ఆదిలాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల
ఆదిలాబాద్ డిగ్రీ కాలేజీ | |
| రకం | సైన్స్ కాలేజ్ |
|---|---|
| స్థాపితం | 1957 |
| స్థానం | ఆదిలాబాద్
ఆదిలాబాదు జిల్లా, తెలంగాణ, భారతదేశం 19°24′04″N 78°18′53″E / 19.4012°N 78.3148°E |
| కాంపస్ | పట్టణ |
| అనుబంధాలు | కాకతీయ విశ్వవిద్యాలయము |
| జాలగూడు | కళాశాల అధికారిక వెబ్సైటు |

ఆదిలాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల సైన్స్ తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్ జిల్లా, ఆదిలాబాదు లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కాకతీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో 1957 ఏప్రిల్ 01న స్థాపించారు. ఆదిలాబాద్ పట్టణంలోని శాంతినగర్ కాలనీలో ఉంది. జాతీయ స్థాయిలో న్యాక్ ద్వారా 'బి' గ్రేడ్ సాధించింది. ఇది ప్రస్తుతం 16 ఎకరాల విస్తీర్ణంలో నడపబడుతుంది.[1][2][3]
ప్రారంభం
[మార్చు]ఆదిలాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల 1957 ఏప్రిల్ 01న ప్రారంభించారు. అప్పటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఈ కళాశాల ఎంతో మంది విద్యార్థులను విద్యా వంతులుగా తీర్చిదిద్ది ఉన్నత స్థాయికి చేర్చింది. ఆదిలాబాద్ దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న విద్యార్థినీ, విద్యార్థులకు విద్యను అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఆదిలాబాద్ పట్టణం ఉమ్మడి జిల్లాకు ప్రధాన కార్యాలయం, మహారాష్ట్రకు సమీపంలో ఉండటంతో ఇచ్చట బహుభాషా సంస్కృతి సంప్రదాయాలు ఆచారాలకు పుట్టినిల్లు అయింది. తెలుగు, ఉర్దూ, హిందీ భాషతో పాటు లిపి లేని భాషలూ అనేకం ఉన్నాయి. ఈ కళాశాలలో చదివిన విద్యార్థులు వివిధ ఉన్నత పదవులలో దేశ విదేశాలలో వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్నారు. మరికోందరు రాజకీయాల్లో రాణిస్తున్నారు. మరికొందరు దేశ సేవలో, విదేశాల్లో ఐటీ సంస్థలో పనిచేస్తు ఉన్నత స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు.
మౌలిక సదుపాయాలు
[మార్చు]ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆదిలాబాద్ లో విద్యార్థులకు నాణ్యమైన విద్యాను అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఐసిటి , ప్రభావంతమైన బోధనా పద్ధతులను ఉపయోగించి మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తుంది[4].విశాలమైన తరగతులున్న ఈ కళాశాలలో విద్యార్థులకు నాణ్యమైన బోధన, అభ్యాసన కరదీపికలను అందజేస్తూ, సామర్థ్యాల పై దృష్టి సారించడం.కళాశాలలో గ్రంథాలయం, కంప్యూటర్ గదులు, ఇంటర్నెట్ సౌకర్యాలు, ల్యాబ్ రేటరి, ఆటస్థలం, జీమ్ సౌకర్యాలు,జాతీయ సేవా పథకం, నేషనల్ క్యాడెట్ కార్ప్స ఈ రెండు కార్యక్రమాలు యువత అభివృద్ధి ఉద్యమం కోసం, జాతి నిర్మాణానికి అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. విద్యార్థుల్లో సృజనాత్మకమైన పఠన అలవాట్లు చేస్తూ విద్యార్థులను ప్రోత్సహించడం జరుగుతుంది.
కోర్సులు
[మార్చు]బీఎస్ సి సైన్స్ లో వృక్షశాస్త్రం, జంతు శాస్త్రం, రసాయన శాస్త్రం తెలుగు, హిందీ,ఆంగ్లం, ఉర్దూ మాధ్యమం ద్వారా బోధన జరుగుతుంది. ఏం.ఎస్.సి జంతుశాస్త్రంలో పీజీ డిగ్రీ ఉంది.
ప్రాంగణం
[మార్చు]తెలంగాణ ప్రభుత్వం కేటాయించిన 16 ఎకరాల స్థలంలో విశాలమైన క్రీడా మైదానం ఉంది. అందులో విశాలమైన రోడ్లు, రోడ్డుకు ఇరువైపులా చేట్లు, హరిత హారం వనం, ఆటస్థలం , జిమ్ మొదలగు ఉన్నాయి.
న్యాక్ గుర్తింపు
[మార్చు]ఆదిలాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు జాతీయ స్థాయి గుర్తింపు జాబితాలో చోటు లభించింది. ఈ కళాశాలకు తొలి సారిగా 2006 లో జాతీయ మదింపు, గుర్తింపు సంస్థ (ఆంగ్లం: నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్, (న్యాక్) అనేది భారతదేశంలోని ఒక ప్రభుత్వ సంస్థ ఈ సంస్థ ద్వారా B గ్రేడ్ గుర్తింపు పొందింది. 2014 డిసెంబరు అదే B గ్రేడ్ తిరిగి లభించడం విశేషం. ఈ కళాశాల జాతీయ స్థాయిలో గుర్తింపు న్యాక్ A గ్రేడ్ సాధించడానికి ప్రయత్నం చేస్తూ ముందుకు అడుగులు వేస్తోంది.
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు
[మార్చు]ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం నాలుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి.అవి
- ప్రభుత్వ డిగ్రీ కళాశాల సైన్స్ ఆదిలాబాద్
- ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆర్ట్స్ & కామర్స్ ఆదిలాబాద్
- ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇచ్చోడ ఆదిలాబాద్
- ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉట్నూర్, ఆదిలాబాద్
మూలాలు
[మార్చు]- ↑ Velugu, V6 (2024-09-18). "ఆదిలాబాద్లో లిబరేషన్ డే ఫొటో ఎగ్జిబిషన్". V6 Velugu. Retrieved 2025-03-24.
{{cite web}}: zero width space character in|title=at position 10 (help)CS1 maint: numeric names: authors list (link) - ↑ shamsh.in (2024-05-09). "Govt Degree Colleges in Telangana". shamsh.in (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2025-03-24.
- ↑ ABN (2021-03-15). "ఆదిలాబాద్ డిగ్రీ కళాశాలకు ఘనమైన చరిత్ర". Andhrajyothy Telugu News. Retrieved 2025-03-24.
- ↑ Today, Telangana (2024-08-13). "Adilabad girl achieves ranks in seven subjects in CPGET". Telangana Today (in ఇంగ్లీష్). Retrieved 2025-03-24.