ఆగ్నేయ మధ్య రైల్వే రైళ్లు (భారతదేశం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆగ్నేయ మధ్య రైల్వే భారతదేశం పదిహేడు రైల్వే మండలాలులో ఒకటి. దీని ప్రధాన కార్యాలయం బిలాస్‌పూర్, ఇది బిలాస్‌పూర్, నాగ్‌పూర్ రైల్వే డివిజనులు (అధికారికంగా దక్షిణ తూర్పు రైల్వే భాగంగా), కొత్త రాయ్‌పూర్ డివిజన్. కలిగి ఉంది.

ఇది దక్షిణ తూర్పు రైల్వే లోని గతకాలపు బెంగాల్ నాగ్పూర్ రైల్వే, నాగ్‌పూర్ ద్వారా మరొక విభజన సృష్టించడం ద్వారా రెండు రైల్వే డివిజనులుగా ఏర్పరచారు. డివిజన్ మధ్య రైల్వే నుండి ఎటువంటి డివిజను చేర్చివుండ నప్పటికీ, మధ్య రైల్వే, సౌత్ ఈస్ట్రన్ రైల్వే మండలాల మధ్య ఉంటుంది కనుక, ఈ జోను పేరు "సౌత్ ఈస్ట్ సెంట్రల్"గా స్వీకరించారు. దీని రైల్వే కోడ్ ఎస్‌ఈసిఆర్ (SECR) గా ఉంది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒరిస్సా యొక్క ఒక చిన్న భాగం రాష్ట్ర భూభాగములకు సేవల కార్యక్రమాలను అందిస్తుంది. పెద్ద జంక్షన్లలో నాగ్పూర్, కాట్నీ, అనుప్పూర్, చంపా, గోండియా రాయ్‌పూర్ ఉన్నాయి. ఒక నారో-గేజ్ (ట్రాక్) రైలు మార్గము, వెస్ట్ సెంట్రల్ రైల్వే ప్రధాన కేంద్రం జబల్పూర్ స్టేషను వద్ద ప్రవేశిస్తుంది.

ఆగ్నేయ మధ్య రైల్వే పరిధి ముగింపు[మార్చు]

  • సెంట్రల్ రైల్వే కొరకు నాగ్‌పూర్ (మినహాయించి)
  • చందా ఫోర్ట్ (మినహాయించి)
  • సౌత్ ఈస్టర్న్ రైల్వే కొరకు ఝార్సుగుడా (మినహాయించి)
  • కాట్నీ జంక్షన్ (మినహాయించి)
  • ఈస్ట్ కోస్ట్ రైల్వే కొరకు మందిర్ హసౌద్ (సహా)
  • సెంట్రల్ రైల్వే కొరకు చింద్వారా జంక్షన్ (సహా)
  • భిలాయి ఎలక్ట్రిక్ లోకోమోటివ్స్ డబ్ల్యుఎఎం4 యొక్క రకమునకు ఆశ్రయమిస్తుంది. అయితే కాట్నీ డబ్ల్యుడిఎం2, డబ్ల్యుడిఎం2ఎ,

డబ్ల్యుడిఎం3ఎ డీజిల్ తరగతి వాహనములకు ఆశ్రయం కల్పిస్తుంది.

నంబరింగ్[మార్చు]

బిలాస్‌పూర్ డివిజను ఎక్స్‌ప్రెస్ రైళ్లు భారతీయ రైల్వేలు నంబరు యొక్క 82XX సిరీస్ ద్వారా వర్గీకరిస్తారు. సౌత్ ఈస్టర్న్ రైల్వే, ఈస్ట్ కోస్ట్ రైల్వేలు భాగస్వామ్యపరచబడినసూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు 28XX సిరీస్ ద్వారా వర్గీకరిస్తారు.

రాయ్‌పూర్, నారో-గేజ్ వాహనములకు జడ్‌డిఎం-సిరీస్ కలిగి ఉంది. ప్రధాన నారో-గేజ్ రైలు మార్గములకు తోడ్పడుతున్నాయి.

ప్రజాదరణ రైళ్లు[మార్చు]

  1. న్యూ ఢిల్లీ, బిలాస్‌పూర్ మధ్య బిలాస్‌పూర్ రాజధాని ఎక్స్‌ప్రెస్
  2. ఛత్తీస్‌గఢ్ ఎక్స్‌ప్రెస్ / ప్యాసింజర్ : బిలాస్‌పూర్, అమృత్‌సర్ మధ్య వయా నాగ్‌పూర్, ఇటార్సి, హొసంగాబాద్, భూపాల్, విదీష, బినా గౌలియార్, న్యూ ఢిల్లీ
  3. ఛత్తీస్‌గఢ్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ :దుర్గ్, నిజాముద్దీన్ మధ్య వయా బిలాస్పూర్, కాట్నీ, బినా
  4. అమర్‌కాంతక్ ఎక్స్‌ప్రెస్ : భూపాల్, దుర్గ్ మధ్య వయా బిలాస్పూర్, జబల్పూర్, ఇటార్సీ
  5. గోరఖ్పూర్ దుర్గ్ ఎక్స్‌ప్రెస్ : బైవీక్లీ వయా బిలాస్పూర్, కాట్నీ, వారణాసి
  6. బెత్వా ఎక్స్‌ప్రెస్ : దుర్గ్ కాన్పూర్ సెంట్రల్ మధ్య బైవీక్లీ వయా బిలాస్పూర్, కాట్నీ, అలహాబాద్
  7. కాట్నీ - బిలాస్పూర్, తూర్పు మధ్యప్రదేశ్ ఎక్స్‌ప్రెస్, కాట్నీ, కోర్బా మధ్యన
  8. ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ : బిలాస్పూర్, భూపాల్ మధ్య వయా దుర్గ్, రాయ్‌పూర్
  9. జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్ : గోండియా, పాట్నా మధ్యన
  10. బిలాస్‌పూర్ భూపాల్ ఎక్స్‌ప్రెస్ : వయా కాట్నీ, బినా
  11. చెన్నై బిలాస్‌పూర్ ఎక్స్‌ప్రెస్ : వీక్లీ, వయా గోండియా, చందాఫోర్ట్, బల్లార్షా, విజయవాడ

ఆగ్నేయ మధ్య రైల్వే వద్ద ఆగిపోయే ఇతర రైళ్ళు[మార్చు]

  1. విశాఖపట్నం బిలాస్‌పూర్ - కోర్బా వయా రాయ్‌పూర్, టిట్లఘర్, రాయగడ
  2. కోర్బా - త్రివేండ్రం బైవీక్లీ వయా నాగ్‌పూర్, విజయవాడ, చెన్నై, కోయంబత్తూర్
  3. దుర్గ్ - చాప్రా సారనాథ్ ఎక్స్‌ప్రెస్ వయా వారణాసి, కాట్నీ, బిలాస్‌పూర్
  4. సౌత్ బీహార్ ఎక్స్‌ప్రెస్, పాట్నా, టాటానగర్ మధ్య వయా ఝార్సుగుడా
  5. యశ్వంత్‌పూర్ (బెంగుళూర్) వీక్లీ ఎక్స్‌ప్రెస్ వయా సికింద్రాబాద్, నాగ్‌భీర్, గోండియా, రాయ్‌పూర్, బిలాస్‌పూర్
  6. బిలాస్‌పూర్-తిరుపతి ఎక్స్‌ప్రెస్, తిరుపతి, బిలాస్‌పూర్ మధ్య వయా బైవీక్లీ విజయవాడ, విశాఖపట్నం, రాయ్‌పూర్
  7. కోర్బా-బిలాస్‌పూర్-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్, ప్రతిరోజు (డైలీ), విశాఖపట్నం, కోర్బా

ఇవి కూడా చూడండి[మార్చు]