ఆచంట లక్ష్మీపతి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆచంట లక్ష్మీపతి
Achanta lakshmipathi.jpg
ఆచంట లక్ష్మీపతి
జననంఆచంట లక్ష్మీపతి
మార్చి 3, 1880
పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు దగ్గర మాధవవరం
మరణం1962 ఆగస్టు 6 (1962-08-06)(వయసు 82)
ప్రసిద్ధిప్రముఖ ఆయుర్వేద వైద్యుడు , సంఘసేవకుడు
భార్య / భర్తఆచంట రుక్మిణమ్మ

ఆచంట లక్ష్మీపతి (మార్చి 3, 1880 - ఆగస్టు 6, 1962) ప్రముఖ ఆయుర్వేద వైద్యుడు, సంఘసేవకుడు. ఈయన నాటి మద్రాసు ( నేటి చెన్నయ్) లోని ఆయుర్వేద వైద్య కళాశాల ప్రధానోపాధ్యాయులుగా (1920-1928) సేవలు అందించారు.

బాల్యం-విద్యాభ్యాసం[మార్చు]

ఈయన పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు దగ్గర మాధవవరంలో శ్రీ రామయ్య, శ్రీమతి జానకమ్మ లకు 1880, మార్చి 3 న జన్మించారు. ఈయన తాతగారు సుబ్బారాయుడు గారు సంస్కృత పండితులు. ఈయన తండ్రి అతను వైద్య పాటు వ్యవసాయం నేర్చుకోవడం కలలు కన్నారు. అటు వైద్య శాస్త్రం, ఇటు వ్యవసాయం రెండింటిలోనూ మక్కువ గల లక్ష్మీ పతి మెట్రిక్యులేషన్, ఎఫ్ ఏ పూర్తి చేసి స్థానికంగా తహశిల్దారు కార్యాలయంలో గుమాస్తాగా పనిచేసారు. ఆపైన బి.ఎ చేసి స్కాలర్ షిప్ తో యం.బి.సి.యం ( ఆయుర్వేదం) కోర్సు చేసారు. ప్రముఖ వైద్య నిపుణులు పండిత దివి గోపాలాచార్య వద్ద శిష్యరికం చేసారు[1].

ప్రముఖ సంఘసంస్కర్త కందుకూరి వీరేశలింగం గారు వీరికి ఉన్నత పాఠశాల లోని గురువు. ఎఫ్.ఎ పూర్తి చేసిన పిదప ఆయన దవులూరి ఉమామహేశ్వరవావు వద్ద కొంతకాలం క్లార్క్ బాధ్యతలు నిర్వహించాడు. ఉమామహేశ్వరరావు మద్రాసుకు బదిలీఅయిన పిదప ఆయనతో పాటు వెళ్లాడు. ఆ సమయంలో మద్రాసు రాష్ట్రం బ్రిటిష్ పరిపాలనలో ఉండేది. తరువాత ఆయన 1904 లో బి.ఎ పూర్తి చేసాడు[1]..

రచనలు[మార్చు]

దవులూరి ఉమామహేశ్వరరావు గారి సహాయము వలన ఈయనకు స్కాలర్‌షిప్ వచ్చుటచే ఈయన మెడిసన్, ఎం.బి.బి.యస్ డిగ్రీలను 1909 లో పూర్తి చేశారు. అల్లోపతీ వైద్యవిద్యను పూర్తి చేసిన తర్వాత ఆయుర్వేదం (పురాతన భారత వైద్య విధానం) ను పండిట్ గోపాలాచార్యులు దీవి వారి అధ్వర్యములో అభ్యసించారు. దీవి గోపాలాచార్యులు 1920 లో మద్రాసునందు ఆయుర్వేద మెడికల్ కాలేజీని నడిపేవారు. ఆ ఆయుర్వేద కళాశాలలో లక్ష్మీపతి ప్రిన్సిపాల్ గా ఎదిగారు.

రచనలు[మార్చు]

ఆంగ్ల భాషతో పాటు తెలుగు లోనూ తన రచనా వ్యాసాంగాన్ని కొనసాగించిన డా. ఆచంట లక్ష్మీ పతి1922-27 కాలంలో తెలుగులో "ధన్వంతరి" పత్రికనూ ఆంగ్లంలో 'ఆంధ్రా మెడికల్ జర్నల్ ' ను ప్రచురించారు. ఈయన 63 పుస్తకాలను భారతీయ వైద్యం పై అనగా దర్శనములు, ఆయుర్వేద విజ్ఞానం, ఆయుర్వేద శిక్ష, వనౌషథ విజ్ఞానము, భారతీయ విజ్ఞానము వంటివి వ్రాశారు.ఆయుర్వేదంపై అనేక ఆంగ్ల పుస్తకాలను వ్రాశారు. చలిజ్వరము రోగ లక్షణాలు, దానికి ఆయుర్వేద వైద్యము గురించి చలిజ్వరము[2] పుస్తకాన్ని రాశారు.

జీవిత విశేషాలు[మార్చు]

After his first wife Seetamma died at a young age, he married again. His second wife was Rukminamma, who later became Health Minister for the State of Madras, which included Andhra, after independence. During this period Lakshmipati did a lot of service to the Ayurveda Medicine. He also served as a president for All India Ayurveda Medical Society and Andhra Ayurveda Board. He also served as a secretary for Andhra Sahitya Parishattu in Madras.

In recognition of his services to Medicine and Health in general and to Ayurveda Medicine in particular, various Medical Institutions were named after him in Chennai, e.g., Achanta Lakshmipathy Unit for Research in Ayurvedic Medicine at Voluntary Health Services, Chennai, Achanta Lakshmipathy Neurosurgical Centre, VHS, Chennai, etc

అస్తమయం[మార్చు]

వైద్యునిగా నే కాక సంఘ సేవకునిగా, రచయితగా, జాతీయవాదిగా సేవలందించిన డా.ఆచంట లక్ష్మీ పతి 1962, ఆగస్టు 6 న పరమపదించారు.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 ఆచంట లక్ష్మీపతి చరిత్ర
  2. లక్ష్మీపతి, ఆచంట. చలిజ్వరము.

యితర లింకులు[మార్చు]