ఆదితి పోహంకర్
ఆదితి పోహంకర్ | |
---|---|
జననం | 1994 డిసెంబరు 31 |
వృత్తి | నటి, మోడల్ |
క్రియాశీల సంవత్సరాలు | 2014–ప్రస్తుతం |
ఆదితి పోహంకర్, మహారాష్ట్రకు చెందిన సినిమా నటి. 2014లో మరాఠీలో వచ్చిన లై భారీ యాక్షన్ సినిమాలో రితీష్ దేశ్‌ముఖ్‌తో కలిసి అద్భుతమైన పాత్రను పోషించింది.[1][2] షీ, ఆశ్రమ్ అనే హిందీ వెబ్ సిరీస్‌లలో నటించి గుర్తింపు పొందింది.[3]
జననం
[మార్చు]ఆదితి పోహంకర్ 1994 డిసెంబరు 31న సుధీర్ - శోభా పోహంకర్ దంపతులకు మహారాష్ట్రలోని ముంబైలో జన్మించింది.[4]
క్రీడారంగం
[మార్చు]ఆదితి తల్లిదండ్రులిద్దరూ అథ్లెట్లు. ఆదితి పాఠశాలలో ఉన్నప్పుడు, అథ్లెటిక్స్‌లో మహారాష్ట్రకు ప్రాతినిధ్యం వహించింది. 100 మీటర్లు, 200 మీటర్ల రేసుల్లో పతకాలు కూడా సాధించింది.[5]
ప్రకటనలు
[మార్చు]షూజిత్ సిర్కార్ దర్శకత్వం వహించిన క్యాడ్‌బరీ మంచ్, గోద్రెజ్, ఎయిర్‌టెల్, లెన్స్‌కార్ట్, శామ్‌సంగ్‌తో సహా ఇరవైకి పైగా బ్రాండ్ ప్రకటనలు, వాణిజ్య ప్రకటనలలో నటించింది.[1][6]ది టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్‌లో 2020లో 47వ ర్యాంక్‌ని పొందింది.[7]
సినిమారంగం
[మార్చు]నాటకరంగంలో తన నటనను ప్రారంభించింది. కునాసతి కునిటారిలో అనే సినిమాలో తొలిసారిగా నటించింది.[8][9] ఆదితి నటించిన టైమ్ బాయ్ అనే నాటక ప్రదర్శన చూసిన దర్శకుడు నిషికాంత్ కామత్, తన మరాఠీ సినిమా లై భారీ (2014)లో అవకాశం ఇచ్చాడు.[10] ఆ సినిమాలో తన నటనకు సానుకూల సమీక్షలకు అందుకుంది.[11][12]
సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా | పాత్ర | భాష | ఇతర వివరాలు |
---|---|---|---|---|
2014 | లై భారీ | నందిని | మరాఠీ | |
2017 | జెమినీ గణేశనుం సురుళి రాజనుమ్ | సరోజా దేవి | తమిళం | |
2020–ప్రస్తుతం | షీ | భూమికా పరదేశి/భూమి | హిందీ | నెట్‌ఫ్లిక్స్ సిరీస్ |
2020–ప్రస్తుతం | ఆశ్రమం | పర్మీందర్/పమ్మి | హిందీ | ఎంఎక్స్ ప్లేయర్ సిరీస్ |
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "Lai Bhaari star Aaditi to make Bollywood Khans her mentors : Bollywood Helpline". Archived from the original on 2022-11-08. Retrieved 2022-06-16.
- ↑ Singh, Suhani (February 27, 2021). "The OTT Generation". India Today. Retrieved 2021-03-22.
- ↑ "Aaditi Pohankar: I want people to remember my roles". Hindustan Times. 2021-01-30. Retrieved 2021-03-22.
- ↑ Santhosh, K. (28 October 2012). "Straddling stage, screen and stadium". The Hindu. Archived from the original on 23 March 2020. Retrieved 23 March 2020.
- ↑ Ramnath, Nandini (Mar 25, 2020). "'I have arrived': How web series 'She' has given Aaditi Pohankar the role of a lifetime". Scroll.in. Retrieved 2021-03-22.
- ↑ "When Aaditi Pohankar went fishing with the King - Sushant Singh Rajput!". Urban Asian. 6 October 2015. Archived from the original on 23 March 2020. Retrieved 23 March 2020.
- ↑ "The Times Most Desirable Women of 2020". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 8 June 2021. Retrieved 2021-08-07.
- ↑ Santhosh, K. (28 October 2012). "Straddling stage, screen and stadium". The Hindu. Archived from the original on 23 March 2020. Retrieved 23 March 2020.
- ↑ "Aaditi to debut in Mollywood - Times of India". The Times of India. Archived from the original on 4 December 2017. Retrieved 23 March 2020.
- ↑ "Lai Bhaari star Aaditi to make Bollywood Khans her mentors : Bollywood Helpline". Archived from the original on 2022-11-08. Retrieved 2022-06-16.
- ↑ "Review: Lai Bhaari is awesome". Rediff. Archived from the original on 23 March 2020. Retrieved 23 March 2020.
- ↑ "Interview : Aditi Pohankar : Vile Yet beautiful". Satarblockbuster. Archived from the original on 25 April 2017.
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో ఆదితి పోహంకర్ పేజీ