Jump to content

ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి

వికీపీడియా నుండి
(ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ నుండి దారిమార్పు చెందింది)

వివిధ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం కొన్ని అకాడమీలను స్థాపించింది. ప్రస్తుతం వీటి సంఖ్య ఎనిమిది. వాటిలో తెలుగు సాహిత్యం కోసం సాహిత్య అకాడమీ రూపొందినది.

కేంద్ర సాహిత్య అకాడమీ (నేషనల్ అకాడమీ ఆఫ్ లెటర్స్)కి అనుబంధంగా 1957 వ సంవత్సరలో స్థాపించబడినది ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ. దీని విధులు ఈ విధంగా ఉంటాయి.

  • తెలుగు భాషా సాహిత్యాలను ప్రోత్సహించటం
  • పరిశోధన కార్యక్రమాలను అభివృద్ధి పరచటం
  • నిఘంటువులు, ఎన్ సైక్లోపిడియాలు, మూలం(రెఫరెన్స్) పుస్తకాలు మొదలగునవి ప్రచురించడం
  • వ్యక్తులకు లేదా సాహితీ సంస్థలకు సహకారాన్ని అందించడం.
  • తెలుగు రచయితల క్రియాత్మక, విమర్శనాత్మక కార్యకలాపాలకు బహుమతులివ్వడం
  • ఆధునిక శాస్త్రీయ విధానంలో వివరణాత్మకమైన తెలుగు నిఘంటువును, వ్యాకరణ పదకోశాన్ని తయారు చేయడం
  • సాధారణ ప్రజలలో ఉత్తమ సాహిత్య పఠనాన్ని మెరుగు పరచడం

ఇలాంటి వాటితో సాహిత్య అకాడమీ పనిచేస్తుంది.

కొన్ని ప్రచురణలు

[మార్చు]
Sri Suryarayandhra Nighantuvu.jpg
శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువు

సమాలోచనం

[మార్చు]

అకాడమి యొక్క 20వ వార్షికోత్సవం 1979లో జరిగిన సందర్భంగా ఆధునిక సాహిత్య ప్రక్రియలపై పలువురు విమర్శకులు ప్రసంగించారు. అనంతరకాలంలో ఆ ప్రసంగాలు వ్యాసాలుగా మలిచి సమాలోచనం పేరున ప్రచురించారు.[2] దీనికి డా. జి.వి.సుబ్రహ్మణ్యం సంపాదకత్వం వహించారు.

వ్యాసాలు
  1. నేటి సాహిత్యం - సామాజిక స్పృహ : ఆర్.ఎస్.సుదర్శనం
  2. నేటి సాహిత్య విమర్శ - ప్రమాణాల స్థాయి : డా. దివాకర్ల వేంకటావధాని
  3. పరిశోధన - పరమార్థ పరిశీలన : డా. కొత్తపల్లి వీరభద్రరావు
  4. సాహిత్యభాష - వ్యవహారభాష : డా. బూదరాజు రాధాకృష్ణ
  5. నేటి పద్యరచన - దాని భవితవ్యము : మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి
  6. వచన కవిత - ప్రయోగ వైవిధ్యం : ఆరుద్ర
  7. 20 ఏండ్ల తెలుగు కవిత్వంలో భావకవిత్వచ్ఛాయలు (1957-77) : డా. నాయని కృష్ణకుమారి
  8. నేటి తెలుగు కవితలో తిరుగుబాటు ధోరణులు : డా. కె.కె.రంగనాథాచార్యులు
  9. ప్రజా కవిత - పాట : ఎల్లోరా
  10. ఆధునిక కవిత - ఆదానం ప్రదానం : డా. ఇలపావులూరి పాండురంగారావు
  11. నవల - మహిళ : డా. జి. లలిత
  12. తెలుగు నవల - ప్రమాణాలూ, ప్రయోగాలూ : డా. అక్కిరాజు రమాపతిరావు
  13. నేటి కథ - వాస్తవికత - తెనుగుదనం : మధురాంతకం రాజారాం
  14. నాటక రచన - క్రొత్త ప్రయోగాలు : డా. పి.వి. రమణ
  15. సాహిత్య అకాడమీ బహుమానాలు పొందిన గ్రంథాలు - ఒక సమీక్ష : డా. జి. వి. సుబ్రహ్మణ్యం

మూలాలు

[మార్చు]