ఆదిభట్ల కైలాసం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆదిభట్ల కైలాసం భారతీయ కమ్యూనిస్టు పార్టీ నాయకుడు. ఆయన శ్రీకాకుళం ఉద్యమం లో ప్రముఖ నాయకుడు.

జీవిత విశేషాలు[మార్చు]

ఆయన శ్రీకాకుళం జిల్లా లోని కారివలస గ్రామం (ప్రస్తుతం విజయనగరం జిల్లా) లో భూస్వామ్య కుటుంబానికి చెందినవారు. ఆయన 1970 లో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు-లెనినిస్టు) లో చేరి పార్టీ కాంగ్రెస్ సమావేశంలో కేంద్ర కమిటీకి ఎన్నికైనాడు. ఆయన వృత్తిపరంగా పాఠశాల ఉపాధ్యాయుడు. 1960ల ప్రారంభంలో ఆయన, ఆయన సహచరుడు వెంపటాపు సత్యం తో కలసి శ్రీకాకుళ గిరిజన పోరాటానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర విభాగాలు వారిపై క్రిమినల్ కేసులు పెట్టాయి. వారు అజ్ఞాతంలోనికి వెళ్ళడానికి నిశ్చయించారు. జూలై 7, 1970 న కైలాసం, సత్యం పోలీసులకు పట్టుబడ్డారు. ఆ తరువాత వారు కాల్చి చంపబడ్డారు. [1]

ఉద్యమం అణచివేత[మార్చు]

ఈ నేపథ్యంలో నాటి ప్రభుత్వం పోలీసు బల ప్రయోగంతో ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నం చేసింది. ఈ సమయంలో వెంపటాపు సత్యం, ఆదిభట్ల కైలాసం తదితర నాయకులు అజ్ఞాతంలోకి వెళ్లి సాయుధ పోరాటాన్ని ప్రారంభించారు. 1967 నుంచి 70 వరకు వందలాదిగా సంఘటనలు జరిగాయి. భూస్వాములు హత్యలు, పోలీసు, సీఆర్పీఎఫ్ గాలింపు చర్యలు, ఎన్‌కౌంటర్లు జరిగాయి. ఇదే సమయంలో పశ్చిమ బెంగాల్లో నక్సల్బరీ ఉద్యమం ఉధృతంగా సాగుతోంది. ఈ రెండు ఉద్యమాలకు భావసారూప్యత గల కారణాలుగా ఆ నాటి నక్సలైట్ పార్టీ జాతీయ నాయకులు చారూ మజుందార్, కానూసన్యాల్, నాగభూషణ్ పట్నాయిక్ తదితర నాయకులు ఉద్యమాన్ని అన్ని విధాలా ప్రోత్సహిస్తూ సహాయ సహకారాలు అందించారు. చివరకు 1970, జూలై 10న వెంపటాపు సత్యం, ఆదిభట్ల కైలాసంలు కురుపాం సమీపంలోని కొండల్లో ఉన్నట్లు సమాచారంతో పోలీసులు వీరిని చుటుముట్టి ఎన్‌కౌంటరు చేశారు. ఆ తరువాత పలువురు నాయకులను అరెస్టులు చేయడంతో నాటి ఉద్యమం బలహీనపడింది.[2]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]