ఆగ్నేయ ఆసియా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆగ్నేయ ఆసియా

ఆగ్నేయాసియా నైసర్గిక స్వరూపం
|- ! style="border-top: solid 1px #ccd2d9; padding: 0.4em 1em 0.4em 0; vertical-align: top; text-align: left;" | భూభాగాలు | style="border-top: solid 1px #ccd2d9; padding: 0.4em 1em 0.4em 0; vertical-align: top" | 9 |- ! style="border-top: solid 1px #ccd2d9; padding: 0.4em 1em 0.4em 0; vertical-align: top; text-align: left;" | GDP (2009) | style="border-top: solid 1px #ccd2d9; padding: 0.4em 1em 0.4em 0; vertical-align: top" | $1.486 ట్రిలియన్లు (మారకపు విలువ) |- ! style="border-top: solid 1px #ccd2d9; padding: 0.4em 1em 0.4em 0; vertical-align: top; text-align: left;" | తలసరి GDP (2009) | style="border-top: solid 1px #ccd2d9; padding: 0.4em 1em 0.4em 0; vertical-align: top" | $2,500 (మారకపు విలువ) |- ! style="border-top: solid 1px #ccd2d9; padding: 0.4em 1em 0.4em 0; vertical-align: top; text-align: left;" | భాషలు | style="border-top: solid 1px #ccd2d9; padding: 0.4em 1em 0.4em 0; vertical-align: top" | |- ! style="border-top: solid 1px #ccd2d9; padding: 0.4em 1em 0.4em 0; vertical-align: top; text-align: left;" | కాలమండలాలు | style="border-top: solid 1px #ccd2d9; padding: 0.4em 1em 0.4em 0; vertical-align: top" | UTC+5:30 (అండమాన్, నికోబార్ ద్వీపాలు) నుంచి UTC+9:00 (ఇండోనేషియా) వరకు |- ! style="border-top: solid 1px #ccd2d9; padding: 0.4em 1em 0.4em 0; vertical-align: top; text-align: left;" | రాజధాని నగరాలు | style="border-top: solid 1px #ccd2d9; padding: 0.4em 1em 0.4em 0; vertical-align: top" | |-

ఆగ్నేయ ఆసియా (లేదా ఆగ్నేయాసియా ) ఆసియా ఖండంలో ఒక ఉపప్రాంతం, భౌగోళికంగా చైనాకు దక్షిణంవైపున, భారత్‌కు తూర్పువైపున మరియు ఆస్ట్రేలియాకు ఉత్తరంవైపున ఉన్న దేశాలు ఈ ప్రాంత పరిధిలోకి వస్తాయి. భూగర్భ ఫలకాలు ఖండించుకునే చోట ఉన్న ఈ ప్రాంతంలో, భూప్రకంపన మరియు అగ్నిపర్వత చర్యాశీలత బాగా ఎక్కువగా ఉంటుంది.

ఆగ్నేయాసియా రెండు భౌగోళిక ప్రాంతాలను కలిగివుంది: అవి ఆసియా ప్రధాన భూభాగం (దీనిని ఇండోచైనాగా పిలుస్తారు), మరియు తూర్పువైపుకు మరియు ఆగ్నేయంవైపుకు ఉన్న ద్వీప చాపం మరియు ద్వీపసమూహం. ప్రధాన భూభాగంలో బర్మా (మయన్మార్), కాంబోడియా, లావోస్, థాయ్‌ల్యాండ్, వియత్నాం మరియు ద్వీపకల్ప మలేషియా ఉండగా, సముద్ర ప్రాంతంలో బ్రూనే, తూర్పు మలేషియా, తూర్పు తైమోర్, ఇండోనేషియా, పాపువా న్యూ గినియా, ఫిలిప్పీన్స్, మరియు సింగపూర్ ఉన్నాయి.[1]

భౌగోళికంగా కొన్నిసార్లు చైనా, తైవాన్, హాంకాంగ్, మాకౌ ప్రాంతాలను ఆగ్నేయాసియా ఉపప్రాంతంలో భాగంగా పరిగణిస్తున్నారు,[ఉల్లేఖన అవసరం] అయితే రాజకీయంగా చాలా అరుదుగా వీటిని ఆగ్నేయాసియాలో భాగంగా చూస్తారు.[ఉల్లేఖన అవసరం] సాంస్కృతికపరంగా మరియు చారిత్రాత్మకంగా వియత్నాం ఆగ్నేయాసియాతో కాకుండా తూర్పు ఆసియా ప్రాంతంతో అనుబంధం కలిగివుంది.[ఉల్లేఖన అవసరం]

ఈ ప్రాంతంలో ఆస్ట్రోనేషియన్ ప్రజలు ఆధిపత్యం కలిగి ఉన్నారు. ఇస్లాం మరియు బౌద్ధ మతం, తరువాత క్రైస్తవ మతం ఈ ప్రాంతంలో ప్రధాన మతాలుగా ఉన్నాయి. అయితే ఈ ప్రాంతం మొత్తం మీద అనేక రకాల మతాలను గుర్తించవచ్చు, హిందూ మతంతోపాటు, అనేక సర్వాత్మవాద-ప్రభావిత ఆచారాలు కూడా ఉన్నాయి.[ఉల్లేఖన అవసరం]

విభాగాలు[మార్చు]

రాజకీయ పరిస్థితి[మార్చు]

"ఆగ్నేయాసియా"కు సంబంధించిన నిర్వచనాలు వివిధ రకాలుగా ఉన్నప్పటికీ, ఎక్కువ నిర్వచనాలు ఈ కింది దేశాలు ఉన్న భూభాగాన్ని ఆగ్నేయాసియాగా సూచిస్తున్నాయి:

పాపువా న్యూ గినియా మరియు తైమోర్-లెస్ట్ మినహా మిగిలిన పైదేశాలన్నీ అసోసియేషన్ ఆఫ్ సౌత్‌ఈస్ట్ ఏషియన్ నేషన్స్‌లో సభ్యదేశాలుగా ఉన్నాయి (దీనిని సాధారణంగా ASEANగా సంక్షిప్తీకరించి పిలుస్తారు.) ఆగ్నేయాసియాను, దక్షిణాసియాలో కొంత భాగాన్ని కలిపి ఎక్కువగా ఈస్ట్ ఇండీస్ అని పిలుస్తారు, 20వ శతాబ్దం వరకు సాధారణంగా దీనిని ఇండీస్ అని పిలిచేవారు. క్రిస్మస్ ద్వీపం మరియు కాకోస్ (కీలింగ్) ద్వీపాలు కూడా ఆగ్నేయాసియాలో భాగంగా పరిగణించబడుతున్నాయి, వాస్తవానికి ఈ రెండు ప్రాంతాలు ఆస్ట్రేలియా ప్రభుత్వ పాలనలో ఉన్నాయి. కొన్ని దక్షిణ చైనా సముద్రంలోని ద్వీపాల విషయంలో సార్వభౌమాధికార వివాదాలు నెలకొనివున్నాయి. ఇండోనేషియా ద్వారా పాపువా ఆగ్నేయాసియాలో రాజకీయంగా భాగమై ఉంది, అయితే భౌగోళికంగా దీనిని తరచుగా ఓషియానియాలో భాగంగా పరిగణిస్తున్నారు. 2009 నుంచి, తాము ASEANలో చేరే అవకాశం ఉందని పాపువా న్యూ గినియా ప్రకటించింది, ఈ ప్రకటన ద్వారా తన భౌగోళిక స్థానాన్ని మార్చుకోనున్నట్లు ఈ దేశం సూచించింది.[2][3]

భౌగోళిక పరిస్థితులు[మార్చు]

ఆగ్నేయాసియా ప్రాంతం.[4]

ఇండోనేషియా తూర్పు ప్రాంతాలు మరియు తూర్పు తైమోర్ (వాలెస్ రేఖకు తూర్పువైపు)లను భౌగోళికంగా ఓషియానియాలో భాగాలుగా పరిగణిస్తారు.

UN ప్రకారం గుర్తించబడిన ఆసియాలోని ప్రాంతాలు:[10][11][12][13][14][15]

ఆగ్నేయాసియా భౌగోళికంగా రెండు ఉపప్రాంతాలుగా విభజించబడివుంటుంది, ఈ రెండు ప్రాంతాలను వరుసగా ఆగ్నేయాసియా ప్రధాన భూభాగం (లేదా ఇండోచైనా) మరియు సముద్రప్రాంత ఆగ్నేయాసియా (లేదా ఇదే విధంగా నిర్వచించిన మాలే ఆర్కిపెలాగో (ఇండోనేషియా భాషలో: నుసాన్‌టారా ) అనే పేర్లతో పిలుస్తారు.

సముద్రప్రాంత ఆగ్నేయాసియాలో ఉన్న దేశాలు:

భారతదేశంలో ఉన్న అండమాన్ మరియు నికోబార్ ద్వీపాలను భౌగోళికంగా ఆగ్నేయాసియాలో భాగంగా పరిగణిస్తారు. బంగ్లాదేశ్ మరియు భారతదేశంలోని ఏడు ఈశాన్య రాష్ట్రాలు సాంస్కృతిక పరంగా ఆగ్నేయాసియాలో భాగంగా ఉన్నాయి, కొన్నిసార్లు వీటిని దక్షిణాసియా మరియు ఆగ్నేయాసియా రెండు ప్రాంతాల్లో భాగంగా పరిగణిస్తున్నారు. భారతదేశంలోని ఏడు ఈశాన్య రాష్ట్రాలు భౌగోళికంగా కూడా ఆగ్నేయాసియాలో భాగంగా ఉన్నాయి. హైనాన్ ద్వీపం మరియు యున్నాన్, గిఝౌ మరియు గువాంగ్జి వంటి అనేక ఇతర దక్షిణ చైనా భూభాగాలను కూడా తూర్పు ఆసియా మరియు ఆగ్నేయాసియా రెండు ప్రాంతాల్లో భాగంగా పరిగణిస్తారు. మిగిలిన న్యూ గినియా భూభాగాన్ని కొన్నిసార్లు పాలౌ, గువామ్ మరియు ఉత్తర మరియానా ద్వీపాలు మాదిరిగా, స్పానిష్ ఈస్ట్ ఇండీస్‌లో భాగంగా పరిగణిస్తారు.

దేశాలు మరియు భూభాగాల సమాచారం[మార్చు]

దేశాలు[మార్చు]

దేశం వైశాల్యం (km2)[5] జనాభా (2009)[1] జనసాంద్రత (/km2) GDP USD (2009)[6] తలసరి GDP (2009) రాజధాని
 Brunei 5,765 400,000 70 14,700,000,000 $36,700 బండార్ సెరీ బెగవాన్
 Myanmar 676,578 50,020,000 74 26,820,000,000 $500 నైపీడా
 Cambodia 181,035 14,805,000 82 10,900,000,000 $800 ఫ్నోమ్ పెన్
 Timor-Leste 14,874 1,134,000 76 599,000,000 $500 దిలీ
 Indonesia 1,904,569 240,271,522 126 514,900,000,000 $2,200 జకార్తా
 Laos 236,800 6,320,000 27 5,721,000,000 $900 వియెంటియాన్
 Malaysia 329,847 28,318,000 83 191,400,000,000 $6,800 కౌలాలంపూర్
 Papua New Guinea 462,840 6,732,000 15 8,200,000,000 $1,200 పోర్ట్ మోరెస్‌బై
 Philippines 299,764 91,983,000 307 158,700,000,000 $1,700 మనీలా
 Singapore 710.2 4,987,600[7] 7,023 177,100,000,000 $35,500 సింగపూర్ నగరం (ప్రధాన వాణిజ్య ప్రాంతం)
 Thailand 513,120 67,764,000 132 263,500,000,000 $3,900 బ్యాంకాక్
 Vietnam 331,210 88,069,000 265 97,120,000,000 $1,100 హనాయ్

భూభాగాలు[మార్చు]

భూభాగం వైశాల్యం (km2) జనాభా జనసాంద్రత (/km2)
 Christmas Island 135[8] 1,402[8] 10.4
 Cocos (Keeling) Islands 14[9] 596[9] 42.6

చరిత్ర[మార్చు]

సుమారుగా 45,000 సంవత్సరాల క్రితం హోమో సెపియన్లు (ఆదిమ మానవులు) ఈ ప్రాంతానికి చేరుకున్నారు.[10] హోమో ఫ్లోరెసియన్సిస్ (అంతరించిపోయిన ఒక మానవ జాతి) ఆధునిక మానవులతో 12,000 సంవత్సరాల క్రితం వరకు ఈ ప్రాంతంలో కొన్ని ద్వీపాలను పంచుకుంటున్నట్లు తెలుస్తోంది, ఆ తరువాత ఈ మానవ జాతి అంతరించిపోయింది.[11] ఇండోనేషియా మరియు ఫిలిప్పీన్స్‌లో అధిక సంఖ్యలో ఉన్న ఆస్ట్రోనేషియన్ ప్రజలు తైవాన్ నుంచి ఆగ్నేయాసియాకు వలసవెళ్లారు. వారు సుమారుగా 2000 BCE కాలంలో ఇండోనేషియాలో అడుగుపెట్టారు, వీరు ఆపై ద్వీపసమూహాలకు తమ ఉనికిని విస్తరించారు, స్థానిక మెలనేషియన్ ప్రజలను వారు తూర్పు ప్రాంతాలకు పరిమితం చేశారు.[12]

5000 BCE నుంచి 1 CE వరకు వియత్నాం మరియు మిగిలిన ద్వీపసమూహాల మధ్య సునాన్‌టావో (నుసాన్‌టారా ) సముద్ర వాణిజ్యం జరిగిందనేందుకు సోల్హియం మరియు ఇతరులు ఆధారాలు చూపించారు.[13] ఆగ్నేయాసియా ప్రజలు, ముఖ్యంగా ఆస్ట్రోనేషియన్ సంతతికి చెందిన ప్రజలు, వేలాది సంవత్సరాలపాటు నావికులుగా ఉన్నారు, వీరిలో కొందరు మెడగాస్కర్ వరకు వెళ్లారు. వింటా వంటి వారి నౌకలు సముద్రాలపై ప్రయాణించేందుకు సమర్థవంతంగా ఉపయోగపడ్డాయి. యూరోపియన్ నౌకలతో పోలిస్తే, వారి యొక్క నౌకలు ఎంత సమర్థవంతంగా ఉండేవో మెగెలాన్ యొక్క నౌకాయానాలు వివరిస్తాయి.[14]

హిందూ మహాసముద్రం గుండా సాగించిన ప్రయాణాలు ఆస్ట్రోనేషియన్ ప్రజలు మెడగాస్కర్‌లో నివాసాలు ఏర్పాటు చేసుకునేందుకు సాయపడ్డాయి, అంతేకాకుండా పశ్చిమాసియా మరియు ఆగ్నేయాసియా ప్రాంతాల మధ్య వాణిజ్యానికి కూడా ఇవి ఉపయోగపడ్డాయి. సుమత్రా నుంచి వెలికితీసిన బంగారం సుదూర పశ్చిమ ప్రాంతానికి, అంటే రోమ్ వరకు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది, సులు సముద్ర ప్రాంతానికి చెందిన బానిసలను మెగెలాన్ ప్రయాణంలో అనువాదకులుగా ఉపయోగపడినట్లు భావిస్తున్నారు.

ఈ ప్రాంతంలో దాదాపుగా అందరు ప్రజలు మొదట సర్వాత్మవాదానికి చెందినవారే. తరువాత ఈ ఆచారం స్థానంలోకి హిందూ బ్రాహ్మణత్వం వచ్చింది. తరువాత కొంతకాలానికి, 525లో థీరవేదా బౌద్ధ మతం వ్యాపించింది. 1400వ శతాబ్దంలో, ఇస్లామిక్ ప్రభావాలు ప్రవేశించడం మొదలైంది. ఈ పరిణామంతో ఇండోనేషియా నుంచి చివరి హిందూ సభ బాలీ ప్రాంతానికి మాత్రమే పరిమితమయ్యేలా బయటకు నెట్టబడింది.

ఆగ్నేయాసియాలోని ప్రధాన భూభాగంలో, అంటే మయన్మార్, కాంబోడియా మరియు థాయ్‌ల్యాండ్ దేశాల్లో బౌద్ధమతంలో థీరవేద రూపం సంరక్షించబడింది, ఈ మతం శ్రీలంక నుంచి ఈ దేశాలకు విస్తరించింది. బౌద్ధమతంలోని ఈ రూపం హిందూ-ప్రభావిత ఖ్మెర్ సంస్కృతితో మిళితమైంది.

శ్రీవిజయ శైలి వాస్తుశిల్పం.సూరత్ థానీ థాయ్‌ల్యాండ్

భారత ప్రభావిత సామ్రాజ్యాలు[మార్చు]

రెండో శతాబ్దం BCE తరువాత నుంచి ఈ ప్రాంతానికి భారత వ్యాపారులు వెళ్లారు మరియు అదేవిధంగా భారత మత ప్రభావాలు అక్కడికి విస్తరించాయి, దీనికి ముందు ఆగ్నేయాసియా మత విశ్వాసాలు మరియు ఆచారాలు గురించి తెలియజేసేందుకు అతి కొద్ది సమాచారం మాత్రమే అందుబాటులో ఉంది. 13వ శతాబ్దానికి ముందు, బౌద్ధమతం మరియు హిందూమతం ఆగ్నేయాసియాలో ప్రధాన మతాలుగా ఉన్నాయి.

జావా మరియు సుమత్రా ప్రాంతాల్లోని హిందూ సామ్రాజ్యం జావా ద్వీపం సుమారుగా 200 BCEలో ఏర్పాటై ఉంది. భారత్ ప్రభావం ప్రవేశించడంతోనే మాలే-మాట్లాడే ప్రపంచం యొక్క చరిత్ర మొదలైంది, ఇది సుమారుగా 3వ శతాబ్దం BC కాలంనాటిది. అపార అటవీ మరియు సముద్ర ఉత్పత్తుల కోసం మరియు చైనాకు వ్యాపారులతో వాణిజ్యం సాగించేందుకు భారతీయ వ్యాపారులు ఈ ద్వీపసమూహానికి వచ్చారు, వీరే అందరి కంటే ముందు మాలే ప్రపంచాన్ని గుర్తించారు. 1వ శతాబ్దం CE ప్రారంభంనాటికి మాలే ద్వీపకల్పంలో హిందూ మరియు బౌద్ధ మతాలు రెండూ బాగా విస్తరించబడ్డాయి, అక్కడి నుంచి ఈ మతాలు ద్వీపసమూహం మొత్తానికి విస్తరించాయి.

ఫునాన్ సామ్రాజ్య ప్రారంభ కాలంలో హిందూ మతం మొదట 0}కాంబోడియాను ప్రభావితం చేసింది. ఖ్మెర్ సామ్రాజ్యం యొక్క అధికారిక మతాల్లో హిందూ మతం కూడా ఒకటి. ప్రపంచంలో బ్రహ్మదేవుడి కోసం కట్టబడిన రెండు ఆలయాల్లో ఒకటి కాంబోడియాలోనే ఉంది. కాంబోడియాలో ఉన్న అంగ్కోర్ వాత్ కూడా ఒక ప్రసిద్ధ హిందూ దేవాలయం. ప్రస్తుతం మధ్య వియత్నాంగా పరిగణించబడుతున్న ప్రాంతంలో ఛాంపా నాగరికత విలసిల్లింది, ఇది ఒక భారత ప్రభావిత హిందూ సామ్రాజ్యం.

1293 నుంచి 1500 వరకు తూర్పు జావాలో ఉన్న మజాపాహిత్ సామ్రాజ్యాన్ని ఒక భారత ప్రభావిత సామ్రాజ్యంగా చెప్పవచ్చు. ఈ సామ్రాజ్యంలో గొప్ప పాలకుడు హాయమ్ వురుక్, ఆయన 1350 నుంచి 1389 వరకు ఈ సామ్రాజ్యాన్ని పాలించాడు, ఆయన హయాంలో సామ్రాజ్యం ఉన్నత శిఖరాలకు చేరుకుంది, ఈ కాలంలో దక్షిణ మాలే ద్వీపకల్పం, బోర్నెయో, సుమత్రా మరియు బాలీ ప్రాంతాల్లోని ఇతర సామ్రాజ్యాలపై ఇది ఆధిపత్యం చెలాయించింది. నగరకేర్తగామా వంటి వివిధ మూలాలు దీని యొక్క ఆధిపత్య పరిధి సెలెబెస్, మోలుకాస్ ద్వీపాలు, పశ్చిమ పాపువాలోని కొన్ని ప్రాంతాల్లోని భూభాగాలకు కూడా విస్తరించబడిందని తెలియజేస్తున్నాయి, దీని ద్వారా ఆగ్నేయాసియా చరిత్రలోనే అతిపెద్ద సామ్రాజ్యంగా ఇది గుర్తింపు పొందింది.

చోళులు సైనికపరంగా మరియు వ్యాపార రంగం రెండింటిలోనూ సముద్ర కార్యకలాపాల్లో ఆరితేరారు. కేడా మరియు శ్రీవిజయ సామ్రాజ్యాలపై వీరు సైనిక దాడులు చేశారు, అంతేకాకుండా చైనా సామ్రాజ్యంతో వీరు కొనసాగించిన వాణిజ్య సంబంధాలు స్థానిక సంస్కృతులను ప్రభావితం చేశాయి. చోళుల సాహసయాత్రలు ఫలితంగానే ఆగ్నేయాసియాలో ఈరోజుకు కూడా హిందూ సంస్కృతి ప్రభావాన్ని ధ్రువీకరించే అనేక ఉదాహరణలు ఉన్నాయి.[15]

ఆగ్నేయాసియా ఇస్లామీకరణ[మార్చు]

11వ శతాబ్దంలో, సముద్రప్రాంత ఆగ్నేయాసియా చరిత్రలో కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి, భారత్‌కు చెందిన చోళుల నౌకా దళం సముద్రాన్ని దాటి శ్రీవిజయ సామ్రాజ్యంపై దాడి చేసింది, శక్తివంతమైన సముద్రప్రాంత సామ్రాజ్యం రాజధాని కేడారంలో (కెడా) సంగ్రామ విజయతుంగావర్మన్ సేనలపై చోళులు విజయం సాధించారు, రాజును వారు నిర్బంధించారు. కేడారంతోపాటు, ప్రస్తుతం సుమత్రాగా పిలువబడుతున్న పనాయ్, మలైయూర్ మరియు మలేయన్ ద్వీపకల్పంపై కూడా వారు దాడి చేశారు. దీని తర్వాత వెంటనే, కెడా రాజు ఫారా ఓంగ్ మహావాంగ్సా హిందూ విశ్వాసాలను పరిత్యజించిన మొదటి పాలకుడిగా గుర్తింపు పొందాడు, 1136వ సంవత్సరంలో ఏర్పాటయిన కెడా సామ్రాజ్యాన్ని ఇస్లాం మతంలోకి మార్చాడు. 1267వ సంవత్సరంలో సముదేరా పాసాయ్ కూడా ఇస్లాం మతంలోకి మారింది, మలేకా రాజు పారమేశ్వర పాసాయ్ యువరాణిని వివాహం చేసుకున్నాడు, వీరి కుమారుడు మలేకాకు మొదటి సుల్తాన్‌గా అవతరించాడు, తరువాత కొంతకాలానికి మలేకా ఇస్లాం అధ్యయనానికి మరియు సముద్ర వాణిజ్యానికి ప్రధాన కేంద్రంగా మారింది, ఇతర పాలకులు కూడా దీనిని అనుసరించారు. ఇండోనేషియా మత పెద్ద మరియు ఇస్లామిక్ పరిశోధకుడు హంకా (1908–1981) 1961లో రాసిన వివరాల ప్రకారం: "ఇండోనేషియా మరియు మలేయా ప్రాంతాల్లో ఇస్లాం అభివృద్ధితో ఒక చైనా ముస్లిం, అడ్మిరల్ జెంగ్ హికి దగ్గరి సంబంధం ఉందని పేర్కొన్నారు." [16]

ఆగ్నేయాసియా ఇస్లామీకరణ ప్రక్రియకు సంబంధించి అనేక సిద్ధాంతాలు ఉన్నాయి. మొదటి సిద్ధాంతం ఏమిటంటే వాణిజ్యం. పశ్చిమ ఆసియా, భారత్ మరియు ఆగ్నేయాసియా మధ్య వాణిజ్య సంబంధాలు విస్తరించడంతో ఈ ప్రాంతానికి ముస్లిం వ్యాపారాలు తమ మతాన్ని వ్యాపింపజేయడానికి సాయపడింది. రెండు సిద్ధాంతం ఏమిటంటే మిషనరీలు లేదా సుఫీలు పాత్ర. అప్పటికే అమలులో ఉన్న స్థానిక విశ్వాసాలు మరియు మతాచారాలు స్థానంలో ఇస్లాం మత విశ్వాసాలు వ్యాపింపజేయడంలో సుఫీ మిషనరీలు కీలక పాత్ర పోషించాయి. చివరకు, పాలక వర్గాలు ఇస్లాంను స్వీకరించాయి, ఈ ప్రాంత వ్యాప్తంగా ఇస్లాం మతం వ్యాపించడానికి ఈ పరిణామం సాయపడింది. అత్యంత కీలకమైన నౌకాశ్రయం ఉన్న ప్రాంతంగా గుర్తించబడిన, మలేకా సామ్రాజ్యం 15వ శతాబ్దంలో ఇస్లాం మతాన్ని స్వీకరించింది, దీంతో ఈ ప్రాంతం మొత్తం కొంతకాలంపాటు వేగంగా మత మార్పిడులు జరిగాయి, పాలక మరియు వ్యాపార వర్గాలను ఏకతాటిపైకి తేవడంలో ఇస్లాం మతం కీలకపాత్ర పోషించింది.

వాణిజ్యం మరియు కాలనీల ఏర్పాటు[మార్చు]

చైనా[మార్చు]

చైనా వ్యాపారులు ఈ ప్రాంతంతో సుదీర్ఘకాలం నుంచి వాణిజ్యం జరిపారు, మెగెలాన్ సాహసయాత్ర తెలియజేసే వివరాల ప్రకారం.. బ్రూనే ఐరోపా నౌకల కంటే సమర్థవంతమైన ఫిరంగులు కలిగివుంది, వీటిని చైనీయులు సమకూర్చినట్లు తెలుస్తోంది.[14]

చైనీయులు మింగ్ చక్రవర్తి ఒకరు సుల్తాన్ యొక్క లౌక్యానికి ముగ్ధుడై తమ యువరాణి హాన్ లి పోను 500 మంది పరివారంతో సుల్తాన్ మన్సూర్ షాకు ఇచ్చి వివాహం జరిపించేందుకు మలేకాకు పంపినట్లు తెలుస్తోంది. హాన్ లి పో బావి (1459లో నిర్మించబడింది) బుకిట్ సినా వద్ద ఇప్పుడు పర్యాటక ఆకర్షణగా ఉంది, ఇక్కడ ఆమె యొక్క పరివాహం స్థిరపడింది.

15వ శతాబ్దం మరియు 16వ శతాబ్దం ప్రారంభంలో మలేకా సుల్తాను నియంత్రణలో ఉన్న మలేకా జలసంధి యొక్క వ్యూహాత్మక ప్రాధాన్యత వలన పోర్చుగీసు రచయిత డువార్టే బార్బోసా దీనిని ప్రముఖంగా పేర్కొన్నాడు, ఆయన 1500లో, "మలేకా రాజు చేతిలో వెనిస్ గొంతు ఉందని రాశాడు".

ఐరోపా

పోర్చుగీసు మరియు స్పెయిన్‌వారు మోలుకాస్‌ మరియు ఫిలిప్పీన్స్‌కు రావడంతో, పశ్చిమ దేశాల ప్రభావం 1500వ శతాబ్దంలో ఈ ప్రాంతంలోకి ప్రవేశించడం ప్రారంభమైంది. తరువాత డచ్ దేశీయులు డచ్ ఈస్ట్ ఇండీస్‌ను; ఫ్రెంచ్‌వారు ఇండోచైనా; మరియు బ్రిటీష్‌వారు జలసంధి వద్ద స్థిరనివాసాలు ఏర్పాటు చేశారు. థాయ్‌ల్యాండ్‌లో మినహా అన్ని ఆగ్నేయాసియా దేశాల్లో ఐరోపా కాలనీలు ఏర్పాటు చేయబడ్డాయి.

పశ్చిమం నుంచి మరియు తూర్పు నుంచి ఐరోపా అన్వేషకులు ఆగ్నేయాసియా చేరుకున్నారు. హిందూ మహాసముద్రం నుంచి తూర్పు ప్రాంతాలకు మరియు ఆసియా ప్రధాన భూభాగం నుంచి దక్షిణ ప్రాంతాలకు నౌకలతో వాణిజ్యం సాగుతుండేది, ద్వీపసమూహంలోని దీవుల్లో దొరికే తేన మరియు హార్న్‌బిల్ అనే పక్షి ముక్కుల వంటి సహజ ఉత్పత్తులకు బదులుగా వస్తువుల దిగుమతి చేసుకునేవారు.

ఐరోపావాసులు ఈ ప్రాంతానికి క్రైస్తవ మతాన్ని తీసుకొచ్చారు, దీంతో వారి మిషనరీలు కూడా విస్తృతంగా వ్యాపించాయి. థాయ్‌ల్యాండ్ కూడా తమ దేశంలోకి పశ్చిమ దేశాల శాస్త్ర మరియు సాంకేతిక పరిజ్ఞానం ప్రవేశించేందుకు అనుమతించింది.

జపాన్[మార్చు]

రెండో ప్రపంచ యుద్ధం సందర్భంగా, జపాన్ సామ్రాజ్యం దాదాపుగా అన్ని మాజీ పశ్చిమదేశాల కాలనీలను ఆక్రమించింది. షోవా పరిపాలనలో స్థానిక పౌరులపై మనీలా నరమేధం వంటి హింసాత్మక చర్యలు జరిగాయి మరియు జపాన్ ఆక్రమిత ఇండోనేషియాలో రోముషా లుగా పిలిచే 4 నుంచి 10 మిలియన్ల మంది నిర్బంధ కార్మికులు ఉండేవారు, ఈ కాలంలో స్థానిక పౌరుల విషయంలో ఇటువంటి నిర్బంధ కార్మిక వ్యవస్థ అమలు చేయబడింది.[17] ఇండోనేషియాను జపాన్ ఆక్రమించిన కాలంలో కరువు మరియు నిర్బంధ కార్మిక వ్యవస్థ కారణంగా నాలుగు మిలియన్ల మంది పౌరులు మరణించినట్లు తరువాత ఒక UN నివేదిక వెల్లడించింది.[18]

సింగపూర్ నౌకాశ్రయంలో కెపెల్ కంటైనర్ టెర్మినల్.ప్రపంచంలో అత్యంత రద్దీగల ట్రాన్స్‌షిప్‌మెంట్ మరియు కంటైనర్ పోర్ట్‌గా సింగపూర్ నౌకాశ్రయం గుర్తింపుపొందింది, ఆగ్నేయాసియాలో ఇది ముఖ్యమైన నౌకా రవాణా మరియు వాణిజ్య కేంద్రంగా ఉంది.

ప్రస్తుతం[మార్చు]

ఈ ప్రాంతంలో ఎక్కువ దేశాలు సార్వభౌమాధికారాన్ని కలిగివున్నాయి. ప్రజాస్వామ్య రూపాల్లోని ప్రభుత్వం మరియు మానవ హక్కుల వ్యవస్థలు వేళ్లూనుకుంటున్నాయి. వాణిజ్యాన్ని సమగ్రపరిచేందుకు ASEAN ఒక కార్యాచరణ ప్రణాళికను అందించింది.

భూభాగ మరియు సముద్రప్రాంత వివాదాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి, స్ప్రాట్లీ ద్వీపాల విషయంలో తైవాన్, చైనా మరియు ఫిలిప్పీన్స్ మధ్య వివాదం నెలకొనివుంది.

భౌగోళిక పరిస్థితులు[మార్చు]

ఫిలిప్పీన్స్‌లోని మేయోన్ అగ్నిపర్వతం యొక్క ఒక దృశ్యం.

భూగర్భ పరిస్థితినిబట్టి చూస్తే, ప్రపంచంలో అత్యంత చర్యాశీలక అగ్నిపర్వత ప్రాంతాల్లో ఇండోనేషియా ద్వీపసమూహం కూడా ఒకటి. భూగర్భ శక్తులు ఈ ప్రాంతంలో కొన్ని మనోహరమైన పర్వతాలను ఏర్పడేందుకు కారణమయ్యాయి, ఇండోనేషియాలోని పాపువాలో ఉన్న పుంకాక్ జయా 5,030 మీటర్ల (16,024 ft) ఎత్తులో ఉంది, దీనిని న్యూ గినియా ద్వీపంలో చూడవచ్చు, ఆగ్నేయాసియా మొత్తం మీద హిమనీనదం కనిపించే ఒకేఒక్క ప్రదేశం ఇదే కావడం గమనార్హం. ఆగ్నేయాసియాలో ఎత్తైన రెండో పర్వతం మౌంట్ కినాబాలు మలేషియాలోని సబాలో ఉంది, దీనిని బోర్నెయో ద్వీపంలో చూడవచ్చు, దీని ఎత్తు 4,101 మీటర్లు (13,455 ft). ఆగ్నేయాసియాలోనే ఎత్తైన పర్వతం హకాకాబో రాజీ ఉత్తర మయన్మార్‌లో ఉంది, దీని ఎత్తు 5,967 మీటర్లు. పరిమాణపరంగా ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపసమూహంగా ఇండోనేషియా గుర్తించబడింది (CIA వరల్డ్ ఫ్యాక్ట్‌బుక్ ప్రకారం).

సరిహద్దులు[మార్చు]

ఆగ్నేయాసియాకు పొరుగునున్న ఒక ప్రాంతంగా ఆస్ట్రేలియా ఖండం గుర్తించబడుతుంది, ఇది రాజకీయంగా కూడా ఆగ్నేయాసియా దేశాల నుంచి విభజించబడింది. అయితే పాపువా న్యూ గినియా మరియు ఇండోనేషియా ప్రాంతాలైన పాపువా, పశ్చిమ పాపువా మధ్య సాంస్కృతిక సంబంధం ఉంది, ఈ ప్రాంతాలు న్యూ గినియా ద్వీపాన్ని పాపువా న్యూ గినియాతో పంచుకుంటున్నాయి.

వాతావరణ పరిస్థితులు[మార్చు]

ఆగ్నేయాసియాలో ప్రధానంగా ఉష్టమండల వాతావరణ పరిస్థితులు ఉంటాయి మరియు అపార వర్షపాతంతో ఏడాది పొడవునా గాలిలో తేమ ఉంటుంది. గాలులు లేదా రుతుపవనాల కాలిక మార్పు చేత ఆగ్నేయాసియాలో ఒక వర్ష మరియు వేసవి రుతువు ఏర్పడుతుంది. ఉష్ణమండల వర్ష ప్రాంతం కావడంతో రుతుపవన కాలం సందర్భంగా ఇక్కడ అదనపు వర్షపాతం నమోదవుతుంది. ప్రపంచంలో రెండో అతిపెద్ద వర్షారణ్యం ఈ ప్రాంతంలోనే ఉంది (అమెజాన్ ప్రపంచంలో అతిపెద్ద వర్షారణ్యంగా గుర్తించబడింది). ఉత్తర ప్రాంతంలోని పర్వత ప్రదేశాల్లో ఈ తరహా వాతావరణం మరియు వృక్షసంపద కనిపించదు, బాగా ఎత్తైన ప్రదేశాలు కావడంతో ఇక్కడ తక్కువ ఉష్ణోగ్రతలు, పొడి భూస్వరూపం ఉంటుంది. ఇతర భాగాల్లో ఎడారి మాదిరి పరిస్థితులు ఉండటంతో, ఇటువంటి వాతావరణ పరిస్థితులు కనిపించవు.

పర్యావరణం[మార్చు]

నీటి దున్నపోతు.
ఆస్ట్రేలాషియన్ మరియు ఆగ్నేయాసియా జంతుజాలం మధ్య వాలెస్ యొక్క ఊహాజనిత రేఖ.
గ్రేట్ హార్న్‌బిల్ - ఆగ్నేయాసియాకు చెందిన ఒక పక్షి

ఆగ్నేయాసియా మొత్తం వేడి, ఆర్ద్ర ఉష్ణమండల పరిధిలోకి వస్తుంది, సాధారణంగా ఇక్కడి వాతావరణం రుతుపవనాలపై ఎక్కువగా ఆధారపడివుంటుంది. ఆగ్నేయాసియా జంతువుల్లో వైవిద్యం కనిపిస్తుంది; బోర్నెయో మరియు సుమత్రా దీవుల్లో ఓరంగుటాన్ (అడవి మనిషి), ఆసియా ఏనుగు, మలేయన్ పంది, సుమత్రా ఖడ్గమృగం మరియు ముదురు రంగులో ఉండే బోర్నెయా చిరుత పులి వంటి జంతువులను గుర్తించవచ్చు. పాలవాన్ ద్వీపానికి చెందిన ఒక ప్రాంతీయ వ్యాధి ఇప్పుడు ప్రమాదకరంగా ఉన్నప్పటికీ, బింటురోంగ్ లేదా బీర్‌క్యాట్ (ఎలుగుబంటి మాదిరిగా ఉండే పిల్లి)ల్లో ఆరు ఉపజాతులు ఈ ప్రాంతంలో ఉన్నాయి.

ఇప్పటికీ ఉనికి కలిగివున్న బల్లిజాతికి చెందిన అతిపెద్ద జీవిగా కొమొడో డ్రాగన్ గుర్తింపు పొందింది, వీటిని ఇండోనేషియాలోని కొమొడో, రింకా, ఫ్లోరెస్ మరియు గిలి మోటాంగ్ ద్వీపాల్లో గుర్తించవచ్చు.

ఆసియా అడవి దున్నపోతు, వివిధ ద్వీపాల్లో కనిపించే అనోవా వంటి మరగుజ్జు జాతి గేదెలు ఒకప్పుడు ఆగ్నేయాసియా మొత్తం విస్తరించివుండేవి, ఇప్పుడు పెంపుడు ఆసియా గేదెలు ఈ ప్రాంతం మొత్తం కనిపిస్తున్నాయి, అయితే వీటితో అనుబంధం ఉన్న జీవులు మాత్రం అరుదుగా మరియు అంతరించిపోయే ప్రమాదపు అంచుల్లో ఉన్నాయి.

చుంచెలుక మాదిరిగా ఉండే జింకలను సుమత్రా, బోర్నెయో మరియు పాలవాన్ ద్వీపాల్లో గుర్తించవచ్చు, ఈ జింకలు బొమ్మ కుక్క లేదా పిల్లి పరిమాణంలో ఉంటాయి. ఇండోచైనా ప్రాంతంలో గౌర్‌ను గుర్తించవచ్చు, అడవి దున్నపోతు కంటే ఎక్కువ పరిమాణంలో ఉండే అడవి ఎద్దును ఈ పేరుతో పిలుస్తారు.

ఫీఫౌల్ (నెమిలి జాతికి చెందిన పక్షి) మరియు డ్రాంగో వంటి పక్షులు ఈ ఉపప్రాంతంలో ఇండోనేషియా వరకు కనిపిస్తుంటాయి. బాబిరుసాను, నాలుగు-కొమ్ములుండే పంది, ఇండోనేషియాలో కూడా గుర్తించవచ్చు. ముక్కు ద్వారా బాగా ప్రాచుర్యం పొందిన హార్న్‌బిల్ అనే పక్షిని చైనాతో వాణిజ్యంలో ఉపయోగించేవారు. ఖడ్గమృగాల కొమ్ముకు చైనాలో బాగా విలువ ఉండేది, ఈ కొమ్ము దాని యొక్క కపాలంలో భాగంగా ఉండదు.

ఇండోనేషియా ద్వీపసమూహం వాలెస్ రేఖతో వేరుచేయబడి ఉంటుంది. టెక్టానిక్ పళ్లెం సరిహద్దు వెంబడి ఈ రేఖ ఉంటుంది, ఇది ఆస్ట్రేలియా (తూర్పు) జాతుల నుంచి ఆసియా (పశ్చిమ) జాతులను వేరు చేస్తుంది. జావా/బోర్నెయో మరియు పాపువా ద్వీపాలు మధ్య ఒక మిశ్రమ మండలం ఏర్పాటయింది, ఇక్కడ రెండు రకాల జాతులు కలిసివుంటాయి, దీనిని వాలెసియాగా గుర్తిస్తారు. అభివృద్ధి ఊపందుకోవడం మరియు జనాభా విస్తరణలు ఆగ్నేయాసియాలో కొనసాగుతుండటంతో, ఈ ప్రాంత పర్యావరణంలో మానవ కార్యకలాపాల ప్రభావంపై ఆందోళన పెరుగుతోంది. అయితే ఆగ్నేయాసియాలోని గణనీయమైన భూభాగంలో, వన్యప్రాణాలు సహజావరణంలో పెద్దగా ఎటువంటి మార్పులు చోటుచేసుకోలేదు, ఇప్పటికీ యథాతథ పరిస్థితులు కొనసాగుతున్నాయి. కొన్ని మినహా, ఈ ప్రాంతంలోని దేశాలన్నీ, భూమి కోతను అడ్డుకోవడం కోసమే మాత్రమే కాకుండా, వృక్షజాలం మరియు జంతుజాలం యొక్క వైవిద్యాన్ని సంరక్షించాల్సిన అవసరంపై అవగాహనపై కలిగివున్నాయి. ఉదాహరణకు, ఇండోనేషియా దీని కోసం జాతీయ పార్కులు మరియు సంరక్షణ కేంద్రాలతో కూడిన ఒక విస్తృతమైన వ్యవస్థను సృష్టించింది. అయినప్పటికీ, జావా ఖడ్గమృగాలు వంటి జీవులు అంతరించిపోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి, పశ్చిమ జావా ప్రాంతంలో కేవలం చేతి వేళ్లపై లెక్కించదగిన ఖడ్గమృగాలు మాత్రమే మిగిలివున్నాయి.

ప్రపంచ సాగర పర్యావరణ వ్యవస్థల్లో అత్యధిక స్థాయి జీవవైవిద్యం కలిగివున్న ప్రదేశాలుగా ఆగ్నేయాసియా పగడపు దిబ్బలు ఉన్న మడుగులు గుర్తింపుపొందాయి, వీటిలో పగడపు జీవులు, చేపలు మరియు గవ్వజీవులు విస్తారంగా ఉన్నాయి. కన్జర్వేషన్ ఇంటర్నేషనల్, సాగర అధ్యయనాలు భూమిమీద అత్యంత సాగర జీవవైవిద్యం ఉన్న ప్రదేశంగా రాజా అంపాత్ ప్రాంతాన్ని గుర్తించినట్లు తెలియజేసింది.[1] ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ మరియు పాపువా న్యూ గినియాలతో కూడిన పగడపు త్రిభుజంలో కనిపించే వైవిద్యం ప్రపంచంలోని ఇతర ప్రదేశాల కంటే బాగా ఎక్కువగా ఉంటుంది. ప్రపంచపు పగడపు దిబ్బల జీవవైవిద్యానికి పగడపు త్రిభుజం గుండె మాదిరిగా ఉంటుంది, ఈ కారణంగానే ప్రపంచంలోని పగడపు దిబ్బ పర్యావరణవ్యవస్థల్లో అత్యంత వైవిద్యం కలిగిన ప్రదేశంగా రాజా అంపాత్ గుర్తించబడింది. ప్రపంచంలో అతిపెద్ద చేపగా గుర్తించబడిన తిమింగిలపు సొరచేప మరియు ఆరు తాబేలు జాతులను దక్షిణ చైనా సముద్రం మరియు ఫిలిప్పీన్స్ యొక్క ఫసిఫిక్ మహాసముద్ర ప్రాంతాల్లో గుర్తించవచ్చు.


ఈ ప్రాంతంలో కనిపించే చెట్లు మరియు ఇతర మొక్కలు ఉష్ణమండలాల్లో మాదిరిగానే ఉంటాయి; పర్వతాలు బాగా ఎత్తుగా ఉన్న కొన్ని దేశాల్లో సమశీతోష్ణ ఉద్భిజ్జ సంపదను గుర్తించవచ్చు. ఈ ప్రాంతంలోని వర్షారణ్య ప్రాంతాల్లో చెట్లు ఇప్పుడు నరికివేయబడుతున్నాయి, ముఖ్యంగా బోర్నెయోలో ఈ పరిస్థితి నెలకొనివుంది.

వృక్షజాలం మరియు జంతుజాలం విషయంలో ఆగ్నేయాసియా సమృద్ధిగా ఉన్నప్పటికీ, ఈ ప్రాంతం తీవ్రమైన అటవీనిర్మూలన సమస్యను ఎదుర్కొంటుంది, దీని వలన ఓరంగుటాన్ మరియు జావా పులి వంటి వివిధ అంతరించిపోయే ప్రమాదం ఎదుర్కొంటున్న జాతులు సహజావరణం కోల్పోతున్నాయి. 21వ శతాబ్దంలో ఆగ్నేయాసియాలోని 40% పైగా జంతు మరియు వృక్ష జాతులు అంతరించిపోతాయని అంచనాలు వేశారు.[19] ఇదే సమయంలో, పొగమంచు రోజూ కనిపిస్తుంది. ఈ ప్రాంతంలో బాగా ఎక్కువగా పొగమంచు ఆవరించిన సంఘటనలు 1997 మరియు 2006 సంవత్సరాల్లో నమోదయ్యాయి, ఈ సందర్భంగా కొన్ని దేశాలు దట్టమైన పొగమంచులో చిక్కుకపోయాయి, ఇండోనేషియాలో చెట్లు నరికివేత మరియు కాల్చివేత కార్యకలాపాలు దీనికి ప్రధాన కారణంగా గుర్తించారు. దీనికి స్పందనగా, పొగమంచు కాలుష్యాన్ని నిరోధించేందుకు, ఆగ్నేయాసియాలోని అనేక దేశాలు ASEAN అగ్రిమెంట్ ఆన్ ట్రాన్స్‌బౌండరీ హేజ్ పొల్యూషన్‌పై సంతకం చేశాయి.

ఆర్థిక వ్యవస్థ[మార్చు]

మనీలాలోని ఆర్టిగాస్ సెంటర్, ఇక్కడ ఆసియా అభివృద్ధి బ్యాంకు ప్రధాన కార్యాలయం ఉంది.

ఐరోపా దేశాలు ఈ ప్రాంతంపై దృష్టి పెట్టకముందే, ఆగ్నేయాసియా ప్రపంచ వాణిజ్య వ్యవస్థలో కీలక భాగంగా ఉండేది. రైక్యో సామ్రాజ్యం తరచుగా ఆగ్నేయాసియా ప్రాంతంతో సముద్ర వాణిజ్యం సాగించింది. ఈ ప్రాంతానికి చెందిన విస్తృతమైన వస్తు సంపదకు, ముఖ్యంగా మిరియాలు, అల్లం, లవంగాలు మరియు జాజికాయలు వంటి సుగంధ ద్రవ్యాలకు ఎక్కువ గిరాకీ ఉండేది. సుగంధ ద్రవ్యాల వ్యాపారాన్ని మొదట భారతీయ మరియు అరబ్బు వ్యాపారాలు అభివృద్ధి చేశారు, అయితే ఈ వ్యాపారం ఐరోపావాసులను కూడా ఈ ప్రాంతానికి తీసుకొచ్చింది. మొదట స్పెయిన్ దేశీయులు (మనీలా గెలోన్) మరియు పోర్చుగీసువారు, తరువాత డచ్‌వారు, చివరకు బ్రిటీష్ మరియు ఫ్రెంచ్ దేశీయులు వివిధ దేశాలతో ఈ వ్యాపారం ప్రారంభించారు. వ్యాపార కార్యకలాపాల రక్షణ మరియు విస్తరణకు వ్యాపారులు తమ ఆధిపత్య పరిధిని విస్తరించుకోవడానికి ప్రయత్నించడంతో, ఐరోపా వ్యాపార ఆసక్తులు క్రమక్రమంగా చివరకు భూభాగాల ఆక్రమణకు దారితీశాయి. దీని ఫలితంగా, డచ్‌వారు ఇండోనేషియాలోకి, బ్రిటీష్‌వారు మలేయా మరియు ఫ్రెంచ్ దేశీయులు ఇండోచైనాలోకి ప్రవేశించారు.

ఈ ప్రాంత ఆర్థిక వ్యవస్థ ఎక్కువగా వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉంది, వస్తు తయారీ మరియు సేవా రంగాలు కూడా కీలకంగా మారుతున్నాయి. అభివృద్ధి చెందుతున్న విఫణి, ఇండోనేషియా ఈ ప్రాంతంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా గుర్తింపు పొందింది. ఫిలిప్పీన్స్, మలేషియా మరియు థాయ్‌ల్యాండ్ దేశాలు కొత్తగా పారిశ్రామీకరణ చెందిన దేశాల పరిధిలోకి వస్తాయి, ఇదిలా ఉంటే సింగపూర్ మరియు బ్రూనే ధనిక అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలుగా గుర్తింపు పొందాయి. మిగిలిన ఆగ్నేయాసియా ప్రాంతం ఇప్పటికీ వ్యవసాయంప ఆధారపడివుంది, అయితే వియత్నాం మాత్రం పారిశ్రామిక రంగాల్లో నెమ్మదిగా గణనీయమైన పురోగతి సాధిస్తోంది. ఈ ప్రాంతం ప్రధానంగా వస్త్రాలు, మైక్రోప్రాసెసర్లు వంటి ఎలక్ట్రానిక్ హై-టెక్ వస్తువులు, ఆటోమొబైల్స్ వంటి భారీ పారిశ్రామిక ఉత్పత్తులను తయారు చేస్తోంది. ఈ ప్రాంతంలో చమురు నిక్షేపాలు కూడా ఉన్నాయి.

ఆగ్నేయాసియా- U.S.ను కలుపుతూ సముద్రగర్భంలో కొత్త కేబుల్‌ను ఏర్పాటు చేసేందుకు పదిహేడు టెలీకమ్యూనికేషన్ కంపెనీలు ఒప్పందం కుదుర్చుకున్నాయి.[20] ఇటీవల భూకంపం కారణంగా తైవాన్ నుంచి U.S.కు సముద్రగర్భంలో ఉన్న కేబుల్ తెగిపోవడంతో ఏర్పడిన అవాంతరాన్ని నిరోధించేందుకు ఈ ప్రాజెక్టు చేపట్టారు.

అనేక ఆగ్నేయాసియా దేశాలు, ముఖ్యంగా కాంబోడియా ఆర్థికాభివృద్ధిలో పర్యాటక రంగం ప్రధాన పాత్ర పోషిస్తోంది. UNESCO ప్రకారం, "పర్యాటకం, సరిగా పరిగణలోకి తీసుకుంటే, అద్భుతమైన అభివృద్ధి సాధనం మరియు భూమి యొక్క సాంస్కృతిక వైవిద్యాన్ని పరిరక్షించే సమర్థవంతమైన సాధనంగా ఉపయోగపడుతుంది."[21] 1990వ దశకం ప్రారంభం నుంచి, "కాంబోడియా, లావోస్, వియత్నాం మరియు మయన్మార్ వంటి పర్యాటకం నుంచి బాగా తక్కువ ఆదాయం పొందుతున్న ASEAN యేతర దేశాలు కూడా సొంత పర్యాటక పరిశ్రమలను విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నాయి.”[22] 1995లో, సింగపూర్ పర్యాటక రంగంలో ప్రాంతీయ రారాజుగా ఉంది, దీని యొక్క GDPలో పర్యాటక రంగం వాటా 8% పైగా ఉంది. 1998నాటికి, సింగపూర్ యొక్క GDPలో పర్యాటక రంగం వాటా 6%నికి పరిమితమైంది, ఇదిలా ఉంటే థాయ్‌ల్యాండ్ మరియు లావో PDRల GDPలో ఈ రంగం వాటా 7% పైగా నమోదయింది. 2000 నుంచి, కాంబోడియా మిగిలిన అన్ని ASEAN దేశాలను ఈ విషయంలో వెనక్కునెట్టింది, కాంబోడియా 2006 GDPలో పర్యాటక రంగం వాటా దాదాపుగా 15%గా నమోదయింది.[23]

జనాభా గణన[మార్చు]

ఆగ్నేయాసియాలోని దేశాలు మరియు ఇండోనేషియాలోని ద్వీపాల మధ్య జనాభా పంపిణీని చూపించే పీ చార్టు

ఆగ్నేయాసియా సుమారుగా 4,000,000 km² (1.6 మిలియన్ చదరపు మైళ్లు) వైశాల్యం కలిగివుంది. 2004నాటికి, 593 మిలియన్ల మందికిపైగా ప్రజలు ఈ ప్రాంతంలో నివసిస్తున్నారు, వీరిలో ఐదో వంతుకుపైగా ప్రజలు (125 మిలియన్లు) ఇండోనేషియాలోని జావా ద్వీపంలో నివసిస్తున్నారు, ప్రపంచంలో అత్యధిక జనసాంద్రత కలిగిన ద్వీపంగా ఇది గుర్తించబడింది. ఈ ప్రాంతంలో అత్యధిక జనాభా కలిగిన దేశం ఇండోనేషియా, ఈ దేశంలో 230 మిలియన్ల మంది పౌరులు నివసిస్తున్నారు, ప్రపంచంలో అత్యంత జనాభా కలిగిన దేశాల్లో ఇండోనేషియా 4వ స్థానంలో ఉంది. ఆగ్నేయాసియాలో మతాలు మరియు ప్రజల మధ్య వైవిద్యం ఉంటుంది, దేశదేశానికి ఇవి మారుతుంటాయి. సుమారుగా 30 మిలియన్ల మంది విదేశాల్లో ఉంటున్న చైనీయులు ఆగ్నేయాసియాలో ఉంటున్నారు, వీరిలో ఎక్కువ మంది క్రిస్మస్ ద్వీపం, మలేషియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, ఇండోనేషియా, థాయ్‌ల్యాండ్ మరియు వియత్నాంలోని హోవాల్లో నివసిస్తున్నారు.

జాతి సమూహాలు[మార్చు]

ఇటీవలి స్టాన్‌ఫోర్డ్ జన్యు అధ్యయనం ప్రకారం, ఆగ్నేయాసియా యొక్క జనాభా సజాతీయతకు చాలా దూరంగా ఉంది. ఆస్ట్రోనేషియన్, థాయ్ మరియు కాంశ్య యుగం మరియు ఇనుప యుగం సందర్భంగా దక్షిణ చైనా నుంచి వలస వచ్చిన మోన-ఖ్మెర్- మాట్లాడే వలసదాసరుల సంతతికి చెందినవారు ఈ ప్రాంతంలో ఎక్కువ మంది ఉన్నప్పటికీ, అరబ్బు, చైనీయులు, భారత, పాలీనేషియన్ మరియు మెలనేషియన్ సంతతికి చెందిన ప్రజలు కూడా ఇక్కడి ప్రజల్లో కనిపిస్తారు.

స్థానిక ఆగ్నేయ ఆసియన్లు మరియు చైనీయులు సంతతికి చెందినవారి మధ్య వివాహాల కారణంగా జన్మించిన పౌరులు కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. వియత్నాం, సింగపూర్, థాయ్‌ల్యాండ్ మరియు ఫిలిప్పీన్స్ వంటి దేశాల్లో వీరు గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. ఇండోనేషియా మరియు మలేషియా దేశాల్లో కూడా కొన్ని మిశ్రమ ఆగ్నేయ ఆసియా-చైనీయుల జనాభాలు ఉన్నాయి.

ఎటి మహిళ. ఆగ్నేయాసియాలో నివసించిన పురాతన మానవజాతుల్లో ఈ నీగ్రిటో జాతులు కూడా ఉన్నాయి.

ప్రధాన భూభాగంలోని కాంబోడియాలో ఖ్మెర్ పౌరులు ఇప్పటికీ పారెయోన్ సంతితికి చెందినవారుగా ఉన్నారు. ఇదే విధంగా, మయన్మార్ మరియు థాయ్‌ల్యాండ్ దేశాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోన్ సమూహాలకు చెందిన కొద్ది మంది పౌరులు ఉన్నారు; టిబెటో-బర్మన్ మరియు థాయ్, లావో మరియు షాన్ పౌరులతో కూడా ఈ ప్రాంతంలో జాతి వైవిద్యం సృష్టించబడింది. సమకాలీన వియత్నాం జనాభా ఉత్తరాన ఉన్న ఎర్ర నది ప్రాంతం నుంచి ఉద్భవించింది, వీరు థాయ్ మరియు మాలే పౌరుల మిశ్రమజాతి కావొచ్చు.[ఉల్లేఖన అవసరం] ఈ ప్రధాన జాతి సమూహాలతోపాటు, మయన్మార్‌లోని కారెన్స్, చిన్స్ మరియు నాగాస్ వంటి ఇతర ఆసియా పౌరులతో దాయాదిత్వాలు గల అనేక చిన్న జాతుల పౌరులు కూడా ఈ ప్రాంతంలో ఉన్నారు. ఆగ్నేయాసియా ద్వీపసంబంధ భూభాగంలో, ప్రోటో-మాలే (నెసియోట్) వారసులు మరియు మలేయో-పాలినేషియన్ మరియు ఇతర సమూహాలతో ప్రభావితమైన పారెయోన్ ప్రజల మిశ్రమ జాతీయులు నివసిస్తున్నారు. అంతేకాకుండా, అరబ్బులు, భారతీయులు మరియు చైనీయులు కూడా ఈ ద్వీపాల్లో జాతి శ్రేణిని ప్రభావితం చేశారు.

ఆధునిక రోజుల్లో, ఆగ్నేయాసియాలో అతిపెద్ద జాతి సమూహంగా జావావాసులు గుర్తింపు పొందారు, ఈ జాతి సమూహంలో 86 మిలియన్ల మంది పౌరులు ఉన్నారు, వీరిలో ఎక్కువ మంది ఇండోనేషియాలోని జావా ద్వీపంలో ఉన్నారు. మయన్మార్‌లో, బర్మనీయులు దేశ జనాభాలో మూడింట రెండు వంతుల మంది ఉన్నారు, థాయ్ జాతీయులు మరియు వియత్నాం జాతీయులు ఆయా దేశాల్లో ఐదింట నాలుగు వంతుల మంది ఉన్నారు. ఇండోనేషియాలో నిస్సందేహంగా జావనీయులు మరియు సుండనీయుల జాతి సమూహాలు ఆధిపత్యం కలిగివున్నారు, మలేషియాలో మాత్రం మాలేయులు మరియు చైనీయులు దాదాపుగా సమానంగా ఉన్నారు. ఫిలిప్పీన్స్‌లో, టాగాలోగ్, సెబువానో, ఐలోకానో మరియు బీకాల్ జాతీయులు గణనీయమైన సంఖ్యలో ఉన్నారు.

మతాలు[మార్చు]

థాయ్‌ల్యాండ్‌లోని చియాంగ్ మాయ్‌లోని థాయ్ థీరవేదా బౌద్ధ మతస్థులు

ఆగ్నేయాసియాలో ఇస్లాం మతం ఎక్కువగా ఆచరించబడుతోంది, సుమారుగా 240 మిలియన్ల మంది ఈ మతాన్ని ఆచరిస్తున్నారు, ఈ ప్రాంతం మొత్తం జనాభాలో వీరు సుమారుగా 40% ఉన్నారు, బ్రూనే, ఇండోనేషియా మరియు మలేషియా దేశాల్లో వీరు ఆధిపత్యం కలిగి ఉన్నారు. ఆగ్నేయాసియాలోని దేశాల్లో అనేక మత విశ్వాసాలు ఆచరణలో ఉన్నాయి. ఆగ్నేయాసియా ప్రధాన భూభాగంలోని దేశాలు, అంటే థాయ్‌ల్యాండ్, కాంబోడియా, లావోస్, మయన్మార్ మరియు వియత్నాం దేశాల్లో ఎక్కువ మంది ప్రజలు బౌద్ధమతాన్ని ఆచరిస్తున్నారు. సింగపూర్‌లో కూడా ఎక్కువ మంది పౌరులు బౌద్ధమతాన్నే పాటిస్తున్నారు. వియత్నాం మరియు సింగపూర్ దేశాల్లో పూర్వికుల ఆరాధన మరియు కాన్‌ఫ్యూసియనిజం కూడా విస్తృతంగా ఆచరించబడుతున్నాయి. సముద్రప్రాంత ఆగ్నేయాసియాలోని, మలేషియా, పశ్చిమ ఇండోనేషియా, బ్రూనే ప్రాంతాల్లో ప్రజలు ప్రధానంగా ఇస్లాం మతాన్ని ఆచరిస్తున్నారు. ఫిలిప్పీన్స్, తూర్పు ఇండోనేషియా, తూర్పు తైమోర్ ప్రాంతాల్లో క్రైస్తవ మతస్థులు కూడా ఎక్కువ మంది ఉన్నారు. ఫిలిప్పీన్స్‌లో అతిపెద్ద రోమన్ కాథలిక్ జనాభా ఉంది, వియత్నాలో కూడా కొద్ది స్థాయిలో వీరి జనాభా ఉంది. పోర్చుగీసు పాలనా చరిత్ర వలన, తూర్పు తైమోర్ ప్రాంతంలో కూడా రోమన్ కాథలిక్కులు ఆధిపత్యం కలిగి ఉన్నారు.

ప్రతి దేశంలోనూ మతపరమైన మేళనము ఈ కింది విధంగా ఉంది. కొన్ని విలువలను CIA వరల్డ్ ఫ్యాక్ట్‌బుక్ నుంచి సేకరించబడ్డాయి:[24]

కాంబోడియా మూఢ విశ్వాసాలకు సంబంధించిన పవిత్రమైన హిందూ ఆరాధన విగ్రహాలు మరియు ఇతర సరంజామా.

ఆగ్నేయాసియాలో మతాలు మరియు ప్రజల మధ్య భిన్నత్వం కనిపిస్తుంది, ఏ దేశంలోనూ ఏకరీతి కనిపించదు. ప్రపంచంలో అత్యధిక ముస్లిం జనాభా కలిగిన దేశంగా గుర్తింపు పొందిన ఇండోనేషియాలోని బాలీ వంటి ద్వీపాల్లో హిందూమతం ఆధిపత్యం కలిగివుంది. ఫిలిప్పీన్స్, న్యూ గినియా మరియు తైమోర్ ప్రాంతాల్లో క్రైస్తవ మతం ఆధిపత్యం కలిగివుంది. సింగపూర్, మలేషియా తదితర దేశాల్లో కూడా హిందూ జనాభాను గుర్తించవచ్చు. థాయ్‌ల్యాండ్ మరియు ఇండోనేషియా దేశాల జాతీయ చిహ్నాల్లో గరుడ పక్షి (సంస్కృతం: గరుడ) ఉంటుంది, ఇది విష్ణువు యొక్క వాహనం; ఫిలిప్పీన్స్‌లోని పాలవాన్‌లో గరుడ పక్షి యొక్క బంగారు ప్రతిమలు గుర్తించారు; మిండానోవాలో ఇతర హిందూ దేవుళ్లు మరియు దేవతల బంగారు ప్రతిమలు కూడా గుర్తించబడ్డాయి. బాలీ ద్వీపంలో పాటించే హిందూ మతాచారాలు మిగిలిన ప్రాంతాల్లో ఆచరణలో ఉన్న హిందూ ఆచారాలకు కొంతవరకు భిన్నంగా ఉన్నాయి, సర్వాత్వవాద భావనలు, స్థానిక సంస్కృతి ఇక్కడ హిందూ మతంలో కలిసిపోయి ఉంటాయి. ప్రస్తుత హిందూ ఆచారాలు కాంబోడియాలో మాత్రం ఆచరణలో ఉన్నాయి, పూర్వకాలంనాటి శక్తివంతమైన ఖ్మెర్ సామ్రాజ్యంలో మూలాలు కలిగిన బౌద్ధమతానికి చెందిన అనేక ప్రత్యేక సందర్భాలు, ప్రార్థనలు మరియు విశ్వాసాలు ఇక్కడి హిందూ మతంలో కలిసిపోయి ఉంటాయి. ఆగ్నేయాసియావ్యాప్తంగా క్రైస్తవ మతాన్ని కూడా గుర్తించవచ్చు; తూర్పు తైమోర్ మరియు ఫిలిప్పీన్స్‌లో ఈ మతస్థులు ఆధిపత్య సంఖ్యలో ఉన్నారు, ఆసియాలో అతిపెద్ద క్రైస్తవ దేశంగా ఫిలిప్పీన్స్ గుర్తింపు పొందింది. అంతేకాకుండా, తూర్పు మలేషియాలోని సరావాక్ మరియు తూర్పు ఇండోనేషియాలోని పాపువా వంటి మారుమూల ప్రాంతాల్లో పురాతన గిరిజన మతాచారాలు ఇప్పటికీ వాడుకలో ఉన్నాయి. మయన్మార్‌లో, సక్కా (ఇంద్రుడు) ఒక దేవుడిగా పూజించబడుతున్నాడు. వియత్నాంలో, మలేషియా బౌద్ధమతం ఆచరణలో ఉంది, ఈ బౌద్ధమతం స్థానిక సర్వాత్మవాదంతో మిళితమై ఉంటుంది, ఇందులో పూర్విక ఆరాధనకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.

 Brunei ఇస్లాం (67%), బౌద్ధ మతం (13%), క్రైస్తవ మతం (10%), ఇతరాలు (స్థానిక విశ్వాసాలు, తదితరాలు) (10%)
 Burma థీరవేదా బౌద్ధ మతం (89%), ఇస్లాం (4%), క్రైస్తవ మతం (4%), సర్వాత్మవాదం (1%), ఇతరాలు (2%)
 Cambodia థీరవేదా బౌద్ధ మతం (95%), ఇస్లాం, క్రైస్తవ మతం, సర్వాత్మవాదం ఇతరాలు (5%)
 Christmas Island బౌద్ధ మతం (36%), ఇస్లాం (25%), క్రైస్తవ మతం (18%), టావోయిజం (15%), ఇతరాలు (6%)
 Cocos (Keeling) Islands సున్నీ ఇస్లాం (80%), ఇతరాలు (20%)
 East Timor రోమన్ కాథలిక్కులు (90%), ఇస్లాం (5%), ప్రొటెస్టంట్‌లు (3%), ఇతరాలు (బౌద్ధ మతం, హిందూ మతం, తదితరాలు) (2%)
 Indonesia ఇస్లాం (86.1%), ప్రొటెస్టంట్ (5.7%), రోమన్ కాథలిక్కులు (3%), హిందూ మతం (1.8%), ఇతరాలు బౌద్ధ మతం, లేదా నిర్దేశించి చెప్పబడని మతాచారాలు (3.4%)[25]
 Laos థీరవేదా బౌద్ధమతం (65%) సర్వాత్మవాదం (32.9%), క్రైస్తవ మతం (1.3%), ఇతరాలు (0.8%)
 Malaysia ఇస్లాం (60.4%), మహాయాన బౌద్ధ మతం (19.2%), క్రైస్తవ మతం (9.1%), హిందూ మతం (6.1%), సర్వాత్మవాదం (5.2%)
 Papua New Guinea రోమన్ కాథలిక్కులు (27%), ఎవాంగెలికల్ లూథెరాన్ (20%), యునైటెడ్ చర్చ్ (12%), సెవెంత్-డే ఎడ్వెంటిస్ట్ చర్చ్ (10%), పెంటెకోస్టల్ (9%), ఎవాంగెలికల్ (7%), ఆంగ్లికన్ (3%), ఇతర క్రైస్తవ విశ్వాసాలు (8%), ఇతరాలు (4%)
 Philippines రోమన్ కాథలిక్కులు (80%), ఇస్లాం (5%), ఎవాంగెలికల్ (2.8%), ఐగ్లెసియా ని క్రిస్టో (2.2%), ఫిలిప్పీన్ ఇండిపెండెంట్ చర్చ్ (అగ్లిపాయన్) (2%), ఇతర క్రైస్తవ విశ్వాసాలు (3%), ఇతరాలు (సంప్రదాయ విశ్వాసాలు, బౌద్ధ మతం, జుడాయిజం, మతేతర విశ్వాసాలు, తదితరాలు) (5%)
 Singapore బౌద్ధ మతం (42.5%), ఇస్లాం (15%), టావోయిజం (8%), రోమన్ కాథలిక్కులు (4.5%), హిందూ మతం (4%), మతేతర విశ్వాసాలు (15%), క్రైస్తవ మతం (10%), ఇతరాలు (1%)
దక్షిణ చైనా సముద్ర ద్వీపాలు బౌద్ధ మతం, క్రైస్తవ మతం, కాన్‌ఫ్యూసియనిజం, ఇస్లాం, టావోయిజం, మతేతర విశ్వాసాలు
 Thailand థీరవేదా బౌద్ధ మతం (94.6%), ఇస్లాం (4.6%), ఇతరాలు (1%)
 Vietnam మహాయాన బౌద్ధ మతం (81%), రోమన్ కాథలిక్కులు (5%), థీరవేదా బౌద్ధ మతం (2%), కావో డాయ్ (1%), ప్రొటెస్టంట్ (1%), ఇతరాలు (సర్వాత్మవాదం, హోవా హావో, ఇస్లాం, మతేతర విశ్వాసాలు, ఇతరాలు; 10%)

భాషలు[మార్చు]

వాణిజ్యం మరియు చారిత్రక కాలనీల ఏర్పాటు కారణంగా సాంస్కృతిక ఒత్తిళ్ల చేత ఆగ్నేయాసియాలోని ప్రతి భాష ప్రభావితమైంది. ఉదాహరణకు, ఫిలిప్పీన్ దేశీయులు, ఆంగ్లం, ఫిలిపినో భాషల్లో విద్యావంతులై ఉంటారు, వీటితోపాటు వారి ఒక మాతృ భాష (ఉదాహరణకు, విసయాన్)ను, చారిత్రక కారణాల వలన స్పానిష్ వంటి లేదా ఆర్థిక కారణాల వలన చైనీస్, కొరియన్ లేదా జపనీస్ వంటి మరో ఇతర భాషను కూడా వారు బాగా మాట్లాడగలరు; మలేషియా దేశస్థులు ఆంగ్లం, చైనీస్, ద్వితీయ భాషగా తమిళం మరియు మాలే భాషలను బాగా మాట్లాడగలరు.

ఆగ్నేయాసియా దేశాల్లో భాషా మిశ్రయం ఈ కింది విధంగా ఉంటుంది: (అధికారిక భాషలు మందమైన అక్షరాల్లో ఉన్నాయి.)

అండమాన్, నికోబార్ ద్వీపాలు నికోబారీస్, బెంగాలీ, ఆంగ్లం, హిందీ, మలయాళం, పంజాబీ, తమిళం, తెలుగు, షోంపెన్, అండమానీస్ భాషలు, ఇతరాలు
బ్రూనే మాలే, ఆంగ్లం, చైనీస్, స్థానిక బ్రూనేయన్ మాండలికాలు[26]
కాంబోడియా ఖ్మెర్, ఆంగ్లం, ఫ్రెంచ్, వియత్నమీస్, థాయ్, ఛామిక్ మాండలికాలు, చైనా భాషలు, ఇతరాలు[27]
క్రిస్మస్ ద్వీపం ఆంగ్లం, చైనా భాష, మాలే[28]
కాకోస్ (కీలింగ్) ద్వీపాలు ఆంగ్లం, కాకోస్ మాలే[29]
తూర్పు తైమోర్ తెటుమ్, పోర్చుగీసు, ఇండోనేషియా భాష, ఆంగ్లం, మాంబీ, మకాసే, టుకుడెడ్, బునాక్, గాలోలీ, కెమాక్, ఫాతలుకు, బైకెనో, ఇతరాలు[30]
ఇండోనేషియా ఇండోనేషియా భాష, ఎసెహనీస్, బాతక్, మినాంగ్, సుండనీస్, జావనీస్, బెంజరీస్, ససాక్, తెటుమ్, డయాక్, మినాహసా, తోరజా, బుంగినీస్, హాల్మాహెరా, అంబోనీస్, సెరామెస్; ఆంగ్లం, డచ్, పాపువాన్ భాషలు, చైనీస్, ఇతరాలు[31]
లావోస్ లావో, థాయ్, వియత్నమీస్, మోంగ్, మియావో, మియాన్, డావో, షాన్; ఫ్రెంచ్, ఆంగ్లం ఇతరాలు[32]
మలేషియా మాలే, ఆంగ్లం, మాండరిన్, చైనీయుల మాండలికాలు, భారతీయ భాషలు, సారావాకియన్ మరియు సాబహాన్ భాషలు, ఇతరాలు[33]
మయన్మార్ (బర్మా) బర్మనీస్, షాన్, కారెన్, రాఖీన్, కాచిన్, చిన్, మోన్, చైనీస్ భాషలు, భారతీయ భాషలు, ఇతరాలు
ఫిలిప్పీన్స్ ఫిలిపినో, ఆంగ్లం, టాగోలోగ్, సెబువానో, ఐలోకానో, హిలిగాయ్నోన్/ఐలోంగో, బికోల్, వారే, కాపంపాంగన్, పాంగసినాన్, ఇతరాలు[34]
సింగపూర్ ఆంగ్లం, మాండరిన్, మాలే, తమిళం, ఇతర చైనా భాషలు, ఇతర భారతీయ భాషలు, అరబిక్ మాండలికాలు, ఇతరాలు
దక్షిణ చైనా సముద్ర ద్వీపాలు ఆంగ్లం, ఫిలిపినో, మాలే, మాండరిన్ (చైనీస్), వియత్నమీస్
థాయ్‌ల్యాండ్ థాయ్, ఆంగ్లం, చైనీయుల భాషలు, మాలే, లావో, ఖ్మెర్, ఇసాన్, షాన్, ల్యూ, ఫుటాయ్, మోన్, మెయిన్, మోంగ్, కారెన్, బర్మా భాషలు, ఇతరాలు [35]
వియత్నాం వియత్నమీస్, ఆంగ్లం, చైనా భాషలు, ఫ్రెంచ్, ఖ్మెర్, పర్వత ప్రాంత భాషలు (మోన్-ఖ్మెర్ మరియు మలేయో-పాలినేషియన్, మోంగ్)[36]

సంస్కృతి[మార్చు]

ఫిలిప్పీన్స్‌లోని లుజోన్ ద్వీపంలో ఉన్న బానౌ వరి మడులు.

ఆగ్నేయాసియాలో వరి మడి వ్యవసాయం వేలాది సంవత్సరాలుగా జరుగుతుంది, ఈ ఉపప్రాంతం మొత్తం ఈ పంటను పండిస్తున్నారు. ఈ వరి మడులకు సంబంధించిన కొన్ని నాటకీయ ఉదాహరణలు ఫిలిప్పీన్స్‌లోని లుజోన్ పర్వతాలపై బానౌ వరి మడులు సృష్టించేందుకు దారితీశాయి. ఈ వరి మడుల సాగు ఎక్కువ కర్షక-శ్రమతో కూడుకొని ఉండేది. ఈ ప్రాంతంలోని రుతుపవన వాతావరణం వరి మడులకు బాగా అనుకూలంగా ఉంటుంది.

థాయ్‌ల్యాండ్ మరియు లావోస్ నుంచి బోర్నెయో, ఫిలిప్పీన్స్‌లోని లుజోన్ వరకు, పాపువా న్యూ గినియా వరకు, అంటే దాదాపుగా ఆగ్నేయాసియా మొత్తం స్టిల్ట్ హౌస్‌లు (భూమిపై లేదా నీటిలో కొయ్యలు లేదా ఇతర స్తంభాల ఆధారంగా కట్టిన ఇళ్లు) గుర్తించవచ్చు.

ఈ ప్రాంతంలో కనిపించే లోహపనుల్లో వైవిద్యం ఉంటుంది, ముఖ్యంగా ఇండోనేషియాలో దీనిని గుర్తించవచ్చు. ఈ ప్రాంతంలో ఉపయోగించబడిన ప్రత్యేకమైన కటారులు వంటి ఆయుధాలు, గామెలాన్ వంటి సంగీత పరికరాల్లో భిన్నత్వం కనిపిస్తుంది.

ప్రభావాలు[మార్చు]

చైనా లేదా భారత్ లేదా రెండింటి ప్రభావాలు ఈ ప్రాంత సంస్కృతిపై కనిపిస్తాయి, వియత్నాం సంస్కృతిపై చైనా ప్రభావం బాగా ఎక్కువగా ఉంటుంది. చైనా మరియు భారత్‌లచే మయన్మార్ సమానంగా ప్రభావితమైంది. పశ్చిమ దేశాల సాంస్కృతిక ప్రభావాలు ఎక్కువగా ఫిలిప్పీన్స్‌లో కనిపిస్తాయి, ముఖ్యంగా స్పెయిన్ పాలన సందర్భంగా ఇక్కడ ఈ ప్రభావాలు ఏర్పడ్డాయి.

ఉదాహరణకు చేతి వేళ్లతో ఆహారం తినేవారు భారత సంస్కృతితో ప్రభావితమయ్యారని చెప్పవచ్చు, చైనా సంస్కృతికి చెందిన ప్రజలు ఆహారాన్ని మొదట చాప్‌స్టిక్‌లతో (కర్ర పుల్లలు) తింటారు; టీ సేవించడం, ఈ ప్రాంతం మొత్తం వాడుకలో ఉంది. ఈ ప్రాంతానికి ప్రత్యేకించబడిన చేప వ్యంజనాల్లో భిన్నత్వం ఉంటుంది.

కళలు[మార్చు]

"దున్నపోతుపై వేణువు ఊదుతున్న బాలుడు", డోంగ్ హో చిత్రలేఖనం, వియత్నాం.
కాంబోడియా మరియు థాయ్‌ల్యాండ్‌కు చెందిన సంప్రదాయ వాద్య పరికరం, ఖిమ్‌ను వాయిస్తున్న ఒక థాయ్ బాలుడు.*Khim audio
తాళపత్రాల్లో బాలీ రాతపద్ధతి. ఇల్లినాయిస్, చికాగోలోని ఫీల్డ్ మ్యూజియంలో ఈ తాళ పత్రాలు ప్రదర్శనలో ఉన్నాయి.

ఆగ్నేయాసియా కళలకు ఇతర ప్రాంతాల్లో కళలతో ఎటువంటి సంబంధం లేదు. ఆగ్నేయాసియా ప్రాంతంలో కూడా నృత్యంలో కళాకారులు ప్రేక్షకులకు భావాన్ని మరియు కథలో నృత్యం యొక్క అర్థాన్ని వ్యక్తపరిచేందుకు చేతుల మరియు కాళ్ల కదలికలను ఉపయోగిస్తారు.ఆగ్నేయాసియన్లకు చెందిన నృత్యాన్ని కచేరీల్లో ప్రదర్శించే విధంగా మలిచారు, ఖ్మెర్ సామ్రాజ్యానికి ముందు, 7వ శతాబ్ద ప్రారంభ కాలానికి చెందిన కాంబోడియన్ రాయల్ బ్యాలెట్ భారతీయ హిందూ సంప్రదాయంతో బాగా ప్రభావితమై ఉంటుంది. హిందూ శైలి నృత్యానికి గొప్ప ఉదాహరణగా ఎక్కువగా చేతి మరియు కాలి కదలికతో ప్రసిద్ధి చెందిన అప్సర నృత్యాన్ని చెప్పవచ్చు. కీలుబొమ్మలాటలు మరియు క్రీ నీడలు గత శతాబ్దాల్లో మంచి వినోద కార్యక్రమాలుగా గుర్తింపు పొందాయి, వీటిలో ప్రముఖమైనది ఇండోనేషియాకు చెందిన వాయాంగ్.ఆగ్నేయాసియాలోని కొన్ని ప్రాంతాల్లో కళలు మరియు సాహిత్యంపై కొంతవరకు కొన్ని శతాబ్దాల క్రితం వారి వద్దకు తీసుకురాబడిన హిందూ సంప్రదాయాల ప్రభావం ఉంటుంది.

మరికొన్ని చైనా కళాత్మకమైన సంప్రదాయాలతో తై ఆగ్నేయాసియాకు ఆలస్యంగా చేరుకుంది, అయితే దీనిని వెంటనే ఖ్మెర్ మరియు మోన్ సంప్రదాయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ త్యజించారు, చైనీయుల కళలతో ఆగ్నేయాసియన్ల పూర్వ సంబంధం ఇక్కడి ఆలయాల నిర్మాణ శైలిలో మాత్రమే కనిపిస్తుంది, ముఖ్యంగా పైకివెళ్లేకొద్ది సన్నగా మారే కప్పు మరియు వారి యొక్క లాక్వెర్‌వేర్‌లో (అమూల్యమైన లోహాలు, చెక్కతో తయారు చేసే వస్తువులు) కనిపిస్తుంది.

కొన్ని రకాల కళలకు వ్యతిరేకమైన ఇస్లాం మతంలోకి మారినప్పటికీ, ఇండోనేషియాలో ప్రజలు అనేక రకాల హిందూ ప్రభావిత సంప్రదాయాలు, సంస్కృతులు, కళలు మరియు సాహిత్యాలను పరిరక్షించారు. దీనికి ఉదాహరణ వాయాంగ్ కులిత్ (కీలు బొమ్మలాట) మరియు రామాయణం వంటి సాహిత్యం. ఆగ్నేయాసియా ప్రధాన భూభాగంలో (వియత్నాం మినహా) కూడా ఈ కళలు, సంప్రదాయాలు పరిరక్షించబడ్డాయి. థాయ్‌, ఖ్మెర్, లావో మరియు బర్మా సంస్కృతుల్లో కూడా నృత్య రీతులు, హిందూ దేవుళ్లు, కళల ప్రభావం కనిపిస్తుంది. ఖ్మెర్ మరియు ఇండోనేషియా సంప్రదాయ కళలు దేవుళ్ల జీవితచరిత్రలతో ఉంటాయి, అయితే ఆగ్నేయాసియా ప్రజల దృష్టిలో దైవుళ్ల జీవితం అంటే ప్రజల జీవితంగా-సంతోషకరమైన, భూసంబంధమైన మరియు దివ్యమైన జీవితంగా పరిగణించబడుతుంది.

వియత్నాంలో, అక్కడి ప్రజలు చైనీయులతో అనేక సాంస్కృతిక సారూప్యతలు పంచుకుంటున్నారు.

సంగీతం[మార్చు]

అనేక జాతి మరియు సాంస్కృతిక విభాగాలు మాదిరిగా ఆగ్నేయాసియాలో సంప్రదాయ సంగీతం కూడా వైవిద్యభరితంగా ఉంటుంది. సంప్రదాయ సంగీతంలో అనేక రకాలు చూడవచ్చు: కచేరీ సంగీతం, జానపద సంగీతం, చిన్న జాతి సమూహాల సంగీత శైలులు మరియు ఇతర సంగీత రూపాలపై భౌగోళిక ప్రాంతం బయటవైపు ప్రభావం ఉంటుంది.

కచేరీ మరియు జానపద రీతులు, గోంగ్-చిమ్ సంగీత బృందాలు మరియు వాద్యబృందాలు ఈ ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తుంటాయి (వియత్నాం దిగువ ప్రాంతాలు ఇందుకు మినహాయింపు). ఇండోనేషియాకు చెందిన గామెలాన్ వాద్యబృందాలు, థాయ్‌ల్యాండ్ & కాంబోడియాకు చెందిన పిఫట్ /పిన్‌పీట్ సంగీత బృందాలు, దక్షిణ ఫిలిప్పీన్స్, బోర్నెయో, సులావేసి మరియు తైమోర్‌లకు చెందిన కులిన్‌తాంగ్ సంగీత బృందాలు ఈ ప్రాంతంలో మిగిలిన సంగీత శైలులను ప్రభావితం చేసిన మూడు ప్రధాన విలక్షణ సంగీత రీతులుగా గుర్తింపు పొందాయి. ఈ ప్రాంతంలో తీగ సంగీత పరికరాలు కూడా ప్రాచుర్యం కలిగివున్నాయి.

రచనలు[మార్చు]

ఆగ్నేయాసియా చరిత్ర వివిధ రచయితలను సంపన్నులను చేసింది, స్థానికులు మరియు విదేశీయులు ఇద్దరూ ఈ ప్రాంతం గురించి రచనలు చేశారు.

మొదట, భారతీయులు ఈ ప్రాంతంలోని స్థానిక ప్రజలకు రచనలు చేయడం నేర్పించారు. బాలినీస్ లిపి వంటి ఈ ప్రాంతంలో ఉన్న బ్రాహమిక్ తరహా రాత పద్ధతులను ఉపయోగించి ఈ రచనలు చేయబడ్డాయి, దీనికి ఉదాహరణను లాంతార్ అని పిలిచే తాళపత్రాలపై చేసిన రచనను కుడివైపు చూడవచ్చు:

ఈ రాత పద్ధతి యొక్క ప్రాచీనత చైనాలో సుమారుగా 100వ సంవత్సరంలో కాగితం కనుగొనక ముందు కాలానికి చెందినది. ప్రతి తాళపత్ర భాగంలో కొన్ని వరుసల్లో మాత్రమే, అడ్డంగా రాయబడి ఉండటం, తాళపత్రాలు దారంతో కట్టుబడి ఉండటం గమనించవచ్చు. బాహ్య భాగం సాలంకృతమై ఉంటుంది. ఆగ్నేయాసియాలో అబుగిడా అక్షరమాలను ఉపయోగించారు, ఐరోపావారు వచ్చే వరకు ఇది కొనసాగింది, వీరు కూడా అచ్చులతో మాత్రమే కాకుండా, హల్లులతో ముగిసే పదాలను ఉపయోగించారు. కాగితాన్ని ఉపయోగించని, ఇతర రూపాల అధికారిక పత్రాలు రాగిపలకలపై రాయబడేవి, దీనికి ఉదాహరణ జావావాసులు ఉపయోగించిన రాగిఫలక పట్టీలు. ఆగ్నేయాసియా ఉష్ణమండల వాతావరణంలో ఇవి ఎక్కువ మన్నిక కలిగివుండేవి.

ఇవి కూడా చూడండి[మార్చు]

సూచనలు[మార్చు]

 1. 1.0 1.1 "World Macro Regions and Components". The United Nations. Retrieved 2009-09-13. Cite web requires |website= (help)
 2. పాపువా న్యూ గినియా ఆస్క్స్ RP సపోర్ట్ ఫర్ Asean మెంబర్‌షిప్ బిడ్ జులై 8, 2009న సేకరించబడింది
 3. సోమేర్ సీక్స్ PGMA's సపోర్ట్ ఫర్ PNG's ASEAN మెంబర్‌షిప్ బిడ్ Archived 2010-03-06 at the Wayback Machine. జులై 8, 2009న సేకరించబడింది
 4. ఈ పటంలో ASEAN సభ్య దేశాలు ప్రధానంగా గుర్తించబడ్డాయి, అందువలన భౌగోళికంగా ఆగ్నేయాసియాలో భాగస్వాములుగా ఉన్న అండమాన్, నికోబార్ ద్వీపాలను ఈ పటంలో చూపించలేదు.
 5. "Country Comparison :: Area". CIA World Factbook. Retrieved 2009-09-12. Cite web requires |website= (help)
 6. "Country Comparison :: GDP". CIA World Factbook. Retrieved 2010-02-12. Cite web requires |website= (help)
 7. . "Statistics Singapore - Population (Mid Year Estimates) & Land Area". 2009. Statistics Singapore.
 8. 8.0 8.1 "Christmas Islands". CIA World Factbook. Retrieved 2009-09-12. Cite web requires |website= (help)
 9. 9.0 9.1 "Cocos (Keeling) Islands". CIA World Factbook. Retrieved 2009-09-12. Cite web requires |website= (help)
 10. Smithsonian (2008). "The Great Human Migration": 2. Unknown parameter |month= ignored (help); Cite journal requires |journal= (help)
 11. Morwood, M. J. (October 13, 2005). "Further evidence for small-bodied hominins from the Late Pleistocene of Flores, Indonesia". Nature. 437: 1012–1017. doi:10.1038/nature04022. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (help)
 12. Taylor, Jean Gelman (2003). Indonesia: Peoples and Histories. New Haven and London: Yale University Press. pp. 5–7. ISBN 0-300-10518-5.
 13. సోల్హీమ్, జర్నల్ ఆఫ్ ఈస్ట్ ఏషియన్ ఆర్కియాలజీ , 2000, 2 :1-2, పేజీలు 273-284(12)
 14. 14.0 14.1 లారెన్స్ బెర్‌గ్రీన్, ఓవర్ ది ఎడ్జ్ ఆఫ్ ది వరల్డ్: మెగెలాన్స్ టెరిఫైయింగ్ సర్కమ్‌నేవిగేషన్ ఆఫ్ ది గ్లోబ్, హార్పెర్‌కొల్లిన్స్ పబ్లిషర్స్, 2003, హార్డ్‌కవర్ 480 పేజీలు, ISBN 0-06-621173-5
 15. ఇండోనేషియాలోని ప్రాంబనాన్ వద్ద ఉన్న మహా ఆలయ సముదాయం దక్షిణ భారత వాస్తుశిల్పంతో అనేక సారుప్యతలను ప్రదర్శిస్తుంది. నిలకంఠ శాస్త్రి, K.A. The CōĻas , 1935 పేజీలు 709 చూడండి
 16. చైనీస్ ముస్లిమ్స్ ఇన్ మలేషియా, హిస్టరీ అండ్ డెవెలప్‌మెంట్ రచన రోసీ వాంగ్ మా
 17. లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్, 1992, "ఇండోనేషియా: వరల్డ్ వార్ II అండ్ ది స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్, 1942-50; ది జపనీస్ ఆక్యుపేషన్, 1942-45" సేకరణ తేదీ: ఫిబ్రవరి 9, 2007.
 18. జాన్ W. డోవెర్ వార్ వితౌట్ మెర్సీ: రేస్ అండ్ పవర్ ఇన్ ది ఫసిఫిక్ వార్ (1986; పాంథియాన్; ISBN 0-394-75172-8)
 19. బయోడైవర్శిటీ వైపౌట్ ఫేసింగ్ సౌత్ ఈస్ట్ ఏషియా, న్యూ సైంటిస్ట్, జులై 23 2003
 20. Sean Yoong (April 27, 2007). "17 Firms to Build $500M Undersea Cable". International Business Times. Retrieved 2007-07-28. Cite web requires |website= (help)
 21. బ్యాక్‌గ్రౌండ్ ఓవర్‌వ్యూ ఆఫ్ ది నేషనల్ సెమినార్ ఆన్ సస్టైనబుల్ టూరిజం రీసోర్స్ మేనేజ్‌మెంట్, ఫ్నోమ్ పెన్, జూన్ 9–10, 2003. (http://pub.unwto.org:81/WebRoot/Store/Shops/Infoshop/Products/1240/1240-1.pdf Archived 2012-03-24 at the Wayback Machine.)
 22. హిచ్‌కాక్, మైకెల్, మరియు ఇతరులు టూరిజం ఇన్ సౌత్-ఈస్ట్ ఏషియా న్యూయార్క్: రౌట్లెడ్జ్, 1993
 23. WDI Online
 24. "Field Listing - Religions". CIA factbook. Retrieved 2007-02-24. Cite web requires |website= (help)
 25. ఇండోనేషియా - ది వరల్డ్ ఫ్యాక్ట్‌బుక్ https://www.cia.gov/library/publications/the-world-factbook/geos/id.html
 26. CIA - The World Factbook -- Brunei
 27. CIA - The World Factbook -- Cambodia
 28. CIA - The World Factbook -- Christmas Island
 29. CIA - The World Factbook -- Cocos (Keeling) Islands
 30. CIA - The World Factbook -- East Timor
 31. CIA - The World Factbook -- Indonesia
 32. CIA - The World Factbook -- Laos
 33. CIA - The World Factbook -- Malaysia
 34. CIA - The World Factbook -- Philippines
 35. CIA - The World Factbook -- Thailand
 36. CIA - The World Factbook -- Vietnam

మరింత చదువుటకు[మార్చు]

బాహ్య లింకులు[మార్చు]

Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.