ఆజాదీ కా అమృత్ మహోత్సవం

వికీపీడియా నుండి
(ఆజాద్ కా అమృత్ మహోత్సవం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

భారతదేశానికి స్వాతంత్రం ల‌భించి 75 ఏళ్లు పూర్త‌వుతున్న సంద‌ర్భంగా కేంద్ర ప్ర‌భుత్వం ఎర్పాటు చేస్తున్న కార్యకమం పేరు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ , ఇది భారత స్వాతంత్య్ర దినోత్సవం ఆగస్టు 15 2022 కు 75 వారాల ముందు ప్రారంభమవుతుంది[1]. 2023 స్వాతంత్ర్య దినోత్సవం వరకు కొనసాగుతుంది[2]. జన-భాగీదారి స్ఫూర్తితో దీనిని జనోత్సవంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి నేతృత్వంలో 250 మందికిపైగా రాజకీయ, వ్యాపార ప్రముఖులతో జాతీయ అమలు కమిటీ ఏర్పాటు చేసి, ఈ సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమాలను, కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

ఈ మహోత్సవ్‌ ఏడాదిన్నర పాటు 75 వారాలు కొనసాతుంది. 2021 మార్చి 12 న ప్రారంభమై 2022 ఆగస్టు 15 వరకు కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో పలు కార్యక్రమాలను నిర్వహిస్తాయి. స్వాతంత్ర పోరాటంలో చిరస్థాయిగా నిలిచిపోయిన దండియాత్రను గుర్తుచేసుకుంటూ సబర్మతి ఆశ్రమం నుంచి నవసారి లోని దండి వరకు 241 మైళ్ల దూరం పాదయాత్రను నిర్వహిస్తారు. . ఈ పాదయాత్ర 25 రోజులు పాటు సాగి 2021 ఏప్రిల్ 5న దండిలో ముగుస్తుంది.

వేడుకలను ప్రారంభించే 16 చరిత్రాత్మక ప్రాంతాలను పురావస్తు శాఖ గుర్తించింది. ఢిల్లీలోని ఖిలా రాయ్ పిథోరా వద్ద ప్రారంభమవుతాయి. మిగతా 15 ప్రాంతాలైన గ్వాలియర్ కోట, ఢిల్లీలోని హుమయూన్ సమాధి, ఫతేపూర్ సిక్రీ, హైదరాబాద్‌లోని గోల్కొండ కోట, ఐజ్వాల్‌లోని భువనేశ్వరి ఆలయం, ముంబయిలోని అగాఖాన్ ప్యాలెస్, ఒడిశాలోని కొణార్క్ ఆలయం, లక్నోలోని హిమాచల్‌ ప్రదేశ్‌ రెసిడెన్సీ బిల్డింగ్ కాంగ్రా కోట, ఝాన్సీ కోట, తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ పూర్వీకుల నివాసం, కర్ణాటకలోని చిత్రదుర్గ కోట, వారణాసిలోని మహల్ ఘాట్, అమరావతి, జైపూర్ ప్యాలెస్ వద్ద వేడుకలు నిర్వహిస్తారు.[3]

మూలాలు[మార్చు]

  1. "Azadi Ka Amrit Mahotsav". MyGov.in (in ఇంగ్లీష్). 2021-03-09. Retrieved 2021-06-12.
  2. "'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసిన సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ". pib.gov.in. Retrieved 2021-03-12.
  3. "75 వారాలపాటు 75వ స్వాతంత్ర వేడుకలు: నేటి నుంచే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్". Samayam Telugu. Retrieved 2021-06-12.