Jump to content

ఆదాయపు పన్ను

వికీపీడియా నుండి
కేరళ లోని ఆదాయపుపన్ను శాఖ కార్యాలయం చిత్రం

వ్యక్తులు, సంస్థలపై ప్రభుత్వం విధించే పన్నులలో ఆదాయపు పన్ను ముఖ్యమైంది. [1]) ఇది పన్ను చెల్లింపు సామర్థ్యాన్ని అనిసరంచి విధిస్తారు. అనగా తక్కువ ఆదాయమున్న వారు తక్కువ పన్ను, అధిక ఆదాయమున్న వారు అధిక పన్ను చెల్లించే విధంగా నిర్ణయిస్తారు. అంతేకాకుండా ఒక స్థాయి ఆదాయం వరకు అసలే పన్ను ఉండదు. ఈ స్థాయిని కనీస జీవన ప్రమాణాన్ననుసరించి ప్రతి దేశంలో వేర్వేరుగా ఉంటుంది. కాలం జర్గే కొలది ప్రజల ఆదాయాలు పెరగడం, ధరలు పెరగడం వల్ల ఆదాయపు పన్ను స్లాబులు తరచూ మార్పులకు గురౌతుంటాయి. శ్లాబ్ విధానం...

భారతదేశ ఆదాయపు పన్ను చరిత్ర

[మార్చు]

1857లో జరిగిన ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామం వల్ల అప్పటి బ్రీటీష్ ప్రభుత్వానికి తలెత్తిన ఆర్థిక ఇబ్బందుల వల్ల మొదటిసారిగా 1860లో మనదేశంలో ఆదాయపు పన్నును విధించడం జరిగింది. అప్పుడు ఆదాయపు పన్నుకై కనీస ఆదాయపు పరిమితిని రూ.200 గా నిర్ణయించారు. రూ.200 నుంచి రూ.500 ఆదాయం కలవారిపై 2% పన్నును, రూ.500 పైగా ఆదాయం కలవారిపై 4% ఆదాయపు పన్నును విధించడం జరిగింది. కాని 1886 వరకు ఈ పన్నును కొన్ని సం.లు విధించడం కొన్ని సం.లు విధించకపోవడం జరిగింది. 1886 నుంచి ఆదాయపు పన్నును ప్రతి సంవత్సరం విధించడం జరుగుతున్నది.

1914 వరకు ఆదాయపు పన్నులో పురోగామి విధానం పాటించారు. అనగా మొత్తం ఆదాయంపై ఒకే రేటు ఉండేది. 1939 వరకు ఆదాయపు పన్నును సోపాన పద్ధతిలో విధించారు. సోపాన పద్ధతిలో విభిన్న ఆదాయాల వారు భిన్న రేట్లలో ఆదాయంపై పన్ను చెల్లించవల్సి ఉండేది. ఆదాయం స్థాయి మార్పు చెందగానే మొత్తం పన్ను రేటు కూడా మార్పు చెందేది. ఉదాహరణకు రూ.1000 వరకు 2% పన్ను, రూ.1000 దాటితే 4% పన్నుగా భావిస్తే రూ.999 ఆదాయమున్న వ్యక్తి 2% చెల్లిస్తే, రూ.1001 ఆదాయమున్న వ్యక్తి 4% చెల్లించవలసి ఉండేది.

సోపాన పద్ధతిలోని లోపాలను తొలిగించడానికి 1939 నుంచి సమతల పద్ధతి (slab rate) లో ఆదాయపు పన్నును విధించడం జరుగుతున్నది. ఈ విధానంలో ఎంత ఆదాయమున్న వారైననూ నిర్ణీత ఆదాయ స్థాయిల మధ్య చెల్లించవలసిన పన్ను రేట్లు ఒకే విధంగా ఉంటాయి. ఉదాహరణకు పైన తెల్పిన రేట్లే పరిగణలోకి తీసుకుంటే సమతల పద్ధతిలో రూ.999 ఆదాయమున్న వ్యక్తి 2% పన్ను చెల్లిస్తే, రూ.1001 ఆదాయమున్న వ్యక్తి రూ.1000 వరకు 2% ప్రకారం పన్ను చెల్లించి, ఆపై ఆదాయమున్న రూ.1 కి మాత్రమే 4% పన్ను చెల్లించవలసి ఉంటుంది. ఆర్థిక పరిభాషలో చెప్పాలంటే ఈ పన్ను పద్ధతిలో ఉపాంత పన్ను రేటు, సగటు పన్ను రేటు వేరువేరుగా ఉంటుంది. 1939 లో పన్ను పరిధిలోకి ఆదాయాన్ని రూ.2000 గా నిర్ణయించారు. 1947లో ఆ పరిమితిని రూ.2500 కు పెంచారు. 1948లో రూ.3000, 1951లో రూ.3600, 1953లో రూ.4200 లకు పెంచారు. కాని 1957లో పన్నుల విచారణ కమిషన్ సిఫార్సులననుసరించి పన్ని మినహాయింపు స్థాయిని రూ.3000 కు తగ్గించబడింది. ఆ తర్వాత మళ్ళీ మినహాయింపు స్థాయిని క్రమక్రమంగా పెంచుతూ వచ్చారు. 1971-72 బడ్జెట్లో ఈ పరిమితిని రూ.5000 కు పెంచబడింది. 1986-87 సం.పు బడ్జెట్ లో రూ.18000 వరకు పెంచారు. ప్రస్తుతం మనదేశంలో ఆదాయపు పన్ను మినహాయింపు పరిమిరి రూ.250000 గా ఉంది.

ఉప పన్నులు

[మార్చు]

సర్చార్జి

[మార్చు]

ప్రస్తుతం ఆదాయ పన్ను పై ఎటువంటి సర్ ఛార్ఝీ లేదు.

ఎడ్యుకేషన్ సెస్

[మార్చు]

చెల్లింఛవలసిన ఆదాయ పన్ను పై 4 శాతం అదనంగా విద్య, ఉన్నత విద్యా పన్ను ఉంది.

ఆదాయపు పన్ను రేట్లు

[మార్చు]

2021-22 ఆర్థిక సంవత్సరంలో పన్నుల రేటులు ఈ విదంగా ఉన్నాయి.

  • రు.2,50,000/- వరకు ఆదాయం కలిగిన వారికి పన్ను లేదు.
  • రు.2,50,001/- నుండి రు.5,00,000/- వరకు పన్ను రేటు - 10 శాతం
  • రు.5,00,001/- నుండి రు.10,00,000/- వరకు పన్ను రేటు - 20 శాతం
  • రు.10,00,000/- ఆ పైన వారికి పన్ను రేటు - 30 శాతం

మూలాలు

[మార్చు]
  1. "IncomeTaxLogin". Archived from the original on 2018-08-30. Retrieved 2018-03-01.

వెెలుపలి లంకెలు

[మార్చు]