ఆది గోద్రేజ్
| ఆది బుర్జోర్జీ గోద్రేజ్ | |
|---|---|
| జననం | 1942 ఏప్రిల్ 5 బాంబే, బాంబే ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా |
| వృత్తి | గోద్రేజ్ గ్రూప్ ఛైర్మన్ |
| భార్య / భర్త | పరమేశ్వర్ గోద్రేజ్ (మరణం 2016) |
| పిల్లలు | నిసా గోద్రెజ్ పిరోజ్ షా గోద్రెజ్ తాన్యా దుబాష్ |
ఆది బుర్జోర్జీ గోద్రేజ్ (జననం 1942 ఏప్రిల్ 3), ఒక భారతీయ బిలియనీర్ వ్యాపారవేత్త, గోద్రేజ్ కుటుంబానికి చెందినవాడు, గోద్రేజ్ గ్రూప్ ఛైర్మన్. నవంబరు 2025 నాటికి, అతని నికర విలువ 4 బిలియన్ల అమెరికన్ డాలర్లు.[1]
ప్రారంభ జీవితం
[మార్చు]ఆది గోద్రేజ్ తన విద్యను ముంబైలోని సెయింట్ జేవియర్స్ హైస్కూల్, తరువాత సెయింట్ జవియర్స్ కాలేజ్ లలో చదివాడు.[2] అతను హెచ్ఎల్ కళాశాల నుండి అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీని, ఎంఐటి స్లోన్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ నుండి ఎంబిఎ పూర్తి చేసాడు, అక్కడ అతను పై లాంబ్డా ఫై, టౌ బీటా పై ల సభ్యుడు.
కెరీర్
[మార్చు]భారతదేశానికి తిరిగి వచ్చిన తరువాత, అతను కుటుంబ వ్యాపారంలో చేరి నిర్వహణను ఆధునీకరించాడు, ప్రక్రియలు మెరుగుపరిచాడు. లైసెన్స్ రాజ్ సమయంలో కంపెనీని మెరుగుపరిచాడు. అతను గోద్రేజ్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్, గోద్రేజ్ అగ్రోవెట్ ఛైర్మన్ నాదిర్ గోద్రేజ్ ల బంధువు, గోద్రేజ్ అండ్ బాయ్స్ మేనేజింగ్ డైరెక్టర్, ఛైర్మన్ జంషిద్ గోద్రేజ్ లతో కలిసి ఈ గ్రూపుకు నాయకత్వం వహించాడు.
2021లో ఆయన గోద్రేజ్ గ్రూప్ హోల్డింగ్ కంపెనీ అయిన గోద్రేజ్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ పదవి నుంచి వైదొలగడానికి తన ప్రణాళికలను ప్రకటించాడు. అతను గోద్రేజ్ గ్రూప్ ఛైర్మన్ గా, జిఐఎల్ ఎమెరిటస్ ఛైర్మన్ గా కొనసాగుతున్నాడు.[3]
అంతర్జాతీయ విస్తరణకు 3X3 విధానం ఆధారంగా గోద్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ బలమైన అభివృద్ధి చెందుతున్న మార్కెట్ ఎఫ్ఎంసిజి ప్లేయర్ గా ఎదిగింది. మూడు అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో (ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా) మూడు విభాగాలలో (ఇంటి సంరక్షణ, వ్యక్తిగత శుభ్రత, జుట్టు సంరక్షణ) ఉనికిని పెంచుకుంది.[3]
ఇతర పదవులు
[మార్చు]ఆయన అనేక భారతీయ వాణిజ్య, పారిశ్రామిక సంస్థలు, సంఘాలకు అధ్యక్షుడిగా ఉన్నాడు.
ఆయన ఏప్రిల్ 2011 నుండి ఏప్రిల్ 2018 వరకు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ కు ఛైర్మన్ గా ఉన్నాడు.[3] 2012–13 సంవత్సరానికి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ[3] అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఆయన ఎమ్ఐటి స్లోన్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ డీన్ సలహా మండలి సభ్యుడిగా, నార్సీ మోంజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ గవర్నర్ల బోర్డు ఛైర్మన్‌గా ఉన్నాడు.[3]
గోద్రేజ్ హోల్డింగ్ కంపెనీలో ఇరవై ఐదు శాతం వాటాలు పిరోజ్షా గోద్రేజ్ ఫౌండేషన్, సూనాబాయి పిరోజ్షా గోద్రేజ్ ఫౌండేశన్, గోద్రేజ్ మెమోరియల్ ట్రస్ట్లతో సహా ట్రస్టులలో ఉన్నాయి.[3] ఈ ట్రస్టుల ద్వారా, మడ అడవులు, టీచ్ ఫర్ ఇండియా, డబ్ల్యుడబ్ల్యుఎఫ్, గోద్రేజ్ మెమోరియల్ హాస్పిటల్ వంటి ఆరోగ్య సంరక్షణ, విద్య, పర్యావరణ సుస్థిరత కార్యక్రమాలకు గ్రూప్ మద్దతు ఇస్తుంది.[3]
వ్యక్తిగత జీవితం
[మార్చు]అతను సామాజికవేత్త పరమేశ్వర్ గోద్రేజ్ (మ. అక్టోబరు 2016)ను వివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు.