ఆగా ఖాన్ III
ఆగా ఖాన్ III | |
|---|---|
1936లో మహమ్మద్ షా | |
| నిజారీ ఇస్మాయిలీ ముస్లింల 48వ ఇమామ్ | |
| కార్యాలయంలో 17 ఆగస్టు 1885 – 11 జూలై 1957 | |
| అంతకు ముందు వారు | ఆగా ఖాన్ II |
| తరువాత వారు | ఆగా ఖాన్ IV |
| ఆల్ ఇండియా ముస్లిం లీగ్ శాశ్వత అధ్యక్షుడు | |
| కార్యాలయంలో 1906–1957 | |
| అంతకు ముందు వారు | ఖ్వాజా సలీముల్లా (తాత్కాలిక) |
| లీగ్ ఆఫ్ నేషన్స్ అసెంబ్లీ సభ్యుడు | |
| కార్యాలయంలో 1932–1937 | |
| లీగ్ ఆఫ్ నేషన్స్ అధ్యక్షుడు | |
| కార్యాలయంలో 1937–1938 | |
| అంతకు ముందు వారు | తెవ్ఫిక్ రుష్టూ అరాస్ |
| తరువాత వారు | ఈమన్ డి వలేరా |
| వ్యక్తిగతం | |
| జననం | 1877 నవంబరు 2 [1] కరాచీ, బాంబే ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా |
| మరణం | 1957 జులై 11 (వయసు: 79)[1] స్విట్జర్లాండ్‌లోని జెనీవా సమీపంలోని వెర్సోయ్ |
| చివరి మజిలీ | ఆగా ఖాన్ సమాధి, అస్వాన్, ఈజిప్ట్ |
| మతం | షియా ఇస్లాం |
| జీవిత భాగస్వామి |
|
| సంతానం |
|
| తల్లిదండ్రులు |
|
| Denomination | ఇస్మాయిలిజం |
| పాఠశాల | నిజారీ ఇస్మాయిలీ |
| జాతి | ఫాతిమీ వంశం |
| ఇతర పేర్లు | సుల్తాన్ మహమ్మద్ షా |
సర్ సుల్తాన్ మహమ్మద్ షా[a] (2 నవంబర్ 1877 – 11 జూలై 1957), ఆగా ఖాన్ III[b] పేరుతో ప్రసిద్ధి చెందిన ఆయన, షియా ఇస్లాంలోని నిజారీ ఇస్మాయిలీ శాఖకు చెందిన 48వ ఇమామ్. ఆయనను పాకిస్తాన్ స్థాపక పితామహులలో ఒకరిగా భావిస్తారు. అదనంగా, ఆయన ఆల్ ఇండియా ముస్లిం లీగ్ (AIML) తొలి శాశ్వత అధ్యక్షునిగా కూడా సేవలందించారు.
షా బ్రిటిష్ భారతదేశంలోని ముస్లింల అభ్యున్నతికి, వారి హక్కుల పరిరక్షణకు కృషి చేశాడు. 1930ల చివరి వరకు ముస్లిం లీగ్ పెద్ద సంస్థగా లేకపోయినా, అది భూస్వామ్య, వాణిజ్య వర్గాలకు చెందిన ముస్లిం ప్రయోజనాలను ప్రతినిధ్యం వహించడంతో పాటు, బ్రిటిష్ రాజ్ కాలంలో బ్రిటిష్ విద్యను ప్రోత్సహించింది.[2] భారతదేశ ముస్లింలను ప్రత్యేక రాజకీయ, సాంస్కృతిక సముదాయంగా గుర్తించాలని షా వాదించాడు. ఈ అభిప్రాయం తరువాత ద్విజాతి సిద్ధాంతంకు పునాది అయిన సూత్రాలకు అనుగుణంగా నిలిచింది. 1912లో AIML అధ్యక్ష పదవి నుంచి వైదొలిగిన తర్వాత కూడా, ఆ సంస్థ విధానాలు, కార్యాచరణపై ఆయన గణనీయమైన ప్రభావాన్ని కొనసాగించాడు. 1932లో ఆయనను లీగ్ ఆఫ్ నేషన్ లో భారతదేశ ప్రతినిధిగా నామినేట్ చేశారు. అనంతరం 1937–1938 మధ్యకాలంలో లీగ్ ఆఫ్ నేషన్స్ 18వ అసెంబ్లీ అధ్యక్షునిగా పనిచేశాడు.[3]
ప్రారంభ జీవితం
[మార్చు]ఆయన 1877లో బ్రిటిష్ భారతదేశంలోని సింధ్ ప్రాంతంలోని కరాచీలో జన్మించాడు. ఆయన తండ్రి ఆగా ఖాన్ II (పర్షియా నుండి వలస వచ్చినవారు), తల్లి ఆయన మూడవ భార్య నవాబ్ ఆ'లియా షమ్సుల్ ములూక్.[4] ఆమె ఇరాన్ పాలకుడు ఫత్ అలీ షా మనవరాలు. ఈటన్ కళాశాలలో విద్యాభ్యాసం చేసిన అనంతరం, ఆయన కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో చదువుకున్నాడు.[5]
రాజకీయ, ప్రజా జీవితం
[మార్చు]1885లో, ఏడేళ్ల వయసులోనే ఆయన తన తండ్రి స్థానంలో ఇమామ్గా, షియా ఇస్మాయిలీ ముస్లింల ఆధ్యాత్మిక నాయకత్వాన్ని స్వీకరించాడు.[1][6]

1897లో ఆయనకు క్వీన్ విక్టోరియా చేత ఆర్డర్ ఆఫ్ ది ఇండియన్ ఎంపైర్ కు చెందిన నైట్ కమాండర్ (KCIE) బిరుదు ప్రదానం చేయబడింది. అనంతరం 1902 కరోనేషన్ హానర్స్ జాబితాలో ఆయనను నైట్ గ్రాండ్ కమాండర్ (GCIE)గా పదోన్నతి చేశారు.[7][8] 1902 అక్టోబర్ 24న ఎడ్వర్డ్ VII చేత బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో అధికారికంగా ఆ బిరుదుతో సత్కరించబడ్డాడు.[9] 1912లో జార్జ్ V ఆయనను ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఇండియా (GCSI) నైట్ గ్రాండ్ కమాండర్‌గా నియమించాడు. 1923లో ఆయనకు GCMG బిరుదు కూడా లభించింది. ఆయన ప్రజాసేవలకు గుర్తింపుగా జర్మన్ చక్రవర్తి, టర్కీ సుల్తాన్, ఇరాన్ షా తదితర పాలకుల నుంచి గౌరవాలు లభించాయి.[10]
1906లో షా ఆల్ ఇండియా ముస్లిం లీగ్ స్థాపక సభ్యుల్లో ఒకరిగా, తొలి అధ్యక్షునిగా వ్యవహరించాడు. ఈ రాజకీయ పార్టీ బ్రిటిష్ పాలనలో ఉన్న భారతదేశ వాయవ్య ప్రాంతాల్లో స్వతంత్ర ముస్లిం దేశం ఏర్పాటుకు కృషి చేసింది. తరువాత 1947లో అదే దేశం పాకిస్తాన్గా అవతరించింది.
1930 నుండి 1932 వరకు లండన్‌లో జరిగిన మూడు రౌండ్ టేబుల్ సమావేశాల్లో, భారత రాజ్యాంగ సంస్కరణలను అమలు చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించాడు.[1] 1934లో ఆయనను యునైటెడ్ కింగ్డమ్ ప్రివీ కౌన్సిల్ సభ్యునిగా నియమించారు.
ఇస్మాయిలీ ముస్లింల నామమాత్ర నాయకుడు
[మార్చు]20వ శతాబ్దపు తొలి అర్థంలో ఇస్మాయిలీ సమాజ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యమైన కాలంగా నిలిచింది. ఈ కాలంలో భారత ఉపఖండంతో పాటు తూర్పు ఆఫ్రికాలో సామాజిక, ఆర్థిక అభివృద్ధి కోసం అనేక సంస్థలు స్థాపించబడ్డాయి.[11]
భారతదేశంలో, తరువాత పాకిస్తాన్‌లో, సహకార సంఘాలకు మద్దతు అందించడానికి డైమండ్ జూబిలీ ట్రస్ట్, ప్లాటినం జూబిలీ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ వంటి సామాజిక అభివృద్ధి సంస్థలు స్థాపించబడ్డాయి. ప్రస్తుత పాకిస్తాన్ ఉత్తర ప్రాంతాల్లో బాలికల కోసం డైమండ్ జూబిలీ హైస్కూల్ స్థాపించబడింది. అలాగే గోల్డెన్ జూబిలీ సందర్భంగా ప్రారంభించిన విద్యార్థి వేతన కార్యక్రమాలు ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు సహాయపడే విధంగా విస్తరించబడ్డాయి. తూర్పు ఆఫ్రికాలో పాఠశాలలు, కమ్యూనిటీ కేంద్రాలు, నైరోబీలోని ఆసుపత్రి వంటి సామాజిక, ఆర్థిక అభివృద్ధి సంస్థలు ఏర్పాటయ్యాయి. అదనంగా డైమండ్ జూబిలీ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (ప్రస్తుతం డైమండ్ ట్రస్ట్ ఆఫ్ కెన్యా), జూబిలీ ఇన్సూరెన్స్ కంపెనీ వంటి ఆర్థిక సంస్థలు కూడా స్థాపించబడ్డాయి. ఇవి నైరోబీ స్టాక్ ఎక్స్చేంజ్‌లో నమోదై, దేశ అభివృద్ధిలో చురుకుగా పాల్గొన్నాయి.
ఇస్మాయిలీ సమాజాలు తమ సామూహిక వ్యవహారాలను సక్రమంగా నిర్వహించుకోగలిగే విధంగా, షా అనేక సంస్థాగత సంస్కరణలను అమలు చేశాడు.[11] ఈ సంస్కరణలు ఒకవైపు సామూహిక నైతికతను ప్రోత్సహించే ముస్లిం సంప్రదాయంపై ఆధారపడగా, మరోవైపు వ్యక్తిగత బాధ్యత, నైతిక నిర్ణయ స్వేచ్ఛ, వ్యక్తిగత గమ్యాన్ని నిర్ణయించుకునే హక్కు వంటి అంశాలను ప్రాముఖ్యపరిచాయి. 1905లో ఆయన తూర్పు ఆఫ్రికా ఇస్మాయిలీ సమాజ సామాజిక పరిపాలన కోసం తొలి ఇస్మాయిలీ రాజ్యాంగాన్ని రూపొందించాడు. సమాజ వ్యవహారాల నిర్వహణను స్థానిక, జాతీయ, ప్రాంతీయ మండళ్ల శ్రేణి ద్వారా నిర్వహించే విధంగా కొత్త వ్యవస్థను ఏర్పాటు చేశారు. వివాహం, విడాకులు, వారసత్వం వంటి అంశాలపై కూడా రాజ్యాంగంలో నిబంధనలు చేర్చబడ్డాయి. అదనంగా, ఇస్మాయిలీల మధ్య పరస్పర సహకారం, మద్దతు, ఇతర సమాజాలతో సంబంధాల నిర్వహణకు సంబంధించిన మార్గదర్శకాలు కూడా అందులో పొందుపరచబడ్డాయి. భారతదేశంలో కూడా ఇలాంటి రాజ్యాంగాలు అమలులోకి తెచ్చబడ్డాయి. కాలానుగుణ అవసరాలు, పరిస్థితులకు అనుగుణంగా అవి తరచూ సవరించబడ్డాయి.[11]
1905లో షా హాజీ బీబీ కేసులో కూడా పాల్గొన్నాడు. ఈ కేసులో ఆయన అనుచరుల మూలాల గురించి ప్రశ్నించబడింది. తన సమాధానంలో ఇరాన్, రష్యా, ఆఫ్ఘానిస్తాన్, మధ్య ఆసియా, సిరియా తదితర ప్రాంతాల్లోని ఇస్మాయిలీలను ప్రస్తావించడమే కాకుండా, “హిందుస్థాన్, ఆఫ్రికాలో నన్ను విశ్వసించే అనేక గుప్తీలు ఉన్నారు… వారిని నేను షియా ఇమామీ ఇస్మాయిలీలుగా పరిగణిస్తాను; కుల పరంగా వారు హిందువులు” అని పేర్కొన్నాడు.[12]
మతపర, సామాజిక అభిప్రాయాలు
[మార్చు]| శ్రేణిలో భాగం |
| అలీగఢ్ ఉద్యమం |
|---|
షా, సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అభిప్రాయాల ప్రభావానికి లోనయ్యాడు.[13] సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ తరువాత కాలంలో అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయంగా రూపాంతరం చెందిన విద్యాసంస్థ స్థాపకుడు. అనంతరం షా ఆ సంస్థకు మద్దతుదారుడిగా మారి, నిధులు సమకూర్చడంతో పాటు ముస్లిం విద్యాభివృద్ధిలో ఆ సంస్థ పాత్రను ప్రోత్సహించాడు.[14] షాను స్వయంగా ఒక ఇస్లామీయ ఆధునికవాది, అలాగే అలీగఢ్ ఉద్యమంకు చెందిన మేధావిగా పరిగణించవచ్చు.[15]
మతపరమైన దృక్కోణంలో షా ఇస్లాంపై ఆధునికవాద విధానాన్ని అనుసరించాడు.[15] మతం, ఆధునికత మధ్య ఎలాంటి విరోధం లేదని ఆయన నమ్మేవాడు. ముస్లింలు ఆధునికతను స్వీకరించేందుకు చేసే ప్రయత్నాలకు ఆయన మద్దతు తెలిపాడు.[16] అయితే ముస్లింలు పాశ్చాత్య సమాజాన్ని పూర్తిగా అనుకరించడాన్ని ఆయన వ్యతిరేకించాడు. అయినప్పటికీ, పాశ్చాత్య దేశాలతో పెరుగుతున్న సంబంధాలు మొత్తం ముస్లిం సమాజానికి మేలు చేస్తాయని విశ్వసించాడు.[17] ఆయన పాశ్చాత్య తత్వశాస్త్రం, పాశ్చాత్య ఆలోచనల పట్ల మేధోపరంగా సానుకూల దృక్కోణం కలిగి ఉండేవాడు. వాటితో మమేకం కావడం ద్వారా ఇస్లామీయ ఆలోచనల్లో పునరుజ్జీవనం, నవోదయం సాధ్యమవుతుందని నమ్మాడు.[17]
తన కాలంలోని ఇతర ఇస్లామీయ ఆధునికవాదుల మాదిరిగానే, షా సంప్రదాయ మతపర వ్యవస్థను (ఉలమా) విమర్శించాడు. ముఖ్యంగా వారు ఆచారపరమైన కట్టుబాట్లు, న్యాయపరమైన కఠినత్వం, మతగ్రంథాల అక్షరార్థ వ్యాఖ్యానాలకు ఇచ్చిన ప్రాధాన్యాన్ని ఆయన వ్యతిరేకించాడు.[18] దానికి బదులుగా, ఆయన పునరుద్ధరిత ఇజ్తిహాద్ (స్వతంత్ర తార్కిక విచారణ), ఇజ్మా (సమ్మతి)లను సమర్థించాడు. ఈ సమ్మతిని ఆయన ఆధునిక భావనలో “సమ్మతి నిర్మాణం”గా అర్థం చేసుకున్నాడు.[19] ఆయన అభిప్రాయం ప్రకారం, ముస్లింలు ఇస్లాం యొక్క అసలు సారాన్ని, ఆత్మను కనుగొనడానికి మూల గ్రంథాలైన ముఖ్యంగా ఖుర్ఆన్ వద్దకు తిరిగి వెళ్లాలి.[19] ఒకసారి మతసూత్రాల అసలు భావాన్ని అవగతం చేసుకున్న తర్వాత, అవి సార్వత్రికమైనవి, ఆధునికమైనవిగా కనిపిస్తాయని ఆయన విశ్వసించాడు.[20] ఆయన దృష్టిలో ఇస్లాం యొక్క అంతర్గత స్వభావంలో ఉదారవాద, ప్రజాస్వామ్య భావాలు ఉన్నాయి.[21] అదనంగా ఆయన సంపూర్ణ పౌర, మత స్వేచ్ఛలకు మద్దతు తెలుపుతూ,[22] శాంతి, నిరాయుధీకరణ, యుద్ధాలన్నింటికీ ముగింపు పలకాలని పిలుపునిచ్చాడు.[23] షా సెక్టారియనిజంను వ్యతిరేకించాడు. అది ముస్లిం సమాజ బలం, ఐక్యతను బలహీనపరుస్తుందని ఆయన నమ్మాడు.[24] ముఖ్యంగా ఆయన సున్నీలు, షియాలు మధ్య సఖ్యత ఏర్పడాలని కోరుకున్నాడు.[25] అయితే ఈ అభిప్రాయం వల్ల మతపర భేదాలు పూర్తిగా కనుమరుగవుతాయని ఆయన భావించలేదు. తన ఇస్మాయిలీ అనుచరులు తమ స్వీయ మతబోధనల పట్ల కట్టుబడి ఉండాలని ఆయన నిరంతరం ప్రాముఖ్యత ఇచ్చాడు.[26] అయినప్పటికీ, భిన్నత్వాన్ని అంగీకరించడం ద్వారా, అభిప్రాయ భేదాలను గౌరవించడం ద్వారా ఐక్యత సాధ్యమవుతుందని ఆయన విశ్వసించాడు.[26][27] ముస్లిం సంప్రదాయాల వైవిధ్యంలోనే అసలైన బలం ఉందని ఆయన భావించాడు.[28]
ముస్లిం సమాజంలో సామాజిక సంస్కరణలు అవసరమని ఆయన పిలుపునిచ్చాడు. తన స్వంత ఇస్మాయిలీ సమాజంలో వాటిని అమలు చేయడంలో విజయవంతమయ్యాడు.[29] ఇస్లామీయ సూత్రాలు సామాజిక న్యాయం, పేదరిక నిర్మూలనకు మద్దతు ఇస్తాయని షా వాదించాడు. ఆర్థిక అసమానతలను తగ్గించే ప్రయత్నాలకు ఆయన మద్దతు తెలిపాడు.[30] సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ మాదిరిగానే, హిందూ సమాజంతో పోలిస్తే ముస్లింలు విద్యారంగంలో వెనుకబడి ఉన్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశాడు.[31] ఆయన తప్పనిసరి, సార్వత్రిక ప్రాథమిక విద్యకు మద్దతుదారుడు.[32] అలాగే ఉన్నత విద్యాసంస్థల స్థాపనను కూడా ప్రోత్సహించాడు.[33]
మహిళా హక్కుల విషయంలో, షా తన కాలంలోని సర్ సయ్యద్, ఇతర ఇస్లామీయ ఆధునికవాదులతో పోలిస్తే మరింత ప్రగతిశీల అభిప్రాయాలు కలిగి ఉన్నాడు.[34] మహిళల హక్కులను ఆయన కేవలం తల్లులు లేదా భార్యల పాత్రల ఆధారంగా కాకుండా, వ్యక్తిగత సాధికారత, సామాజిక సమానత్వానికి సంబంధించిన అంశంగా చూశాడు.[35] ఇస్లాంలో పురుషులు, మహిళలకు సమాన ఆధ్యాత్మిక హోదా ఉందని ఆయన సమర్థించాడు. అలాగే సంపూర్ణ రాజకీయ సమానత్వానికి కూడా మద్దతు తెలిపాడు.[36] ఇందులో మహిళలకు ఓటు హక్కు,[36][37] విద్య హక్కు కూడా ఉన్నాయి.[38] ముఖ్యంగా బాలికలకు తప్పనిసరి ప్రాథమిక విద్యను ఆయన సమర్థించాడు.[39] మహిళలు విశ్వవిద్యాలయ స్థాయి ఉన్నత విద్యను అభ్యసించాలని ఆయన ప్రోత్సహించాడు.[38] సహవిద్యా సంస్థల విషయంలో కూడా ఆయనకు ఎలాంటి అభ్యంతరం లేదు.[40] సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ బాలుర విద్యకు బాలికల కంటే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినప్పటికీ, షా తన అనుచరులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నప్పుడు వారిలో ఒక్కరినే పాఠశాలకు పంపగలిగితే, కుమారుడి కంటే కుమార్తెనే పంపాలని సూచించాడు.[41]
షా పర్దా, జనానా వ్యవస్థలకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. అవి మహిళలను అణచివేసే, ఇస్లాం సిద్ధాంతాలకు విరుద్ధమైన వ్యవస్థలని ఆయన భావించాడు.[42] తన ఇస్మాయిలీ అనుచరులలో ముఖవస్త్రం, పర్దా వ్యవస్థలను పూర్తిగా నిషేధించాడు.[43] అదనంగా ఆయన తన సమాజంలో బహుభార్యత్వాన్ని పరిమితం చేసి, విధవ వివాహాలను ప్రోత్సహించాడు. బాల్య వివాహాలను కూడా నిషేధించాడు.[42] వివాహం, విడాకులకు సంబంధించిన చట్టాలను మహిళలకు మరింత న్యాయసమ్మతంగా మార్చాడు.[42]
ప్రస్తుతం ఇస్మాయిలీ సమాజం విద్య, ఆరోగ్యం, ఆర్థికాభివృద్ధిపై దృష్టి సారించిన విస్తృత సంస్థాగత వ్యవస్థను కొనసాగిస్తోంది. వీటిలో అనేక సంస్థలు షా పదవీకాలంలో లేదా ఆయన అనంతర కాలంలో స్థాపించబడ్డాయి.[44]
గుర్రపు పందేల యాజమాన్యం, అశ్వక్రీడలు
[మార్చు]
ఆయన ప్రసిద్ధ థరోబ్రెడ్ గుర్రపు పందేల యజమాని. ఆయనకు చెందిన గుర్రాలు ది డర్బీలో ఐదుసార్లు విజయం సాధించి రికార్డును సమం చేశాయి. వాటిలో బ్లెన్‌హైమ్, బహ్రామ్, మహ్మూద్, మై లవ్, టుల్యార్ ఉన్నాయి. అదనంగా, ఆయన గుర్రాలు మొత్తం పదహారు బ్రిటిష్ క్లాసిక్ రేసుల్లో విజేతలుగా నిలిచాయి. షా పదమూడు సార్లు బ్రిటిష్ ఫ్లాట్ రేసింగ్ ఛాంపియన్ ఓనర్గా గుర్తింపు పొందాడు. ఎలిజబెత్ II జీవితచరిత్ర రచయిత బెన్ పిమ్లాట్ ప్రకారం, షా బ్రిటిష్ రాజవంశానికి ఆస్ట్రఖాన్ అనే ఒక ఫిల్లీ గుర్రాన్ని బహుమతిగా ఇచ్చాడు. ఆ గుర్రం 1950లో హర్స్ట్ పార్క్ రేస్‌కోర్స్లో విజయం సాధించింది.
1926లో షా ఆగా ఖాన్ ట్రోఫీ అనే కప్‌ను స్థాపించాడు. ఇది ఐర్లాండ్‌లోని డబ్లిన్‌లో ప్రతి ఆగస్టు మొదటి వారంలో జరిగే రాయల్ డబ్లిన్ సొసైటీ వార్షిక గుర్రపు ప్రదర్శనలో నిర్వహించే అంతర్జాతీయ జట్టు షో జంపింగ్ పోటీ విజేతలకు ప్రదానం చేయబడుతుంది.[45] ఈ పోటీ ప్రపంచంలోని ప్రధాన షో జంపింగ్ దేశాల పోటీదారులను ఆకర్షిస్తుంది. దీనిని ఐర్లాండ్ జాతీయ టెలివిజన్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.
వివాహాలు, సంతానం
[మార్చు]
- 1896 నవంబర్ 2న భారతదేశంలోని పుణెలో తన తొలి బంధువురాలు, ఆగా ఖాన్ I మనవరాలు అయిన షహ్జాదీ బేగమ్‌ను వివాహం చేసుకున్నాడు.
- 1908లో ఆయన క్లియోప్ తెరెసా మాగ్లియానో (1888–1926)ను వివాహం చేసుకున్నాడు.[46] వారికి ఇద్దరు కుమారులు జన్మించారు: జ్యూసెప్పే మహ్దీ ఖాన్ (మరణం: ఫిబ్రవరి 1911), అలీ ఖాన్ (1911–1960). ఆమె 1926 డిసెంబరు 1న జరిగిన శస్త్రచికిత్స అనంతరం మరణించింది.[47]
- 1929 డిసెంబరు 7న (పౌర వివాహం) ఫ్రాన్స్‌లోని ఎక్స్-లే-బెయిన్స్లో, అలాగే 1929 డిసెంబరు 13న (మతపర వివాహం) భారతదేశంలోని బొంబాయిలో ఆండ్రే జోసెఫిన్ క్యారోన్ (1898–1976)ను వివాహం చేసుకున్నాడు. పారిస్‌లో దుస్తుల తయారీ దుకాణానికి సహ యజమానిగా ఉన్న ఆమె తరువాత ఆండ్రే ఆగా ఖాన్‌గా ప్రసిద్ధి చెందింది. ఈ వివాహం ద్వారా వారికి ఒక కుమారుడు సద్రుద్దీన్ ఆగా ఖాన్ (1933–2003) జన్మించాడు.[48] ఈ దంపతులు 1943లో విడాకులు తీసుకున్నారు.[49]
- 1944 అక్టోబర్ 9న స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో ఓం హబీబెహ్ ఆగా ఖాన్ (ఇవోన్ బ్లాంచ్ లాబ్రూస్) (15 ఫిబ్రవరి 1906 – 1 జూలై 2000)ను వివాహం చేసుకున్నాడు.
ప్రచురణలు
[మార్చు]ఆయన అనేక పుస్తకాలు, వ్యాసాలు రచించాడు. వాటిలో ఇండియా ఇన్ ట్రాన్సిషన్ (1918) ప్రముఖమైనది. ఇందులో భారత విభజనకు పూర్వం ఉన్న రాజకీయ పరిస్థితులపై ఆయన చర్చించాడు. అదేవిధంగా ఆయన ఆత్మకథ ది మెమోయర్స్ ఆఫ్ ఆగా ఖాన్: వరల్డ్ ఎనఫ్ అండ్ టైమ్ (1954) కూడా ప్రసిద్ధి చెందింది. ఇండియా ఇన్ ట్రాన్సిషన్ గ్రంథంలో షా “దక్షిణ ఆసియా సమాఖ్య” (South Asiatic Federation) భావనను ప్రతిపాదించాడు.[50] ఈ ప్రతిపాదన ప్రకారం భారతదేశాన్ని సమాఖ్య వ్యవస్థలో స్వయం ప్రతిపత్తి గల రాష్ట్రాలుగా పునర్వ్యవస్థీకరించాలి అని సూచించాడు. వలస పాలనలో ఉన్న భారతదేశంలో సమాఖ్య విధానాన్ని ప్రతిపాదించిన తొలి విశద ప్రణాళికలలో ఇది ఒకటిగా పరిగణించబడుతుంది.
మరణం, వారసత్వం
[మార్చు]షా మరణానంతరం ఆయన మనవడు కరీమ్ అల్-హుస్సైనీ నిజారీ ఇస్మాయిలీ ముస్లింల 49వ ఇమామ్‌గా బాధ్యతలు స్వీకరించి, ఆగా ఖాన్ IV అనే బిరుదును స్వీకరించాడు. 1957 జూలై 11న ఆయన మరణించిన సమయంలో వెర్సోయ్లో కుటుంబ సభ్యులు ఆయన చుట్టూ ఉన్నారు. ఆయన చివరి మాటలు ఖుర్ఆన్ శ్లోకాల పఠనమే అని పేర్కొనబడింది.[51]
జూలై 12న లండన్ నుండి షా యొక్క వీలునామాను ఒక న్యాయవాది జెనీవాకు తీసుకువచ్చి కుటుంబ సభ్యుల సమక్షంలో చదివాడు.
ఆయనను మొదట స్విట్జర్లాండ్లోని వెర్సోయ్‌లో సమాధి చేశారు. అనంతరం ఆయన అవశేషాలను వెలికి తీసి, ఈజిప్ట్‌లోని అస్వాన్లో నైల్ నది తీరాన ఉన్న ఆగా ఖాన్ సమాధిలో (24°05′18″N 32°52′43″E / 24.088254°N 32.878722°E) 1959 ఫిబ్రవరి 20న మళ్లీ అంత్యక్రియలు నిర్వహించారు.[52][53]
వారసత్వం
[మార్చు]1977లో పాకిస్తాన్ పోస్టు ఆయన గౌరవార్థం “ఆగా ఖాన్ III జన్మ శతాబ్ది” ప్రత్యేక తపాలా బిళ్లను విడుదల చేసింది.[54] అనంతరం 1990లో “స్వాతంత్ర్య పితామహులు” (Pioneers of Freedom) శ్రేణిలో కూడా పాకిస్తాన్ పోస్టు ఆయన స్మారక తపాలా బిళ్లను విడుదల చేసింది.[6]
గౌరవాలు
[మార్చు]- 21 మే 1898 – ఆర్డర్ ఆఫ్ ది ఇండియన్ ఎంపైర్ నైట్ కమాండర్ (KCIE)[55]
- 1901 – ప్రష్యా క్రౌన్ ఆర్డర్ ప్రథమ శ్రేణి పురస్కారం – జర్మన్ తూర్పు ఆఫ్రికాలోని మహమ్మదీయ జనాభాతో సంబంధించిన వివిధ అంశాల పరిష్కారంలో ఆయన అందించిన విలువైన సేవలకు గుర్తింపుగా[56]
- 26 జూన్ 1902 – ఆర్డర్ ఆఫ్ ది ఇండియన్ ఎంపైర్ నైట్ గ్రాండ్ కమాండర్ (GCIE)[8]
- 12 డిసెంబర్ 1911 – ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఇండియా నైట్ గ్రాండ్ కమాండర్ (GCSI)[57]
- 30 మే 1923 – రాయల్ విక్టోరియన్ ఆర్డర్ నైట్ గ్రాండ్ క్రాస్ (GCVO) – రాజు జన్మదినోత్సవ సందర్భంలో[58]
- 1 జనవరి 1934 – రాజు జార్జ్ V చేత హిస్ మెజెస్టీస్ మోస్ట్ ఆనరబుల్ ప్రివీ కౌన్సిల్ సభ్యునిగా నియామకం[59]
- 1 జనవరి 1955 – ఆర్డర్ ఆఫ్ సెయింట్ మైఖేల్ అండ్ సెయింట్ జార్జ్ నైట్ గ్రాండ్ క్రాస్ (GCMG)[60]
గమనికలు
[మార్చు]మూలాలు
[మార్చు]- 1 2 3 4 https://www.britannica.com/biography/Aga-Khan-III, Biography of Aga Khan III on Encyclopedia Britannica, Updated 18 September 2003, Retrieved 31 March 2017
- ↑ John Keay (2001). India: A History. Grove Press. p. 468. ISBN 978-0-8021-3797-5.
- ↑ "Conferencing the International" (in ఇంగ్లీష్).
- ↑ Daftary, Farhad (1990). The Ismā'īlīs: Their History and Doctrines. Cambridge: Cambridge University Press. p. 518. ISBN 0-521-42974-9.
- ↑ "Aga Khan, Fashionable Londoner, Holds Enormous Power in Islam", The New York Times,8 July 1923, p. XX5.
- 1 2 "Agha Khan III". findpk.com. the original నుండి 5 మే 2019 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 19 September 2019.
- ↑ The Times (London). 26 June 1902. (36804),
- 1 2 "No. 27448". The London Gazette. 26 June 1902. p. 4197.
- ↑ The Times (London). 25 October 1902. (36908),
- ↑ Bhownagree 1911.
- 1 2 3 Daftary, Farhad (1998). A Short History of the Ismailis. Edinburgh, UK: Edinburgh University Press. pp. 199–206. ISBN 0-7486-0687-4.
- ↑ Virani, Shafique N. (February 2011). "Taqiyya and Identity in a South Asian Community". The Journal of Asian Studies (in ఇంగ్లీష్). 70 (1): 99–139. doi:10.1017/S0021911810002974. ISSN 0021-9118. S2CID 143431047.
- ↑ Purohit, Teena (2012). The Aga Khan Case: Religion and Identity in Colonial India. Cambridge, MA: Harvard University Press. p. 111. ISBN 978-0-674-06639-7.
- ↑ Mukherjee, Soumen (2017). Ismailism and Islam in Modern South Asia: Community and Identity in the Age of Religious Internationals. Cambridge, UK: Cambridge University Press. p. 131. ISBN 978-1-107-15408-7.
- 1 2 The Shi'a in modern South Asia : religion, history and politics. Jones, Justin, 1980-, Qasmi, Ali Usman. Delhi, India: Cambridge University Press. 5 May 2015. p. 53. ISBN 978-1-316-25879-8. OCLC 927147288.
{{cite book}}: CS1 maint: others (link) - ↑ Haider, Najam Iftikhar (11 August 2014). Shi'i Islam : an introduction. New York, NY: Cambridge University Press. pp. 193. ISBN 978-1-107-03143-2. OCLC 874557726.
- 1 2 Aga Khan III (1998). Aga Khan III : selected speeches and writings of Sir Sultan Muhammad Shah. Aziz, Khursheed Kamal. London: Kegan Paul International. p. 1067. ISBN 0-7103-0427-7. OCLC 39678354.
- ↑ Rattansi, Diamond (August 1981). The Nizari Isma'ilis of Pakistan: Isma'ilism, Islam and Westernism Viewed Through the Firmans: 1936–1980. McGill University (Thesis). p. 65. the original నుండి 2021-09-01 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2026-05-22.
- 1 2 Aga Khan III 1998, p. 1183
- ↑ Aga Khan III 1998, pp. 1345–1346
- ↑ Aga Khan III 1998, p. 211
- ↑ Aga Khan III 1998, p. 876
- ↑ Aga Khan III 1998, p. 1415
- ↑ Aga Khan III 1998, pp. 210, 803
- ↑ Aga Khan III 1998, p. 1184
- 1 2 Aga Khan III 1998, p. 1407
- ↑ Aga Khan III 1998, pp. 842 & 1063
- ↑ Rattansi 1981, p. 207
- ↑ Voices of Islam. Cornell, Vincent J. Westport, Conn.: Praeger Publishers. 2007. pp. 235. ISBN 978-0-313-05116-6. OCLC 230345942.
{{cite book}}: CS1 maint: others (link) - ↑ Aga Khan III 1998, p. 216
- ↑ Aga Khan III 1998, p. 235
- ↑ Aga Khan III 1998, p. 217
- ↑ Aga Khan III 1998, pp. 212-213
- ↑ Khoja-Moolji, Shenila, 1982- (June 2018). Forging the ideal educated girl : the production of desirable subjects in Muslim South Asia. Oakland, California. p. 27. ISBN 978-0-520-97053-3. OCLC 1022084628.
{{cite book}}: CS1 maint: location missing publisher (link) CS1 maint: multiple names: authors list (link) CS1 maint: numeric names: authors list (link) - ↑ Khoja-Moolji 2018, p. 31
- 1 2 Kaiser, Paul J. (1996). Culture, transnationalism, and civil society : Aga Khan social service initiatives in Tanzania. Westport, Conn.: Praeger. p. 51. ISBN 0-275-95528-1. OCLC 34545670.
- ↑ Aga Khan III 1998, pp. 593 & 645
- 1 2 Aga Khan III 1998, p. 586
- ↑ Aga Khan III 1998, p. 1117
- ↑ Aga Khan III 1998, p. 587
- ↑ Aga Khan III 1998, p. 1211–1212
- 1 2 3 Leonard, Karen Isaksen, 1939- (2003). Muslims in the United States : the state of research. New York: Russell Sage Foundation. pp. 68. ISBN 978-1-61044-348-7. OCLC 794701243.
{{cite book}}: CS1 maint: multiple names: authors list (link) CS1 maint: numeric names: authors list (link) - ↑ Khoja-Moolji 2018, p. 32
- ↑ Twaddle, Michael (July 1995). "Asians in East Africa Quest for Equality: Asian Politics in East Africa, 1900–1967. By Robert G. Gregory. Hyderabad and London: Orient Longman and Sangam Books (57 London Fruit Exchange, London E1 6EP, UK), 1993. Pp. xvi + 231. £14.95 (ISBN 0-86311-208-0)". The Journal of African History. 36 (2): 335–336. doi:10.1017/s0021853700034289. ISSN 0021-8537. S2CID 142953052.
- ↑ The Aga Khan Trophy, Dublin Horse Show, accessed 9 July 2007
- ↑ "Marriages of the Aga Khan III". Ismaili.net. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 August 2014.
- ↑ "Aga Khan's Wife Dies As He Buys Big Gem", The New York Times, 2 December 1926, p. 2
- ↑ "Aga Khan Again a Father", The New York Times, 18 January 1933, p. 9.
- ↑ "Princess Andrée", The New York Times, 30 December 1976, p. 19.
- ↑ The Aga Khan; India in Transition, Bombay,1918, pp.45-46.
- ↑ "Death of the Aga Khan III".
- ↑ "Aga Khan III Reburied: Ismailis Gather for Rites at Mausoleum on the Nile". The New York Times. 1959.
- ↑ Vickers, Hugo (2000). "Obituary: The Begum Aga Khan". The Independent.
- ↑ "Pakistan Philately". pakistanphilately.com. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 19 September 2019.
- ↑ "No. 26969". The London Gazette. 21 May 1898. p. 3230.
- ↑ "No. 27291". The London Gazette. 5 March 1901. p. 1576.
- ↑ "No. 28559". The London Gazette. 12 December 1911. p. 9357.
- ↑ "No. 32830". The London Gazette. 2 June 1923. p. 3947.
- ↑ "No. 34010". The London Gazette. 1 January 1934. p. 1.
- ↑ "No. 40366". The London Gazette. 1 January 1955. p. 4.
ఆధార గ్రంథాలు
[మార్చు]- This article incorporates text from a publication now in the public domain: Bhownagree, Mancherjee Merwanjee (1911). "Aga Khan I. s.v. Aga Khan III.". In Chisholm, Hugh (ed.). ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా (in ఇంగ్లీష్). Vol. 1 (11th ed.). Cambridge University Press. p. 363.
- Brown, Frank Herbert (1922). . In Chisholm, Hugh (ed.). Encyclopædia Britannica (12th ed.). London & New York: The Encyclopædia Britannica Company.
- Daftary, F., The Isma'ilis: Their History and Doctrines, Cambridge University Press, 1990.
- Khoja-Moolji, Shenila. “Redefining Muslim women: Aga Khan III’s reforms for women’s education.” South Asia Graduate Research Journal 20, no. 1, 2011, 69-94.
- Khoja-Moolji, Shenila. Forging the Ideal Educated Girl. The Production of Desirable Subjects in Muslim South Asia. Oakland: University of California Press, 2018.
- Naoroji M. Dumasia, A Brief History of the Aga Khan (1903).
- Aga Khan [III], The Memoirs of Aga Khan: World Enough and Time, London: Cassel & Company, 1954; published the same year in the United States by Simon & Schuster, with a foreword by విలియమ్ సోమర్‌సెట్ మామ్
- Edwards, Anne (1996). Throne of Gold: The Lives of the Aga Khans, New York: William Morrow, 1996
- Naoroji M. Dumasia, The Aga Khan and His Ancestors, New Delhi: Readworthy Publications (P) Ltd., 2008
- Valliani, Amin; "Aga Khan's Role in the Founding and Consolidation of the All India Muslim League", Journal of the Pakistan Historical Society (2007) 55# 1/2, pp 85–95.
బాహ్య లింకులు
[మార్చు]- వీడియో క్లిప్ – హిస్టరీ ఛానల్ వెబ్సైట్
- ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇస్మాయిలీ స్టడీస్: సర్ సుల్తాన్ మహమ్మద్ షా ఆగా ఖాన్ III ప్రసంగాలు Archived 7 అక్టోబరు 2010 at the Wayback Machine
- Archived 10 జూలై 2017 at the Wayback Machine అధికారిక ఇస్మాయిలీ వెబ్సైట్
- ఆగా ఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్ అధికారిక వెబ్సైట్
- దక్షిణాసియా అమెరికన్ డిజిటల్ ఆర్కైవ్ (SAADA)లో ఆగా ఖాన్ సంబంధిత సమాచారం[permanent dead link]
- Newspaper clippings about ఆగా ఖాన్ III in the 20th Century Press Archives of the ZBW
- Articles having different image on Wikidata and Wikipedia
- Articles containing Persian-language text
- CS1 maint: location missing publisher
- Wikipedia articles incorporating a citation from the 1922 Encyclopaedia Britannica with Wikisource reference
- Articles with dead external links from మే 2026
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- Wikipedia articles with SELIBR identifiers
- Wikipedia articles with BNF identifiers
- 1877 జననాలు
- 1957 మరణాలు
- ఖాజార్ వంశం
- ఆగా ఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్
- బ్రిటిష్ గుర్రపు పందేల యజమానులు, పెంపకదారులు
- ఎప్సమ్ డర్బీ విజేతల యజమానులు
- పాకిస్తానీ గుర్రపు పందేల యజమానులు, పెంపకదారులు
- పాకిస్తానీ దాతలు
- పాకిస్తానీ మత నాయకులు
- 20వ శతాబ్దపు భారతీయ దాతలు
- పాకిస్తాన్ ఉద్యమ నాయకులు
- పాకిస్తాన్ ఉద్యమం
- ఆగా ఖాన్లు
- యునైటెడ్ కింగ్డమ్ ప్రివీ కౌన్సిల్లో భారతీయ సభ్యులు
- లీగ్ ఆఫ్ నేషన్స్ అసెంబ్లీ అధ్యక్షులు
- ఈటన్ కళాశాలలో విద్యనభ్యసించినవారు
- ఆర్డర్ ఆఫ్ ది ఇండియన్ ఎంపైర్ నైట్ గ్రాండ్ కమాండర్లు
- ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఇండియా నైట్ గ్రాండ్ కమాండర్లు
- ఆర్డర్ ఆఫ్ సెయింట్ మైఖేల్ అండ్ సెయింట్ జార్జ్ నైట్ గ్రాండ్ క్రాస్
- రాయల్ విక్టోరియన్ ఆర్డర్ నైట్ గ్రాండ్ క్రాస్
- భారతీయ నైట్స్
- భారతీయ ఇస్మాయిలీలు
- పాకిస్తానీ ఇస్మాయిలీలు
- భారతీయ ఇమాములు
- పాకిస్తానీ ఇమాములు
- 20వ శతాబ్దపు ఇమాములు
- భారతీయ పాఠశాలలు, కళాశాలల స్థాపకులు
- కరాచీ ప్రజలు
- ఇరానీ వంశావళి కలిగిన పాకిస్తానీలు
- ప్రి డే లార్క్ డి ట్రయాంఫ్ విజేతల యజమానులు
- అరబ్ వంశావళి కలిగిన పాకిస్తానీలు
- అరబ్ వంశావళి కలిగిన బ్రిటిష్ ప్రజలు
- 19వ శతాబ్దపు ఇస్మాయిలీలు
- 20వ శతాబ్దపు ఇస్మాయిలీలు



