ఆదిరాజు వెంకటేశ్వరరావు
ఆదిరాజు వెంకటేశ్వరరావు | |
---|---|
జననం | 1938 పండితాపురం, కామేపల్లి మండలం, ఖమ్మం జిల్లా |
మరణం | జూన్ 14, 2018 హైదరాబాదు, తెలంగాణ |
నివాస ప్రాంతం | హైదరాబాదు |
ప్రసిద్ధి | తొలితరం (1969) తెలంగాణ ఉద్యమకారుడు, సీనియర్ పాత్రికేయుడు, రచయిత |
మతం | హిందూ |
పిల్లలు | ముగ్గురు కుమారులు, ఓ కుమార్తె |
ఆదిరాజు వెంకటేశ్వరరావు (1938 - జూన్ 14, 2018) తొలితరం (1969) తెలంగాణ ఉద్యమకారుడు, సీనియర్ పాత్రికేయుడు, రచయిత, ప్రజాతంత్ర వ్యవస్థాపకుల్లో ఒకరు.[1] 1969 ఉద్యమ సమయంలో 21 రోజులు జైలుకెళ్లిన ఏకైక పాత్రికేయుడు.[2]
జననం
[మార్చు]వెంకటేశ్వరరావు 1938లో ఖమ్మం జిల్లా, కామేపల్లి మండలం, పండితాపురం గ్రామంలోని రైతు కుటుంబంలో జన్మించాడు.[3]
పాత్రికేయరంగం
[మార్చు]పలు తెలుగు, ఇంగ్లీష్ పత్రికల్లో జర్నలిస్టుగా పనిచేయడమేకాకుండా. జనతా, రాజధాని (1981-83) పత్రికలను నడిపాడు. 1969 తెలంగాణ విమోచనోద్యమంలో పాల్గొన్నప్పుడు 21 రోజుల పాటు ముషీరాబాద్ జైలులో ఉన్న వెంకటేశ్వరరావు రాసిన ‘‘పీపుల్స్ స్ట్రగుల్’’ అనే పుస్తకం చాలా ప్రాచుర్యం పొందింది. మలిదశ ఉద్యమాన్ని కూడా అక్షరబద్ధం చేశాడు. దేశమంతటా తిరిగి వివిధాంశాలపై వ్యాసాలు రాయడమేకాకుండా అమెరికా, బ్రిటన్, స్విట్జర్లాండ్ దేశాల్లో కూడా ఆయన పర్యటించడంతోపాటు ఐక్యరాజ్య సమితి భద్రతామండలి, ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాలపై కూడా వార్తలను రాశాడు. పాత్రికేయునిగా హైదరాబాద్, ఢిల్లీలో పని చేసిన ఆదిరాజు రాసే ఉత్తరాలకు మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ తిరిగి రిప్లై ఇచ్చేవారు.
రచనా రంగం
[మార్చు]వెంకటేశ్వరరావు తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో దాదాపు 15 పుస్తకాలను రాశారు. అందులో చాలావరకు సంచలనాలు సృష్టించాయి.
తెలుగు:
- తెలంగాణ పోరాటం
- హంతకులు ఎవరు
- మహానాయకుడు మర్రిచెన్నారెడ్డి
- ఆంధ్రా, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు-కొన్ని గుణపాఠాలు
- నక్సలిజం-పెరిగిపోతున్న అరాచకాలు
- చంద్రబాబు బండారం
- తెలంగాణ రాష్ర్టోద్యమాలు
ఇంగ్లీష్:
- గాంధీ టు గాంధీ
- ద రైట్ ప్రైమ్‌మినిష్టర్
- నెహ్రూస్
- గాంధీస్ గ్రూప్స్
- సిఖ్స్ అండ్ ఇండి యా- ఐడెంటిటీ క్రైసిస్
- అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ చంద్రబాబునాయుడు
- వై తెలంగాణ ఎ సెపరేట్ స్టేట్
- నక్సలిజం ఎట్ క్రాస్ రోడ్స్
పురస్కారాలు
[మార్చు]- తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పురస్కారాలు - 2018లో భాగంగా జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నుండి పురస్కారం అందజేయబడింది.[4][5][6]
మరణం
[మార్చు]వెంకటేశ్వరరావు 2018, జూన్ 14వ తేదీ రాత్రి 11.30 కు హైదరాబాదు మెహిదీపట్నం దత్తాత్రేయనగర్ కాలనీలోని తన నివాసంలో మరణించాడు.[2]
మూలాలు
[మార్చు]- ↑ "Veteran journalist Adiraju passes away". The Hindu. Special Correspondent, Special Correspondent. 2018-06-16. ISSN 0971-751X. Retrieved 2018-06-18.
{{cite news}}
: CS1 maint: others (link) - ↑ 2.0 2.1 నమస్తే తెలంగాణ (15 June 2018). "ఆదిరాజు వెంకటేశ్వరరావు మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం". Archived from the original on 17 June 2018. Retrieved 17 June 2018.
- ↑ ఆంధ్రజ్యోతి, తెలంగాణ ముఖ్యాంశాలు (16 June 2018). "ఆదిరాజు కన్నుమూత". Archived from the original on 17 June 2018. Retrieved 17 June 2018.
- ↑ నమస్తే తెలంగాణ (31 May 2018). "రాష్ట్ర ఆవిర్భావ పురస్కారాలు". Archived from the original on 2018-06-14. Retrieved 18 June 2018.
- ↑ ఆంధ్రజ్యోతి (31 May 2018). "విశిష్ట పురస్కారాలు". Retrieved 18 June 2018.[permanent dead link]
- ↑ మనం న్యూస్ (6 June 2018). "తెలంగాణ కళకు ఘనసత్కారం". Retrieved 18 June 2018.[permanent dead link]
- All articles with dead external links
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- 1938 జననాలు
- తెలుగువారు
- 2018 మరణాలు
- తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పురస్కార గ్రహీతలు
- ఖమ్మం జిల్లా పాత్రికేయులు
- ఖమ్మం జిల్లా రచయితలు
- మొదటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఖమ్మం జిల్లా వ్యక్తులు