ఆటమ్ వెల్లీ
| ఆటమ్ వెల్లీ | |||
| పదవీ కాలం 2009 – 2014 | |||
| ముందు | టెక్కీ హేము | ||
|---|---|---|---|
| తరువాత | కామెంగ్ డోలో | ||
| నియోజకవర్గం | పక్కే కేస్సాంగ్ | ||
| పదవీ కాలం 1999 – 2009 | |||
| ముందు | బిడా టాకో | ||
| తరువాత | తపుక్ టకు | ||
| నియోజకవర్గం | సెప్ప ఈస్ట్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
| ఇతర రాజకీయ పార్టీలు | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్ | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
ఆటమ్ వెల్లీ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన అరుణాచల్ ప్రదేశ్ శాసనసభకు సెప్ప ఈస్ట్, పక్కే కేస్సాంగ్ శాసనసభ నియోజకవర్గాల నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పని చేశాడు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]ఆటమ్ వెల్లీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1999 అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో సెప్ప ఈస్ట్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎన్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి టేబిడా టాకోపై 425 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరి 2004 అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి టేమ్ ఫస్సాంగ్ పై 463 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
ఆటమ్ వెల్లీ 1999 అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో పక్కే కేస్సాంగ్ శాసనసభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎన్‌సీపీ అభ్యర్థి టెకీ హేముపై 67 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2019 అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి బియురామ్ వాగే చేతిలో 2222 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.
ఆటమ్ వెల్లీ 2023 నవంబర్ 4న భారత జాతీయ కాంగ్రెస్ పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలో చేరాడు.[2][3]
మూలాలు
[మార్చు]- ↑ "Ex-deputy CM of Arunachal Pradesh loses election battle in Supreme Court" (in ఇంగ్లీష్). The Indian Express. 23 May 2017. Archived from the original on 18 May 2025. Retrieved 18 May 2025.
- ↑ "Former Cong minister Welly joins BJP". Arunachal Observer. 5 November 2023. Archived from the original on 18 May 2025. Retrieved 18 May 2025.
- ↑ "Former minister Atum Welly joins BJP" (in ఇంగ్లీష్). Echo of Arunachal. 4 November 2023. Archived from the original on 18 May 2025. Retrieved 18 May 2025.