Jump to content

ఆకాంక్ష శర్మ

వికీపీడియా నుండి
ఆకాంక్ష డియో శర్మ
జననంఢిల్లీ
జాతీయతభారతీయురాలు
విశ్వవిద్యాలయాలునేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ
వృత్తి
  • ఇండస్ట్రియల్ డిజైనర్
  • టెక్స్‌టైల్ ఇన్నోవేటర్
  • విజువల్ ఆర్టిస్ట్
క్రియాశీలక సంవత్సరాలు2016–ప్రస్తుతం
సంస్థఐకియా

ఆకాంక్ష డియో శర్మ (ఆంగ్లం: Akanksha Deo Sharma), ఒక భారతీయ పారిశ్రామిక డిజైనర్, వస్త్ర ఆవిష్కర్త, దృశ్య కళాకారిణి. 2020లో ఆమె ఫోర్బ్స్ ఇండియా 30 అండర్ 30 జాబితాలో 8వ స్థానంలో నిలిచింది.[1][2] డచ్‌కు చెందిన స్వీడిష్ బహుళజాతి వాణిజ్య సంస్థ ఐకియా (IKEA) డిజైనర్ల బృందంలో పని చేస్తున్న భారతదేశానికి చెందిన ఏకైక మహిళ ఆమె.

ప్రారంభ జీవితం

[మార్చు]

కామర్స్ లో డిగ్రీ పట్టా పుచ్చుకున్న ఆమె న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో చదువు పూర్తిచేసింది. 2016లో గ్రాడ్యుయేషన్ తర్వాత, ఆమె 10 నెలల ఇంటర్న్‌షిప్ కోసం స్వీడన్ కు వెళ్లింది. ఆ తరువాత, భారతదేశం తిరిగి వచ్చిన ఆమె గుర్‌గావ్ లో ఐకియాలో పని చేస్తోంది. దీనికి ముందు ఆమె సెల్ డిజైన్, రా మ్యాంగో, లవ్ బర్డ్స్ వంటి వివిధ బ్రాండ్‌లతో తోనూ కలిసి పని చేసింది.

పురస్కారాలు

[మార్చు]
  • ఎల్లే డెకర్ ఇండియా (Elle Decor India) బెస్ట్ డిజైనర్ అవార్డ్ 2009.

మూలాలు

[మార్చు]
  1. "Akanksha Sharma | ఐకియాలో ఉన్న ఒకే ఒక్క భార‌తీయ డిజైన‌ర్ ఈమెనే.. త‌న గురించి ఈ విష‌యాలు తెలుసా-Namasthe Telangana". web.archive.org. 2025-01-19. Archived from the original on 2025-01-19. Retrieved 2025-01-19.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "Akanksha Deo Sharma's workspace is a testament to her astute designer's mind | Vogue India". web.archive.org. 2025-01-19. Archived from the original on 2025-01-19. Retrieved 2025-01-19.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)