ఆదర్శ్ శాస్త్రి
ఆదర్శ్ శాస్త్రి | |||
| |||
పదవీ కాలం 2015 – 2020 ఫిబ్రవరి 11 | |||
ముందు | ప్రద్యుమన్ రాజ్‌పుత్ | ||
---|---|---|---|
తరువాత | వినయ్ మిశ్రా | ||
నియోజకవర్గం | ద్వారక | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జాతీయత | ![]() | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ (2020-ప్రస్తుతం) | ||
ఇతర రాజకీయ పార్టీలు | ఆమ్ ఆద్మీ పార్టీ (2013-2020) | ||
తల్లిదండ్రులు | అనిల్ శాస్త్రి, మంజు శాస్త్రి | ||
జీవిత భాగస్వామి | మోనికా శాస్త్రి | ||
పూర్వ విద్యార్థి | లాల్ బహదూర్ శాస్త్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ హిందూ కాలేజ్, ఢిల్లీ సెయింట్ కొలంబా స్కూల్, ఢిల్లీ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
ఆదర్శ్ శాస్త్రి (జననం 16 అక్టోబర్ 1973) ఢిల్లీ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఢిల్లీ శాసనసభకు 2015 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో ద్వారక నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
ఆదర్శ్ శాస్త్రి మాజీ ప్రధాన మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి మనవడు.[1][2]
రాజకీయ జీవితం
[మార్చు]ఆదర్శ్ శాస్త్రి ఆమ్ ఆద్మీ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2013 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో ద్వారక శాసనసభ నియోజకవర్గం నుండి ఆప్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ పార్టీ అభ్యర్థి ప్రద్యుమన్ రాజ్‌పుత్ పై 39,366 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3][4]
ఆదర్శ్ శాస్త్రి 2014 లోక్‌సభ ఎన్నికలకు ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ మానిఫెస్టో ముసాయిదా కమిటీ సభ్యుడిగా, 2014 లోక్‌సభ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ ఉత్తరప్రదేశ్ చాప్టర్ మానిఫెస్టో ముసాయిదా కమిటీ & అభ్యర్థుల ఎంపిక కమిటీ సభ్యుడిగా పని చేశాడు. ఆయన 2014 లోక్‌సభ ఎన్నికల్లో అలహాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుండి ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి 6,439 ఓట్లతో ఆరవ స్థానంలో నిలిచాడు.[5]
ఆదర్శ్ శాస్త్రి తరువాత భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరి[6] 2020 శాసనసభ ఎన్నికలలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి 6,757 ఓట్లతో మూడో స్థానంలో నిలిచాడు.[7]
మూలాలు
[మార్చు]- ↑ "Lal Bahadur Shastri's grandson Adarsh Shastri quits Rs 1 crore job at Apple to join Aam Aadmi Party" (in ఇంగ్లీష్). India Today. 28 December 2013. Archived from the original on 16 March 2025. Retrieved 16 March 2025.
- ↑ "Lal Bahadur Shastri's grandson Adarsh Shastri to draft AAP's UP vision document". The Economic Times. 9 February 2014. Archived from the original on 16 March 2025. Retrieved 16 March 2025.
- ↑ Elections in India. "Delhi Assembly Election 2015 - State Wise and Party Wise Results". Archived from the original on 25 December 2022. Retrieved 25 December 2022.
- ↑ "Delhi Assembly: Know your MLAs" (in ఇంగ్లీష్). The Indian Express. 11 February 2015. Archived from the original on 10 February 2025. Retrieved 10 February 2025.
- ↑ "Adarsh Shastri - Aam Aadmi Party's Allahabad, Uttar Pradesh, LS - 2014 Candidate". aamaadmiparty.org. Aam Aadmi Party. 2014. Archived from the original on 29 November 2014. Retrieved 19 November 2014.
- ↑ "Delhi polls: AAP's Dwarka MLA Adarsh Shastri joins Congress". 18 January 2020. Archived from the original on 16 March 2025. Retrieved 16 March 2025.
- ↑ "Dwarka Constituency Election Results 2025" (in ఇంగ్లీష్). The Times of India. 8 February 2025. Archived from the original on 16 March 2025. Retrieved 16 March 2025.