవంబరు 1
రాజధానిఅమరావతి(శాసన), విశాఖపట్నం(కార్యనిర్వాహక), కర్నూలు(న్యాయ)[1]
ప్రభుత్వం
 • నిర్వహణఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
 • గవర్నరుబిశ్వభూషణ్ హరిచందన్
 • ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
 • శాసనసభద్విసభ (175 + 58 సీట్లు)
 • లోకసభ నియోజకవర్గాలు25
 • హైకోర్టువిజయవాడ
విస్తీర్ణం
 • మొత్తం1,62,975 కి.మీ2 (62,925 చ. మై)
విస్తీర్ణపు ర్యాంకు7వ
జనాభా
(2011)[3]
 • మొత్తం4,93,86,799
 • ర్యాంకు10వ
 • సాంద్రత308/కి.మీ2 (800/చ. మై.)
జి.డి.పి (2018–19)
 • మొత్తం10.81 lakh crore (US$150 billion)
 • తలసరి1,64,025 (US$2,300)
ప్రామాణిక కాలమానంUTC+5:30
UN/LOCODEAP 39
అక్షరాస్యత రేటు67.41% (2011)
అధికార భాషలుతెలుగు
తీరప్రాంతం974 kilometres (605 mi)
జాలస్థలిwww.ap.gov.in
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిహ్నాలు
చిహ్నం
Ap seal.jpg
ఆంధ్రప్రదేశ్ అధికారిక చిహ్నం
భాష
Telugu.svg
తెలుగు
పాటమా తెలుగు తల్లికి[5]
నృత్యంKuchipudi Dance Performance by V Anjana Devi at Ravindra Bharathi Hyderabad.jpg కూచిపూడి
జంతువు
Antilope cervicapra from velavadar.JPG
కృష్ణ జింక[6]
పక్షి
Rose-ringed Parakeet Psittacula krameri male by Dr. Raju Kasambe DSCN8937 (3).jpg
రామచిలుక[6]
చేపComdolph.jpg డాల్ఫిన్
పుష్పం
Jasminum officinale.JPG
మల్లె[6]
వృక్షం
(Curetis thetis) Indian Sunbeam on a neem tree along Eastern Ghats 04.JPG
వేప[6]
క్రీడKabaddi in villages.jpg చెడుగుడు

ఆంధ్రప్రదేశ్, భారతదేశంలోని 29 రాష్ట్రాలలో ఒకటి. తెలంగాణాతో పాటు ఈ రాష్ట్రంలో తెలుగు ప్రధాన భాష. తదుపరి స్థానంలో ఉర్దూ ఉంది. ఈ రాష్ట్రానికి వాయవ్య దిశలో తెలంగాణ, ఉత్తరాన ఛత్తీస్‌గఢ్, ఒడిషా రాష్ట్రాలు, తూర్పున బంగాళాఖాతం, దక్షిణాన తమిళనాడు రాష్ట్రం, పడమరన కర్ణాటక రాష్ట్రాలు ఉన్నాయి. భారతదేశంలో ఎనిమిదవ అతి పెద్ద రాష్ట్రము ఆంధ్రప్రదేశ్. ఈ రాష్ట్రంలోని ముఖ్యమైన నదులు గోదావరి, కృష్ణ, తుంగభద్ర, పెన్నా. ఆంధ్రప్రదేశ్ 12°37', 19°54' ఉత్తర అక్షాంశాల మధ్య, 76°46', 84°46' తూర్పు రేఖాంశాల మధ్య వ్యాపించి ఉంది. భారత ప్రామాణిక రేఖాంశమైన 82°30' తూర్పు రేఖాంశం రాష్ట్రంలోని కాకినాడ మీదుగా పోతుంది.

1953 అక్టోబరు 1న మద్రాస్ రాష్ట్రంలోని తెలుగు మాట్లాడేవారు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను, రాయలసీమ దత్త జిల్లాలను కలిపితే ఆంధ్రరాష్ట్రం ఆవిర్భవించింది. రాష్ట్రాల పునర్విభజన బిల్లు ఆమోదం పొందాక భాషా ప్రయుక్త రాష్ట్రాలు వచ్చాయి. హైదరాబాదు రాజ్యంలోని మరాఠీ జిల్లాలు మహారాష్ట్రకూ, కన్నడ జిల్లాలు కర్ణాటకకూ పోగా, మిగిలిన హైదరాబాదుతో కూడుకుని ఉన్న తెలుగు మాట్లాడే నిజాం రాజ్యాధీన ప్రాంతం ఆంధ్రరాష్ట్రంలో కలిసింది. అలా 1956, నవంబరు 1న అప్పటి హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతాన్ని, మద్రాస్ నుండి వేరుపడ్డ ఆంధ్ర రాష్ట్రాన్ని కలిపి హైదరాబాద్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. అడపా దడపా సాగిన వేర్పాటు ఉద్యమాల ఫలితంగా దాదాపు 58 సంవత్సరాల తరువాత 2014 జూన్ 2 న పునర్విభజింపబడింది. నవ్యాంధ్రప్రదేశ్, తెలంగాణలు 2 తెలుగు రాష్ట్రాలుగా 2014 జూన్ 2 నుంచి అమలులోకి వచ్చాయి. హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల ఉమ్మడి రాష్ట్ర రాజధానిగా 2014 జూన్ 2 నుండి మూడు సంవత్సరాల వరకు కొనసాగింది. అమరావతిలో కొత్త రాజధానికి 2015 అక్టోబరు 23 న శంకుస్థాపన జరిగింది. 2017 మార్చి 2న శాసనసభ ప్రారంభించబడి పరిపాలన మొదలైంది. జగన్ ప్రభుత్వం సమీకృత అభివృద్ధి. పరిపాలన వికేంద్రీకరణ కొరకు, అమరావతిని కేవలం శాసనరాజధానిగా పరిమితం చేసి, విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా మార్పులు చేసిన చట్టానికి 2020 జూలై 31 న గవర్నరు ఆమోదముద్ర పడింది.

చరిత్ర

ప్రధాన వ్యాసము: ఆంధ్రప్రదేశ్ చరిత్ర

ఆంధ్రులు వింధ్యపర్వత దక్షిణ భాగానికి తరలి వెళ్ళి, ద్రావిడులతో కలసిన ఆర్యులుగా క్రీ.పూ. 7వ శతాబ్దపు సంస్కృత రచనలు వర్ణిస్తున్నాయి. క్రీ. పూ. 5వ శతాబ్దములో ప్రతీపాలపురం (భట్టిప్రోలు) రాజధానిగా కుబేరక అను రాజు పాలన చేస్తున్నాడని ఆధారాలు దొరికాయి. మహావీరుడు, గౌతమ బుద్ధుడు ధాన్యకటకము (అమరావతి) సందర్శించారనడానికి ఆధారాలున్నాయి. మౌర్య చక్రవర్తి అశోకుని మరణానంతరం (క్రీ.పూ 232) ఆంధ్రులు వెలుగులోకి వచ్చారు. నవీన చరిత్రకారులు ఆంధ్రుల చరిత్ర ఆనాటినుండి మొదలైనట్లుగా లెక్కిస్తున్నారు. ఆంధ్ర (శాతవాహన), శక, పల్లవ, ఇక్ష్వాకు, తెలుగు చోళ, తూర్పు చాళుక్య, కాకతీయ, విజయనగర, కుతుబ్ షాహి, హైదరాబాదు నిజాంలు మొదలైన వంశాలకు చెందిన రాజులు ఆంధ్ర దేశాన్ని పరిపాలించారు. క్రీ.శ 17వ శతాబ్దములో బ్రిటీషు వారు కోస్తా ఆంధ్రను నిజామ్ వద్ద గెలుచుకొని మద్రాసు రాష్ట్రములో (మద్రాసు ప్రెసిడెన్సీ) కలుపుకున్నారు. హైదరాబాదు నిజామ్ బ్రిటిషు ఆధిక్యతను గుర్తించి తెలంగాణ ప్రాంతానికి పరిమితమైనాడు.

భారత దేశ స్వాతంత్ర్యానంతరం

1947లో భారత దేశానికి ఆంగ్లేయుల నుండి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత నిజాము, హైదరాబాదు సంస్థానాన్ని తమ పాలనలోనే ఉంచుకోవటానికి ప్రయత్నించాడు. పోలీసు చర్య ద్వారా హైదరాబాదు 1948 భారత దేశంలో విలీనమై, హైదరాబాదు రాష్ట్రంగా అవతరించింది.

మద్రాసు రాజధానిగా ఉండే ఆంధ్ర రాష్ట్రం కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు 58 రోజుల నిరాహార దీక్ష చేసి మరణించారు, కానీ కర్నూలును రాజధానిగా చేసి 1953 అక్టోబరు 1న మద్రాసు రాష్ట్రంలో ఉత్తరాన ఉన్న 11 జిల్లాలతో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం చేశారు. గుంటూరులో హైకోర్టు ఏర్పాటు చేసారు. టంగుటూరి ప్రకాశం పంతులు ఆంధ్ర రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి.

తెలుగు ప్రజల కోరికపై 1956, నవంబరు 1 న హైదరాబాదు రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలను ఆంధ్ర రాష్ట్రంలో కలిపి ఆంధ్రప్రదేశ్ను ఏర్పాటు చేసారు. కొత్త రాష్ట్రానికి హైదరాబాదు రాజధానిగా అవతరించింది. ఈ విధంగా భాష ఆధారముగా ఏర్పడిన రాష్ట్రములలో ఆంధ్రప్రదేశ్ మొదటి రాష్ట్రము అయినది. నీలం సంజీవరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి.

1960 వ సంవత్సరంలో పటాస్కర్ కమిషన్ తీర్పుమూలంగా చిత్తూరు జిల్లా తిరుత్తణి తాలూకాలోని ఎక్కువ భాగాన్ని తమిళనాడుకు ఇచ్చి, తమిళనాడుకు చెందిన తిరువళ్లూర్ తాలూకాలోని కొన్ని గ్రామాలను ఆంధ్రప్రదేశ్ లో చేర్చారు. ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించినప్పుడు 20 జిల్లాలే ఉన్నాయి. తరువాత, 1970, ఫిబ్రవరి 2న ప్రకాశం జిల్లా, 1978 ఆగష్టు 12న రంగారెడ్డి జిల్లా, 1979 జూన్ 1న విజయనగరం జిల్లాలు ఏర్పడడంతో మొత్తం 23 జిల్లాలయ్యాయి.

రాష్ట్ర భౌగోళిక సమగ్రతపై ఉద్యమాలు

రాష్ట్రం ఏర్పడినతరువాత అడపా దడపా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు దానికి పోటీగాసమైక్య ఉద్యమాలు జరుగుతూ వచ్చాయి.2009 లో కే.సి.ఆర్ నిరాహరదీక్ష విరమింపచేయడానికి కేంద్రప్రభుత్వం తెలంగాణాఏర్పాటు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించడంతో ఈ ఉద్యమాలు మరింత బలం పుంజుకున్నాయి. కేంద్రప్రభుత్వం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి అందరికీ అమోదమైన లక్ష్యంకొరకు ప్రయత్నించినప్పటికి సత్ఫలితాలివ్వలేదు.2013 జూలై 30న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ 10 జిల్లాలతో కూడిన తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.తదుపరి సమైక్యాంధ్ర ఉద్యమము వూపందుకుంది. ప్రభుత్వ ఉద్యోగసంఘాల నాయకత్వంలో రెండు నెలలపై బడి సమైక్యాంధ్ర ఉద్యమము నడిచింది. 2013 అక్టోబరు 3న జరిగిన కేంద్రప్రభుత్వ మంత్రివర్గ సమావేశంలో తెలంగాణా ఏర్పాటుని ఆమోదించారు. తదుపరి చర్యగా మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి రెండు రాష్ట్రాల సమస్యలపై చర్చించి వాటి పరిష్కార వివరాలతో కేబినెట్ నోట్, బిల్లు తయారీ జరిగింది.[7] ఆ తరువాత రాష్ట్రపతి పంపిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును [8] శాసనసభ,శాసనమండలిలో సుదీర్ఘ చర్చల పూర్తికాకముందే ఒకవారం పొడిగించిన గడువు ముగిసే సందర్భంలో ముఖ్యమంత్రి ప్రతిపాదించిన తిరస్కరించే తీర్మానం పై మూజువాణీ వోటుతో సభలు అమోదముద్ర వేశాయి. 2014, ఫిబ్రవరి 18న ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుకు భారతీయ జనతా పార్టీ మద్దతుతో లోకసభ ఆమోదం లభించింది. 20 పిభ్రవరి న రాజ్యసభ ఆమోదం తెలిపింది. సీమాంధ్రకు న్యాయం చేయడానికి వెంకయ్యనాయుడు ప్రతిపాదించిన సవరణలను కొంత వరకు తృప్తిపరచే విధంగా ప్రధాని ఆరుసూత్రాల ప్యాకేజీని ప్రకటించిన పిదప, బిల్లుకు యథాతథంగా మూజువాణీ వోటుతో అమోదముద్ర పడింది [9]. 2014 జూన్ 2 న తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలు 2 క్రొత్త రాష్ట్రాలుగా ఏర్పడినవి[10].

అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు

కృష్ణా గోదావరి నదులు (ఉపగ్రహ ఛాయాచిత్రం)

నీలం సంజీవరెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు తొలి ముఖ్యమంత్రి. 1982 వరకు అన్నీ కాంగ్రెసు ప్రభుత్వాలే ఆంధ్రప్రదేశ్ ను పరిపాలించాయి. 1982 వరకు కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా ఎక్కువ కాలము పనిచేశాడు. ఆయన తరువాత పి.వి.నరసింహారావు ముఖ్యమంత్రిగా కొంతకాలం పనిచేసారు.

అయితే 1982 వరకు రాష్ట్ర రాజకీయాలలో కాంగ్రెసుకు ఉన్న బలాన్ని సవాలు చేయటానికి నందమూరి తారక రామారావు అదే సంవత్సరములో తెలుగుదేశం అనే పేరుతో ఒక రాజకీయ పార్టీని స్థాపించాడు. స్థాపించిన తొమ్మిది నెలలలోనే తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారపగ్గాలు చేపట్టడంతో ఒక బుడతడి దెబ్బకు వస్తాదు కుప్పకూలినట్లయింది.

2004 అసెంబ్లీ ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రెసు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉధృతంగా పోరాడుతున్న తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో కలిసి పోటీ చేసింది. కాంగ్రెసు, తెరాస కూటమి పదవిలోకి రావడంతో, కాంగ్రెసుకు చెందిన వై.ఎస్.రాజశేఖరరెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. ఐదేళ్ళ అనతరం 2009లో జరిగిన శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీచేయగా, తెలుగుదేశం పార్టీ, తెరాస, ఉభయ కమ్యూనిష్టు పార్టీలు కలిసి మహాకూటమి తరఫున పోటీచేశాయి. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ, భారతీయ జనతా పార్టీలు కూడా పోటీచేయడంతో బహుముఖ పోటీలు జరిగాయి. 2009 సెప్టెంబరు 2న రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడంతో కొణిజేటి రోశయ్య ముఖ్యమంత్రిగా పనిచేశాడు. 14 నెలలు పాలించిన తరువాత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా మార్చడం జరిగింది . నల్లారి కిరణకుమార్ రెడ్డి నేతృత్వంలోని మంత్రివర్గం రాజీనామా చేయటంతో ఎన్నికలు దగ్గరబడుతున్నందున, ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పరచటానికి ఆసక్తి చూపనందున రాష్ట్రపతిపాలన విధించబడింది[11].

విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ భౌతిక పటము

2014 జూన్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి తెలంగాణ ప్రాంతం విడిపోయి కొత్త రాష్ట్రంగా ఏర్పడింది. ఆ సమయంలో తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని మండలాలు సీమాంధ్రలో కలవడంతో నవ్యాంధ్ర లేక నవ్యాంధ్ర ప్రదేశ్ అనే పేరు తెరపైకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ (నవ్యాంధ్ర) రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి (2014-2019) గా నారా చంద్రబాబు నాయుడు పనిచేశాడు. ఆ తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎన్నికలలో ఆధిక్యత సాధించి వై.ఎస్.జగన్ ముఖ్యమంత్రి పదవి చేపట్టాడు. తెలంగాణాతో కొన్ని 10వ షెడ్యూల్‌లోని సంస్థల విభజన, షీలా భిడే కమిటీ సిఫారసుల మేరకు 9వ షెడ్యూల్‌లోని 40 సంస్థల విభజన మరి ఇతర సమస్యలు ఇంకా పరిష్కరించబడవలసినవున్నది.[12]

జగన్ ప్రభుత్వం సమీకృత అభివృద్ధి. పరిపాలన వికేంద్రీకరణ కొరకు, అమరావతిని కేవలం శాసనరాజధానిగా పరిమితం చేసి,విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా మార్పులు చేసిన చట్టానికి 2020 జూలై 31 న గవర్నరు ఆమోదముద్ర పడింది.[1] ఈ చట్టాన్ని ఉన్నత న్యాయస్థానంలో సవాలు చేయగా, తదుపరి విచారణ ఆగష్టు 14 వరకు యథాతథ స్థితి కొనసాగాలని న్యాయస్థానం తీర్పు ఇచ్చింది[13].

భౌగోళిక పరిస్థితి

ఆంధ్రప్రదేశ్ జిల్లాల పటము

ఆంధ్రప్రదేశ్ లో రెండు ముఖ్య ప్రాంతాలున్నాయి. అవి కోస్తాంధ్ర, రాయలసీమ. రాష్ట్రంలో 13 జిల్లాలు ఉన్నాయి.కోస్తా ఆంధ్రలో ఎర్రటి నేలలు ఉండే మెట్ట భూములు, నల్లరేగడి నేలలు ఉండే డెల్టా భూములు ఉన్నాయి. రాయలసీమలో ఎర్రటి నేలలు ఉన్నాయి. ముఖ్య నగరాలు విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, ఏలూరు, రాజమహేంద్రవరం, తిరుపతి, కర్నూలు, నెల్లూరు, గుంటూరు,ఒంగోలు, మచిలీపట్నం. గోదావరి, కృష్ణ వంటి మహానదులు రాష్టంలో ప్రవహించటంవలన కొన్ని లక్షల హెక్టేరుల భూమి సాగు చేయబడుతున్నది.[14]

జిల్లాలు, ముఖ్య పట్టణాలు

ఆంధ్రప్రదేశ్ విభజనానంతరం 13 జిల్లాలు ఉన్నాయి.జిల్లాలు, వాటి ముఖ్య పట్టణాలు, 2011 భారత జనాభా లెక్కలు ప్రకారం జనాభా వివరాలు, విస్తీర్ణం , జన సాంద్రత వివరాలు క్రింది జాబితా ద్వారా తెలుస్తాయి

ఆంధ్రప్రదేశ్

వ.సం. కోడ్ ‌జిల్లా ముఖ్య పట్టణం జనాభా (2011) విస్తీర్ణం (కి.మీ.²) జన సాంద్రత (/కి.మీ.²)
1 AN అనంతపురం అనంతపురం 4,083,315 19,130 213
2 CH చిత్తూరు చిత్తూరు 4,170,468 15,152 275
4 EG తూర్పు గోదావరి కాకినాడ 5,151,549 10,807 477
5 GU గుంటూరు గుంటూరు 4,889,230 11,391 429
3 CU కడప కడప 2,884,524 15,359 188
6 KR కృష్ణా మచిలీపట్నం 4,529,009 8,727 519
7 KU కర్నూలు కర్నూలు 4,046,601 17,658 229
9 PR ప్రకాశం ఒంగోలు 3,392,764 17,626 192
8 NE నెల్లూరు నెల్లూరు 2,966,082 13,076 227
10 SR శ్రీకాకుళం శ్రీకాకుళం 2,699,471 5,837 462
11 VS విశాఖపట్నం విశాఖపట్నం 4,288,113 11,161 384
12 VZ విజయనగరం విజయనగరం 2,342,868 6,539 358
13 WG పశ్చిమ గోదావరి ఏలూరు 3,934,782 7,742 490

ఆర్థిక పరిస్థితి

2016-2017 సంవత్సర గణాంకాల ప్రకారం ప్రస్తుత విలువలు ఆధారంగా, ముందంచనాల ప్రకారం, ఆంధ్రప్రదేశ్ విలువ చేకూర్చిన మొత్తానికి (Gross Value Added) వ్యవసాయరంగం 31.77శాతం వుండగా, పరిశ్రమలరంగం 22.23శాతం, సేవలరంగం 46.0శాతం ఉన్నాయి. ఇవి భారతదేశానికి 17.32, 29.02, 53.66 గా ఉన్నాయి.[15]

2011-12 నాటి విలువ ఆధారంగా, 2016-17 ముందంచనాల ప్రకారం పెరుగుదల వ్యవసాయరంగం 14.03శాతం వుండగా, పరిశ్రమలరంగం 10.05 శాతం, సేవలరంగం 10.16 శాతం, మొత్తం పెరుగుదల 11.18 శాతం ఉన్నాయి. ఇవి భారతదేశానికి 4.37, 5.77,7.87,6.67, 6.67గా ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం నేటివిలువ ప్రకారం ₹1,22,376, స్థిర విలువల ప్రకారం ₹95,566 వుండగా, ఇవి భారతదేశానికి ₹1,03,818, ₹82,112 గా ఉన్నాయి.

వ్యాపార నిర్వహణ అనుకూలత

ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ విడిపోయాక, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి, కొత్త పరిశ్రమల ఏర్పాటుకూ అనేక చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా రాష్ట్రానికి సన్ రైజ్ కంట్రీ అనే ఒక బ్రాండ్ నేమ్‌ను పెట్టి, దేశం లోను, బయటా ప్రచారం చేసింది. ప్రపంచ బ్యాంకు జరిపే వ్యాపార నిర్వహణ అనుకూలత (Ease of doing business)బిజినెస్ పరిశీలనలో రాష్ట్రం, దేశం మొత్తం మీద 2015 లో రెండవ స్థానంలోను [16], 2018 లో మొదటి స్థానంలోనూ[17] నిలిచింది.

పంటలు

మెట్ట భూముల్లో ఆయిల్ పామ్, బత్తాయి, నిమ్మ, చెరుకు, కొబ్బరి, కొకొవా, జొన్న, దానిమ్మ, జామ, సపోటా, మిర్చి, ప్రత్తి, పొగాకు, కూరగాయలు వంటివి పండిస్తారు. డెల్టా ప్రాంతాల్లో వరి, కొబ్బరి, కూరగాయలు, పండిస్తారు. ఉభయ గోదావరి జిల్లాల ప్రాంతం చేపలు, రొయ్యలు సాగులో దేశంలోనే ప్రసిద్ధిగాంచింది.

రాష్ట్ర ప్రభుత్వం, కార్య నిర్వహణ వ్యవస్థ

ప్రధాన వ్యాసము: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అధినేత ముఖ్యమంత్రి కాగా, రాష్ట్ర పరిపాలన గవర్నరు పేరున జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ (దిగువ సభ) లో 175 స్థానాలు, విధాన మండలి (ఎగువ సభ)లో 56 స్థానాలు ఉన్నాయి.దీనికి తోడు, ఆంగ్లో-ఇండియన్ వర్గం నుంచి ఒకరిని శాసన సభకు నామినేటు చేస్తారు.ఆ రకంగా శాసన సభలో సభ్యుల సంఖ్య 175. ఆంధ్రప్రదేశ్ కు పార్లమెంటులో 36 స్థానాలు ఉన్నాయి. (లోక్ సభలో 25, రాజ్య సభలో 11). ఎలెక్ట్రానిక్ సాంకేతివ్యవస్థ ఉపయోగించి రాజీవ్ ఇంటర్నెట్ విలేజి కార్యక్రమం (ఆంధ్రప్రదేశ్) ద్వారా ప్రజలకు మెరుగైన సేవలందించటానికి అంతర్జాలంలో ఏపీ ఆన్ లైన్ అనే జాలస్థలి[18] కలిగివుంది. విభజన తర్వాత నారా చంద్రబాబునాయుడు 2014, జూన్ 8 న నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర 1వ ముఖ్యమంత్రిగా పనిచేశాడు. 2019 మే 30న రెండవ ముఖ్యమంత్రిగా వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టాడు

రాష్ట్ర గుర్తులు

విభజన తర్వాత రాష్ట్ర పక్షి రామచిలుక, రాష్ట్ర చెట్టుగా వేపచెట్టు, రాష్ట్ర జంతువుగా కృష్ణ జింక, రాష్ట్ర పువ్వుగా మల్లెపువ్వు నిర్ణయించారు. ఇవి జూన్ 6. 2018 నుంచి అధికారికంగా అమల్లోకి వచ్చాయి.[19]

భాష-సంస్కృతి

తెలుగు రాష్ట్ర అధికార భాష. కవిత్రయమని పేరుగన్న నన్నయ, తిక్కన, ఎర్రాప్రగడ మహా భారత కావ్యాన్ని తెలుగులోకి అనువదించారు. మహా భాగవతమును బమ్మెర పోతన అనువదించాడు. జ్ఞానపీఠ అవార్డు గ్రహీతలు విశ్వనాథ సత్యనారాయణ, మొదలైనవారు తెలుగులో ఆధునిక రచయితలు. ఆంధ్రప్రదేశ్ కు గొప్ప సాంస్కృతిక వారసత్వము ఉంది. అన్నమాచార్య, త్యాగరాజు, రామదాసు తదితర గొప్ప కర్ణాటక సంగీతకారులు తెలుగు భాషలో కృతులు రచించి, భాషను సుసంపన్నం చేశారు. కూచిపూడి రాష్ట్ర శాస్త్రీయ నృత్యం. అలాగే నటరాజ రామకృష్ణ గారి కృషి వల్ల ఆంధ్రనాట్యం కూడా ప్రజాదరణ పొందింది. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ నగరం తప్ప మిగిలిన ప్రాంతాల్లో గ్రామీణ సంస్కృతి కనిపిస్తుంది. కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కొనసాగుతున్నది. ముస్లిముల జనాభా ఆంధ్ర ప్రాంతంలో చాలా తక్కువగా ఉంది.

నృత్యం

యామిని రెడ్డి, కూచిపూడి నృత్యం.

భారతదేశంలో ముఖ్య నృత్యాల్లో ఒకటైన కూచిపూడి నాట్యానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణాజిల్లాకు చెందిన కూచిపూడి గ్రామం పుట్టినిల్లు. కూచిపూడి గ్రామంలో ప్రారంభమైన ఈ నృత్యరీతి ఆంధ్రప్రదేశ్ మొత్తానికే కాక దేశవిదేశాల్లో ఎందరెందరో నేర్చుకుని ప్రదర్శించే స్థాయికి ఎదిగింది. కూచిపూడి వారు ప్రదర్శించే నృత్యనాటికలు భామా కలాపం, గొల్ల కలాపం వంటివి తెలుగు వారి సంస్కృతిలో భాగంగా నిలుస్తున్నాయి. దేవదాసీలు మాత్రమే ప్రదర్శిస్తూ ఆచారవంతులైనవారు నృత్యకారులను పంక్తిబాహ్యులని భావించే స్థితిలో కేవలం బ్రాహ్మణ పురుషులే అన్ని వేషాలు వేస్తూ, విద్యావంతులైన వారితో కూచిపూడి నృత్యరీతిని సిద్దేంద్ర యోగి వ్యవస్థాపించారు. కాలక్రమేణా నృత్యరీతి తెలుగువారి సంస్కృతిలో ముఖ్యభాగమైంది. 1950 నాటికి స్థానికంగా ఉండిపోయిన దీనికి జాతీయ స్థాయిలో మెప్పును, అంతర్జాతీయస్థాయిలో గుర్తింపునూ తీసుకురావడానికి వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి స్త్రీలను ప్రవేశపెట్టడం వంటి ప్రయత్నాలు చేసి యావజ్జీవితాన్ని కళకు అంకితం చేశారు.[20] వంటివాటిని పునరుద్ధరించడంలో నృత్య కళాకారులు నటరాజ రామకృష్ణ ఎనలేని కృషి చేశారు. దేవదాసీల ప్రదర్శనల్లో విలసిల్లి క్రమంగా దేవదాసీ వ్యవస్థతో పాటుగా అంతరించిపోతున్న నృత్యరీతులను, లక్షణ గ్రంథాల్లో సైద్ధాంతికంగా ఉండి ప్రయోగంలో తరతరాల నుంచి లేని నృత్యరీతులను దేవాలయల్లోని ప్రతిమల నాట్యభంగిమలను లక్షణ గ్రంథాలతో కలిపి అధ్యయనం చేసి అపూర్వరీతిలో ఆంధ్ర నాట్యం పేరిట మరల సృజించారు.[21]

సినిమా రంగం

తెలుగు సినిమా రంగంలో నటులు, నటీమణులు, దర్శకులు, నిర్మాతలు, గాయనీ గాయకులు ఎక్కువగా ఆంధ్ర ప్రాంతానికి చెందినవారే. రాష్ట్రం నుండి ఉద్భవించిన కొందరు ప్రముఖ సినీ కళాకారులు నాగయ్య, ఎన్.టి.రామారావు (మాజీ ముఖ్యమంత్రి), అక్కినేని నాగేశ్వరరావు, ఎస్.వి.రంగారావు ("ఎస్.వి.అర్) జగ్గయ్య, కృష్ణంరాజు, సాగి రాజన్ రాజు (ముక్కురాజు), శోభన్ బాబు, ఘంటసాల,ఎస్.పి.బాలసుబ్రమణ్యం, సుశీల, జానకి, సావిత్రి, భానుమతి, అంజలి జమున, శారద, షావుకారు జానకి, వాణిశ్రీ, ఎల్.వి.ప్రసాద్, కె.వి.రెడ్డి, బి.యన్.రెడ్డి, బి.నాగిరెడ్డి, బాపు, రాజేంద్ర ప్రసాద్, చిరంజీవి, జయప్రద మొదలైనవారు. హిందీ సినిమా రంగంపై తెలుగు కళాకారుల హవా, ప్రత్యేకమైన ముద్ర గలదు.

ఇతర కళలు

కొండపల్లె బొమ్మలు, విజయవాడ లోని ఒక ఇంటిలో.

విశాఖపట్నం జిల్లాలో ఏటి కొప్పాక అను గ్రామంలో ఇప్పటికీ చెక్క బొమ్మలు తయారగుచున్నవి. కృష్ణాజిల్లాలో కొండపల్లి గ్రామంలో కొండపల్లి బొమ్మలు తయారగుచున్నవి.

రవాణా రంగం

రహదారి, రైలు మార్గాలద్వారా ఇతర రాష్ట్రాలకు కలపబడివుంది. విమానయాన, సముద్రయాన మార్గాలు కూడా ఉన్నాయి. బంగాళఖాత తీరంలో, సముద్ర వ్యాపారానికి అనువుగా సముద్ర ఓడరేవులున్నాయి. విజయవాడలో అతి పెద్దదైన రైలు కూడలి, విశాఖపట్నంలో అతి పెద్ద ఓడరేవు ఉంది.

రహదారులు

ఆంధ్రప్రదేశ్ లో జాతీయరహదారి నెట్వర్క్
విజయవాడ-గుంటూరు రహదారి (NH-16లో భాగం)

రాష్ట్రంలోని మొత్తం రహదారుల పొడవు 53,403 km (33,183 mi) కాగా, దానిలో6,401 km (3,977 mi) పొడవు జాతీయ రహదారులు, 14,722 km (9,148 mi) పొడవు రాష్ట్ర రహదారులు,32,280 km (20,060 mi) పొడవుజిల్లా రహదారులు ఉన్నాయి.[22] రాష్ట్రంలో జాతీయ రహదారి 16, 1,000 km (620 mi) పొడవుంది. ఇది బంగారు చతుర్భజి ప్రాజెక్టులో భాగం. ఆసియా రహదారి 45 లో కూడా భాగమే. ప్రభుత్వరంగ సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) రాష్ట్రంలోని భాగాలన్నిటికీ వేల కొద్ది బస్సులు నడుపుతూ ప్రముఖ పాత్ర వహిస్తున్నది. విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ (PNBS) ఆసియా ఖండములోనే ఒక పెద్ద బస్ ప్రాంగణం.[23] 2019 జనవరి 30 నుండి రాష్ట్రంలోని వాహనాలకు AP-39 కోడ్ తో ప్రారంభమయి ఒక అక్షరము, నాలుగు అంకెల సంఖ్యతో నమోదు చేయటం ప్రారంభమైంది.[24]

రైల్వే

ఆంధ్రప్రదేశ్ రైలు మార్గాలు

ఆంధ్రప్రదేశ్ లో [25] బ్రాడ్ గేజి రైలు మార్గం 3703.25 కిమీ. మీటర్ గేజి రైలు మార్గాలు లేవు.[26] రైలు సాంద్రత 1,000 km (620 mi)కు 16.59. ఇది భారతదేశానికి సగటు 20 గా ఉంది.[27] రాష్ట్రం గూండా పోయే హౌరా-చెన్నై ప్రధాన మార్గం డైమండ్ చతుర్భుజిలో భాగంగా అతివేగమైన రైలు మార్గంగా అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలున్నాయి.[28][29] రైలు నెట్వర్క్ రెండు జోనుల పరిధిలో ఉంది. దీనిని డివిజన్లగా విభాగించారు. దక్షిణ మధ్య రైల్వే లోని విజయవాడ రైల్వే డివిజన్, గుంటూరు రైల్వే డివిజన్, గుంతకల్ రైల్వే డివిజన్., తూర్పుకోస్తా రైల్వే జోన్ లోని వాల్తేర్ రైల్వే డివిజన్. రాష్ట్రానికి విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ తీర రైల్వే జోన్ ఏర్పాటయింది.

విమానాశ్రయాలు

ఆంధ్రప్రదేశ్ వాణిజ్యోపయోగ విమానాశ్రయాలు

విశాఖపట్నం, విజయవాడ రాష్ట్రంలోని అంతర్జాతీయ విమానాశ్రయాలు.[30] రాష్ట్రంలో దేశీయ విమానాశ్రయాలు రాజమండ్రి, కడప, తిరుపతి లలో ఉన్నాయి. ఇంకా 16 చిన్న తరహా విమానాలు దిగడానికి సౌకర్యమున్న కేంద్రాలున్నాయి.[31]

ఓడ రేవులు

దేశంలోనే 2వ అతిపెద్ద కోస్తాతీరం రాష్ట్రంలో ఉంది.[32]

విశాఖపట్నం ఓడరేవు దేశంలోకెల్లా సరకురవాణాకి అత్యంత పెద్దదైన ఓడరేవు.[33] మిగతా ప్రముఖ ఓడరేవులు కృష్ణపట్నం, గంగవరం, కాకినాడ. గంగవరం అతిలోతైన పోర్టు కావడంతో అతి పెద్ద సముద్రపడవలు (200,000 – 250,000 టన్నులు సరకులు బరువు) కు అనుకూలమైంది.[34] పెద్దవి కాని 14 పోర్టులు భీమునిపట్నం, దక్షిణ యానాం, మచిలీపట్నం, నిజాంపట్నం, వాడరేవు లలో ఉన్నాయి.[35][36]

విద్యారంగం

ప్రధాన వ్యాసం: ఆంధ్రప్రదేశ్ లో విద్య
ఆంధ్రప్రదేశ్ లో విద్యా నిర్వహణ ప్రభుత్వ శాఖలద్వారా జరుగుతుంది.

 1. పాఠశాల విద్యాశాఖ [37]
 2. ఇంటర్మీడియట్ విద్యా మండలి (ఆంధ్రప్రదేశ్).[38]
 3. సాంకేతిక విద్యా మండలి[39]
 4. ఉన్నత విద్యా పరిషత్ [40]

పర్యాటక రంగం

ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ రాష్ట్ర పర్యాటక రంగ అభివృద్ధికి ముఖ్య పాత్ర వహిస్తుంది.

ఇవికూడా చూడండి

సరిహద్దు రాష్ట్రాలు, ప్రాంతాలు

మూలాలు

 1. 1.0 1.1 "3రాజధానులే". ఈనాడు. Retrieved 2020-08-01.
 2. "Socio Economical Survey 2017-18" (PDF). Government of Andhra Pradesh. 2018. Archived from the original (PDF) on 2018-08-26. Retrieved 2019-04-08.
 3. "Andhra Pradesh Economy in Brief 2019" (PDF). Official portal of Andhra Pradesh Government. Government of Andhra Pradesh. 2019-02-18. Archived from the original (PDF) on 2019-03-21.
 4. "Andhra Pradesh Budget Analysis 2018–19" (PDF). PRS Legislative Research. 9 March 2018. Retrieved 10 March 2018.
 5. Maitreyi, M. L. Melly (14 December 2017). "No official State song for WTC". The Hindu (in ఇంగ్లీష్). The Hindu Group.
 6. 6.0 6.1 6.2 6.3 "Andhra Pradesh gets new state bird, state flower". Deccan Chronicle (in ఇంగ్లీష్). 31 May 2018.
 7. "ముగిసిన కేబినెట్, తెలంగాణ నోట్‌కు ఆమోదం". వన్ ఇండియా. Sep 3, 2013. Archived from the original on 2018-03-21. Retrieved 2014-01-31.
 8. "12లోగా అసెంబ్లీకి బిల్లు: కిరణ్ పావులు, 'టి' వ్యుహాలు". వన్ ఇండియా. 2013-12-06. Retrieved 2020-08-03.
 9. "తెలంగాణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం.29వ రాష్ట్రంగా..." వెబ్ దునియా. 2014-02-20. Archived from the original on 2014-03-03. Retrieved 2014-02-24.
 10. "Telangana state formation gazette". The New Indian Express. Archived from the original on 6 July 2014. Retrieved 14 May 2014.
 11. "రాష్ట్రపతి పాలనపై ప్రజలకు గవర్నర్: కిరణ్ నిర్ణయాలపై..." వన్ ఇండియా. 2014-03-02. Archived from the original on 2016-03-14. Retrieved 2014-03-06.
 12. "విభజన సమస్యలపై మళ్లీ భేటీ !". సాక్షి. 2018-04-29. Archived from the original on 2018-05-18.
 13. "14 వరకు ఎక్కడివక్కడే". ఈనాడు. 2020-08-05. Retrieved 2020-08-05.
 14. ఎస్.వి., నరసయ్య (1953). ఆంధ్ర ప్రజలు-సిరిసంపదలు. Retrieved 2018-05-14.
 15. "AP Economy in Brief 2017" (PDF). Directorate of Economics & Statistics, Government of Andhra Pradesh. 2017. p. 15. Archived from the original (PDF) on 2019-07-21. Retrieved 2019-07-21.
 16. "Ease of doing business India states ranking". Centre for civil society. 2015-09-01. Retrieved 2020-08-01.
 17. Reporter, Staff (2018-07-11). "A.P. tops in 'Ease of Doing Business'". The Hindu (in ఇంగ్లీష్). ISSN 0971-751X. Archived from the original on 2020-06-13. Retrieved 2020-06-13.
 18. "AP Online Portal". 2001-12-18. Archived from the original on 2001-12-18.
 19. Suvarnaraju. "ఆంధ్రప్రదేశ్:రాష్ట్ర చిహ్నాలు ఖరారు...ఉత్తర్వులు జారీ". oneindia. Archived from the original on 2019-02-10. Retrieved 2018-06-12. Cite has empty unknown parameter: |1= (help)
 20. చిన సత్యం, వెంపటి (1987-09-09). "కూచిపూడి నృత్యం - ఆవిర్భావ వికాసం వివరాలు". పేరిణి ఇంటర్నేషనల్. Retrieved 1 January 2015.
 21. "నాట్యకళా చరిత్ర పరిశోధకుడు నటరాజ రామకృష్ణ". నవతెలంగాణ. June 13, 2020. Retrieved 1 January 2015.
 22. "4000-km Andhra Pradesh highways to be maintained by private companies". The New Indian Express. Vijayawada. 6 May 2018. Archived from the original on 26 April 2019. Retrieved 26 April 2019.
 23. "citi-Charter". Apsrtc.gov.in. Archived from the original on 17 September 2010. Retrieved 19 August 2010.
 24. "New 'AP 39' code to register vehicles in Andhra Pradesh launched". The New Indian Express. Vijayawada. 31 January 2019. Retrieved 9 June 2019.
 25. "AP Budget 2018–19 Highlights – Sakshi". Archived from the original on 8 March 2018. Retrieved 28 February 2018.
 26. "Statewise Length of Railway Lines and Survey For New Railway Lines". pib.nic.in. Archived from the original on 5 January 2018. Retrieved 4 January 2018.
 27. "Infrastructure – Connectivity – Rail". apedb.gov.in. Andhra Pradesh Economic Development Board. Archived from the original on 29 జూన్ 2018. Retrieved 30 June 2018. Check date values in: |archive-date= (help)
 28. "Need for speed: Railway board looks at two more Bullet Train Corridors". TOI. 25 July 2017. Archived from the original on 16 September 2017.
 29. "Diamond Quadrilateral". Press information bureau. 2016-08-12. Archived from the original on 12 June 2017.
 30. "Vijayawada airport to go International". TOI. 17 December 2019. Archived from the original on 11 January 2018. Retrieved 10 January 2018.
 31. "Airports" (PDF). AP State Portal. Archived from the original (PDF) on 23 September 2015. Retrieved 23 June 2014.
 32. "డిపార్ట్మెంట్ ఆఫ్ లాండ్ రిసోర్సెస్ వారి పరిశోధన" (PDF). Archived from the original (PDF) on 2013-03-21.
 33. "Vizag port info". Port of Visakhapatnam. Archived from the original on 11 November 2012. Retrieved 9 June 2014.
 34. "Capacity of port". gangavaram.com. Gangavaram port. Archived from the original on 21 February 2014. Retrieved 9 June 2014.
 35. "Andhra Pradesh: Opening up ports". Andhra Pradesh Department of Ports. Archived from the original on 29 September 2014. Retrieved 2 March 2014.
 36. "Andhra Pradesh To Become First Indian State To Get Hyperloop; Signs MOU With Hyperloop Transportation Technologies". inc42.com. 7 September 2017. Archived from the original on 10 సెప్టెంబర్ 2017. Retrieved 10 September 2017. Check date values in: |archive-date= (help)
 37. "Department of School Education Portal". Govt. of AP. Archived from the original on 2019-03-22. Retrieved 2019-03-21.
 38. "Andhra Pradesh Board of Intermediate education website". Govt. of AP. Archived from the original on 2018-11-22. Retrieved 2020-08-01.
 39. "Department of Technical Education website". Govt. of AP. Retrieved 2020-08-01.
 40. "Andhra Pradesh State council for higher education website". Archived from the original on 2010-06-19. Retrieved 2010-04-03.

బయటి లింకులు