Jump to content

ఆంధ్ర సాహిత్య పరిషత్, కాకినాడ

వికీపీడియా నుండి

ఆంధ్ర భాషాభివృద్ధి కోసం ఏర్పడిన సంస్థ ఆంధ్ర సాహిత్య పరిషత్తు. మద్రాసులో జయంతి రామయ్య పంతులు అధ్యక్షతన ఇది ఏర్పడింది. వావిలికొలను సుబ్బారావు, వేదం వేంకటరాయ శాస్త్రి లాంటి పండితులు జయంతి రామయ్య వాదాన్ని బలపరిచారు. దేశం అంతటా సభలు పెట్టి వ్యాసరచన పరీక్షలో ప్రభుత్వం ఇచ్చిన స్వేచ్ఛను ఉపసంహరించాలని పెద్ద ఎత్తున ఉద్యమం లేవదీసారు. వ్యవహారిక భాషావాదులకు వ్యతిరేకంగా జయంతి రామయ్య పంతులు "A Defence of literary telugu "అన్న గ్రంథం రచించాడు.

ఈ సంస్థ గ్రాంథిక భాషకు మద్దతుగా నిలిచింది. వ్యావహారిక భాషలో పాఠ్య గ్రంథాలను ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకించింది. అముద్రిత గ్రంథాల ప్రచురణకూ, భాషా సాహిత్యసేవకూ సంస్థ పనిచేసింది.[1]

జయంతి రామయ్య పంతులు గారి చిత్రపటం

ప్రారంభ చరిత్ర

[మార్చు]

ఈ సంస్థ 1911 మే 12 న మద్రాసులో ఏర్పడింది. మొదట దీన్ని ఆంధ్రభాషా మహాసంఘము పేరుతో ఏర్పాటు చేసారు. ఆ తరువాత పేరును ఆంధ్ర సాహిత్య పరిషత్తు అని మార్చారు. 8.4.1913 బ్రిటిష్ కంపెనీ ఏక్ట్ ప్రకారం రిజిస్త్రేషన్ చేసారు. సంస్థ ఏర్పాటుకు ప్రధాన కారణం తెలుగు సాహిత్య అభివృద్ధి, సాహిత్య పుస్తక ప్రచురణ, విశ్త్రుత ప్రాచుర్యం కల్పించడం. ప్రముఖ కవి, శాసన పరిశోధకుడూ అయిన జయంతి రామయ్య పంతులు దీనికి అధ్యక్షుడు కాగా, పురాణం నాగభూషణం, వేదం వేంకటరాయశాస్త్రి, ఆచంట లక్ష్మీపతి కార్యదర్శులు. కంచి కృష్ణస్వామి రావు, పిట్టి త్యాగరాయ చెట్టి ట్రస్టీలు. పిఠాపురం మహారాజా వారి ఆర్థిక సహాయంతో జయంతి రామయ్య పంతులు 1936 లో "సూర్యారాయంధ్ర నిఘంటువు"ను రచించాడు.

కాకినాడకు తరలింపు

[మార్చు]

సాహిత్య పరిషత్తు 1912 మొదలుకొని 1918 వరకూ అనేక రచయితల పుస్తకాలను ప్రచురించి ప్రాచుర్యం కల్పించింది. 1919- 20 మద్య కొన్ని కారణాల వలన పిఠాపురం రాజావారి జోక్యంతోనూ జయంతి రామయ్య పంతులు గారి చొరవతోనూ దీనిని కాకినాడకు తరలించారు. తరువాత 1946 వరకూ ఇది ప్రైవేటు పరంగా పుస్తక ప్రచురణ, ప్రచారంలో కృషిచేసింది. 1947లో జయంతి రామయ్య పంతులు గారి సోదరి శ్రీమతి సుబ్బమ్మల భర్త అయిన ప్రభల సుందర రామయ్య గార్ల దాతృత్వం వలన సంస్థకు చక్కని భవనం సమకూరింది. అప్పటి నుండి ఆంధ్ర సాహిత్య పత్రికలను ప్రచురిస్తూ అత్యంత ప్రజాధరణ పొందిన సూర్యాంధ్ర నిఘంటువును 1946లో ప్రచురించింది, దానిని 7 భాగాలుగా విడగొట్టి సరికొత్త ప్రచురణ కావించింది

ప్రభుత్వ ఆధీనంలోకి

[మార్చు]
Panorama of BUILDING
సాహిత్య పరిషత్ భవనం
Panorama of BUILDING
సాహిత్య పరిషత్ భవనం

1973 నుండి సాహిత్య పరిషత్తు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చింది. అప్పటి నుండి ఈ భవనానికి మరిన్ని హంగులు కూర్చి ఆంధ్ర సాహిత్య పరిషత్తు గవర్నమెంట్ మ్యూజియం అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ANDHRA SAHITYA PARISHAD GOVERNMENT MUSIUM AND REASEARCH INSTITUTE) అని మార్పుచేసారు. ఆఫ్ఫటి నుండి ఇది ఆంధ్రప్రదేశ్ పురావస్తుశాఖ ఆధీనంలో పనిచేస్తున్నది.

సేకరణలు

[మార్చు]

1977 నుండి వారి ద్వారా సుమారు 400 పురాతన రాతి విగ్రహాలు, టెర్రాకోటా వస్తువులు, రాగి ఇత్తడి పంచలోహ విగ్రహాలు తదితర ఇతర వస్తువులు సేకరించబడి జాగ్రత్త చేయబడ్డాయి. ఇంకా మరిన్ని సేకరించబడుతున్నాయి.

ఇతర విశేషాలు

[మార్చు]
  • సాహిత్య పరిషత్తు కేవలం ప్రచురణే కాక సుమారు 10,000 పుస్తకాలను భద్రపరచింది.
  • తాటిఆకుల తాళపత్ర గ్రంథాలను సుమారుగా 4,776 వరకూ సేకరించి భద్రపరచింది.
  • పురాతన భౌద్ద స్తూపాల వద్ద లభ్యమైన విగ్రహాలను భద్రపరుస్తున్నది

చిరునామా

[మార్చు]

ఫైర్ సర్వీస్ కార్యాలయం ప్రక్కన, పశువుల ఆసుపత్రి రోడ్, పైపుల చెరువు వద్ద, రామారావు పేట, కాకినాడ

సాహిత్య పరిషత్తు భవన చిత్రాలు

[మార్చు]

మూలాలు,ఆధారాలు

[మార్చు]
  1. మువ్వల, సుబ్బరామయ్య (2015). తెలుగుప్రచురణరంగం. విజయవాడ: జయంతి పబ్లికేషన్స్. p. 59.