Jump to content

ఆది రత్నేశ్వర ఆలయం

Coordinates: 9°47′0″N 78°55′10″E / 9.78333°N 78.91944°E / 9.78333; 78.91944
వికీపీడియా నుండి
ఆది రత్నేశ్వర ఆలయం
భౌగోళికం
భౌగోళికాంశాలు9°47′0″N 78°55′10″E / 9.78333°N 78.91944°E / 9.78333; 78.91944
దేశంభారతదేశం
రాష్ట్రంతమిళనాడు
జిల్లారామనాథపురం
సంస్కృతి
దైవంశివుడు
వాస్తుశైలి
నిర్మాణ శైలులుద్రావిడ శిల్పకళ

తమిళనాడు రాష్ట్రంలోని తిరువడనై పట్టణంలో ఉన్న ఆది రత్నేశ్వర ఆలయం శివుడు అధిదేవతగా ఉన్న హిందూ దేవాలయం.

పురాణగాథ

[మార్చు]

తిరువదనై, తమిళనాడు లోని అనేక ఆలయ పట్టణాలలో ఒకటి. ఈ ప్రాంతంలో ఒక రకం చెట్టు విస్తారంగా ఉండే అడవులు ఉంటాయి. ఈ చెట్లే ఇక్కడి స్వామికి కూడా నీడనిచ్చాయి. ఆ చెట్టు పేరిటే ఈ గ్రామానికి ఈ పేరు వచ్చింది. ఈ ప్రాంతమంతా బిల్వ వృక్షాలు విరివిగా ఉన్న అడవి ఉండేది. అందుకే దీన్ని బిల్వవనం అని అంటారు.[1] పురాణాల ప్రకారం, వానదేవుడైన వరుణుడి కుమారుణ్ణి, ఏనుగు శరీరంతో మేక తలతో జన్మించమని ఒక ఋషి శపించాడు. ఈ ఆలయంలో శివుడిని పూజించిన తర్వాత అతను తన సాధారణ రూపాన్ని తిరిగి పొందాడు. ఈ పట్టణం పేరు ఈ పౌరాణిక సంఘటన నుండి ఉద్భవించిందని కూడా నమ్ముతారు (తిరు - పవిత్ర; అడు - మేక; ఆనై - ఏనుగు; తిరు అదానై - మేక తల గల ఏనుగు తన అసలు రూపాన్ని తిరిగి పొందిన పవిత్ర స్థలం). [2]

సూర్య దేవుడు ఇక్కడ నీలిరంగు వజ్రపు శివుని ప్రతిమను పూజించాడని చెబుతారు. భృగు మహర్షి కూడా ఇక్కడి మూర్తిని పూజించాడని నమ్ముతారు.

పాండవుల వనవాస సమయంలో, అర్జునుడు శివుడి నుండి పాశుపతాస్త్రాన్ని పొందాడని మరొక ప్రసిద్ధ నమ్మకం. ఆ అస్త్ర ప్రయోగాన్ని నేర్చుకోవడానికి తిరువదనైకి రమ్మని శివుడు అతనిని కోరాడు. తన భక్తికి చిహ్నంగా అర్జునుడు, ఈ ఆలయంలో సోమస్కంద మందిరాన్ని ప్రతిష్టించాడు.[3]

చరిత్ర

[మార్చు]

ఇది 275 పాడల్ పేట్ర స్థలాలలో[గమనిక 1] ఒకటి. పాండియ నాడు (తమిళనాడులోని ఆగ్నేయ భాగం) లో ఉన్న తేవరం శ్లోకాలలో ప్రశంసించబడిన 14 శివాలయాలలో ఇది ఒకటి. అగస్త్య, మార్కండేయ ఋషులు, కామధేనువు ఇక్కడి స్వామిని పూజించారు. ఆలయంలోని మురుగన్ స్వామిని, అరుణగిరినాథర్ రాసిన తిరుపుగజ్ శ్లోకాలలో అర్చించాడు.[4][5]

శిల్పకళ

[మార్చు]

ఈ ఆలయ గోపురం పైఅంతస్థులు ద్రావిడ కళకు ఒక నమూనా. దీనిని రాష్ట్రంలోని కొంతమంది సినీనటుల విరాళాల ద్వారా పునరుద్ధరించారు. గోపురంపై హిందూ పురాణాల లోని వివిధ కథలను వర్ణించే చిత్రాలున్నాయి. ఈ చిత్రాలను ఆయిలుతో చిత్రించారు. ఆలయ ప్రాంగణం నుండి దాదాపు 10 మైళ్ల దూరం నుండి ఈ గోపురం కనిపిస్తుంది.[2]

ప్రాముఖ్యత

[మార్చు]

భక్తులు తమ గత కర్మల దుష్ప్రభావాల నుండి ముక్తి పొందేందుకు ఆదిరత్నేశ్వరుడిని ప్రార్థిస్తారు. సంతానం కోసం అమ్మవారికి ప్రత్యేక శుక్రహోమాలు నిర్వహిస్తారు. శుక్రదశలో ఉన్నవారు ఈ ఆలయంలో అమ్మవారిని ప్రార్థించాలని నమ్ముతారు.[3][6]

స్నేహవల్లి తల్లి శుక్ర గ్రహానికి దేవత. తిరువణ్ణామలై, వైతీశ్వరన్ కోయిల్‌లోని నాడి జ్యోతిష్యాన్ని సంప్రదించేవారు ఈ ఆలయానికి వచ్చి పరిహార పూజలు నిర్వహిస్తారు.[7]

తమిళ కవి సంబంధర్ ఇక్కడే తేవార పతిగం రచించినట్లు తెలుస్తోంది.

సూర్య భగవానునికి పూజలు చేసే శివాలయాలలో ఇది ఒకటి. సూర్యుడు శివుడిని నీలమణి రత్నాలతో చేసిన వేదికపై ఉంచి పూజించాడని నమ్ముతారు, అందుకే ఆయనకు ఆదిరత్నేశ్వరుడు అనే పేరు వచ్చింది. మధ్యాహ్నం అభిషేకాలు చేసేటప్పుడు, దేవుడు నీలం రంగులో కనిపిస్తాడు.[6]

ఆలయంలో జరిగే పండుగలు

[మార్చు]
  • మే-జూన్‌లో 10 రోజుల వైకాశి విశాఖ వసంత ఉత్సవం (వేసవి పండుగ)
  • జూలై-ఆగస్టులో 15 రోజుల ఆదిపూరం
  • సెప్టెంబరు–అక్టోబరుల్లో నవరాత్రి
  • (అన్ని నెలల్లో పౌర్ణమి, అమావాస్య పక్షాలలో 13వ రోజు శివ-ప్రదోషాలు)
  • నవంబరు-డిసెంబరులో కార్తికం, అవని మాసంలో చతుర్థి (ఆగస్టు-సెప్టెంబరు)
ఆలయం ఫొటో

గ్యాలరీ

[మార్చు]

గమనికలు

[మార్చు]
  1. ఇది తమిళ భాషా పదబంధం. వైష్ణవాలయాల్లో వైష్ణవ దివ్యదేశాలు ఎలాగో శైవులకు పాడల్ పేట్ర స్థలాలు అలాంటివి. శైవ నాయనార్లు భజించిన 275 శివాలయాలను పాడల్ పేట్ర స్థలాలు అంటారు.

మూలాలు

[మార్చు]
  1. Reddy, G.Venkatramana (2013). Alayam - The Hindu temple - An epitome of Hindu Culture. Mylapore, Chennai: Sri Ramakrishna Math. p. 10. ISBN 978-81-7823-542-4.
  2. 2.0 2.1 "Hindu Books - Tiruvadanai". Archived from the original on 29 October 2013. Retrieved 27 October 2013.
  3. 3.0 3.1 "Sri Adhi Ratneswarar temple- Thiruvadanai". Archived from the original on 29 October 2013. Retrieved 27 October 2013.
  4. "Times of Hindu : Sri Adhi Ratneswarar Temple, Thiruvadanai". Retrieved 27 October 2013.
  5. Reddy, G.Venkatramana (2013). Alayam - The Hindu temple - An epitome of Hindu Culture. Mylapore, Chennai: Sri Ramakrishna Math. p. 10. ISBN 978-81-7823-542-4.
  6. 6.0 6.1 "Times of Hindu : Sri Adhi Ratneswarar Temple, Thiruvadanai". Retrieved 27 October 2013.
  7. Reddy, G.Venkatramana (2013). Alayam - The Hindu temple - An epitome of Hindu Culture. Mylapore, Chennai: Sri Ramakrishna Math. p. 10. ISBN 978-81-7823-542-4.