Jump to content

ఆంధ్ర లయోలా కళాశాల

వికీపీడియా నుండి
ఆంధ్ర లయోలా కళాశాల
ఆంధ్ర లయోలా కళాశాల ముఖద్వారం
స్థానం
పటం
,
సమాచారం
రకంఎఫిలియేటెడ్
MottoService of God through Service of Country
స్థాపన1954
ప్రిన్సిపాల్ఫాదర్. జీ.ఏ.పి. కిశోర్ ఎస్‌జె
విద్యార్ధుల సంఖ్య3600 (approx.)

ఆంధ్రా లయోల కళాశాల ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో కలదు.

స్ధాపితం

[మార్చు]
కళాశాలలో ఒక దృశ్యము
  • ఆంధ్ర ప్రదేశ్ లోని ఒక కళాశాల. ఇది 1954 లో స్థాపించబడింది.

నిర్వాహణ

[మార్చు]
  • యేసు ప్రభువుకు చెందిన గురువులు ఈ సంస్థను నిర్వహిస్తున్నారు.

విద్యావిధానం

[మార్చు]
ఆంధ్ర లయోల కాలేజి లైబ్రరి భవనము
  • ఈ కళాశాల స్వయం ప్రతిపత్తి కలిగి, సంవత్సరానికి రెండు సెమిస్టర్లు విధానంలో పాఠ్యాంశాల బోధన జరుగుతుంది.

విద్యార్ధులు

[మార్చు]
  • ఇక్కడ విద్యార్థినీ-విద్యార్థులు ఇరువురు విద్యను అభ్యసించటానికి అనుకూలమైన వాతావరణం లభిస్తుంది.

వసతులు

[మార్చు]
  • విద్యార్థినీ-విద్యార్థులకు వేరువేరుగా వసతి గృహాలు ఉన్నాయి.
  • క్యాంటీన్ అందుబాటులో ఉంది.
  • విశాలమైన ఆట స్థలం కలిగివుంది.
  • ద్విచక్ర వాహనాల పార్కింగ్ సదుపాయం ఉంది.

గ్రంథాలయం

[మార్చు]

ఈ కళాశాలలో లక్షకు పైగా పుస్తకాలతో రెండు అంతస్థులలో అతి పెద్ద గ్రంథాలయం ఉంది. ఇది ఒక క్రైస్తవ మిషనరీ కళాశాల అయినప్పటికీ, ఇందులో హిందూ ఆధ్యాత్మిక గ్రంథాలు, ప్రాచీన తాళపత్ర గ్రంథాలు, సంస్కృతం, తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో వేలాది పుస్తకాలు అందుబాటులో వున్నాయి. పుస్తకాలలో తెలుగులో భగవద్గీత, రామాయణం, భాగవతం, వేదాలు, బైబిల్, శతకాలు, కళలు, నాటకాలు, సంగీతం, చిత్రకళ, నిఘంటువులు, జీవిత చరిత్రలు, ట్రావెల్, మహాత్మ్యాలు, చరిత్ర, సంస్కృతి, హాస్యం, సూక్తులు, దేశభక్తి, నవలలు, సంకలనాలు, కాఫీటేబుల్ బుక్స్ గ్రంథాలయ సమాచారశాస్త్ర గ్రంథాలు, జర్నలిజం మొదలగునవి ఉన్నాయి. పరిశోధనా విద్యార్థులకోసం గ్రంథాలయంలో 20 కంప్యూటర్లు అందుబాటులో ఉన్నాయి.

పూర్వ విద్యార్థులలో ప్రముఖులు

[మార్చు]

ప్రత్యేకతలు

[మార్చు]
  • కళాశాల ప్రాంగణంలో ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తారు.
  • ఈ సైన్స్ ఎగ్జిబిషన్ లో సాంస్కృతిక కార్యక్రమాలు, కొండపల్లి బొమ్మలు, ఈ కళాశాల విజువల్ కమ్యూనికేషన్ విద్యార్థుల చిత్రకళా ప్రదర్శన, ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

మూలాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]