ఆంధ్ర మహాభారత నిఘంటువు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

18 పర్వాలు, 63 ఆశ్వాసలతో పరిపూర్తి చెందిన ఆంధ్ర మహాభారతం నికి సంబంధించిన నిఘంటువును 1979లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారు ప్రచురించారు. ఈ నిఘంటువు నిర్మాణ క్రతువుకి యజమాని, ఋత్విక్కు శ్రీ అబ్బరాజు సూర్యనారాయణగారు.ఉభయభాషా ప్రవీణ ఆయుర్వేద వైద్య విద్వాన్, ఆయుర్వేదా విశారద పరీక్షలలో శ్రీ అబ్బరాజుగారు ఉతీర్ణులై స్వగ్రామమైన ఆదిపూడిలో కొంతకాలం వైద్యవృత్తిలోను, పెరచోట ఆంధ్రోపాధ్యాయ వృత్తిలోను ఉండేవారు. వీరి అన్నగారగు విజయరాఘవయ్యగారితో 1936లో ఒకనాడు సాహిత్యగోష్ఠి జరుపుతూ అబ్బరాజుగారు 'తిక్కన ప్రపంచ కవి' అని నిరూపించటానికి ఈ నిఘంటు రచనకు ఉపక్రమించారు.1954లో కొంతభాగం నడిచింది. 1955లో అన్నదమ్ముల ఎడబాటు.1974కి ఒక రూపం వచ్చినది.అదే ఏట వేటపాలం సారస్వత నికేతనంలో అకాడమీ అధ్యక్షులు శ్రీ బెజవాడ గోపాలరెడ్డిగారి దర్సనం చేసుకొని అబ్బరాజువారు మొత్తంమీద 1979 [1] నాటికి ప్రధమ సంపుటాన్ని అకాడమీ ద్వారా ప్రకటించారు. ఇది నిఘంటువుకు పూర్వరంగం.

కవిత్రయంలో ఆద్యుడైన నన్నయ త్రోవనే తిక్కన, ఎర్రనలు తమ తమ రచనలు సాగించారని అప్పకవి చెప్పినా, నన్నయకు చాలాకాలం తర్వాత కాని కడమ ఇద్దరు భారతం పూర్తి చేయలేదు.నన్నయ కాలానికి చెల్లుబాటు అయ్యే కావ్యభాషకూ, అతడు ఏర్పరచుకున్న నియమాలకు తరువాత రచనకూ తేడా కనిపిస్తుంది.ఈ తేడాలను తెల్సుకోవాడానికి సమగ్ర నిఘంటురచనా సంకల్పం గొప్పదయినా ప్రధమత: నన్నయ భారత నిఘంటువు వెలువడితేగానీ కవిత్రయ నిఘంటువుకు ప్రామాణికత్వం ఉండదు అని పలువురు విమర్సకుల అభిప్రాయం.

ఇందులో అర్ధాలు చాలామట్టుకు పూర్వనిఘంటువులలో ఇచ్చినవే అయినా, కొన్నిటికి పాఠాంతరాలలో పోల్చి సరియైన అర్ధాలు ఇవ్వటానికి అబ్బరాజువారు ఇందులో ప్రయత్నించారు.

దీని రెండవ సంపుటం తెలుగు విశ్వవిద్యాలయం వారు 1987 లో ప్రచురించారు. [2]

మూలములు[మార్చు]

  • 1982 భారతి మాస పత్రిక: వ్యాసము : ఆంధ్రమహా భారత నిఘంటువు. వ్యాసకర్త: శ్రీ. నిడదవోలు వేంకటరావు.
  1. "ఆంధ్ర మహాభారత నిఘంటువు 1".
  2. "ఆంధ్ర మహాభారత నిఘంటువు 2".