ఆకుల రాజేంద‌ర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆకుల రాజేంద‌ర్
పదవీ కాలం
2009 - 2014
తరువాత చింతల కనకారెడ్డి
నియోజకవర్గం మల్కాజ్‌గిరి నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 8 జూన్ 1959
ఉప్పరిగూడ, మల్కాజ్‌గిరి , మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి జిల్లా , తెలంగాణ రాష్ట్రం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి
నివాసం ఎన్.ఎం.డి.సి కాలనీ, ఈస్ట్ ఆనంద్ బాగ్ , మల్కాజ్‌గిరి , హైదరాబాద్

ఆకుల రాజేంద‌ర్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే. ఆయన 2009లో కొత్తగా ఏర్పడ్డా మల్కాజ్‌గిరి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.

జననం, విద్యాభాస్యం[మార్చు]

ఆకుల రాజేంద‌ర్ 1959 జూన్ 8లో తెలంగాణ రాష్ట్రం, మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి జిల్లా, మల్కాజ్‌గిరి, ఉప్పరిగూడలో జన్మించాడు. ఆయన పడవ తరగతి మల్కాజ్‌గిరి లోని జిల్లా పరిషత్ పాఠశాలలో పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం[మార్చు]

ఆకుల రాజేంద‌ర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన మాజీ ఎంపీ నంది ఎల్లయ్య శిష్యుడు. ఆకుల రాజేంద‌ర్ 2009లో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఏర్పడిన మల్కాజ్‌గిరి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి చింతల కనకారెడ్డి పై 9195 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.

ఆకుల రాజేంద‌ర్ 2014లో తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తరువాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరాడు.[1] ఆయనకు 2014లో టిఆర్ఎస్ పార్టీ నుండి టికెట్ దక్కలేదు.[2] ఆకుల రాజేంద‌ర్ 2018లో తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[3] ఆకుల రాజేందర్ 2023 జూలై 29న కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ శాఖ అధ్యక్షుడు జీ కిషన్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు కె. లక్ష్మణ్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్,  బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మాజీ కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్, తరుణ్ చుగ్ సమక్షంలో బీజేపీలో చేరాడు.[4]   

మూలాలు[మార్చు]

  1. Telugu One (3 April 2014). "చేయిచ్చారు: గులాబీ జట్టులో బాబు మోహన్ , ఆకుల రాజేంద‌ర్ ,". Archived from the original on 1 ఆగస్టు 2021. Retrieved 1 August 2021.
  2. The Hindu (4 April 2014). "TRS releases list of '69' candidates for Assembly polls" (in Indian English). Archived from the original on 1 ఆగస్టు 2021. Retrieved 1 August 2021.
  3. Sakshi (13 September 2018). "బస్తీ మే సవాల్‌!". Sakshi. Archived from the original on 1 ఆగస్టు 2021. Retrieved 1 August 2021.
  4. V6 Velugu (29 July 2023). "బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ". Archived from the original on 29 July 2023. Retrieved 29 July 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)