ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం
రకం | జాతీయ విశ్వవిద్యాలయం |
---|---|
స్థాపితం | 12 జూన్ 1964 |
ఛాన్సలర్ | ఎస్. రఘువర్ధన్ రెడ్డి |
వైస్ ఛాన్సలర్ | డా. ఎ. పద్మా రాజు |
స్థానం | లాం, గుంటూరు, ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం |
కాంపస్ | పట్టణ ప్రాంతం |
పాత పేరు | ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం |
అనుబంధాలు | యు.జి.సి. |
జాలగూడు | www.angrau.ac.in |
![]() |
ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా, తాడికొండ మండలంలోని లాం గ్రామ పంచాయితీ పరిధిలో కేంద్రంగా ఉన్న ప్రభుత్వ వ్యవసాయ విశ్వవిద్యాలయం.[1]
చరిత్ర[మార్చు]
విశ్వవిద్యాలయ జాలస్థలంలో ఇచ్చిన సమాచారం ప్రకారం ఆచార్య ఎన్.జి.రంగా విశ్వవిద్యాలయం (ANGRAU) ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయంగా 1964 జూన్ 12న ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయ చట్టం 1963 ద్వారా స్థాపించబడింది.1996 నవంబరు 7న, విశ్వవిద్యాలయం పేరును వ్యవసాయవేత్త, నాయకుడు ఆచార్య ఎన్.జి.రంగా పేరుతో, 'ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం'గా పేరు మార్చబడింది.అర్ధశతాబ్ది పూర్తి చేసుకోబోతూండగా రాష్ట్ర విభజన కారణంగా, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంగా పేరు మార్పు చెంది, రాష్ట్ర విభజన చట్టం 2014 ప్రకారం గుంటూరుకు విశ్వవిద్యాలయ కేంద్రం మార్చబడింది. ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాలకు నవ్యాంధ్ర రాజధానికి చేరువలో ఉన్న లాం నుండి సేవలను అందిస్తోంది.[2]
మూలాలు[మార్చు]
- ↑ "ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం చిరునామా అధికారిక మార్పు". ప్రజాశక్తి. ప్రజాశక్తి. 9 May 2016. Retrieved 15 March 2017.
- ↑ "ఆచార్య ఎన్ జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం".