అజంగఢ్ జిల్లా
ఆజంగఢ్ జిల్లా
आजमगढ ज़िला ' | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఉత్తర ప్రదేశ్ |
డివిజను | ఆజంగఢ్ |
ముఖ్య పట్టణం | ఆజంగఢ్ |
మండలాలు | 7 |
విస్తీర్ణం | |
• మొత్తం | 3,054 కి.మీ2 (1,179 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 46,16,509 |
• జనసాంద్రత | 1,500/కి.మీ2 (3,900/చ. మై.) |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 72.69% |
Website | అధికారిక జాలస్థలి |
ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర జిల్లాలలో అజంగఢ్ జిల్లా ఒకటి. అజంగఢ్ డివిజన్‌లో భాగమైన ఈ జిల్లాకు ముఖ్య పట్టణం ఆజంగఢ్.
పేరు వెనుక చరిత్ర
[మార్చు]జిల్లా కేంద్రం అజంగఢ్ పేరు జిల్లాకు నిర్ణయించబడింది. విక్రంజిత్ కుమారుడు అజం 1665లో ఈ పట్టణాన్ని స్థాపించాడు. విక్రంజిత్ గౌతమ రాజపుత్రుల సంతతికి చెందినవాడు. గౌతమ రాజపుత్రులు నిజామాబాదు పరగణాకు చెందినవారు. వీరు ఇస్లాం మతం స్వీకరించారు. ఆయనకు ఇద్దరు కుమారులు (అజం, అజ్మత్) ఉన్నారు.[1] ఇది దుర్వాసమహర్షి నివసించిన ప్రాంతం అని విశ్వసిస్తున్నారు. దుర్వాసుని ఆశ్రమం ఫూల్పూర్ తాలూకాకు ఉత్తరాన [2] తమసా, మఝుయీ నదుల మధ్య ఉంది.
చరిత్ర
[మార్చు]కాలనీ శకం
[మార్చు]ఆజంగఢ్ హిందూ, ముస్లిం భూస్వాములు (రౌత్రాలు) ఇరువురు 1857 సిపాయీ కలహంనికి సహాయం అందించారు. 1857 జూన్ 3 న 17వ " రెజిమెంట్ ఆఫ్ నేటివ్ ఇంఫాంటరీ మ్యూటినియడ్ " అజంగఢ్ వారి అధికారులు కొందరిని హత్యచేసి ప్రభుత్వ నిధిని ఫైజాబాదుకు తీసుకుపోయారు. గూర్ఖాలు, తిరుగుబాటుదార్ల యుద్ధానికి ఈ ప్రాంతం వేదికగా మారింది. 1858 నాటికి కాలనియల్ కెల్లీ పరిస్థితి అదుపులోకి తీసుకువచ్చాడు. తిరుగుబాటు దారులలో ముఖ్యుడు జనాబ్ లాల్ మొహమ్మద్ చివ్తహ్విన్. తరువాత బ్రిటిషు ప్రభుత్వం పలువురు భూస్వాములను అణచివేసింది.[3] తరువాత ఆజంగఢ్ ప్రజలు సహాయ నిరాకరణోద్యమం, క్విట్ ఇండియా (1942) వంటి జాతీయ ఉద్యమాలలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు.[1] ది చారిత్రక, సాంఘిక సంస్కరణలు, నేషనలిస్ట్ మహాపండిత్ రాహుల్ శాంక్రియయన్ " ఈ జిల్లాలోని ఒక గ్రామంలో జన్మించాడు.
భౌగోళికం
[మార్చు]అజంగఢ్ జిల్లా వైశాల్యం 3054 చ.కి.మీ. జిల్లా గంగా, ఘఘ్రా నదుల మధ్య ఉంది. .[1] జిల్లా ఆగ్నేయ సరిహద్దులో జౌన్‌పూర్, నైరుతీ సరిహద్దిలో సుల్తాన్‌పూర్, పశ్చిమ సరిహద్దులో అంబేద్కర్ నగర్ జిల్లాలు ఉన్నాయి.[4]
- జిల్లాలు అజంగఢ్ జిల్లా 7 తాలూకాలు , జిల్లాలో 22 మండలాలు , 4,106 గ్రామాలు (3,792 నివాసిత గ్రామాలు, 314 నిర్జన గ్రామాలు) ఉన్నాయి.[1]
ప్రధానమైన 12 పట్టణాలు (ఖస్బ)
[మార్చు]- ఆజంగఢ్
- బిలరీగంజ్
- లాల్‌గంజ్
- ముబారక్‌పూర్
- సరాయ్ మీర్
- ఫూల్పూర్
- జియంపూర్
- అత్రౌలీ
- అంబారి
- మాహుల్
- మర్తింగంజ్
- సాగరి
- మేహ్‌నగర్
ఆర్ధికం
[మార్చు]2006 గణాంకాల ప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో ఆజంఘడ్ జిల్లా ఒకటి అని గుర్తించింది.[5] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న ఉత్తర ప్రదేశ్ జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[5]
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 4,616,509,[6] |
ఇది దాదాపు. | బోస్నియా, హర్జిగోవిన దేశ జనసంఖ్యకు సమానం.[7] |
అమెరికాలోని. | సౌత్ కరోలినా నగర జనసంఖ్యకు సమం.[8] |
640 భారతదేశ జిల్లాలలో. | 30 వ స్థానంలో ఉంది.[6] |
1చ.కి.మీ జనసాంద్రత. | 1139 .[6] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 17.17%.[6] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 1007:1000 [6] |
జాతియ సరాసరి (928) కంటే. | అధికం |
అక్షరాస్యత శాతం. | 72.69%.[6] |
జాతియ సరాసరి (72%) కంటే. | దాదాపు సమానం |
2001 జనసంఖ్య | 3,939,915 |
జిల్లావైశాల్యం | 972 చ.కి.మీ |
నగరప్రాంత జనసంఖ్య | 297,300 |
గ్రామీణ జనసంఖ్య | 3,642,616 |
పురుషుల సంఖ్య | 1,950,414 |
స్త్రీల సంఖ్య | 1,989,501 |
అక్షరాస్యత | 57%.[1] |
భాషలు
[మార్చు]జిల్లాలో హిందీ, అవధి, ఉర్దూ, ఆంగ్లం, భోజ్‌పురి భాషలు వాడుకలో ఉన్నాయి.[9]
పర్యాటక ఆకర్షణలు
[మార్చు]- జమియాతుల్ ఫలాహ్ (ఖుర్ఆన్ అధ్యయనం కోసం ఆసియాలోని విశ్వవిద్యాలయం) (విశ్వవిద్యాలయం ఇస్లామిక్ స్టడీస్ లో విద్య అలాగే ఆధునిక విద్యకు అంటారు).
- దారుల్ ముసనాఫీన్ (ఆసియాలోనే అతిపెద్ద అరబ్బీ లైబ్రరీ)
- అల్జమియాతుల్ అష్రాఫియా (ఆసియాలోనే అతిపెద్ద అరబిక్ విశ్వవిద్యాలయం)
- షిబ్లీ నేషనల్ కాలేజ్
- కేంద్రీయ విద్యాలయ
- డి.ఎ.వి. కాలేజ్
- రాజేంద్ర ప్రసాద్ కాలేజ్ మేనేజ్మెంటు
- డెంటల్ కోల్లెజ్
ప్రముఖ వ్యక్తులు
[మార్చు]- రాహుల్ సాంకృత్యాయన్ - హిందీ ప్రయాణం తండ్రి సాహిత్యం - నుండి కనైలా విలేజ్
- అయోధ్య ప్రసాద్ ఉపాధ్యాయ- హిందీ కవి - నుండి నిజామాబాద్ (ఉత్తర ప్రదేశ్)
- ప్రేమ్ చంద్ పాండే - భారత శాస్త్రవేత్త, విద్యా
- మజ్రోహ్ సుల్తాన్‌పురి - ఉర్దూ కవి, రచయిత, గేయరచయిత - నుండి నిజామాబాద్ (ఉత్తర ప్రదేశ్)
- శ్యామ్ నారాయణ్ పాండే - రచయిత, కవి -దుంరావ్ గ్రామం నుండి, (ఇప్పుడు మావు జిల్లాలో అయితే ఆ సమయంలో ఆజమ్గర్హ జిల్లాలో ఉంది)
- లక్ష్మీ నారాయణ్ మిశ్రా - కవి - బస్తీ నుండి (అప్పుడు ఆజమ్గర్హ జిల్లాలో ఇప్పుడు మావు జిల్లాలో కానీ ఉంది)
- షేక్ షమిన్ అహ్మద్ - సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ శాసన సభ్యులు సుందనిపూర్ నుండి షుదిన్‌పూర్ - బాంబే కోసం.
- హమీదుద్దీన్ ఫరాహి - మత పండితుడు, విద్యావేత్త, రచయిత -ఫెర్హా గ్రామం నుండి
- షిబ్లీ నోమాని - ఇస్లామిక్ పండితుడు
- అమీన్ అహసాన్ - ఇస్లామిక్ పండితుడు -బంహూర్ గ్రామం నుండి
- గజేంద్ర సింగ్ - భారత టెలివిజన్ నిర్మాత, దర్శకుడు
- విభూతి నారాయణ్ రాయ్- మాజీ ఐపిఎస్ అధికారి, మాజీ వైస్ ఛాన్సలర్ - మహాత్మా మహాత్మా గాంధీ అంతర్రాష్ట్రీయ హిందీ విశ్వవిద్యాలయ
బయటి లింకులు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 "Azamgarh". Azamgarh district administration. Archived from the original on 2010-07-29. Retrieved 2014-12-16.
- ↑ ""Durvasa Ashram in Azamgarh official public information web page"". Archived from the original on 2001-06-07. Retrieved 2014-12-16.
- ↑ http://chestofbooks.com/reference/Encyclopedia-Britannica-1/Azamgarh.html
- ↑ "Azamgarh". UP online. Archived from the original on 2010-07-14. Retrieved 2014-12-16.
- ↑ 5.0 5.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
- ↑ 6.0 6.1 6.2 6.3 6.4 6.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01.
Bosnia and Herzegovina 4,622,163 July 2011 est.
- ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30.
South Carolina 4,625,364
- ↑ M. Paul Lewis, ed. (2009). "Bhojpuri: A language of India". Ethnologue: Languages of the World (16th ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-30.