ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయము
Agriculture logo.jpg
రకంప్రభుత్వ
స్థాపితం1964
వైస్ ఛాన్సలర్పి రాఘవ రెడ్డి
స్థానంహైదరాబాదు, ఆంధ్రప్రదేశ్
కాంపస్పట్టణ
అనుబంధాలుయు.జి.సి
జాలగూడుwww.angrau.net
దస్త్రం:Prof,Jayashanker Agricultural University logo.jpg

ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, 1964లో హైదరాబాదులో ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయంగా స్థాపించబడింది. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయ చట్టం, 1963, ప్రకారం ఉస్మానియా విశ్వవిద్యాలయం యొక్క పరిధిలో ఉన్న వ్యవసాయ, పశువైద్య కళాశాలను, ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్న బాపట్ల వ్యవసాయ కళాశాలను, శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్న శ్రీవేంకటేశ్వర వ్యవసాయ కళాశాల, ఆంధ్రా పశువైద్య కళాశాల, తిరుపతిలను జూన్ 1964లో ఈ కొత్త విశ్వవిద్యాలయపు పరిధిలోకి తెచ్చారు.

1996 నవంబర్ 7న దీని పేరుని ప్రముఖ రైతు నాయకుడు ఆచార్య ఎన్.జీ.రంగా పేరు మీద ఆచార్య ఎన్.జీ.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంగా మార్చటం జరిగింది. ఈ విశ్వవిద్యాలయం కింద 9 బోధనా కేంద్రాలు, 14 కాలేజిలు, 67 పరిశోధనాశాలలు, 6 కృషి విజ్ఞాన కేంద్రాలు, 7 పాలిటెక్నిక్ కాలేజిలు, 22 జిల్లా వ్యవసాయ సలహా, విజ్ఞాన బదిలీ కేంద్రాలు ఉన్నాయి. డిగ్రీ కోర్సులలో ప్రవేశం 'ఎంసెట్' ఆధారంగా జరుగుతుంది.

1964, జూన్ 12న హైదరాబాదులో స్థాపించబడిన వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ఒ.పుల్లారెడ్డి ప్రథమ ఉపసంచాలకునిగా పనిచేశాడు. విశ్వవిద్యాలయానికి అధికారxగా 1965, మార్చి 20న అప్పటి భారత ప్రధానమంత్రి లాల్ బహుదూర్ శాస్త్రి ప్రారంభించాడు. 1966, జూన్ 23న ఇందిరా గాంధీ విశ్వవిద్యాలయభవన సముదాయానికి ప్రారంభోత్సవం చేసింది.ఆచార్య ఎన్.జీ.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పేరును తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంగా మార్చటం జరిగింది.

విశ్వవిద్యాలయము అందిస్తున్న కోర్సులు[మార్చు]

డిగ్రీ కోర్సులు

బి.ఎస్.సి. (వ్యవసాయం), బి.ఎస్.సి. (ఉద్యానవనం), బి.టెక్ (వ్యవసాయ ఇంజినీరింగ్), బి.వి.ఎస్.సి (పశువైద్యం), బి.ఎస్.సి. (సి.ఎ & బి.ఎమ్), బి.ఎచ్.ఎస్.సి (గృహవిజ్ఞాన శాస్త్రం), బి.టెక్ (పుడ్ సైన్సు).

పి.జి. కోర్సులు

ఎమ్.ఎస్.సి (వ్యవసాయం), ఎమ్.వి.ఎస్.సి (పశువైద్యం), ఎమ్.ఎ.బి.ఎమ్, ఎమ్.ఎస్.సి (అగ్రికల్చరల్ బయోటెక్నాలజీ), ఎమ్.ఎస్.సి (ఎన్విరాన్ మెంటల్ సైన్సు అండ్ టెక్నాలజీ), ఎమ్.ఎస్.సి (గృహవిజ్ఞాన శాస్త్రం), ఎమ్.ఎస్.సి (పుడ్ సైన్సు అండ్ టెక్నాలజీ).

రీసెర్చ్ కోర్సులు

వ్యవసాయం, పశువైద్యం, గృహవిజ్ఞాన శాస్త్రాలలో పి.ఎచ్.డి.

పాలిటెక్నిక్ కోర్సులు

వ్యవసాయంలో డిప్లొమా, ఉద్యానవన శాస్త్రంలో డిప్లొమా, గృహవిజ్ఞాన శాస్త్రంలో డిప్లొమా.

అవార్డులు[మార్చు]

  • ఈ విశ్వవిద్యాలయం వ్యవసాయాభివృద్ధికి చేసిన కృషికి గుర్తింపుగా 2007 సంవత్సరానికి సర్దార్ పటేల్ ఔట్ స్టాండింగ్ ఐ.సి.ఎ.ఆర్. ఇనిస్టిట్యూట్ అవార్డు లభించింది.[1]

పత్రిక[మార్చు]

వ్యవసాయం [2] అనబడే తెలుగు మాస పత్రికని ప్రచురిస్తున్నది.

ఇప్పటివరకు పనిచేసిన ఉపకులపతుల జాబితా[మార్చు]

ఇప్పటివరకు పనిచేసిన ఉపకులపతులు

మూలాలు[మార్చు]

  1. వ్యవసాయ వర్సిటీకి 'సర్దార్ పటేల్' అవార్డు, అన్నదాత ఆగష్టు 2008 పత్రిక.
  2. "వ్యవసాయం". Archived from the original on 2010-02-11. Retrieved 2010-06-12.

వెలుపలి లంకెలు[మార్చు]