ఆధునిక వాదం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దస్త్రం:Hans Hofmann's painting 'The Gate', 1959–60.jpg
హన్స్ హాఫ్మన్, "ది గేట్", 1959-1960, కలక్షన్: సాలమన్ R. గుగ్గెన్‌హీం మ్యూజియం. హాఫ్‌మన్ తన స్వస్థలం జర్మనీలో, ఆ తర్వాత "U.S."లోనూ, కళాకారుడిగా మాత్రమే కాక, కళ, ఆధునికవాదపు సిధ్ధాంతకర్తగా కూడా ప్రసిధ్ధిగాంచాడు. 1960వ దశాబ్దంలో, అతను న్యూ యార్క్‌లోనూ మరియు కాలిఫోర్నియా్‌లోనూ, ఆధునికవాదాన్నీ, ఆధునికవాద సిధ్ధాంతాలనీ కొత్త తరపు అమెరికన్ కళాకారులకి పరిచయం చేసాడు.తన బోధనలతో మరియూ ప్రసంగాలతో, గ్రీన్‌విచ్ గ్రామం మరియు ప్రొవిన్స్‌టౌన్, మసాచుసెట్స్‌లోని కళా పాఠశాలలలో, అతను అమెరికాలో ఆధునికవాదపు పరిధిని విశాలం చేసాడు [1]

ఆధునికవాదానికి స్పష్టమైన నిర్వచనం - ఆధునిక ఆలోచన, లక్షణము లేదా అభ్యాసము. మరింత నిర్దిష్టంగా చెప్పాలంటే అది 19వ శతాబ్దపు చివరికాలంలో, 20వ శతాబ్దపు మొదటి కాలంలో పాశ్చాత్య సమాజంలో చోటు చేసుకున్న విస్తారమైన, అనేక పరిణామాలకు దారి తీసే మార్పులకి సంబంధించిన సాంస్కృతిక పోకడల సమాహారం మరియు సంబంధిత సాంస్కృతిక ఉద్యమాల అమరిక. క్రొత్త ఆర్ధిక, సామాజిక మరియు రాజకీయ పరిస్థితుల నేపధ్యంలో పూర్తిగా పారిశ్రమీకరించబడుతోన్న ప్రపంచంలో సంప్రదాయ సిధ్ధమైన కళ, వాస్తుశాస్త్రం, సాహిత్యం, మతవిశ్వాసం, సామాజిక వ్యవస్థ మరియు దైనందిన జీవనశైలి - ఇవన్నీ పాతబడి పోతున్నాయన్న వారి కార్యకలాపాలూ, ఆలోచనా ధోరణులు విశదీకరించే పదమే ఆధునిక వాదం (Modernism).

ఒక దయాపూరితుడైన, సర్వశక్తిమంతుడైన సృష్టికర్త యొక్క ఉనికినీ, మరియు నిశ్చయమైన భగవత్ జ్ఞానోదయం దానికి సంబంధించిన ఆలోచనలని ఆధునిక వాదం తిరస్కరించింది.[2][3] అలాగని ఆధునికవాదులు లేదా ఆధునికవాద ఉద్యమాలూ మతాన్నీ లేదా భగవత్ జ్ఞానోదయానికి సంబంధించిన ప్రతి విషయాన్నీ తిరస్కరించించాయని చెప్పలేము. కానీ ఆధునికవాదాన్ని పూర్వకాలంలో ప్రామాణికమైన సార్వజనీనసత్యాలని ప్రశ్నించే తత్వంగా చూడవచ్చు.

ఆధునికవాదం యొక్క ముఖ్య లక్షణం ఆత్మస్పృహ. ఇది ఆకృతి, పని మీద ప్రయోగాలు చేయడానికి దారితీసి ఉపయోగించిన పధ్ధతులూ, పదార్థాల మీదా (వ్యక్తీకరించలేని పోకడల మీదా) దృష్టి పడేలా చేసింది.[4] కవి ఎజ్రా పౌండ్ యొక్క అవగాహనాపూరితమైన ఉత్తర్వు, "దానిని నూతనంగా మార్చు!". ఆధునికవాదుల "నూతనంగా మార్చడం" అనే ప్రక్రియ ఒక క్రొత్త చారిత్రాత్మకమైన శకమా కాదా అనేది వివాదాంశం. తర్వవేత్త మరియు రచయిత థియోదోర్ అడోర్నో మనల్ని ఇలా హెచ్చరిస్తాడు:

"ఆధునికత ఒక గుణాత్మకమైన స్థితి, అది కాలక్రమానుసారమైనది కాదు. దాన్ని ఎలాగైతే వ్యక్తీకరించలేని ఆకృతిగా మార్చలేమో, అంతే సమానమైన అవసరంతో పైకి కనపడే ప్రామాణికమైన పొందికను, కేవలం ప్రత్యామ్నాయం వల్ల కనపడే సమతాళమును తిరస్కరించాలి"[5]

అబద్దపు తర్కం యొక్క తిరస్కారం ఇంకా జ్ఞానోదయానికి దారి తీసే ఆలోచన, కళ, మరియు సంగీతం యొక్క పొందిక ఆధునికత అని అర్థం చేసుకొమ్మని అడోర్నో మనల్ని కోరతాడు. కానీ గతం అతుకుల బొంతగా ఉంది. ఉన్న పధ్ధతులని నూతనంగా చేయమనే పౌండ్ యొక్క సాధారణ ఉత్తర్వు మరియు అబద్దపు పొందికనూ, సమతాళాన్నీ తిరస్కరించమనే అడోర్నో ఉద్భోదమూ, T. S. ఎలియట్ యొక్క, కళాకారుడికీ సంప్రదాయానికీ మధ్య సంబంధం నొక్కిచెప్పే సిధ్ధాంతాన్ని ఎదుర్కోవలసి ఉంది. ఎలియట్ ఇలా రాసారు:


"సర్వశ్రేష్ఠమైనవే కాకుండా కవి యొక్క పనిలోని అత్యంత వ్యక్తిగతమైన భాగాలు, బలంగా అవినశత్వాన్ని నొక్కిచెప్పే కవి యొక్క పూర్వీకులూ, గతించిన కవులకూ చెందినవై ఉంటాయి"[6]

సాహితీవేత్త పీటర్ చైల్డ్స్ ఈ సంకీర్ణతను ఈ విధంగా సమకూరుస్తారు:

"విప్లవాత్మకమైన మరియు అభివృధ్ధి నిరోధకమైన భావజాలం, పాతవి అదృశ్యమవటం వల్ల కలిగే ఉత్సాహం మరియు నూతనత్వం అంటే భయం, విధ్వంసకవాదం మరియు మతఛాందసోత్సాహం, సృజనాత్మకత మరియు నిస్పృహల పట్ల లోకవిరుధ్ధమైన ధోరణులు ఉన్నాయి కానీ ప్రతిపక్షధోరణులు లేవు".[7]

ఆధునికవాకానికి ఈ ప్రతికూలత స్వాభావికం : ఒక విశాల సాంస్కృతిక దృక్పధంలో ఇది ఆధునికయుగం, గతం కన్నా భిన్నమైనదనే అంచనా, ప్రపంచం సంకీర్ణతను సంతరించుకుంతోందనీ అంతేగాక దేవుడు, ప్రభుత్వమూ, శాస్త్రము, మరియు తర్కము సునిశితమైన సూక్ష్మపరీక్షకు లోబడి ఉంటాయన్న గుర్తింపు".

ఆధునికవాదం యొక్క ఇప్పటి తాత్పర్యాలు భిన్నంగా ఉంటాయి. కొంతమంది 20వ శతాబ్దపు ప్రతిస్పందనను, ఆధునికవాదం, తదుపరి కాలపు ఆధునికవాదంగా విభజిస్తారు, ఇతరులు వాటిని ఒకే ఉద్యమానికి చెందిన రెందు అంశాలుగా చూస్తారు.

విషయ సూచిక

నేటి దృక్పథాలు[మార్చు]

కొంతమంది వ్యాఖ్యాతలు ఆధునిక వాదాన్ని ఒక సంపూర్ణమైన సామాజికాభ్యుదయ ఆలోచనా ధోరణిగా భావిస్తారు. అది అభ్యాససిధ్ధమైన ప్రయోగ విధానాలతో, శాస్త్రజ్ఞానంతో, లేదా సాంకేతిక విద్యతో వాతావరణాన్ని సృష్టించడానికి, వృధ్ధి చేయటానికీ, పునరాకారం కల్పించడానికీ దోహదపడే మానవుల శక్తిని నొక్కి చెబుతుంది.[8]

ఈ దృక్పథంతో, ఆధునికవాదం, వాణిజ్యం నుండి తత్వశాస్త్రందాకా మానవుల ఉనికికి చెందిన ప్రతి అంశాన్నీ పునఃపరీక్షించడాన్ని ప్రోత్సహించింది. మానవాభ్యుదయాన్ని కుంటుపరిచే అంశాలను కనిపెట్టి, వాటిని నూతనపధ్ధతులతో ప్రతిస్థాపన చేయడమే దాని లక్ష్యం.

ఇతరులు ఆధునికవాదాన్ని రసజ్ఞానాత్మశోధనగా భావిస్తారు. మొదటి ప్రపంచ యుధ్ధంలో సాంకేతిక శాస్త్రం యొక్క ఉపయోగం పై ప్రతిస్పందనలను అంతేగాక, నియేషెకాలం నుండి సామ్యూల్ బెకెట్ కాలం దాకా ఉన్న భిన్నమైన ఆలోచకులు, మరియు కళాకారుల యొక్క పనికి చెందిన విధ్వంసక, సాంకేతిక విజ్ఞాన వ్యతిరేక అంశాలను పరిగణనలోకి తీసుకోవడానికి ఇది దోహదం చేస్తుంది.[9]

ఆధునికవాదం యొక్క చరిత్ర[మార్చు]

ప్రారంభం[మార్చు]

యూజీన్ డెలాక్రొఇక్స్'స్ లిబర్టి లీడింగ్ ది పీపుల్, 1830, ఎ రొమాంటిక్ వర్క్ ఆఫ్ ఆర్ట్.

యూరోప్ లోని 19వ శతాబ్దపు మొదటి సగం యుధ్ధాలతోటీ, విప్లవాలతోటీ నిండి ఉండి, వాస్తవిక రాజకీయ, సామాజిక విభజన పట్ల ఒక రసవంతమైన విముఖతకు దారితీసింది. అది కాల్పనిక వాదంవైపు మొగ్గు చూపింది. కళ, విప్లవాత్మకమైన లేదా సమూలమైన మార్పుకి సంబంధించిన వ్యక్తీకరణ మరియు వ్యక్తి స్వేచ్ఛలకు, పవిత్రత, ప్రకృతి యొక్క ఆధిక్యత, మనిషి అంతఃకరణకు సంబంధించిన అనుభవం విషయాంశాలుగా మారాయి. శతాబ్దంలో సగభాగం పూర్తయ్యేనాటికి, యెలాగో, ఈ భావాలకీ, స్థిరమైన ప్రభుత్వ విధానాలకు మధ్య సంయోగం ఏర్పడింది.1848లో విఫలమైన ప్రజాస్వామ్య విప్లవాలకు మరియు కాల్పనిక విప్లవాలకు ఇది కొంత ప్రతిస్పందన. అభ్యాససిధ్ధమైన పాజిటివిజం లాంటి తాత్విక భావాలూ ఇంకా ఒటోవాన్ బిస్మార్క్ రాసిన రెయల్పోలిటిక్ దీనిని ఉదహరించాయి. (పాజిటివిజం = చూడగలిగినవి, నిరూపించగలిగినవి మాత్రమే స్వీకరించు తత్వం) దీనిని వివిధ నామాలతో పిలిచారు - గ్రేట్ బ్రిటన్లో ఇది "విక్టోరియన్ ఎరా"గా అభివర్ణింప బడింది - ఈ స్థిరపరిచే సంయోగం యొక్క మొదళ్ళు, వాస్తవం అంతఃకరణచే ప్రభావితం కాబడ్డ దృష్టి కోణాల కంటే మెరుగైనదనే భావంలో ఉన్నాయి.

ఈ సంయోగానికి కేంద్రబిందువుగా, సాధారణమైన ఊహలు, సంస్థాగతమైన నిర్దేశకాలు ఉన్నాయి. వీటిల్లో బాహ్యమైన వాస్తవికతను, వాస్తవ దృష్టితో వ్యక్తీకరించవచ్చనే వాదన కేవలం సాధ్యం మాత్రమే కాదు ఆచరణ యోగ్యం కూడా అన్న భావాన్ని నొక్కి చెప్పే ప్రమాణాలూ, క్రీస్తు మతానికి చెందిన మతపరమైన ప్రమాణాలూ, ప్రాచీనమైన భౌతిక శాస్త్రానికి చెందిన శాస్త్రపరమైన ప్రమాణాలూ ఉన్నాయి. ఇది సర్వసామాన్యమైనది కానప్పటికీ, సాంస్కృతిక విమర్శకులు మరియు చరిత్రకారులు ఈ సూత్రాలను యదార్ధవాదంగా ముద్ర వేసారు. తత్త్వశాస్త్రంలో హేతువాద, అనాత్మవాద, నిరూపితయోగ్య వాదాలు, తర్కం మరియు వ్యవస్థ యొక్క ప్రాముఖ్యతను స్థాపించాయి.

ఈ ప్రవాహానికి వ్యతిరేకంగా ఎన్నో భావాలు ఉత్పన్నమయ్యాయి. కొన్ని వాటిల్లో కాల్పనికవాదానికి ప్రత్యక్ష కొనసాగింపులు. వీటిల్లో గుర్తించదగినవి ప్లాస్టిక్ కళలు మరియు కవిత్వంలో (ఉదాహరణకి రఫెలైట్ సౌభ్రాతృత్వం ముందు సమయం మరియు తత్త్వవేత్త జాన్ రస్కిన్)వ్యవసాయ మరియు మతపునర్విస్వాసోధ్ధరణ ఉద్యమాలు. హేతువాదులకు తత్త్వశాస్త్రంలో హేతువాద వ్యతిరేకుల నుండి కూడా స్పందన లభించింది. ముఖ్యంగా నాగరికత, చరిత్రపై హెగెల్ యొక్క తార్కిక దృష్టికి, అస్థిత్వవాదంపై ప్రభావం చూపిన ఫ్రెడ్రిక్ నియెషే మరియు సోరన్ కియర్ కెగార్డ్ నుండి స్పందన లభించింది. ఈ వివిధ రకాల స్పందనలన్నీ కలిపి నాగరికత, చరిత్ర లేదా స్వఛ్ఛమైన తర్కం నుండి ఉత్పన్నమైన సౌలభ్యమైన భావాలకు సవాలుగా నిలిచాయని భావించడం మొదలుపెట్టారు.

1870 దశాబ్దం నుండి, చరిత్ర మరియు నాగరికత స్వాభావికంగా అభ్యుయం వైపు నడిపిస్తాయనీ, ఇంకా అభ్యుదయం ఎప్పటికీ శ్రేష్ఠమైనదేనన్న భావాలు తీవ్ర విమర్శకు గురయ్యాయి. సమకాలీన నాగరికతపై సూక్ష్మ విమర్శకూ, పరుగులు తీసే "అభ్యుదయం" వల్ల మానవులు తోటి మనుషులకు దూరమౌతారనీ, సామాజిక విలువలు పడిపోతాయనీ చేసిన హెచ్చరికలకు గాను రచయిత వాగ్నర్ మరియు ఇబ్సన్ ను దూషించారు. కళాకారుడి యొక్క విలువలూ, సమాజపు విలువలూ కేవలం భిన్నం మాత్రమే కాదు, సమాజం అభ్యుదయానికి వ్యతిరేకం, ఇప్పుడున్న స్థితిలో అది (అంటే సమాజం) ముందుకు వెళ్ళలేదని వాదనలు తలెత్తాయి. తత్త్వవేత్తలు మునుపటి ఆశావాదాన్ని ప్రశ్నించారు. "సంకల్పలేమి" అన్న భావనను ప్రతిబింబించిన స్కోపెన్‌హాయిర్ రచనని నిరాశావాదమని ముద్ర వేసారు. ఈ భావనను నియేషే లాంటి తరువాతి ఆలోచకులు మొదట వ్యతిరేకించి తర్వాత సమ్మతించారు.

జీవశాస్త్రంలో చార్ల్స్ డార్విన్ మరియు రాజనీతిజ్ఞశాస్త్రంలో కార్ల్ మార్క్స్ ఆ కాలంలో సార్థకమైన ఆలోచకులు. "ఇవల్యూషన్ బై నాచురల్ సెలెక్షన్" అనే డార్విన్ సిధ్ధాంతం సాధారణ ప్రజల మతవిశ్వాసాన్నీ, మానవులు విలక్షణమైన వారన్న విద్యాధికుల అభిప్రాయాన్నీ దెబ్బతీసింది. పవిత్రతను ఆపాదించే ఆధ్యాత్మికతకూ, నీచమైన జంతువులలో ఉండే ఉద్రేకాలే మనిషిని కూడా ప్రభావితం చేస్తాయన్న భావనకూ మధ్య సమన్వయం కుదరటం కష్టమైపోయింది. పెట్టుబడిదారీ వ్యవస్థలో ప్రాథమికమైన పరస్పర విరుధ్ధ భావాలు ఉన్నాయని కార్మికులకి స్వేచ్ఛ లేదనీ కార్ల్ మార్క్స్ వాదించాడు. ఆధునికవాదాన్ని స్థాపించడంలో నిర్ణాయకమైన పాత్ర పోషించే ఆలోచకుల సముదాయం ఉద్భవించడానికి ఈ ఇద్దరు ఆలోచకులు కారకులయ్యారు.[ఉల్లేఖన అవసరం]

ఆధునికవాదం మొదలైన సమయానికి సంబంధించి వివిధ తేదీలను చరిత్రకారులు సూచించారు. 1872లో రిచర్డ్ డెడెకైండ్ యొక్క రియల్ నంబర్ లైన్ విభజన మరియు 1874లో బోల్జ్ మన్ యొక్క స్టాటిస్టికల్ థెర్మోడైనామిక్స్ లతో ఆధునిక వాదం మొదలైందని విలియం ఎవర్డెల్ వాదించాడు. ఇమాన్యూల్ కాంట్ ను క్లెమెంట్ గ్రీన్‌బర్గ్ "మొదటి అసలు సిసలు "ఆధునికవాది"[10]గా అభివర్ణించాదు కానీ కూడా ఇలా రాసాడు : "దేన్నైతే మనం క్షేమంగా ఆధునికవాదం అనగలమో, అది మునుపటి శతాబ్దపు మధ్య భాగంలో - ఇంకా చెప్పలంటే స్థానికంగా, ఫ్రాన్స్ లో, సాహిత్యంలో బౌడలేర్ తోటీ, చిత్రకళలో మానెట్ తోటీ, గద్య రచనకి సంబంధించిన కాల్పనిక సాహిత్యంలో ఫోబర్ట్ తోటీ ఉద్భవించింది. (కొంతకాలం తర్వాత, అంత స్థానికంగా కాకుండా, ఆధునికవాదం సంగీతంలోనూ వాస్తు శాస్త్రంలోను కనిపించింది).[11] మొదట్లో ఆధునికవాదాన్ని "అవాంట్ గార్డ్" అన్నారు. సంప్రదాయ వ్యతిరేకమైన ఉద్యమాలని విశదీకరించే పదంగా - ఈ పదం నిలిచిపోయింది.[12]

వేర్వేరు విధాలుగా కళలు, ఉత్తరాల్లో, ఫ్రాన్స్ లో మొదలైన రెండు భావాలు ప్రత్యేకమైన ప్రభావం చూపుతాయి. ఇందులో మొదటిది, అభిరుచివాదం. స్టూడియోల్లో కాకుండా, బహిర్గత ప్రదేశాలలో చేసే పని మీద దృష్టి కేంద్రీకరించే ఆలోచకుల చిత్రకళ ఇది. అభిరుచివాద చిత్రాలు, మనుషులు కేవలం వస్తువులనే కాదు, ఏకంగా వెలుగునే చూస్తారని తెలియజెప్పాయి. ఈ వాదం అభ్యాసకులలో అంతర్గత విభేదాలు ఉన్నప్పటికీ సమర్ధకులని సమీకరించుకోవడమే కాక, క్రమక్రమంగా ప్రభావవంతమైంది. ప్రభుత్వంచే సమర్పించబడే అతి ముఖ్యమైన వాణిజ్య ప్రదర్శన పారిస్-సలోన్ లో భాగం పంచుకోవాలన్న అభిరుచివాదులు చేసిన ప్రయత్నానికి తిరస్కారం లభించింది. అభిరుచివాదులు, ప్రతి సంవత్సరం జరిగే సాముదాయిక ప్రదర్శనలు, వాణిజ్య స్థలాలలో, 1870, 1880 దశాబ్దాలలో నిర్వహించారు. అది ఆధికారిక సలోన్ జరిగే సమయంలోనే నిర్వహించేలా చూసుకునేవారు. 1863లో ముఖ్యమైన సంఘటన నెపోలియన్ 3 చక్రవర్తి సృష్టించిన "సేలన్ డెస్ రెఫ్యూసస్". పారిస్ సేలన్ తిరస్కరించిన చిత్రాలను అన్నింటినీ, ఈ ప్రదర్శనలో ప్రదర్శించారు . వీటిలో చాలా వరకు చిత్రాలు అధములైన కళాకారులు వేసిన సాధారణమైన చిత్రాలు కాగా, మానెట్ వేసిన చిత్రం విపరీతమైన ఆకర్షణకు గురై, ఉద్యమానికి వాణిజ్య ద్వారాలు తెరిచింది.

ఓడిలోన్ రెడాన్, గార్డియన్ స్పిరిట్ ఆఫ్ ది వాటర్స్, 1878, చార్కోల్ ఆన్ పేపర్, ది ఆర్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ షికాగో.

రెండవది ప్రతీకాత్మక వాదం. ఇది భాష ప్రతీకాత్మకమైనదనీ, మరియు, దేశభక్తిని వర్ణించేదనీ, కవిత్వమూ, రచనా పదాల యొక్క ధ్వని, అల్లికపై ఆధారపడి ఉండాలన్న నమ్మకాన్ని సూచిస్తుంది. తర్వాత జరిగే దానికి సంబంధించి కవి స్టీఫెన్ మల్లర్మ్ ప్రత్యేకమైన ప్రాముఖ్యత కలిగి ఉంటారు.

అదే సమయంలో సామాజిక, రాజకీయ మరియు ఆర్థిక శక్తుల ప్రభావం ఉండటంవల్ల కళ, ఆలోచనా సరళిలో సమూలంగా భిన్నమైన మార్పు రావాలన్న వాదనకి దారి తీసింది. అందులో ముఖ్యమైనది ఆవిరి శక్తితో కూడిన పారిశ్రామీకరణ. పోత ఇనుము లాంటి క్రొత్త పారిశ్రామిక పదార్ధాలను ఉపయోగించి, కళనూ, సాంకేతిక శాస్త్రాన్నీ మేళవించి రైల్వే బ్రిడ్జిలూ, గాజు-ఉక్కుతో చేసిన రైలు షెడ్లు, ఈఫిల్ టవర్ నిర్మాణానికి కారణమైన కట్టడాలను నిర్మించడానికి ఇది కారణమైంది. ఈఫిల్ టవర్, మనిషి నిర్మించే కట్టడాలు ఎంత పొడవు ఉండగలవు అనే మీమాంసకు సంబంధించిన అవధులన్నీ బ్రద్దలు కొట్టింది. అదే సమయంలో నగరజీవనంలో సమూలంగా భిన్నమైన వాతావరణానికి దారి తీసింది.

రినైసాన్స్ నుండి కూడా ఎడతెగని, అభ్యుదయపధంలో నడుస్తోందనుకున్న యూరోపియన్ నాగరికతని పారిశ్రామిక నాగరికత యొక్క దురవస్థలూ, శాస్త్రీయమైన విషయపరీక్ష తెచ్చిన మార్పులు కుదిపివేశాయి. టెలీగ్రఫి తెచ్చిన క్రొత్త శక్తి - దూరప్రదేశాలలో ఉన్నవారికి అప్పటికప్పుడే సందేశాలు పంపడం - సమయానుభవాన్నే మార్చేసింది.

ఎన్నో ఆధునిక అధ్యయనశాఖలు (ఉదాహరణకి భౌతికశాస్త్రం, ఆర్థిక శాస్త్రం మరియు బాలె, వాస్తు శాస్త్రం లాంటి కళలు) తమ 20వ శతాబ్దపు ముందు దశని "ప్రాచీనమైనవి"గా గుర్తిస్తాయి. ఈ విశిష్టత శాస్త్ర, సాంస్కృతిక రంగాలలో నెరపిన అన్వేషణ ఫలితంగా వచ్చిన మార్పుల యొక్క విస్తీర్ణాన్ని సూచిస్తుంది.

శతాబ్దపు మలుపు[మార్చు]

దస్త్రం:Bonheur Matisse.jpg
హెన్రి మాటిసె, లె బాన్‌హ్యూర్ డి వివిర్, 1905-6, బార్న్స్ ఫౌండేషన్, మెరియన్, PA. ఆన్ అర్లి ఫావిస్ట్ మాస్టర్‌పీస్.

1890వ దశాబ్దంలో పాతజ్ఞానాన్ని ప్రస్తుత సాంకేతిక పధ్ధతులతో పోల్చి చూడటం కంటే ఆ ప్రమాణాలను పూర్తిగా పక్కన పెట్టడం అవసరమన్న ఆలోచనా సరళి మొదలైంది. భౌతిక శాస్త్రంలో థియరీ ఆఫ్ రిలేటివిటీ, ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ మరియు పారిశ్రామీకరణ యొక్క మేళవింపు, ప్రభుత్వ విధానాలలో పెరుగుతోన్న సామాజిక శాస్త్రాల యొక్క పాత్ర, ఇవన్నీ కూడా కళా ఉద్యమానికి సమాంతరంగా నిలిచాయి. వాస్తవికత యొక్క స్వభావమే ప్రశ్నార్థకంగా మానవకార్యకలాపాల చుట్టూతా ఉండే కట్టుబాట్లే తెగిపోతే కళ కూడా సమూలంగా మారాలన్న వాదన మొదలైంది. ఆవిధంగా, 20 శతాబ్దపు మొదటి పదిహేను సంవత్సరాలలో చాలామంది రచయితలూ, ఆలోచకులూ, ఇంకా కళాకారులూ సాహిత్యాన్నీ, చిత్రకళనూ, సంగీతాన్నీ నిర్వహించే సాంప్రదాయ పధ్ధతులకి స్వస్థి పలికారు.

ఒక తరంగంలా ఉత్పన్నమైన ఆధునికతలో అత్యంత ప్రభావితమైనది సిగ్మండ్ ఫ్రాఇడ్ మరియు ఎర్న్స్ట్ మాష్ సిధ్ధాంతాలు. వీరు 1880 దశాబ్దపు మొదట్లో మనసుకి ప్రాధమికమైన ఆకృతి ఉన్నదనీ, అంతరంగ అనుభవం మనసులోని భాగాలయొక్క పరస్పర చర్యల యొక్క ప్రభావంపై ఆధారపడి ఉందనీ వాదించారు. ఫ్రాయిడ్ అభిప్రాయాల ప్రకారం, మనిషి అంతరంగ వాస్తవికత తనలో ఉండే కోరికలూ, అంతర్బుధ్ధి పై ఆధారపడి ఉంటుంది. ఈ కోరికలూ, అంతర్బుధ్ధి ప్రభావంలోనే మనిషి బాహ్య ప్రపంచాన్ని వీక్షిస్తాడు. ఎర్న్స్ట్ మాష్ సుప్రసిధ్ధమైన "పాజిటివిజం" అనే శాస్త్రీయమైన తత్త్వాన్ని వృధ్ధిలోకి తెచ్చాడు. దాని ప్రకారం ప్రకృతిలో ఉండే వస్తువుల మధ్య సంబంధాలు పూచీలేనివి కానీ అవి మానసిక సంక్షిప్తలిపి ద్వారా మాత్రమే తెలుసుకోవచ్చు. ఉదాహరణకి, జాన్ లోకే యొక్క అనుభవైకవాదంలో టాబ్యూలా రసాతో మొదలయ్యే మనసులాగా, బాహ్యమైన, సంపూర్ణమైన వాస్తవం, మనిషిమీద తనంతట తానే ప్రభావం చూపగలదు అన్న నమ్మకానికి సంబంధించిన గతమునుండి ఇది విముక్తిని ఇచ్చింది. ముఖ్యహేతువైన ఉద్రేకాలూ, వాటిని కట్టడి చేసే తనకుతానై విధించుకున్న కట్టుబాట్లతో కూడిన స్పృహలేని మనస్సుతో కూడిన అంతరంగ మానసిక స్థితుల మీద ఫ్రాయిడ్ ఇచ్చిన వివరణమును కారల్ జంగ్ చేతనావస్థలో ఉండే మనసుని ఎదిరించి, స్వీకరించే ప్రాథమిక వర్గీకరణ వాదాలతో నిండిన సామూహిక అచేతనా స్థితిని నిర్దేశించే ప్రాకృతిక తత్త్వంపై నమ్మకంతో కలగలిపాడు. డార్విన్ యొక్క రచన, "మనిషి, ఒక మృగం" అన్న భావనని సార్వజనీన హృదయానికి పరిచయం చేస్తే, సామాజిక ప్రమాణాలని ఉల్లంఘించాలనే మనుషుల ఉద్రేకాలు, పసితనం వల్లనో, జ్ఞానశూన్యత వల్లనో కలగవనీ, అది మానవమృగం యొక్క ఆవశ్యకమైన ప్రకృతి స్వభావంవల్ల కలుగుతాయనీ జంగ్ అభిప్రాయపడ్డాడు.[ఉల్లేఖన అవసరం]

నిజాలకన్నా, వస్తువులకన్నా శక్తులు, ముఖ్యంగా "శక్తి పొందాలనే సంకల్పం" ముఖ్యమైనవన్న తత్త్వాన్ని ఫ్రెడ్రిక్ నియేషే బలపరిచాడు. చలనంలేని వాస్తవ దృష్టికోణాల కంటే జీవసంబంధమైన "ప్రాణ శక్తి" గొప్పదని హెన్రి బెర్గ్సన్ వాదించాడు. విక్టోరియం పాజిటివిజం మరియు నిశ్చయత్వాల పై కాల్పనిక అపనమ్మకం అనే విషయం మీద ఈ రచయితలంతా ఒక్క తాటి పై నిలబడ్డారు. తర్కవిరుధ్ధమైన ఆలోచనా ధోరణులను తర్కము, సంపూర్ణ వాదము అనే కటకం ద్వారా వివరించడానికి ఫ్రాయిడ్ ప్రయత్నించాడు. ఫెర్గ్సన్, నియేషే బలపరిచారు. సమగ్ర దృక్పథంతో ఆలోచించాలనే శతాబ్దం-పొడవు పోకడతో ఇది సంబంధం కలిగి ఉంది. అందులో అతీతశక్తి ఇంకా ప్రాణశక్తి పై పెరుగుతున్న ఆసక్తి కూడా ఉంది.

కాల్పనికవాదంలోంచి పుట్టిన ఆదర్శాల ఘర్షణలోంచి, తెలియని దాన్ని వివరించాలన్న జ్ఞానాన్ని సముపార్జించాలన్న ప్రయత్నంలోంచి ఒక రచనల తొలితరంగం ఉద్భవించింది. దాని రచయితలు, దాన్ని కళలో ఉండే ప్రస్తుత పోకడల సమాహారంగా భావించారు. బూర్జువా సంస్కృతికీ, భావాలకూ కళాకారులు ప్రతినిధులన్న, సాధారణ ప్రజానీకంతో ఉన్న అంతరార్ధ ఒప్పందాన్ని అది బద్దలుకొట్టింది. 1908లో ప్రాయశ్చిత పూర్వకంగా సమాప్తమైన ఆర్నాల్డ్ స్కోయంబర్గ్ యొక్క సెకండ్ స్ట్రింగ్ క్వార్టెట్, 1903లో ఎక్స్ప్రెషనిస్ట్ చిత్రాలతో మొదలై నైరూప్యచిత్రాలతో ఉన్నతస్థితికి చేరుకున్న వాసిలీ కాండిన్స్కీ చిత్రాలు, అతని ద్వారా 1911లో బ్లూరైడర్ గ్రూప్ స్థాపనా 1900 నుండి 1910 మధ్య, హెన్రి మాటిసె, పేబ్లో పికాసో, జార్జస్ బ్రాక్ మరియు ఇతరుల స్టూడియోల నుండి ఉత్పన్నమైన ఫావిజం అభివృధ్ధి, క్యూబిజం యొక్క నూతన ఆవిష్కారాలూ - ఇవన్నీ ఆధునికవాదానికి మైలురాళ్ళు.

20వ దశాబ్దపు మొదటి దశాబ్దంలో ఈ ఆధునిక ఉద్యమం యొక్క తరంగం, గతంతో బంధం తెంచుకుని, వివిధ రకాల కళాకృతులకి సమూలమైన మార్పులు తెచ్చే పద్ధతిలో పునర్నిర్వచనం చెప్పడానికి ప్రయత్నించింది. ఈ ఉద్యమం (ఉద్యమాలు అనడం మంచిది) యొక్క సాహిత్యపు విభాగంలో ఉన్న ప్రముఖమైన వ్యక్తులలో :

 • రఫెల్ అల్బెర్టి
 • గేబ్రియేల్ డి ఆనన్‌జియో
 • గ్విలామే అపోలినేయిర్
 • లూవీ అరెగోన్
 • జూనా బార్నిస్
 • బెర్టోల్ట్ బ్రెక్ట్
 • బేసిల్ బంటింగ్
 • ఇవాన్ కాంకర్
 • మారియో డి స-కార్నీరో
 • కాన్స్టాంటైన్ పి. కావఫి
 • బ్లిస్ సెండ్రార్స్
 • జీన్ కాక్ట్యూ
 • జోసఫ్ కానరాడ్
 • టీ.ఎస్. ఎలియట్
 • పాల్ ఎల్వార్డ్
 • విలియం ఫాల్క్నర్
 • ఇ.యం.ఫోర్స్టర్
 • హెచ్.డి.
 • ఎర్నెస్ట్ హెమింగ్వే [13]
 • హుగొ వాన్ హాఫ్మన్స్థల్
 • మాక్స్ జేకబ్
 • జేంస్ జాయస్[14]
 • ఫ్రంజ్ కాఫ్కా
 • డి.హెచ్. లారన్స్
 • విన్ధాం లూవిస్
 • ఫ్రెడరీకొ గార్షియా లోర్కా
 • హ్యూజ్ మాక్డైయార్మిడ్
 • మారియాన్ మూర్
 • రాబర్ట్ ముశిల్
 • అల్మడా నెగ్రీరాస్
 • లూగి పిరాండెల్లో
 • ఎజ్రా పౌండ్
 • మార్కల్ ప్రౌస్ట్
 • పిఎర్ర్ రెవర్డి
 • రైనర్ మరియా రిల్కే
 • గేర్ త్రుడ్ స్టెయిన్
 • వాలేస్ స్టివెన్స్
 • ఇటాలో స్వేవో
 • ట్రిస్టన్ జారా
 • గ్యూసెప్ అంగారెట్టి
 • పాల్ వాలెరి
 • రాబర్ట్ వాల్సర్
 • విలీయం కార్లోస్ విలియంస్
 • వర్జీనియా వుల్ఫ్
 • విలియం బట్లర్ యీట్స్

స్కీన్‌బర్గ్, స్ట్రావిన్స్కీ మరియు జార్జ్ ఆంథేల్ లాంటి స్వరకర్తలు ఆధునికవాదంలో సంగీతానికి ప్రాతినిధ్యం వహిస్తారు. గుస్తావ్ క్లింట్, హెన్రి రూసే, వాసిలి కాండిన్స్కీ, పేబ్లో పికాసో, హెన్రి మాటిసే, జార్జస్ బ్రాక్, మార్కల్ డ్యూచాంప్ జియార్జియొ డి షిరీకో, జువాన్ గ్రిస్, పైయట్ మాండ్రియన్ లాంటి కలాకారులూ, మరియు లే ఫావ్స్, క్యూబిజం, దాదా మరియు సర్రియలిజం లాంటి ఉద్యమాలు దృశ్యమాన కళల్లో వివిధరకాల ఆధునికవాదానికి ప్రాతినిధ్యం వహిస్తాయి. ఫ్రాంక్ లాయిడ్ రైట్ లే కోర్బూసియర్ వాల్టర్ గ్రోపియస్ మరియు మియస్ వాన్ డర్ రోహే లాంటి వాస్తుశిల్పులు మరియు డిసైనర్లు నగర దైనందిన జీవితంలోనికి ఆధునిక భావాలు తీసుకువచ్చారు. ఉద్యమం వెలుపల ఉన్న వ్యక్తులని కూడా కళాత్మక ఆధునికవాదం ప్రభావితం చేసింది, ఉదాహరణకి జాన్ మేనార్డ్ కీన్స్, బ్లూమ్స్‌బరీ గ్రూపులోని వూల్ఫ్ మరియు ఇతర రచయితలతో స్నేహంగా ఉండేవాడు.

విస్ఫోటనం, 1910–1930[మార్చు]

మొదటి ప్రపంచ యుధ్ధం సందర్భంగా, రషియన్ విప్లవం, 1905లో ఒక ఉద్రిక్తత మరియు అసంతృప్తి కనపడడం జరిగింది. రాడికల్ పార్టీల ఆందోళన ప్రతి మాధ్యమంలోనూ కళాకృతులను సమూలముగా సరళీకృతం చేసి ఇదివరకు పధ్ధతులను తిరస్కరించింది. ఒక పక్క సెజాన్ లాంటి అభిరుచివాదులు కూడా చేయని పని, కళాకృతులని తయారు చేయడానికి సంప్రదాయ విధానాన్ని తిరస్కరించే పనిని యువచిత్రకారులు పేబ్లో పికాసో మరియు హెన్రి మాటిసే చేసి అందరినీ విస్మయానికి గురిచేస్తున్నారు. 1907లో పికాసో డెంవాసెల్ల్స్ డి అవిగ్నోన్ చిత్రం గీస్తూ ఉండగా, ఆస్కర్ కొకోష్క మొర్డర్, హాఫ్‌నుంగ్ దెర్ ఫ్రాయెన్, మర్డరర్, హోప్ ఆఫ్ విమెన్ రాస్తూ ఉన్నాడు; అది మొదటి భావవ్యక్తీకరన నాటకం (1909లో స్కాండల్ తో నిర్మించబడింది., ఇంకా ఆర్నాల్డ్ స్కీంబర్గ్ టోనల్ సెంటర్ లేని తన మొదటి కూర్పు స్ట్రింగ్ క్వార్టెట్ #2 ఇన్ ఎఫ్-షార్ప్ మైనర్ కూరుస్తూ ఉన్నాడు . 1911లో కాండిన్స్కీ బిల్డ్ మిట్ క్రీస్ (పిక్చర్ విత్ ఎ సర్కిల్ ) గీసాడు, దానిని తర్వాత అతను మొదటి అవ్యక్తీకృత చిత్రంగా అభివర్ణించాడు. ఎడ్మండ్ హసెర్ల్ ఐడియాస్ మీద పనిచేసిన సంవత్సరం 1913లో, నీల్ బోర్ అణువును యొక్క పరిమాణం నిశ్చయించాడు. అదే సంవత్సరంలో ఎజ్రా పౌండ్ ఇమేజిజం స్థాపించాడు, న్యూయార్క్ లో ఆర్మరీ షో జరిగింది, సైంట్ పీటర్స్బర్గ్లో అలెక్సీ క్రూషెనిక్, వెలిమీర్ ఖ్లెబ్నికోవ్ మరియు కసిమీర్ మాలెవిచ్‌ల మొదటి ఫ్యూచరిస్ట్ ఒపేరా "విక్టరీ ఒవర్ ది సన్ " జరిగింది - సెర్గై డియాఘిలెవ్ మరియు బాలెట్స్ రసెస్‌ల కోసం పనిచేస్తున్న మరొక రషియన్ కంపోసర్ ఇగొర్ స్ట్రావిన్స్కీ ఒక బాలే కోసం, "ది రైట్ ఆఫ్ ది స్ప్రింగ్ " కూర్చాడు, దానికి నృత్యాన్ని వాస్లావ్ నిజిన్స్కీ కూర్చాడు....అది మానవ త్యాగాన్ని ప్రతిబింబించింది.

ఈ పరిణామాలు ఆధునికవాదానికి కొత్త అర్థం ఇవ్వడం మొదలుపెట్టాయి. జీవశాస్త్రం నుండి కాల్పనిక పాత్రల సృష్టి మరియు సినీమా నిర్మాణం వరకూ మృదువైన మార్పుని తిరస్కరించి, అది మళ్ళింపుని స్వాగతించింది. అది విచ్ఛేదాన్ని అంగీకరించింది. సాహిత్యము, కళలో సరళమైన వాస్తవికవాదాన్ని తిరస్కరించి, దానికి దూరంగా వెళ్ళడమే గాక, నాటకీయంగా సంగీతపు స్వరనియంత్రణలో మార్పులు తేవడాన్ని తిరస్కరించింది. 19వ శతాబ్దపు కళాకారులు మృదువైన మార్పుని (విప్లవాత్మకమైన మార్పు కంటే పరిణామాత్మకమైన మార్పు మంచిదని నమ్మారు) మాత్రమే కాకుండా, మార్పు యొక్క అభ్యుదయతని అంటే - అభ్యుదయం కూడా కాంక్షించారు. పై చెప్పిన రాడికల్ ఆధునికవాదులు ఆ కారణంగా వీరికి యెడమైనారు.

డికెన్స్ మరియు టాల్స్‌టాయ్, టర్నర్ లాంటి పేయింటర్లు, బ్రహంస్ లాంటి సంగీత విద్వాంసులు రాడికల్స్ లేదా బొహేమియన్లు కారు. కానీ సమాజంలో విలువైన మనుషులు. వారు తక్కువ వాంఛించదగిన అంశాలను విమర్శిస్తూనే సమాజానికి ఉపయోగపడేవిధంగా కళాసృష్టి చేసారు. ఆధునికవాదం అభ్యుదయపధంలో నడుస్తూనే, సంప్రదాయ ఆకృతులనూ, సంప్రదాయ అమరికలను అభ్యుదయాన్ని నిలువరించేవిగా భావించింది. అందుకే, అది కళాకారుదిని ఒక విప్లవకారుడిగా రూపమిచ్చి, తనని వెలుగునిచ్చే వాడిగా కాకుండా అభ్యుదయానికి అడ్డుపడే వాటిని విసిరివేసేవాడిగా చూసింది.

భవిష్యద్వాదము ఈ పోకడని ఉదహరిస్తుంది. 1909లో పారిస్ దినపత్రిక లే ఫిగరో ఎఫ్.టి. మారినెట్టిస్ ఫ్యూచరిస్ట్ మానిఫెస్టో ముద్రించింది. అనతికాలంలోనే ఒక చిత్రకారుల సముదాయం (గియాకొమో బల్లా, అంబెర్టో బొక్సిఓని, కార్లో కారా, లువిగీ రస్సోలో మరియు గీనో సవరిని) ఫ్యూచరిస్ట్ మానిఫెస్టో పై సంతకాలు చేసారు . ప్రసిధ్ధి చెందిన గత శతాబ్దపు కమ్యూనిస్ట్ మానిఫెస్టో మాదిరిగా ఉండే ఇలాంటి మానిఫెస్టోలు ఆసక్తిని రేకెత్తించి అనుచరులను ప్రోగు చేయడానికి ఉద్దేశించినవి. బెర్గ్సన్ మరియు నియేషే చేత బలంగా ప్రభావితం కాబడిన భవిస్యద్వాదం విచ్ఛేదానికి హేతుబధ్ధత కల్పించే ఆధునికవాదుల సాధారణ ధోరణిలో భాగం.

ఆధునికవాదపు తత్త్వం మరియు కళ ఇంకా కూడా ఒక విస్తారమైన సామాజిక ఉద్యమంలో భాగంగానే చూడడం జరిగింది. క్లింట్ మరియు సిజాన్ లాంటి కళాకారులూ, మాహ్లెర్ మరియు రిచర్డ్ స్ట్రాస్ లాంటి స్వరకర్తలూ, భయంకరమైన ఆధునికవాదులు - అవాంట్ గార్డ్ కు దూరంగా ఉండేవారు వినడం కంటే ఎక్కువ వినబడేవారు. రేఖాగణిత లేదా అవ్యక్తీకృత చిత్రాలను సమర్ధించే పోలమిక్స్ తక్కువ సరఫరా ఉండే చిన్న పత్రికలకి (బ్రిటన్లోని ది న్యూ ఏజ్ లాంటివి) పరిమితమయ్యాడు. ఆధునికవాదపు ఆదిమసమాజవాదం మరియు నిరాశావాదం వివాదాస్పదమైనవి, కానీ అభ్యుదయంలో విక్టోరియన్ ఫైత్ మరియు ఉదారమైన ఆశావాదం పై మొగ్గు చూపే ఎడ్వార్డియన్ మెయిన్ స్ట్రీంకు ప్రాతినిధ్యం వహించేవిగా చూడబడలేదు.

ఇలస్ట్రేషన్ ఆఫ్ ది స్పిరిట్ ఆఫ్ St. లూవి

బ్రహంస్ లాంటి 19వ శతాబ్దపు కళాకారులు ఉపద్రవపూరితమైన విప్లవాలు ఐనటువంటి గ్రేట్ వార్ (గొప్ప యుధ్ధం) నూ దాని తర్వాతి ఘటనలనూ గురించి భయపడేవారు, మరొక వైపు అవాంట్-గార్డిస్టులు వాటిని స్వాగతించారు. మొదట, లక్షలమంది భూగోళపు తునకల కోసం యుధ్ధం చేస్తూ చనిపోవడం చూసిన తరానికి, ముందున్న స్థితి లేకపోవడం ఖచ్చితమనిపించింది; మూల్యం చాలా ఎక్కువగా ఉందికాబట్టి ఎవ్వరూ అలాంటి యుధ్ధం ఎవరూ చేయరని వాదించడం జరిగింది. రెండవది, యంత్రపు యుగం జీవిత స్థితిగతులని మార్చివేసింది - యంత్ర యుధ్ధవిధానం అంతిమ వాస్తవానికి గీటురాయి అయింది. చివరగా, తీవ్రమైన బాధతో కూడిన అనుభవం ప్రధానమైన అభిప్రాయాలను కూడా ఢీకొన్నది : ఎరిక్ మారియా రెమార్క్వే /0} రాసిన ఆల్ క్వయెట్ ఆన్ ది వెస్టెర్న్ ఫ్రంట్లో ఉదహరించిన విధంగా అద్భుతమైన నూతన యుధ్ధవిధానాల ముందు వాస్తవికవాదం దివాలా తీసినట్లుగా కనిపించింది. అంతేగాక, మానవజాతి నెమ్మదిగా, నిలకడగా అభ్యుదయం వైపు పయనిస్తోందనే అభిప్రాయం తెలివిలేని సామూహిక సంహారం దృష్ట్యా పరిహాసాస్పదమైపోయింది. మొదటి ప్రపంచ యుధ్ధం కఠినంగా యాంత్రికమైన సాంకేతికత యొక్క రేఖాగణిత తార్కికతతను పీడకలలాంటి అహేతుకమైన పురాణాన్ని విలీనం చేసింది.

దస్త్రం:Pedestal Table in the Studio.jpg
ఆండ్రి మేసన్, పెడెస్టల్ టేబుల్ ఇన్ ది స్టూడియో 1922, అర్లి ఎగ్జాంపుల్ ఆఫ్ సర్రియలిజం

యుధ్ధానికి ముందు అతికొద్దిమందికి మాత్రమే రుచించిన ఆధునికవాదం, 1920వ దశాబ్దాన్ని నిర్వచించదం మొదలు పెట్టింది. యూరోపులో దాదా లాంటి సంక్లిష్టమైన ఉద్యమాలలోనూ, సర్రియలిజం లాంటి నిర్మాణాత్మక ఉద్యమాలలోనూ, బ్లూంస్బరీ గ్రూప్ లాంటి చిన్న ఉద్యమాలలోనూ అది కనిపించింది. ఈ ఆధునికవాదాల్లో ప్రతివక్కటీ కూడా, కొంతమంది పరిశీలకులు ముద్రవేసిన విధంగా, కొత్త పరిణామాలకు దారి తీసే కొత్త పధ్ధతులను నొక్కి వక్కాణించాయి. మళ్ళీ, అభిరుచివాదం ఒక శకునం : జాతీయ విద్యాలయాల భావపరంపర నుండి విడువడి, కళాకారులూ, రచయితలూ అంతర్జాతీయ ఉద్యమాల భావపరంపరను స్వీకరించారు. సర్రియలిజం, క్యూబిజం, బౌహాస్ మరియు లెనినిజం ఇవన్నీ కూడా భౌగొళిక మూలాలకు అతీతంగా అనుచరులను ప్రోగు చేసుకున్న ఉద్యమాలు.

ప్రదర్శనలశాలలు, నాటక రంగము, సినిమా, పుస్తకాలు మరియు కట్టడాలు అన్నీ కూడా ప్రపంచం మారుతోందనే ప్రజాభిప్రయాన్ని బలపడడానికి దోహదం చేసాయి. ప్రతికూల ప్రతిస్పందనలు కనపడ్డయి - చిత్రాలపై తగవులూ, ప్రదర్శనా స్థలిలో ప్రారంభ సమయంలో దొమ్మీలూ జరుగగా, రాజకీయ నాయకులు ఆధునికవాదాన్ని అనారోగ్యకరమూ, అనైతికమూ అని ముద్ర వేసి తీవ్రంగా నిందించారు. అదే సమయంలో 1920వ దశాబ్దం "జాజ్జ్ ఏజ్" అని గుర్తించబడింది; జనాలు కార్లూ, విమాన ప్రయాణాలూ, టెలీఫోను మరియు ఇతర సాంకేతిక ఆవిష్కారాల పట్ల ఉత్సాహం చూపేవారు.

1930కి ఆధునికవాదం మార్పుకి గురయినప్పటికీ, రాజకీయ, కళాత్మక వ్యవస్థతో సహా, వ్యవస్థలో తన స్థానం పదిలపరచుకుంది. 1920వ దశాబ్దంలో, 1918 ముందున్న, గతంతో సంబంధాన్ని ఒకపక్క నొక్కి చెప్తూనే, మరోపక్క దానికి ప్రతికూలంగా స్పందించే ఆధునికవాదానికి వ్యతిరేకంగా మరియు ఆ సమయంలో అతిగానూ, అహేతుకంగానూ, భావాత్మకంగానూ కనపడే అంశాల పట్ల ఒక సాధారణ ప్రతిస్పందన ఉండేది,

ప్రపంచయుధ్ధం తర్వాతి కాలం, వ్యవస్థీకరణ వైపుకో లేక విధ్వంసకవాదం వైపుకో మొగ్గు చూపింది, మరియు, బహుశా దాదా లాంటి ఉదాహరణయోగ్యమైన ఉద్యమం వైపుకి కూడా.

కొంతమంది రచయితలు కొత్త ఆధునికవాదం యొక్క ఉన్మాదం పై దాడి చేయగా, మరికొందరు దానిని యాంత్రికంగానూ, జీవంలేనిదిగానూ ఉన్నదని అభివర్ణించారు. ఆధునికవాదుల్లో ప్రజల ప్రాముఖ్యత గురించీ, కళకూ, శ్రోతలకూ మధ్యనున్న సంబంధం గురించీ, సమాజంలో కళయొక్క పాత్ర గురించీ వివాదాలు ఉన్నాయి. పరిస్థితుల పట్ల ఆధునికవాదానికి పరస్పరవిరుధ్ధమైన ప్రతిస్పందనలు ఉండేవి, వాటినుండి విశ్వజనీనమైన సిధ్ధాంతాలను బయటికిలాగే ప్రయత్నాలు జరిగేవి. చివరకు, శాస్త్రము మరియు శాస్త్రపరమైన హేతుబధ్ధతలను, 18వ శతాబ్దపు జ్ఞానోదయం నుండి ఉదాహరణలు తీసుకుంటూ, తర్కానికీ, స్థిరతకీ మూలంగా భావించడం జరిగితే, మరో పక్క, ప్రాథమిక ఆదిమ లైంగిక మరియు అచేతనావస్థలోని కోరికలూ, యంత్రయుగంలోని అహేతుకజ్ఞానవ్యతిరేక కార్యకలాపాలని ప్రాథమిక భావపదార్ధముగా స్వీకరించడం జరిగింది. ఒకదానికొకటి పొంతనలేని ఈ రెండు స్తంభాల నుండి, ఆధునికవాదులు, జీవితం లోని ప్రతి అంశాన్నీ ప్రభావితం చేయగల ఒక సంపూర్ణమైన వెల్టన్షాఉంగ్ ను తయారు చేయడం మొదలు పెట్టారు.

రెండవ తరం, 1930–1945[మార్చు]

దస్త్రం:Mondrian Comp10.jpg
పైయెట్ మాండ్రియన్, కాంపోసిషన్ నం. 10, 1939-42, ఆయిల్ ఆన్ కాన్వాస్, 80 x 73 cm. ప్రైవేట్ కలక్షన్

1930కల్లా ఆధునికవాదం జనామోదమైన సంస్కృతిలో చేరింది. జనాభా నగరీకరణం పెరుగుతోన్న కొద్దీ, ప్రజలు ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించడానికి ఒక మంచి సాధనంగా దానిని గుర్తించడం మొదలెట్టారు. ఒక పక్క విద్యాధికులలో ఆధునిక వాదం ఆకర్షణ రేకెత్తిస్తుంటే, మరోపక్క, అది తనకు తానుగా ముఖ్యతను సంతరించుకున్న ఒక ఆత్మ-చేతనా సిధ్ధాంతాన్ని వృధ్ధి చేసుకుంటోంది. ఉన్నతమైన సంస్కృతి నుండి రాని, తన సొంత వాస్తవాల (ముఖ్యంగా మాస్ ప్రొడక్షన్) లోనించి వచ్చిన జనామోద సంస్కృతి యెక్కువ శాతం ఆధునికవాద సృజనాత్మకతకు ఆజ్యం పోసింది. 1930కల్లా ది న్యూయార్కర్ మాగజీన్ డొరోతి పార్కర్, రాబర్ట్ బెంచ్లే, ఇ.బి. వైట్, ఎస్.జె. పెరెల్మన్, మరియు జేంస్ థర్బర్ వంటి యువ సాహిత్యకారులూ మరియు హాస్యరచయితలు వ్రాసిన క్రొత్త మరియు ఆధునికమైన భావాలను ముద్రించడం మొదలుపెట్టింది. కళలో ఆధునిక ఉపాయాలు వాణిజ్యప్రకటనలలోనూ మరియు చిహ్నాలలోనూ కనపడ్డాయి; 1919లో ప్రసిధ్ధిగాంచిన ఎడ్వార్డ్ జాన్స్టన్ రూపిందించిన లండన్ అండర్ గ్రౌండ్ చిహ్నం, స్పష్తమైన, తేలికగా గుర్తింపదగిన, గుర్తుంచొకోదగిన దృశ్య చిహ్నాల అవసరానికి ఒక ముందస్తు ఉదాహరణ.

ఈ సమయంలో మరో బలమైన ప్రభావం మార్క్సిజం. చాలామంది ఆధునికవాదుల దృష్టిలో, కేవలం రాజకీయ పరిష్కారాలకు, టీ.ఎస్. ఎలియట్ మరియు ఇగర్ స్ట్రావిన్స్కీ ప్రాతినిధ్యం వహించిన, 1920వ దశాబ్దపు నియో క్లాసికిజానికి మాత్రమే పరిమితమయ్యే ప్రక్రియకు అడ్డుపడి సాధారణంగా, ఆదిమంగా/అహేతుకంగా కనపడే మొదటి ప్రపంచ యుధ్ధపు ముందు కాలపు ఆధునికవాదం తర్వాత, జాత్యహంకార నియంతృత్వం యెదుగుదల, గ్రేట్ డిప్రెషన్, యుధ్ధం దిశగా ప్రపంచం సాగటం - ఇవన్నీ ఒక తరాన్ని సమూలంగా మార్చడానికి ఉపయోగపడ్డాయి. మరింత భావపూరితమైన రాజకీయ వైఖరితో, రషియన్ విప్లవం, పొలిటికల్ రాడికలిజం (రాజకీయ వ్యవస్థలో సమూలమైన మార్పులు కోరే వాదం) మరియు ఉటోపియనిజం (సంపూర్ణమైన, ఆదర్శవంతమైన సమాజం కోరుకునే వాదం) యొక్క విలయన ప్రక్రియకు ఉత్ప్రేరకంగా పనిచేసింది. బెర్టోల్ట్ బ్రెక్ట్, డబ్ల్యూ.హెచ్. ఆడెన్, ఆండ్రి బ్రేటొన్, లూవీ అరేగొన్ మరియు తత్త్వవేత్తలు అంటోనియొ గ్రాంస్కి మరియు వాల్టర్ బెంజిమన్ ఆధునిక మార్క్సిజానికి ప్రసిధ్ధమైన ఉదాహరణలు. ఈ విధంగా రాడికల్ వామపక్షం వైపు వెళ్ళడం, యేమైనప్పటికీ, సర్వసామాన్యమైన విషయంగానీ, నిర్వచించదగ్గదీ కాదు; ప్రాథమికంగా, ఆధునికవాదానికి వామపక్షంతో సంబంధం ఆపాదించడానికి యే కారణమూ లేదు. లూవీ ఫెర్డినాండ్ సెలైన్, సాల్వడార్ డాలి, వింఢాం ల్యూవిస్, విలియం బట్లర్ యీట్స్, టీ.ఎస్. ఎలియట్, ఎజ్రా పౌండ్, దచ్ రచయిత మెన్నోఅ టర్ బ్రాక్ ఇంకా చాలా మంది ఆధునికవాదులు రైట్ వింగ్ సిధ్ధాంతాలకు చెందినవారు.

మస్ట్ బి మాడర్న్ టు కీప్ అప్

ఈ సమయంలోని అత్యంత స్పష్టంగా కనపడే మార్పుల్లో ఆధునికంగా ఉత్పత్తి చేయబడ్డ వస్తువులని దైనందిన జీవితంలో స్వీకరించి, ఉపయోగించడం. విద్యుత్తు, టెలీఫోను, యంత్రంతో నడిచే వాహనాలు - మరి వాటితో పనిచేసే అవసరం, వాటితో జీవించడం - ఇవన్నీ కూడా కొత్త సభ్యతకూ, కొత్త సామాజిక జీవనవిధానాల యొక్క ఆవశ్యకతకూ నాంది పలికింది. చాలా కొద్ది మందికి మాత్రమే తెలిసిన, 1880వ దశాబ్దంలో విచ్ఛేదపూరితమైన ఉద్యమంగా భావించబడిన ఘటనలు ఇప్పుడు సాధారణ సంఘటనలు అయిపొయ్యాయి. ఉదాహరణకి 1890లో స్టాక్ బ్రోకర్లకి మాత్రమే పరిమితమైన, యంత్రసందేశ వ్యవస్థ (కమ్యూనికేషన్స్) ఇప్పుడు కుటుంబ జీవనంలో భాగమైపోయింది.

సామాజిక వ్యవస్థీకరణకు దారి తీస్తున్న ఆధునికవాదం వలన, లైంగికపరమైన విషయాల మీదా, అవిభాజ్య కుటుంబాల మీద కాకుండా, విభజింపబడిన కుటుంబాల ప్రాథమిక బంధాల పైనా విచారణ మొదలయింది. బాల్యదశకు చెందిన లైంగికతకు సంబంధించిన ఫ్రాఇడ్ ఉద్రేకాలూ, పిల్లల పెంపకం చాలా తీవ్రరూపం దాల్చాయి, ఎందుకంటే, జనాలకు కొద్దిమంది పిల్లలు మాత్రమే ఉన్నారు, అందుకనే ప్రతి శిశువుతో నిర్దిష్టమైన బంధం ఆచరణయోగ్యమయింది, ఇంకా జనామోదం కూడా పొందింది. దీనిని మునుపు ఆచరణయోగ్యం కానిదని భావించేవారు.

రెండవ ప్రపంచ యుధ్ధం తర్వాతి ఆధునికవాదం (దృశ్యమాన (visual arts) మరియు దేహసంబంధ (performing arts) కళలు)[మార్చు]

అమెరికా మరియు బ్రిటన్లో, 1930వ దశాబ్దం వరకూ, ఆధునికవాదాన్ని ఒక సాహిత్య ఉద్యమంగా భావించేవారు. ఆధునికవాదులు చాలా అరుదుగా, 1945 తర్వాతి ప్రసిధ్ధమైన రచయితల గురించి ప్రస్తావించే వారు. దృశ్యమాన, దేహసంబంధ కళలను తప్పించి సంస్కృతికి సంబంధించిన అన్ని రంగాలకూ ఇది వర్తిస్తుంది.

యుధ్ధం తర్వాతి కాలము యూరోపులోని రాజధాని నగరాలన్నింటినీ అస్థవ్యస్థతకి గురిచేసింది. దానివల్ల, భౌతికంగా, ఆర్థికంగా పునర్నిర్మాణం జరగవలసిన ఆవశ్యకత ఇంకా రాజకీయంగా, పునఃసమూహం చెందాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. యూరోపియన్ సంస్కృతికి కేంద్రబిందువు, కళా ప్రపంచానికి మాజీ రాజధాని పారిస్ లో కళల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ప్రముఖమైన కలెక్టర్లు, డీలర్లు ఇంకా ఆధునికవాద రచయితలూ, మరియు కవులూ, యూరోపు వదిలి న్యూయార్క్‌కూ, అమెరికాకూ పారిపోయారు. ప్రతి సాంస్కృతిక కేంద్రంలోనుండి, సర్రియలిస్టులూ, ఆధునిక కళాకారులూ, నాజీల దాడి నుండి తప్పించుకునే క్రమంలో యునైటెడ్ స్టేట్స్‌కూ పారిపోయారు. పారిపోని చాలామంది గతించిపోయారు. పేబ్లో పికాసో, హెన్రి మాటిసే, పియరి బోనార్డ్ లాంటి కొంతమంది ఫ్రాన్స్ లో ఉండి కూడా బ్రతికారు.

1940వ దశాబ్దంలో న్యూయార్క్ సిటీ అమెరికన్ అవ్యక్తీకృత భావవ్యక్తీకరణవాదం యొక్క గెలుపు చాటిచెప్పింది. హెన్రి మాటిసె, పేబ్లో పికాసో, సర్రియలిజం, జోన్ మీరో, క్యూబిజం, ఫావిజం ద్వారా నేర్చుకున్న పాఠాలను మరియు అమెరికాలో గొప్ప అధ్యాపకులు హన్స్ హాఫ్మన్ మరియు జాన్ డి. గ్రాహంల తొలి ఆధునికవాదం ద్వారా నేర్చుకున్న పాఠాలను కలిపే ఒక ఆధునికవాదపు ఉద్యమం. పైయెట్ మాండ్రియన్, ఫెర్నాండ్ లెగార్, మాక్స్ ఎర్న్స్ట్ మరియు ఆండ్రి బ్రెటన్ ల సముదాయం, పియరీ మాటిసే యొక్క గాలరి, ఇంకా పెగ్గి గుగ్గెన్ హీం యొక్క గాలరీ - ది ఆర్ట్ ఆఫ్ దిస్ సెంచురి వలన, అంతే గాక మరికొన్ని కారణాల వల్ల అమెరికన్ కళాకారులు లబ్ధి పొందారు.

పోలోక్ మరియు అవ్యక్తీకృత ప్రభావాలు[మార్చు]

1940వ దశాబ్దపు చివర్లో, జాక్సన్ పోలోక్ యొక్క చిత్రకళకు సంబంధించిన రాడికల్ విధానం, అతన్ని అనుసరించిన సమకాలీన కళకు చెందిన శక్తిసామర్ధ్యాన్ని విప్లవాత్మకంగా మార్చేసింది. కళ యెంత ముఖ్యమో, కళాఖండాన్ని తయారు చేసే ప్రక్రియలో కళాకారుడు చేసే ప్రయాణం కూడా అంతే ముఖ్యమని, కొంతవరకూ అవగాహన చేసుకున్నాడు. శతాబ్దపు మలుపు దగ్గర క్యూబిజం మరియు నిర్మించబడిన శిల్పకళ ద్వారా పేబ్లో పికాసో యొక్క చిత్రకళకూ, శిల్పకళకూ సంబంధించిన వినూత్నమైన పునరావిష్కరణల లాగా పోలోక్ కళ తయారయ్యే విధానానికి పునర్నిర్వచనం చెప్పాడు. ఈసెల్ పేయింటింగ్ నుండి, సాంప్రదాయిక పధ్ధతుల నుండి అతను దూరంగా వెళ్ళడం, అతని కాలంలోని కళాకారులకి, తర్వాత వచ్చిన కళాకారులకీ, స్వేచ్ఛా సంకేతంగా అయింది. జాక్సన్ పోలోక్ పద్ధతి - విస్తరించని ముడి చిత్రపటాన్ని నేల మీద పరిచి అన్ని వైపుల నుండి ఉపయోగించడం, కళాత్మకమైన, పారిశ్రామిక పదార్థాలను ఉపయోగించడం, పేయింట్ యొక్క లీనియర్ స్కెయిన్స్‌ని ముంచడం, విసరడం, బొమ్మలు గీయడం, మరకలు వేయడం, బ్రష్ చేయడం, చిత్రాలను, చిత్రాలు కాని వాటినీ ఉపయోగించడం, ఇవన్నీ అవధులు లేని విధంగా కళను తయారు చేసే పద్ధతిని మార్చివేసాయని కళాకారులు గుర్తించారు. అవ్యక్తీకృత భావవ్యక్తీకరణవాదం సాధారణంగా వ్యాప్తి చెంది కొత్త కళాఖండాలను సృష్టించడానికి కళాకరులకు అందుబాటులో ఉన్న నిర్వచనాలనూ, సాధ్యాసాధ్యాలనూ అభివృధ్ధి చేసింది.

ఇతర అవ్యక్తీకృత భావవ్యక్తీకరణవాదులు తాము విజయాలు సాధిస్తూనే పోలోక్ విజయాన్ని అనుసరించారు. ఒక విధంగా చెప్పాలంటే జాక్సన్ పోలోక్, విల్లెం డి కూనింగ్, ఫ్రాంజ్ క్లైన్, మార్క్ రోత్కో, ఫిలిప్ గుస్తోన్, హన్స్ హాఫ్మన్, క్లిఫోర్డ్ స్టిల్ల్, బార్నెట్ న్యూమన్, ఆడ్ రెయిన్ హార్డ్, రాబర్ట్ మదర్వెల్, పీటర్ వౌల్కోస్ మరియు ఇతరుల ఆవిష్కారాలు, తమను అనుసరించిన కళ యొక్క భిన్నత్వానికీ, విస్తీర్ణవ్యాప్తికీ ద్వారాలు తెరిచాయి. కళాచరిత్రకారులు లిండా నోచ్లిన్, [15] గ్రిసేల్డా పోలోక్ [16] మరియు కాథరీన్ డి జెఘర్[17] అవ్యక్తీకృత కళకు సంబంధించిన చరిత్ర తిరిగి చదివినపుడు ప్రముఖమైన మహిళా కళాకారులు వారు సృష్టించిన పెద్ద ఆవిష్కారాలను చరిత్రకు సంబంధించిన అధికారిక వివరాల్లో విస్మరించడం జరిగిందని తెలిసింది.

1960వ దశాబ్దంలో అవ్యక్తీకృత భావవ్యక్తీకరణవాదం తర్వాత[మార్చు]

1950వ దశాబ్దంలో మరియు 1960వ దశాబ్దంలో హార్డ్-ఎడ్జ్ పేయింటింగ్ ఇంకా ఇతర రకాల రేఖాగణిత అవ్యక్తీకృతాలు స్టూడియోలలోనూ రాడికల్ అవాంట్-గార్డ్ సర్కిల్స్‌లోనూ కనపడడం మొదలుపెట్టాయి. ఇది అవ్యక్తీకృత భావవ్యక్తీకరణవాదం యొక్క ఆత్మాశ్రయధోరణికి ప్రతిస్పందనగా జరిగింది. 1954లో, యునైటెడ్ స్టేట్స్ లో ముఖ్యమైన ఆర్ట్ మ్యూజియంస్ లో పర్యటించిన ఒక కొత్త చిత్రాన్ని ఒక ప్రభావవంతమైన ప్రదర్శనలో పెట్టినందుకు, క్లెమెంట్ గ్రీన్‌బర్గ్ పోస్ట్-పేయింటర్లి అబ్స్ట్రాక్షన్ (చిత్ర నైరూప్యత తర్వాతి దశ) కు స్వరమై నిలిచాడు. కలర్ ఫీల్డ్ పేయింటింగ్, హార్డ్-ఎడ్జ్ పేయింటింగ్ మరియు గేయసంబంధమైన నైరూప్యత[18] కొత్త మార్గాలుగా ఉద్భవించాయి.

గేయసంబంధమైన నైరూప్యత, పోస్ట్ మినిమలిస్ట్ ఉద్యమం, ముందస్తు కాన్సెప్త్యువల్ ఆర్ట్ [19] గుండా ప్రయాణించి, 1960వ దశాబ్దపు చివర్లో, పోస్ట్ మినిమలిజం, ప్రాసెస్ ఆర్ట్ మరియు ఆర్ట్ పోవేరా [19]- చిత్ర, శిల్పకళలను ప్రభావితం చేసే విప్లవాత్మకమైన భావనలుగా, ఉద్యమాలుగా ఉద్భవించాయి. పోలోక్ ఊపిరి పోసిన ప్రాసెస్ ఆర్ట్, శైలి, సారము, పదార్ధము, చోటు, సమయసంబంధమైన వివేకం (టైం సెన్స్), ప్లాస్టిక్ మరియు నిజమైన స్థలము లాంటి వివిధ రకాలైన జ్ఞానకోశాన్ని ఉపయోగించడంలో కళాకారులు ప్రయోగాలు చేయడంలో ప్రోత్సాహం ఇచ్చింది. నాన్సీ గ్రేవ్స్, రోనాల్డ్ డేవిస్, హోవార్డ్ హోడ్కిన్, లారి పూన్స్, జానిస్ కౌనెల్లిస్, బ్రైస్ మార్డెన్, బ్రూస్ నౌమన్, రిచర్డ్ టటల్, అలన్ సారెట్, వాల్టర్ డార్బి బన్నార్డ్, లిండా బెంగ్లిస్, డాన్ క్రిస్టన్సన్, లారి జోక్స్, రోనీ లండ్ఫీల్డ్, ఎవా హెస్సె, కీత్ సోన్నియర్, రిచర్డ్ సెర్రా సాం గిల్లియం, మారియో మెర్జ్ మరియు పీటర్ రెజినాటో లాంటి యువకళాకారులు ఆధునికవాదపు శకంలోని చివరిదశలో ఉద్భవించారు. 1960వ దశాబ్దపు చివరిదశలో, కళాభివృధ్ధి జరుగుతున్న సమయానికి విస్తరించినది ఈ ఆధునికవాదం.[20]

పాప్ ఆర్ట్[మార్చు]

దస్త్రం:Roy Lichtenstein Whaam.jpg
రాయ్ లిక్టెన్‌స్టీన్, వ్హాం! (1963)

1962లో సిడ్నీ జేనిస్ గాలరి ది న్యూ రియలిస్ట్స్ అనే మొదటి ముఖ్యమైన పాప్ ఆర్ట్ గ్రూప్ ఎగ్జిబిషన్ ను న్యూ యార్క్ సిటీలోని అప్టౌన్ ఆర్ట్ గాలరిలో యేర్పాటు చేసింది. జానిస్ తన గాలరి ఉండే స్థలం 15ఇ. 57వ వీధి దగ్గరలో, 57వ వీధి స్టోర్ ఫ్రంట్ లో ఎగ్జిబిషన్ యేర్పాటు చేసాడు. న్యూయార్క్ స్కూల్ లో ఈ ఎగ్జిబిషన్ అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేయడమేఅ కాక, ఇది ప్రపంచవ్యాప్తంగా, ప్రతిధ్వనించింది. 1958లో ఇంతకుముందు ఇంగ్లండ్లో, "పాప్ ఆర్ట్" అను పదం, రెందవ ప్రపంచ యుధ్ధం తర్వాతి శకంలోని కన్స్యూమరిజం (వినియోగ తత్త్వం) ను నిర్వచించడానికి లారెన్స్ అల్లోవే ఉపయోగించాడు. ఈ ఉద్యమం హెర్మెన్న్యూటిక్ (వివరణాత్మక) మరియు మానసిక అంతర్భాగం పై దృష్టినీ, అవ్యక్త భావవ్యక్తీకరణవాదాన్ని తిరస్కరించింది. ఇది, వినియోగదారుని సంస్కృతి, అడ్వెర్టైజింగ్, మరియు మాస్ ప్రొడక్షన్ ఏజ్ కు చెందిన ప్రతిమా శాస్త్రాన్ని వర్ణించి చూపిన కళకు అనుకూలంగా ఈ పనిచేసింది. డేవిడ్ హాక్నీ ముందస్తు ఆవిష్కరణలు, రిచర్డ్ హామిల్టన్ మరియు ఎడ్వార్డొ పాలోజ్జీల ఆవిష్కరణలు ఉద్యమంలో వృధ్ధి చెందగల ఉదాహరణలుగా భావించడం జరిగింది. ఇదిలా ఉండగా 10వ స్ట్రీట్ గాలరీస్ కళాకారులు, న్యూ యార్క్ ఈస్ట్ విలేజ్ లోని ముఖ్యవ్యాపారస్థలిలో, అమెరికన్ వర్షన్ పాప్ ఆర్ట్ ను యేర్పాటు చేస్తూ ఉన్నారు. క్లేస్ ఒల్డంబర్గ్ కు తన ప్రదర్శనా స్థలం ఉండేది; ఇంకా 57వ వీధిలోని గ్రీన్ గాలరి టాం వెస్సెల్మన్ మరియు జేంస్ రోసంక్విస్ట్ యొక్క ఆవిష్కరణలను ప్రదర్శించడం మొదలు పెట్టింది. తర్వాత లియో కాస్టెల్లి, తన జీవితంలో ఎక్కువ భాగం వరకూ, అమెరికన్ కళాకరుల ఆవిష్కారాలు ప్రదర్శించాడు, అందులో ఆండీ వార్హోల్ మరియు రాయ్ లిక్టెన్స్టీన్ ల ఆవిష్కరణలు కూడా ఉన్నాయి. బెండే డాట్స్, (కమర్షియల్ రిప్రొడక్షన్ లో ఒక సాంకేతిక పద్ధతి) లాగా అగుపించే క్లేస్ ఓల్డంబర్గ్, ఆండి వార్హోల్ మరియు రాయ్ లిక్టెన్స్టీన్ చిత్రాలకూ, మార్కెల్ ద్యూచాంప్ మరియు మన్ రే (హాస్యరసభరితమైన దదాఇస్ట్ తిరుగుబాటుదారులు) ల రాడికల్ ఆవిష్కారాలకీ సంబంధం ఉంది.

మినిమలిజం (అతి క్లుప్తత)[మార్చు]

1960వ దశాబ్దపు మొదటి భాగంలో, మినిమలిజం కళలో ఒక అవ్యక్తీకృత ఉద్యమంగా ఉద్భవించింది (కాజ్మీర్ మాలేవిచ్, ది బౌహాస్ మరియు పైయెట్ మోండ్రియన్ల రేఖాగణిత నైరూప్యతలోని మూలాలతో). యాక్షన్ పేయింటింగ్ యొక్క రంగస్థలిలో ఉన్న భావాత్మక జీట్గీస్ట్ మరియు పోలమిక్స్, అవ్యక్త భావవ్యక్తీకరణవాదపు సంక్లిష్టత, రిలేషనల్ మరియు సబ్జెక్టివ్ పేయింటింగ్‌ల ఆలోచనను అది తిరస్కరించింది. కళలో అవసరమయ్యే పవిత్ర ప్రాతినిధ్యాన్ని, అతి సరళత కైవసం చేసుకుంటుందని మినిమలిజం వాదించింది. ఇతర రంగాలకు భిన్నంగా, ఫ్రాంక్ స్టెల్లా లాంటి చిత్రకారులతో సంబంధం కలిగి ఉండిన మినిమలిజం, పేయింటింగ్‌లో ఒక ఆధునికవాదపు ఉద్యమం. మినిమలిజాన్ని వివిధరకాలుగా చూసేవారు - దానిని పోస్ట్ మోడర్నిజానికి శకునం లాగానో, లేదా, పోస్ట్ మాడర్న్ ఉద్యమమే ఇది అన్నట్లుగానో చూసేవారు. తర్వాతి దృక్పథంలో, ముందస్తు మినిమలిజం చాలా ఉన్నతస్థాయి ఆధునిక ఆవిష్కారాలను ఉత్పత్తి చేసింది, కానీ, ఆకృతి-వ్యతిరేక ఉద్యమానికి అనుకూలంగా రాబర్ట్ మారిస్, తన మార్గాన్ని మళ్ళించినపుదు, ఉద్యమం ఈ మార్గాన్ని కొంత పరిత్యజించింది.

ది క్రక్స్ ఆఫ్ మినిమలిజం [21] అన్న వ్యాసంలో, హాల్ ఫోస్టర్, తమ ముద్రించబడిన మినిమలిజం[21] యొక్క నిర్వచనాలలో, డోనాల్డ్ జడ్డ్ మరియు రాబర్ట్ మారిస్ యెంత వరకూ, గ్రీన్‌బర్గ్ ఆధునికవాదాన్ని సమ్మతించారు, యెంత వరకూ, అతిక్రమించారు అన్న విషయంపై చర్చిస్తాడు. అతను, మినిమలిజం ఆధునికవాదానికి చివరి మజిలీ కాదనీ, ఈనాటిదాకా, వివరింపబడుతోన్న పోస్ట్ మాడర్న్ పధ్ధతుల వైపు, ఒక ఉదాహరణ యోగ్యమైన మలుపు అనీ వాదించాడు.[21]

పోస్ట్ మినిమలిజం[మార్చు]
స్మిత్సన్'స్ "స్పైరల్ జెట్టి" ఫ్రం ఎటాప్ రోజల్ పాయింట్, ఇన్ మిడ్-ఏప్రిల్ 2005. అది 1970వ సంవత్సరంలో కట్టబడింది. సరస్సు స్థాయిలో హెచ్చుతగ్గుల వల్ల అప్పుడప్పుడూ మునిగిపోయినా ఇంకా ఉంది. దానిలో 6500ల టన్నుల నల్లపింగాణి, భూమి మరియు ఉప్పు ఉంది.

1960వ దశాబ్దపు చివరి భాగంలో, రాబర్ట్ పింకస్[19], మినిమలిజం నుండి ఉద్భవించిన కళను, మినిమలిజం తిరస్కరించిన సందర్భసహిత అంశాలను వివరించడానికి పోస్ట్ మినిమలిజం అన్న పదం మొదటిసారిగా ఉపయోగించాడు. పింకస్ వ్హిట్టెన్ దానిని ఎవా హెస్సే, కీత్ సోన్నియర్, రిచర్డ్ సెర్రాల ఆవిష్కరణకూ మరియు మాజీ మినిమలిస్టులైన, రాబర్ట్ స్మిత్సన్, రాబర్ట్ మోరిస్, సోల్ లెవిట్ మరియు బారి లే వా ఇంకా ఇతరుల కొత్త ఆవిష్కరణలకు ఆపాదించాడు. ఇతర మినిమలిస్టులు డోనాల్డ్ జడ్డ్, డాన్ ఫ్లావిన్, కారల్ ఆండ్రి, ఆజ్ఞస్ మార్టిన్, జాన్ మెక్ క్రాకెన్ మరియు ఇతరులు తమ శేష జీవితంలో ఆధునికవాదపు చిత్రాలూ, ఇంకా శిల్పాలు తయారు చేస్తూ గడిపారు.

1960వ దశాబ్దపు చివరి అంకంలో, అవాంట్-గార్డ్ మినిమలిస్టులైన స్వరకర్తలు ల మోంట్ యంగ్, ఫిలిప్ గ్లాస్, స్టీవ్ రీచ్, మరియు టెర్రి రైలీల ఆవిష్కారాలు కూడా న్యూ యార్క్ కళా ప్రపంచంలో ప్రసిధ్ధిగాంచాయి.

అప్పటి నుండి, యెంతో మంది కళాకారులు మినిమల్ లేదా పోస్ట్ మినిమల్ రీతులను స్వీకరించారు, వారికి "పోస్ట్ మాడర్న్" అన్న ముద్ర పడింది.

కొల్లేజ్, అస్సెంబ్లేజ్ మరియు ఇన్స్టలేషన్స్[మార్చు]

దస్త్రం:Robert Rauschenberg's untitled 'combine', 1963.jpg
రాబర్ట్ రౌషంబర్గ్ అన్‌టైటిల్డ్ కంబైన్, 1963

ఇదివరకు సంప్రదాయాలకు భిన్నంగా, అవ్యక్తీకృత భావవ్యక్తీకరణ తరహాలో, తైయారు చేయబడిన వస్తువులను, ఆర్టిస్ట్ ఉపయోగించే పదార్ధాలతో మిశ్రమించి చేసే చిత్రకళ, శిల్పకళ ఉద్భవించింది. రాబర్ట్ రౌషంబర్గ్ ఆవిష్కరణ ఈ పోకడను ఉదహరిస్తుంది. 1950వ దశాబ్దంలో అతని ఆవిష్కరణ "కంబైన్స్" పాప్ ఆర్ట్ కూ, ఇన్స్టలేషన్ ఆర్ట్ కూ మంచి శకునాలు. అందులో అతను, పెద్ద భౌతిక వస్తువుల, స్తఫ్ఫ్డ్ జంతువుల, పక్షుల మరియు వాణిజ్య ఫొటోచిత్రాల అస్సెంబ్లేజెస్ (అసెంబ్లేజ్ - వివిధ రకాల వస్తువులను మిశ్రమించి కొత్త కళాకృతిని సృష్టించడం) ఉపయోగించాడు. రౌషన్‌బర్గ్, జాస్పర్ జాన్స్, లారి రివర్స్, జాన్ చాంబర్లేన్, క్లేస్ ఓల్డన్‌బర్గ్, జార్జ్ సెగల్, జిం డైన్, మరియు ఎడ్వార్డ్ కీన్ హోల్జ్ పాప్ ఆర్ట్ కూ, నైరూప్య కళకూ అగ్రగాములు. కళాకృతుల తయారీలో కొత్త సంప్రదాయాల ఒరవడిని సృష్టిస్తూ, వాళ్ళు సమకాలీన ఆర్ట్ సర్కిల్స్ లో (ఆర్ట్ సర్కిల్స్ - కళాకారుల సామాజిక సముదాయాలు) ఉపయోగించదగినవి కాదనుకున్న పదార్ధాలని రాడికల్ పద్ధతిలో ఉపయోగించి ఆమోదం పొందారు. కొల్లేజ్ లో మరొ అగ్రగామి జోసఫ్ కార్నెల్ - నిశితంగా పరీక్షింపబడిన అతని ఆవిష్కారాలను రాడికల్ గా (రాడికల్ - సమూలమైన మార్పులు తెచ్చునది) భావించే వారు. దానికి కారణం అతని వ్యక్తిగత ప్రతిమా శాస్త్రం మరియు కనపడే వస్తువుల అతని ఉపయోగం.

నియో దాదా[మార్చు]

20వ శతాబ్దపు మొదటి భాగంలో మార్సెల్ డ్యూచాంప్ ఒక మూత్రశాలను శిల్పకళాఖండంగా ప్రదర్శించాడు. అతను దాన్ని కళాకృతి అన్నాడు కాబట్టి ప్రజలు కూడా దాన్ని కళాకృతిగానే చూస్తారని, అతను తన ఉద్దేశాన్ని బహిరంగంగా చెప్పాడు. అతను తన ఆవిష్కరణను "రెడీమేడ్స్" (రెడీమేడ్ - చేయబడి తయారుగా ఉన్నాయి.గా చెప్పుకొచ్చాడు. ఆర్. మట్ట్ అనే కలంపేరుతో సంతకం చేయబడిన ఫౌంటైన్ అనబడే యూరినల్ ప్రదర్శన 1917 లో కళా ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇదీ ఇంకా డ్యూచాంప్ యొక్క ఇతర ఆవిష్కారాలు దాదా అని పిలవబడ్డాయి. డ్యూచాంప్ ను కాన్సెప్త్యూవల్ ఆర్ట్ కు మంచి శకునముగా చూడవచ్చు. జాన్ కేజెస్ 4'33", నాలుగు నిముషాల ముప్పై మూడు సెకన్ల నిశ్శబ్దం, మరియు రౌషన్బర్గ్ యౌక్క ఇరేజ్డ్ డి కూనింగ్ను ఇతర ప్రసిధ్ధమైన ఉదాహరణలుగా చూడవచ్చు. యెన్నో కాన్సెప్త్యూవల్ ఆవిష్కారాలు, కళను ప్రేక్షకుడు వస్తువుని చూసే ప్రక్రియకు పరిణామంగా లేదా, కళ వెనుక కృషిని కళగా భావిస్తాయనీ, ఆవిష్కరణ యొక్క అంతర్గత లక్షణాలను కళగా భావించవనీ వాదిస్తాయి. అందుకని, ఫౌంటైన్ ప్రదర్శించబడింది కాబట్టి, అదో కళాఖండం.

మార్సెల్ డ్యూచాంప్ చదరంగం కోసం కళను వదిలివేసాడు. ఆవాంట్ గార్డ్ కంపోసర్ డేవిడ్ ట్యూడర్ రీయూనియన్ (1968), అన్న కళాఖండాన్ని సృష్టించాడు. దాన్ని అతడు లోవెల్ క్రాస్ తో కలిసి రచించాడు, దాన్ని చదరంగం ఆటకు సంబంధించిన ప్రతి కదలిక ఒక లైటింగ్ ఇఫెక్ట్ లేదా ప్రొజెక్షన్‌ను ప్రేరేపించేదిగా అతను రూపొందించాడు. డ్యూచాంప్ మరియు కేజ్ ఆవిష్కారపు మొదటి ప్రదర్శనలో చదరంగం ఆడారు.[22]

స్టీవెన్ బెస్ట్ మరియు డౌగ్లాస్ కెల్ల్నర్, ఆధునికవాదం మరియు పోస్ట్ మాడర్నిజం మధ్యకాలంలో మార్సెల్ డ్యూచాంప్ చే ప్రభావితం కాబడిన వారైన, రౌషన్‌బర్గ్ మరియు జాస్పర్ జాన్స్ ను పరిణామదశలో భాగంగా గుర్తిస్తారు. ఇద్దరూ తమ ఆవిష్కారాలలో ఒక పక్క ఉన్నతమైన ఆధునికవాదానికి చెందిన నైరూప్యతను, చిత్రకార సంజ్ఞలను నిలుపుకుంటూనే, సాధారణ వస్తువులను చిత్రాలను లేదా, ఆ వస్తువులనే ఉపయోగించారు.[23]

చాలా రకాల మాధ్యమాలని ఒకేసారి ఉపయోగించడం నియో-దాదా లోని మరొక పోకడ. డిక్ హిగ్గిన్స్ మొదటిసారిగా ఉపయోగించిన పదం, "ఇంటర్ మీడియా" అనేది, ఫ్లక్సస్, కాంక్రీట్ కవిత్వం, కనపడే వస్తువులు, పెర్ఫార్మెన్స్ ఆర్ట్ మరియు కంప్యూటర్ ఆర్ట్స్‌లాగా, కొత్త కళాకృతులను తయారు చేసే పద్ధతి. హిగ్గిన్స్ సంథింగ్ ఎల్స్ ప్రెస్ యొక్క పబ్లిషర్. అతను, ఒక కాంక్రీట్ కవి, కళాకారిణి అలిసన్ నౌల్స్ యొక్క భర్త మరియు మార్సెల్ డ్యూచాంప్ అభిమాని.

పెర్ఫార్మన్స్ మరియు హాపెనింగ్స్ (ప్రదర్శన మరియు సంఘటనలు)[మార్చు]

దస్త్రం:Schneemann-Interior Scroll.gif
కరోలీ స్క్నీమన్, పెర్ఫార్మింగ్ హర్ పీస్ ఇంటీరియర్ స్క్రోల్

1950వ దశాబ్దపు చివర్లో, భిన్నమైన ఆసక్తులు కలిగిన కళాకారులు సమకాలీన కళ యొక్క పరిధులను పెంచడం మొదలుపెట్టారు. ఫ్రాన్స్‌లో యెవ్స్ క్లీన్ కరోలీ స్క్నీమన్, యయొయి కుసామా, చార్లట్ మూర్మన్ మరియు యోకో ఓనో న్యూయార్క్లో, పెర్ఫార్మింగ్ ఆర్ట్స్‌లో అగ్రగాములు. లివింగ్ థియేటర్ లాంటి సముదాయాలు జులియన్ బెక్ మరియ్ జుడిత్ మలీనతో కలిసి, శిల్పకళాకరులూ చిత్రకారులతో కలిసి వాతావరణం సృష్టించడం, ప్రేక్షకులకీ ప్రదర్శనకారుడికీ మధ్య సంబంధాన్ని సమూలంగా మార్చడానికీ దోహద పడ్డారు, ముఖ్యంగా, పారడైజ్ నౌ అనే ఆవిష్కారంలో. జడ్సన్ మెమోరియల్ చర్చ్, న్యూ యార్క్లో ఉన్న జడ్సన్ డాన్స్ థియేటర్, మరియు జడ్సన్ డాన్సర్లు, ముఖ్యంగా యవోన్ రైనర్, త్రిషా బ్రౌన్, ఎలైన్ సమర్స్, సాలి గ్రోస్, సిమోన్ ఫోర్టి, డెబోర హే, లుసిండా చైల్డ్స్, స్టీవ్ పాక్స్టన్ మరియు ఇతరులు - రాబర్ట్ మారిస్, రాబర్ట్ వ్హిట్మన్, జాన్ కేజ్, రాబర్ట్ రౌషన్‌బర్గ్, మరియు బిల్ల్య్ క్లూవర్ లాంటి ఇంజనీర్లతో కలిసారు. పార్క్ ప్లేస్ గాలరి, ఎలెక్ట్రానిక్ కంపోసర్లు ఐన స్టీవ్ రీచ్, ఫిలిప్ గ్లాస్ మరియు జోఅన్ జోనాస్ లాంటి ఇతర పెర్ఫార్మెన్స్ ఆర్టిస్టుల సంగీత ప్రదర్శనలకు కేంద్రబిందువయ్యింది. తరచూ, ప్రేక్షకుల భాగస్వామ్యంతో జరిగే ఈ ప్రదర్శనలను, శిల్పకళ, నృత్యకళ మరియు సంగీతము లేదా ధ్వనులను మేళవించి చేసే కొత్త కళాకృతులుగా భావించేవారు. అవి మినిమలిజం యొక్క సూక్ష్మీకరణ తత్త్వాలు, అయత్నకృతమైన సందర్భోచిత నిపుణత, నైరూప్య భావవ్యక్తీకరణవాదం యొక్క వ్యక్తీకరణ ప్రత్యేక లక్షణములుగా కలిగి ఉండేవి.

అదే సమయంలో, వివిధ అవాంట్-గార్డ్ కళాకారులు "హాపెనింగ్స్" సృష్టించారు. వివిధ నిర్ణయినంపబడిన స్థలాలలో, నిగూఢమైన, అయత్నకృతమైన, అనుకోనివిధంగా జరిగే కళాకారులు, వారి స్నేహితులు మరియు బంధువుల సమావేసాలు - 'హాపెనింగ్శ్. వీటిల్లో తరచూ, నిరర్ధకత (అబ్సర్డిటీ), భౌతికత, దుస్తులు వేసుకునే తీరుతెన్నులు, అయత్నకృతమైన నగ్నత్వం, మరియు యాదృచ్ఛికమైన లేదా సంబంధం లేనివిగా కనపడే చర్యల లాంటి అభ్యాసాలు ఉండేవి. 'హాపెనింగ్శ్ లో అల్లన్ కాప్రోవ్, క్లేస్ ఓల్డంబర్గ్, జిం డైన్, రెడ్ గ్రూంస్, మరియు రాబర్ట్ వ్హిట్మన్ మొదలగు వారు గుర్తించదగ్గ సృష్టికర్తలు.[24]

అలన్ కార్పోవ్ యొక్క పెర్ఫార్మెన్స్ ఆర్ట్ కళనూ, జీవితాన్నీ సంపూర్ణం చేయడానికి ప్రయత్నించింది. హాపెనింగ్స్ ద్వారా, జీవితం, కళ, కళాకారుడు మరియు ప్రేక్షకుల మధ్య దూరం చెరిగిపోతుంది. శరీరపు కదలికతో, రికార్డెడ్ ధ్వనులతో, లిఖించిన మరియు మాట్లాడిన విషయాలతో ఇంకా వాసనలతో ప్రయోగం చేయడానికి 'హాపెనింగ్' స్వేచ్ఛనిస్తుంది. కళాకృతి వృధ్ధి చెందే దశలో, 1961లో రచించిన "హాపెనింగ్స్ ఇన్ ది న్యూ యార్క్ సీన్", అలన్ కాప్రోవ్ యొక్క హాపెనింగ్స్ లో ఒక ముందస్తు హాపెనింగ్.[25]

1958లో కాప్రోవ్ "ది లెగసి ఆఫ్ జాక్సన్ పోలోక్" అనే వ్యాసాన్ని ముద్రించాడు. అందులో అతను, దైనందిన జీవితంలో ఉపయోగించే పదార్ధాలు, పేయింట్, కుర్చీలు, ఆహారము, ఎలెక్ట్రిక్ మరియు నియోన్ లైట్లు, పొగ, నీరు, పాతబడ్డ సాక్స్, ఒక కుక్క, మూవీస్....ఇవన్నింటినీ ఉపయోగించి కాంక్రీట్ ఆర్ట్ సృష్టించాలని దబాయించి అడిగాడు. ఈ ప్రత్యేకమైన పాఠంలో అతను, పనితనాన్ని, శాశ్వతత్త్వాన్ని మరిచిపోవాలని ఇంకా నశ్వరమైన పదార్ధాలని కళలో ఉపయోగించాలని చెబుతూ, "హాపెనింగ్" అన్న పదం మొదటి సారిగా ఉపయోగిస్తాడు.[26]

ఇంటర్ మీడియా, మల్టీ మీడియా[మార్చు]

కళలో పోస్ట్ మాడర్న్ అనే పదంతో సంబంధం కలిగిన మరో పోకడ వివిధ మాధ్యమాలని ఒకేసారి ఉపయోగించడం. డిక్ హిగ్గిన్స్ మొదటి సారిగా ఇంటర్ మీడియా అన్న పదం ఉపయోగించాడు. అది, ఫ్లక్సస్, కాంక్రీట్ కవిత్వం, కనపడే వస్తువులు, పెర్ఫార్మెన్స్ ఆర్ట్, మరియు కంప్యూటర్ ఆర్ట్ తరహాలో కొత్త కళాకృతుల గురించి విశదీకరించడానికి ఉద్దేశించింది. హిగ్గిన్స్ సంథింగ్ ఎల్స్ ప్రెస్ యొక్క పబ్లిషర్. అతను, ఒక కాంక్రీట్ కవి, కళాకారిణి అలిసన్ నౌల్స్ యొక్క భర్త మరియు మార్సెల్ డ్యూచాంప్ అభిమాని. పోస్ట్ మాడర్న్ ఆర్ట్ యొక్క తన లక్షణాల జాబితాలో, ఇహాబ్ హసన్, "ఇంటర్ మీడియా, ది ఫ్యూజన్ ఆఫ్ ఫారంస్, ది కంఫ్యూజన్ ఆఫ్ రెయామ్స్"ను జతచేర్చాడు.[27] మల్టీ మీడియా ఆర్ట్ లో ఒక సామాన్యమైన ఆకృతి, వీడియో-టేప్, CRT మానిటర్స్ యొక్క ఉపయోగం; దీనిని వీడియో ఆర్ట్ అనేవారు. వివిధరకాల కళలను ఒకే కళగా చేయడం అనే సిధ్ధాంతం చాలా పాతది అయినప్పటికీ, దాన్ని అప్పుడప్పుడూ పునరుధ్ధరిస్తున్నప్పటికీ, దాని పోస్ట్ మాడర్న్ అభివ్యక్తీకరణ తరచూ, పెర్ఫార్మెన్స్ ఆర్ట్ తో కలిసి ఉన్నది; అందులో నాటకీయ ఉపపాఠం తొలగించగా, కళాకారుడి నిర్దిష్టమైన వివరణలు లేదా కళాకారుడి చర్యలకు సంబంధించిన భావసంబంధమైన ప్రకటన మాత్రం మిగిలేవి.

ఫ్లక్సస్[మార్చు]

లిథువేనియాలో జన్మించిన అమెరికన్ కళాకారుడు జార్జ్ మాసియునాస్ (1931–78), 1962లో ఫ్లక్సస్ అనే పేరు పెట్టి దానిని అజాగ్రత్తగా నిర్వహించాడు. జాన్ కేజ్ 1957 నుండి 1959 మధ్యలో న్యూ యార్క్ లోని, న్యూ స్కూల్ ఫర్ సోషల్ రిసర్చ్ లో నిర్వహించిన ఎక్స్పరిమెంటల్ కాంపోసిషన్ క్లాసెస్ లో ఫ్లక్సస్ యొక్క మూలాలు ఉన్నాయి. అతని విద్యార్థులలో చాలామంది, ఇతర మాధ్యమాలలో పనిచేసే కళాకారులు; వారిలో కొందరికి సంగీతంలో అతితక్కువ అనుభవం ఉండేది మరికొందరికి అసలు అనుభవమే ఉండేది కాదు. కేజ్ యొక్క విద్యార్థులలో ఫ్లక్సస్ స్థాపకసభ్యులు జాక్సన్ మక్ లో, అల్ హన్సేన్, జార్జ్ బ్రెక్ట్ మరియు డిక్ హిగ్గిన్స్ ఉండేవారు.

నీ అంతట నువ్వే చేయి అనే రసజ్ఞానాత్మక ధోరణిని ఫ్లక్సస్ ప్రోత్సహించింది; ఇంకా సంక్లిష్టత పై సరళత్వానికి ప్రాధాన్యతనిచ్చింది. ఇంతకు మునుపు దాదా ఉద్యమంలాగా, ఫ్లక్సస్ కూడా, వాణిజ్యవ్యతిరేక, కళావ్యతిరేక ధోరణుల ఒక బలమైన తరంగం సృష్టించింది; సంప్రదాయసిధ్ధమైన బజారుచే ప్రోత్సహించబడుతోన్న కళాప్రపంచాన్ని తృణీకరిస్తూనే, కళాకారుడే కేంద్రంగా ఉండే సృజనాత్మక అభ్యాసానికి అనుకూలంగా స్పందించింది. చేతిలో యే వస్తువులుంటే వాటితో పని చేయడానికి ఫ్లక్సస్ కళాకారులు ప్రాధాన్యత ఇచ్చేవారు; అలా చేసి, వారు తమ సొంత ఆవిష్కారాలను సృష్టించారు లేదా తమ సహాయోగులకు కళాకృతులని సృష్టించే పనిలో సహాయం చేసారు.

ఆండ్రియాస్ హూయ్సెన్ ఫ్లక్సస్ ను పోస్ట్ మాడర్నిజానికి అన్వయించడాన్ని విమర్శించాడు. "ఇది పోస్ట్ మాడర్నిజానికి మాస్టర్ కోడ్ ఐనా కావాలి, లేదా, తుదకు పూర్తిగా ప్రాతినిధ్యం వహించలేని కళా ఉద్యమం ఐనా అయి ఉండాలి - ఎందుకంటే ఇది పోస్ట్ మాడర్నిజం యొక్క ఉత్కృష్టమైన అంశం.[28] దానికి బదులు అతను ఫ్లక్సస్ ను అవాంట్-గార్డ్ సంప్రదాయంలోని, ఒక ప్రముఖమైన నియో-దాదాయిజపు ప్రక్రియగా భావిస్తాడు. అది కళాత్మక వ్యూహరచనాభివృధ్ధిలో పెద్దగా ముందంజ వేయలేదుగానీ, 1950వ దశాబ్దంలో ప్రచ్ఛన్న యుధ్ధానికి సైధ్ధాంతిక ఆసరాగా నిలిచిన, దేశీయం చేయబడిన, మితవాద ఆధునికవాదం యొక్క అడ్మినిస్టర్డ్ సంసృతిపై తిరుగుబాటు చేసింది.[29]

చివరి కాలం[మార్చు]

రోనీ లాండ్‌ఫీల్డ్, గార్దెన్ ఆఫ్ డిలైట్, 1971, లిరికల్ అబ్‌స్ట్రాక్షన్ ఫ్రం ది అర్లి 1970స్

చాలా అధ్యయన విభాగాలలోని కళాకారులు ఆధునికవాదపు పధ్ధతులు కొనసాగిస్తూ 21వ శతాబ్దం లోకి అడుగుపెట్టారు. నైరూప్య భావవ్యక్తీకరణ యొక్క కొనసాగింపు, కలర్ ఫీల్డ్ పేయింటింగ్, గేయ సంబంధమైన నైరూప్యత, రేఖాగణిత నైరూప్యత, మినిమలిజం, నైరూప్య భ్రాంతితత్త్వం, ప్రాసెస్ ఆర్ట్, పాప్ ఆర్ట్, పోస్ట్ మినిమలిజం, ఇంకా చిత్రకళ మరియు శిల్ప కళలో ఇతర 20వ శతాబ్దపు ఆధునికవాద ఉద్యమాలు 21వ శతాబ్దపు మొదటి దశాబ్దంలో కొనసాగింపబడ్డాయి[30]; అవి ఆ మాధ్యమాలలో, సమూలమైన మార్పులని సూచించే నూతన మార్గాలకు ప్రాతినిధ్యం వహిస్తాయి.[31][32]

21వ శతాబ్దంలోకే అడుగుపెట్టేసరికి, బాగా పేరుబడ్డ కళాకారులు, సర్ ఆంథొనీ కారో, లూసియన్ ఫ్రాఇడ్, సై ట్వోంబ్లి, రాబర్ట్ రౌషంబర్గ్, జాస్పర్ జాన్స్, ఆజ్ఞస్ మార్టిన్, అల్ హెల్డ్, ఎల్స్వర్త్ కెల్లి, హెలెన్ ఫ్రాంకెంథాలర్, ఫ్రాంక్ స్టెల్ల, కెన్నెత్ నోలాండ్, జూల్స్ ఓలిట్స్కి, క్లేస్ ఓల్దంబర్గ్, జిం డైన్, జేంస్ రోసెంక్విస్ట్, అలెక్స్ కాట్జ్, ఫిలిప్ పర్ల్స్టెయిన్, మరియు యువ కళాకరులు బ్రైస్ మార్డెన్, చక్ క్లోస్, సాం గిల్లియం, ఐజాక్ విట్కిన్, సీన్ స్కల్లి, మహిర్వాన్ మాంటని, జోసఫ్ నెక్వటల్, ఎలిజబెత్ ముర్రే, లారి పూన్స్, రిచర్డ్ సెర్రా, వాల్టర్ డర్బి బన్నార్డ్, లారి జోక్స్, రోని లాండ్ఫీల్డ్, రొనాల్డ్ డేవిస్, డాన్ క్రిస్టెన్సన్, జొయల్ షపీరో, టాం ఒట్టర్నస్, జోన్ సిండర్, రాస్ బ్లెక్నర్, అర్చీ రండ్, సూసాన్ క్రైల్, ఇంకా డజన్ల కొద్దీ ఇతర కళాకారులు చిత్రకళలో, శిల్పకళలో ఆవశ్యకమైన, ప్రభావవంతమైన ఆవిష్కారాలను సృష్టించే ప్రక్రియను కొనసాగించారు.

కానీ, 1980వ దశాబ్దపు మొదట్లో, కళ, వాస్తుశాస్త్రాలలో, పోస్ట్ మాడర్న్ ఉద్యమం, వివిధ రకాల కాన్సెప్త్యూవల్ మరియు ఇంటర్ మీడియా ఫార్మాట్స్ ద్వారా తన స్థానాన్ని బలోపేతం చేసుకోవడం మొదలు పెట్టింది. అంతకుముందే సంగీతంలోనూ, సాహిత్యంలోనూ పోస్ట్ మాడర్నిజం వేళ్ళూనుకుంది, కొంతమంది 1950వ దశాబ్దంలోనే ఇది జరిగిందని అంటారు. పోస్ట్ మాడర్నిజం ఆధునికవాదం యొక్క అంతాన్ని పరోక్షంగా సూచిస్తే, చాలామంది సైధ్ధాంతికవాదులు మరియు పండితులు లేట్ మాడర్నిజం 21వ శతాబ్దం వరకూ కొనసాగిందని నొక్కి చెబుతారు.

ఉద్యమ లక్ష్యాలు[మార్చు]

ది 'గ్లాస్ పాలేస్ (1935) ఇన్ ది నెదెర్లాండ్స్ - ఫంక్షనల్ అండ్ ఓపన్

చాలామంది ఆధునికవాదులు సంప్రదాయాన్ని తిరస్కరించడం ద్వారా తాము కళలో సమూలంగా మార్పులు తెచ్చే కొత్త పధ్ధతులని కనిపెట్టవచ్చని నమ్మారు. ఆర్నాల్డ్ స్కీంబర్గ్ సంప్రదాయ స్వరసంబంధిత సమతాళాన్ని, ఒకటిన్నర శతాబ్దం పైగా సంగీత సృష్టికి సహకరించిన, సంగీతం నిర్వహించే క్రమానుగత వ్యవస్థను తిరస్కరించాడు. 12-నోట్ రోస్ (12 note rows) ఉపయోగించి, ధ్వనిని నిర్వహించే సంపూర్ణమైన కొత్త పద్ధతిని, తాను కనిపెట్టానని అతను నమ్మాడు. నైరూప్య కళాకారులు, అభిరుచివాదులను పాల్ సీజాన్ మరియు ఎడ్వార్డ్ మంచ్ లను ఉదాహరణగా తీసుకుని, కళయొక్క ముఖ్యలక్షణం రంగు, ఆకృతి కానీ, సహజ ప్రపంచం యొక్క వర్ణన కాదు అని భావించడం మొదలు పెట్టారు. వాసిలీ కాండిన్స్కీ, పైయెట్ మాండ్రియన్ మరియు కాజ్మీర్ మాలెవిచ్ - వీరందరూ కూడా, కళ స్వచ్ఛమైన రంగు యొక్క అమరిక అని పునర్నిర్వచించడాన్ని నమ్మారు. దృశ్యసంబంధమైన కళ యొక్క ప్రాతినిధ్యపు విధికి కాలదోషం పట్టించిన ఫొటోగ్రఫి యొక్క ఉపయోగం, ఆధునికవాదం యొక్క ఈ అంశాన్ని బలంగా ప్రభావితం చేసింది. ఏది యేమైనప్పిటికీ, ఈ కళాకారులు భౌతికమైన వస్తువులని వర్ణించడాన్ని తిరస్కరించడం ద్వారా, కళను పరిణామ క్రమంలో, అనాత్మవాదం నుండి ఆధ్యాత్మిక దశకు తీసుకువెళ్ళామని నమ్మారు.

షికాగో్‌లోని లుడ్విగ్ మైయ్స్ వాన్ డర్ రోహ్'స్ 330 నార్త్ వబాష్ (ఇంతకు మునుపు IBM ప్లాజా)

ఇతర ఆధునికవాదులు, ముఖ్యముగా డిజైన్ రంగంలో ఉన్నవారికి మరింత ఆచరణాత్మక భావాలు ఉన్నాయి. ఆధునికవాదపు వాస్తుశిల్పులు మరియు డిజైనర్లు కొత్త సాంకేతిక పరిజ్ఞానం కట్టడాలలో పాత శైలిని పురాతనం చేసిందని నమ్మారు. లే కార్బూసియర్, కార్లు యెలాగైతే ప్రయాణం చేయడానికి ఉపయోగపడే యంత్రాలుగా మారాయో, అదేవిధంగా, కట్టడాలు బ్రతకడానికి ఉపయోగపడే యంత్రాలుగా ఉండాలని భావించాడు. కారు యెలాగైతే గుర్రానికి ప్రత్యామ్నాయంగా మారిందో అదే విధంగా ఆధునికవాదపు డెజైన్ ప్రాచీన గ్రీకు కాలం నుండి, మధ్య యుగం నుండి వారసత్వముగా పొందిన కట్టడాల యొక్క పాత శైలిని తిరస్కరించాలని కోరాడు. కొన్ని సందర్భాలలో, విధికన్నా ఆకృతి ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ యంత్రాన్ని అనుసరిస్తూ, రసజ్ఞులైన, ఆధునికవాదపు డిజైనర్లు, స్వచ్ఛమైన రేఖాగణిత ఆకృతుల మరియు ఉపయోగించిన పదార్ధాల విశిష్టతను నొక్కిచెప్పడానికి, డిజైన్లో అలంకారపూరితమైన ఉద్దేశాలని తిరస్కరించారు. న్యూ యార్క్లోని లుడ్విగ్ మియస్ వాన్ డర్ రోహే యొక్క సీగ్రాం బిల్డింగ్ (1956–1958) లాంటి ఆకాశహర్మ్యం ఒక ఆధునికవాదపు కట్టడానికి ఆదర్శప్రాయమయ్యింది. ఆధునికవాదుల, ఇళ్ళు మరియు గృహోపకరణాల యొక్క డిజైన్, ఆకృతి యొక్క సరళతనూ, స్పష్టతనూ, ఓపెన్ ప్లాన్ ఇంటీరియర్స్‌నూ, సందిగ్ధతాలేమినీ, ఉదాహరణపూర్వకంగా నొక్కిచెప్పింది. ఆధునికవాదం 19వ శతాబ్దపు ప్రభుత్వ, ప్రైవేటు కట్టడాల సంబంధాన్ని తిరగరాసింది; 19వ శతాబ్దంలో ప్రభుత్వ కట్టడాలు, భూమికి సమాంతరంగా వ్యాప్తి చెందితే, వైవిధ్యమైన సాంకేతిక కారణాల వల్ల, ప్రైవేటు కట్టడాలు నిట్టనిలువుగా ఉండేవి - అతి తక్కువ భూభాగంలో ఎక్కువ ప్రైవేటు స్థలాన్ని కేటాయించడానికి. దీనికి విరుధ్ధంగా, 20వ శతాబ్దంలో, ప్రభుత్వ కట్టడాలు నిట్టనిలువుగా ఉండి, ప్రైవేటు కట్టడాలు భూమికి సమాంతరంగా వ్యాప్తి చెందాయి. ఇదివరకటి పిడివాదం అలంకరణ, చారిత్రాత్మక ఉధ్ధారము, స్పేషియల్ డ్రామా యొక్క సరసమైన ఉపయోగానికి దారి తీసినప్పటికీ, సమకాలీన వాస్తుశాస్త్రపు ముఖ్యస్రవంతిలో, ఆధునికవాద నమూనాకు సంబంధించిన యెన్నో అంశాలు ఈ రోజు కూడా ఉన్నాయి.

వాసిలీ చెయిర్

ఇతర కళల్లో అట్లాంటి ఆచరణాత్మక పరిగణనలు అంత ముఖ్యం కావు. తమ కళను మరింత ప్రస్ఫుటం చేయడానికి, ప్రేక్షకులని తమ పురాభూత భావాలను, తమంత తామే ప్రశ్నించుకొనే శ్రమను తీసుకునే పరిస్థితి బలవంతంగా కల్పించడానికి, సాహిత్యంలోనూ, మరియు విజువల్ ఆర్ట్స్ లోనూ, కొంతమంది ఆధునికవాదులు అంచనాలను తారుమారు చేయడానికి సిధ్ధపడ్డారు. ఆధునికవాదంలోని ఈ అంశం, తరచు, 19వ శతాబ్దంలో, యూరోపు మరియు నార్త్ అమెరికాలలో అభివృధ్ధి చెందిన వినియోగదారుల సంస్కృతికి ప్రతిస్పందనగా కనపడేది. వినియోగదారుల ప్రాధాన్యతలూ, పక్షపాతధోరణులూ ఆసరాగా తీసుకుని, చాలా మంధి ఉత్పత్తిదారులు తమ సరుకు అమ్ముకోదగినదిగా చేసుకుంటే, ఉన్నతమైన ఆధునికవాదులు, సాంప్రదాయ ఆలోచనా ధోరణిని బలహీనం చేయడానికి, అట్లాంటి కన్స్యూమరిస్ట్ ఆటిట్యూడ్ ను తిరస్కరంచారు. కళావిమర్శకుడు క్లెమెంట్ గ్రీంబర్గ్, అవాంట్-గార్డ్ మరియు కిట్ష్ అనే వ్యాసంలో ఆధునికవాదం యొక్క ఈ సిధ్ధాంతాన్ని వివరించాడు. వారి డిజైన్ వినియోగదారులని కేవలం గరిష్ఠ ఆకర్షణకు గురి చేయడానికీ, కష్టమైన లక్షణాలనూ తొలగించడానికీ ఉద్దేశింపబడింది కాబట్టి, గ్రీన్ బర్గ్ వినియోగదారుల సంస్కృతికి చెందిన వస్తువులను "కిట్ష్" అని ముద్రవేసాడు. ఆ కారణంగా, గ్రీన్బర్గ్, ఆధునిక వినియోగ దారుల సంస్కృతికి ఉదాహరణలుగా నిలిచే వాణిజ్యపరమైన పాపులర్ మ్యూజిక్, హాలీవుడ్ మరియు అడ్వర్టైజింగ్ల అభివృధ్ధికి ఆధునికవాదం ప్రతిస్పందనగా భావించాడు. గ్రీన్బర్గ్ దీనికి పెట్టుబడిదారీ వ్యవస్థ పట్ల విప్లవాత్మకమైన తిరస్కారంతో సంబంధం ఆపాదించాడు.

కొంతమంది ఆధునికవాదులు తమను తాము రాజకీయ విప్లవంతో కూడిన, ఒక విప్లవాత్మకమైన సంస్కృతిలో భాగంగా భావించారు. రాజకీయ చైతన్యంతో కూడిన విప్లవం, రాజకీయ వ్యవస్థలలో మార్పు కన్నా ముఖ్యమైనదని నమ్మి, ఇతరులు కళాత్మక సంప్రదాయాలను, సాంప్రదాయసిధ్ధమైన రాజకీయాలను తిరస్కరించారు. చాలామంది ఆధునికవాదులు తమను తాము రాజకీయాలతో సంబంధం లేనివారిగా భావించారు. మార్పు ఇష్టపడని టీ.ఏస్. ఎలియట్ లాంటి ఇతరులు, ఒక కంజర్వేటివ్ (మార్పుకి ఇష్ట పడని) స్థానం నుండి, మాస్ పాపులర్ సంస్కృతిని తిరస్కరించారు. కొంతమంది, [33] సాహిత్యం లో, కళలో, ఆధునికవాదం, మెజారిటీ జనాభాను మినహాయించి, ఒక ఎలీట్ (సమాజంలో ఉన్నత స్థానానికి చెందిన వారు) సంస్కృతిని శాశ్వతం చేయడానికి పనిచేసిందని, వాదిస్తారు.

ఆధునికవాదం ఫై విమర్శలు[మార్చు]

ఫ్రాంజ్ మార్క్. ది ఫేట్ ఆఫ్ ది ఆనిమల్స్. 1913. ఆయిల్ ఆన్ కాన్వాస్. డిస్‌ప్లేయ్డ్ ఎట్ ది ఎగ్జిబిషన్ ఆఫ్ ఎంటార్టెట్ కున్స్ట్ ఇన్ మ్యూనిచ్, నాజి జర్మనీ, 1937.

ఆధునిక ఉద్యమం యొద్ద అత్యంత వివాదాస్పద అంశం సంప్రదాయాన్ని తిరస్కరించడం. ఆధునికవాదం - భావవ్యక్తీకరణ స్వేచ్ఛ, ప్రయోగాత్మకత, రాడికలిజం (సమూలమైన మార్పులు త్వరితగతిన కోరే వాదం), ఆదిమసమాజవాదాలకు ఇచ్చిన ప్రాధాన్యత, సాంప్రదాయిక అంచనాలను బేఖాతరు చేసింది. చాలా కళాకృతులలో ఇది ప్రేక్షకులు, ఉలిక్కిపడి, దూరమయ్యేలా చేసింది; వికారమైన, ఊహింపశక్యముకాని పరిణామాలకు దారి తీసింది. ఉదాహరణకి, అది వాస్తవికవాదంలో అసాధారణమైన, చికాకు పరిచే మూలకారణాల మిశ్రమాలు, అపశృతులను, స్వరనియంత్రణ లేని ఆధునిక సంగీతపు ఉపయోగం ఈ రకమైన పరిణామాలకు దారి తీసాయి. సాహిత్యంలో ఇది తరచు, నవలలలో అర్థమయ్యే ఇతివృత్తాలను, కారెక్టరైజేషన్ ను, కవిత్వంలో స్పష్టమైన అర్థంలేని వాటినీ తిరస్కరించింది

స్టాలిన్ వృధ్ధిలోకి వచ్చాక, సోవియట్ కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఇంతకు మునుపు, భవిష్యద్వాదాన్నీ, నిర్మాణవాదాన్నీ బలపరిచినప్పటికీ, ధనికవర్గాలకే పరిమితమైందన్న ఆరోపణతో ఆధునికవాదాన్ని తిరస్కరించింది. జర్మనీలోని నాజీ ప్రభుత్వం ఆధునికవాదాన్ని, నిరర్ధకభాషణముగా, స్వరూపకాముకతగా అంతేగాక జ్యూవిష్ మరియు నీగ్రోగానూ భావించింది. (చూడండి: యూదువ్యతిరేకత) ఆధునికవాద చిత్రాలను, నాజీలు, డీజెనరేట్ ఆర్ట్ అన్న ఎగ్జిబిషన్లో, మానసిక రోగుల చిత్రాలతో కలిపి ప్రదర్శించారు. ఆకార ప్రాధాన్యవాదాన్ని నిందించడం వృత్తి జీవితం యొక్క అంతానికి దారి తీస్తుంది, లేదా అంతకు మించిన హాని జరగచ్చు. ఈ కారణంగా చాలామంది ప్రపంచ యుధ్ధపు తర్వాతి తరానికి చెందిన ఆధునికవాదులు తాము నియంతృత్వానికి వ్యతిరేకంగా అత్యంత ముఖ్యమైన రక్షణ కవచమని భావించారు. ప్రభుత్వము లేదా ఇతర ఆధికారిక సముదాయంచే అణచివేతకు గురైన "కానరి ఇన్ ది కోల్ మైన్", వ్యక్తి స్వేచ్ఛకు ఆటంకం కలుగుతోందనే హెచ్చరికకు ప్రాతినిధ్యం వహించింది. లూవీ ఎ.సాస్ పిచ్చిని, ముఖ్యముగా స్కిజోఫ్రెనియా (తీవ్రభయాందోళన), మరియు ఆధునికవాదాన్ని, విడిగా ఉన్న కథనాలనూ, అది వాస్తవిక చిత్రాలనూ మరియు అస్పష్టతనూ చూసి, తక్కువ జాత్యహంకార ధోరణితో పోల్చాడు.[34]

నిజానికి, ఆధునికవాదం సమర్ధకులు వినియోగదారుల సంస్కృతిని తిరస్కరించినప్పిటికీ, ముఖ్యముగా వినియోగ/పెట్టుబడిదారి సమాజాలలోనే ఆధునికవాదం వృధ్ధి చెందింది. కానీ, 1960వ దశాబ్దంలో, రెండవ ప్రపంచ యుధ్ధం తర్వాత, ఉన్నతమైన ఆధునికవాదం వినియోగదార సంస్కృతితో కలవడం మొదలు పెట్టింది. "ది హూ అండ్ ది కింక్స్" లాంటి ప్రాతినిధ్యపు సంగీతం తర్వాత, బ్రిటన్లో, తనను తాను, "మాడర్నిస్ట్" అని పిలుచుకుంటూ ("మోడ్" అని కుదించబడిన) ఒక యువ ఉప-సంస్కృతి ఉద్భవించింది. బాబ్ డైలాన్, సెర్గే గైన్స్ బౌర్గ్ మరియు ది రోలింగ్ స్టోన్స్, జేంస్ జాయ్స్, సామ్యూఅల్ బెక్కెట్, జేంస్ థర్బర్, టీ.ఎస్. ఎలియట్, గ్విలాం అపోలినేర్, అల్లెన్ గిన్స్బర్గ్ మరియు ఇతరుల యొక్క సాహిత్య పరికరాలను దత్తు తీసుకుంటూ, జనామోద సంగీత సంప్రదాయాలను ఆధునిక కవిత్వంతో మేళవించారు. అనేక ఆల్బంలలో, వివిధ రకాల ఆధునికమైన మ్యూజికల్ ఇఫెక్ట్స్ సృష్టిస్తూ, బీటిల్స్ వృధ్ధి చెందింది. మరోపక్క, ఫ్రాంక్ జాప్పా, సిడ్ బారెట్ మరియు కాప్టెన్ బీఫ్హార్ట్ మరింత ప్రయోగత్మకమైన వారుగా తేలారు. ఆధునిక పరికరాలు పాపులర్ సినీమాలోనూ, తర్వాత మ్యూజిక్ వీడియోలలోనూ కనపడడం మొదలు పెట్టింది. సరళీకృతమైన, స్టైలైజ్డ్ ఆకృతులు ప్రజాదరణ పొందేసరికి, స్పేస్ ఏజ్ హైటెక్ భవిష్యత్తు స్వప్నాలతో తరచు సంబంధం ఉన్న పాపులర్ కల్చర్ యొక్క ముఖ్యస్రవంతిలోకి కూడా ఆధునిక డిజైన్ రావడం మొదలుపెట్టింది,

వినియోగదారుల సంస్కృతి మరియు ఆధునికవాదపు సంస్కృతి యొక్క ఉన్నత పాఠాంతరాల కలయిక ఆధునికవాదపు అర్థాన్ని సమూలంగా మార్చివేసింది. ఒకటి, సంప్రదాయాన్ని వ్యతిరేకించిన ఒక ఉద్యమం, తానే ఒక సంప్రదాయమై కూర్చుంది అని అది పరోక్షంగా సూచించింది. రెండు, అది, ఎలీట్ ఆధునికవాదపు మరియు మాస్ కన్స్యూమర్ సంస్కృతుల మధ్య అంతరం పదును కోల్పోయిందని తేల్చిచెప్పింది. కొంత మంది రచయితలు[ఎవరు?] ఆధునికవాదం వ్యవస్థీకరించబడిందనీ, ఇంకా ఒక విప్లవాత్మకమైన ఉద్యమంగా అది శక్తిని కోల్పోయిందని సూచిస్తూ, అదిప్పుడు "పోస్ట్ అవాంట్-గార్డ్" అనీ వెల్లడించారు. ఈ మార్పుని పోస్ట్ మాడర్నిజం అనే దశకు మొదలుగా చాలా మంది వ్యాఖ్యానించారు. కళా విమర్శకుడు రాబర్ట్ హ్యూజస్ లాంటి ఇతరులకి, పోస్ట్ మాడర్నిజం ఆధునికవాదపు కొనసాగింపుకి ప్రాతినిధ్యం వహిస్తుంది.

"యాంటీ-మాడర్నిజం" లేదా "కౌంటర్-మాడర్నిజం" ఉద్యమాలు, సంపూర్ణవాదం, సంబంధం మరియు ఆధ్యాత్మికతలను ఆధునికవాదానికి పరిష్కారాలుగా, విషపరిహారక ఔషదముగా (యాంటీడోట్స్) బలపరచడానికి ప్రయత్నిస్తాయి. అట్లాంటి ఉద్యమాలు, ఆధునికవాదాన్ని, ఏకైక కార్యకారణ సంబంధవాదంగా చూస్తాయి; అందువల్ల వ్యవస్థాపకమైన పరిణామాలనూ, మరియు ఉత్పన్నమయ్యే పరిణామాలనూ చూడలేవు. ఎంతో మంది ఆధునికవాదులు ఈ అభిప్రాయానికి వచ్చారు, ఉదాహరణకి పాల్ హిండర్మిత్ తన ఆలస్యపు దశలో మార్మిక వాదం పట్ల మొగ్గు చూపాడు. The Cultural Creatives: How 50 Million People Are Changing the World 2000వ సంవత్సరంలో, పాల్ హెచ్.రే మరియు షెర్రి రూత్ ఆండర్సన్, ఎ కల్చర్ ఆఫ్ హోప్లో ఫ్రెడ్రిక్ టర్నర్ మరియు ప్లాన్ బిలో లెస్టెర్ బ్రౌన్, వ్యక్తిగత సృజనాత్మక భావవ్యక్తీకరణ సాంకేతిక పరిజ్ఞానపు వాస్తవాలకు లోబడి ఉండాలని, ఏకంగా ఆధునికవాదపు మూలసిధ్ధాంతాన్నే స్పష్టంగా విమర్శించారు. దానికి బదులు, వ్యక్తి సృజనాత్మకత, దైనందిన జీవితాన్ని భావపరంగా అంగీకార యోగ్యం చేయాలని వాదించారు.

కొన్ని రంగాలలో, ఆధునికవాదపు పరిణామాలు, ఇతర రంగాల కన్నా, బలంగా, పట్టు విడవకుండా ఉన్నాయి. దృశ్యసంబంధమైన కళకు (విజువల్ ఆర్ట్) తన గతంతో పూర్తిగా సంబంధం తెగిపోయింది. చాలా రాజధాని నగరాలలో, రినైసాన్స్ కళకూ ఆధునిక కళకూ అంతరం చూపుతూ, "ఆధునిక కళ"కు మాత్రమే కేటాయించిన మ్యూజియుంస్ ఉన్నాయి. (సర్కా 1400 నుండి సర్కా 1900 వరకు) న్యూయార్క్ లోని మ్యూజియం ఆఫ్ మాడర్న్ ఆర్ట్, లండన్లో ది టేట్ మాడర్న్, మరియు పారిస్ లో సెంటర్ పోంపిడౌ వీటిలో కొన్ని ఉదాహరణలు. ఈ గాలరీలు ఆధునికవాదపు మరియు పోస్ట్ మాడర్నిస్ట్ దశలకు మధ్య ఎలాంటి అంతరాన్ని చూపించవు, అవి ఈ దశలను ఆధునిక కళలోని పరిణామాలుగా భావిస్తాయి.

ఆధునికవాదం, ఆధునికవాదం తరువాత (postmodernism) తేడాలు[మార్చు]

విస్తారమైన, వివిధరకాలైన సాంస్కృతిక ఉద్యమాలకి ఆధునికవాదం ఒక ఆవరణ పట్టిక. ఆధునికతకు భాష్యం చెప్పి ఆధునికత యొక్క జ్ఞానాన్ని ప్రదర్శించే, 20వ శతాబ్దపు కార్యకలాపాల గురించి ఒక విశాలమైన దృక్పథంతో వివరించే పదం ఐనప్పటికీ, రాజకీయ-సామాజిక సిధ్ధాంతానికి అనుగుణంగా తనకు తాను పేరు నిచ్చుకున్న ఒక కేంద్రీకృత ఉద్యమం పోస్ట్ మాడర్నిజం.[35][36][37]

పోస్ట్ మాడర్న్ సిధ్ధాంతము, ఆధునికవాదాన్ని వాస్తవాలతో సూత్రబధ్ధం చేయడం సందిగ్ధత కలిగించగల పరస్పర విరుధ్ధ భావాలకు దారి తీస్తుందని నొక్కి చెబుతుంది.[38]

ఒక సంకుచిత దృక్పథంలో, ఆధునికవాదం అనునది పోస్ట్ మాడర్న్ అయి ఉండాల్సిన అవసరం లేదు. ఆధునికవాదంలో యే అంశాలైతే తార్కికత మరియు సామాజిక-సాంకేతిక అభ్యుదయం యొక్క ప్రయోజనాలను ప్రబలం చేసాయో అవి మాత్రమే ఆధునికవాదంగా పరిగణించాలి.[39]

వీటిని కూడా చూడండి[మార్చు]

 • అమెరికన్ ఆధునికవాదం
 • అంతర్జాతీయ శైలి (వాస్తు శాస్త్రము)
 • లేట్ మాడర్నిజం
 • ఆధునిక వాస్తుశాస్త్రం
 • ఆధునిక గృహోపకరణాలు
 • ఆధునికవాదం (సంగీతం)
 • మాడర్నిస్మో
 • ఆధునిక సాహిత్యం
 • ఆంగ్లములో ఆధునిక కవిత్వం
 • పోస్ట్ మాడర్నిజపు కళ
 • రీమాడర్నిజం
 • కళావిష్కరణ

గమనికలు మరియు సూచనలు[మార్చు]

 1. హన్స్ హాఫ్మన్ బైయోగ్రఫి, రిట్రీవ్డ్ జనవరి, 30, 2009
 2. పెరికల్స్ లూవిస్, మాడర్నిజం, నేషనలిజం, అండ్ ది నావెల్ (కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రెస్, 2000). pp 38-39.
 3. (జేంస్) జాయ్సేస్ యులిసస్ ఈజ్ అ కామెడి నాట్ డివైన్, ఎండింగ్, లైక్ దంతెస్, ఇన్ ది విజన్ ఆఫ్ ఎ గాడ్ హూస్ విల్ ఈజ్ అవర్ పీస్, బట్ హ్యూమన్ ఆల్-టూ-హ్యూమన్ ..." పీటర్ ఫాల్క్నర్, మాడర్నిజం (టేలర్ & ఫ్రాన్సిస్, 1990) . p 60.
 4. గార్డ్నర్, హెలెన్, హార్స్ట్ డె ల క్రొఇక్స్ , రిచర్డ్ జి. టాన్సెయ్ , అండ్ డైయేన్ కిర్క్ పాట్రిక్ గార్డ్నర్స్ ఆర్ట్ త్రూ ది ఏజెస్ , (సాన్ డియెగో : హార్ కోర్ట్ బ్రేస్ జొవానోవిచ్, 1991) ISBN 0-15-503770-6. p. 953.
 5. అడోర్నో, థియోడోర్. మినిమా మొరాలియా, . వర్సొ 2005, p. 218.
 6. "ట్రడిషన్ అండ్ ది ఇండివిడ్యువల్ టాలెంట్ " (1919) ఇన్ సెలెక్టెడ్ ఎస్సేస్, పేపర్బాక్ ఎడిషన్. (ఫేబర్ & ఫేబర్, 1999) '
 7. చైల్డ్స్, పీటర్.మాడర్నిజం (రౌలెడ్జ్, 2000). ISBN 0-415-19647-7. p. 17. ఆక్సెస్డ్ ఆన్ 2009-02-08.
 8. "20వ శతాబ్దంలో, శాశ్వతంగా పరివర్తన చెందే స్థితిలో ఉండే, ఈ సుడిగుండాన్ని సృష్టించిన సామాజిక రీతులను మాడర్నిజం అనడం జరిగింది. ప్రపంచ-ప్రసిధ్ధి గాంచిన ఈ రీతులు ఆశ్చర్యపరిచేంత వైవిద్యం తో కూడిన దృక్పధాలనూ, భావాలనూ పోషించాయి. వీటి ఉద్దేశం, మగవారినీ మరియు ఆడవారినీ, ఆధునికతకు విషయాలుగా మరియు లక్ష్యాలుగా చేయటం, ఈ సుడిగుండం ద్వారా ప్రయాణించి దానిని తమదిగా చేసుకోడం కోసం అవసరమయ్యే శక్తినీ, తమను మార్చే ప్రపంచాన్ని మార్చడానికి అవసరమయ్యే శక్తినీ వారికి ఇవ్వటం. గతశతాబ్ద కాలంలో, ఈ దృక్పథాలూ మరియూ విలువలూ మాడర్నిజం పేరుతో వదులుగా ఒక సమూహంలాగా కలపబడ్డాయి." (బెర్మన్ 1988, 16)
 9. లీ ఓసర్, ది ఎతిక్స్ ఆఫ్ మాడర్నిజం: మోరల్ ఐడియాస్ ఇన్ యీట్స్, ఎలియట్, జాయ్స్, వూల్ఫ్ అండ్ బెకెట్ (కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రెస్, 2007): F.J. మార్కర్ & C.D. ఇన్నస్, మాడర్నిజం ఇన్ యూరోపియీన్ డ్రామా : ఇబ్సన్, స్ట్రింగ్‌బర్గ్ , పిరాండెల్లో. బెకెట్ ; మొరాగ్ షీచ్, "సిట్యువేటింగ్ సామ్యూల్ బెకెట్" pp2034-247 ఇన్ ది కేంబ్రిడ్జ్ కంపానియన్ టు ది మాడర్నిస్ట్ నావెల్ , (కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రెస్, 2007), కాత్రీన్ V. లిండ్బర్గ్, రీడింగ్ పౌండ్ రీడింగ్ : మాడర్నిజం ఆఫ్టర్ నియేషె (ఆక్స్‌ఫోర్డ్ యూనివర్సిటీ ప్రెస్, 1987); పెరికల్స్ లూవిస్, ది కేంబ్రిడ్జ్ ఇంట్రొడక్షన్ టు మాడర్నిజం (కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రెస్, 2007). pp21
 10. ఫ్రాస్కినా అండ్ హారిసన్ 1982, p. 5.
 11. "క్లెమెంట్ గ్రీంబర్గ్: మాడర్నిజం అండ్ పోస్ట్ అండ్ పోస్ట్‌మాడర్నిజం, సెవెంత్ పారాగ్రాఫ్ ఆఫ్ ది ఎస్సే. URL ఆక్సెస్డ్ ఆన్ 15 జూన్ 2006
 12. ఫ్రెడ్ ఆర్టన్ అండ్ గ్రిసెల్డా పోలోక్, అవాంట్-గార్డెస్ అండ్ పార్టిసాన్స్ రీవ్యూడ్ . మాంచెస్టర్ యూనివర్సిటీ, 1996
 13. మాడర్నిజం ఇనోట్స్.కాం
 14. యులిసస్ , హాస్ బీన్ కాల్డ్ "అ డెమాన్స్ట్రేషన్ అండ్ సమ్మేషన్ ఆఫ్ ది ఎంటయిర్ (మాడర్నిస్ట్) మూవ్మెంట్". బీబె, మారిస్ (ఫాల్ 1972). "యులిసస్ అండ్ ది ఏజ్ ఆఫ్ మాడర్నిజం". జేంస్ జాయ్స్ క్వార్టర్లి (యూనివర్సిటీ ఆఫ్ టుల్స) 10 (1): p. 176.
 15. నాచ్లిన్, లిండా, Ch.1 ఇన్ : విమెన్ ఆర్టిస్త్స్ అట్ ది మిలెనియం (ఎడిటెడ్ బై C. ఆంస్ట్రాంగ్ అండ్ C. డి జెఘర్) MIT ప్రెస్, 2006.
 16. పోలోక్, గ్రిసెల్డా, ఎన్‌కౌంటర్స్ ఇన్ ది వర్చువల్ ఫెమినిస్ట్ మ్యూసియం: టైం, స్పేస్ అండ్ ది ఆర్ఖైవ్ . రౌలెడ్జ్, 2007
 17. డి జెఘర్, కాతరీన్, అండ్ టీచర్, హెండెల్ (eds), 3 X అబ్‌స్ట్రాక్షన్ . న్యూ హేవెన్: యేల్ యూనివర్సిటీ ప్రెస్. 2005.
 18. అల్‌డ్రిచ్, లారి. యంగ్ లిరికల్ పేయింటర్స్, ఆర్ట్ ఇన్ అమెరికా, v.57, n6, నవంబర్-డిసెంబర్ 1969, pp.104-113.
 19. 19.0 19.1 19.2 మూవర్స్ అండ్ షేకర్స్, న్యూ యార్క్ , "లీవింగ్ CM", బై సరహ్ డౌగ్లస్, ఆర్ట్+ఆక్షన్, మార్చ్ 2007, V.XXXNo7.
 20. మార్టిన్, ఆన్ రే, అండ్ హొవార్డ్ జంకర్. ది న్యూ ఆర్ట్ ఇట్స్ వే, వే ఔట్, న్యూస్‌వీక్ 29 జులై 1968: pp.3,55-63.
 21. 21.0 21.1 21.2 హాల్ ఫోస్టర్, ది రిటర్న్ ఆఫ్ ది రియల్: ది అవాంట్-గార్డ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది సెంచురి , MIT ప్రెస్, 1996, pp44-53. ISBN 0-262-56107-7
 22. క్రెయిగ్ ఓవెన్స్, బియాండ్ రెకగ్నిషన్: రెప్రెసెంటేషన్, పావర్, అండ్ కల్చర్ , లండన్ అండ్ బర్కిలీ: యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ప్రెస్ (1992), pp74-75.
 23. స్టీవెన్ బెస్ట్, డౌగ్లస్ కెల్నెర్, ది పోస్ట్‌మాడర్న్ టర్న్ , గ్విల్‌ఫోర్డ్ ప్రెస్, 1997, p174. ISBN 1-57230-221-6
 24. Finkel, Jori (April 13, 2008). "Happenings Are Happening Again". The New York Times. Retrieved April 23, 2010.
 25. మాంట్ఫోర్ట్, నిక్, అండ్ నొవహ్ వార్‌డ్రిప్-ఫ్రుయిన్. ది న్యూ మీడియా రీడర్. కేంబ్రిడ్జ్, మాస్. (u.a.: MIT, 2003. ముద్రణ
 26. "Fluxus & Happening -- Allan Kaprow". Retrieved 2010-05-04. Text " Chronology " ignored (help); Cite web requires |website= (help)
 27. ఇహాబ్ హసన్ ఇన్ లారెన్స్ E. కహూన్, ఫ్రం మాడర్నిజం టు పోస్ట్‌మాడర్నిజం: ఆన్ ఆంథొలొజి , బ్లాక్‌వెల్ పబ్లిషింగ్, 2003. p13. ISBN 0-631-23213-3
 28. ఆండ్రియాస్ హూయ్సన్, ట్విలైట్ మెమొరీస్: మార్కింగ్ టైం ఇన్ అ కల్చర్ ఆఫ్ ఆమ్నీసియా , రౌలడ్జ్, 1995. p192. ISBN 0-415-90934-1
 29. ఆండ్రియాస్ హూయ్సన్, ట్విలైట్ మెమొరీస్: మార్కింగ్ టైం ఇన్ అ కల్చర్ ఆఫ్ ఆమ్నీసియా , రౌలడ్జ్, 1995. p196. ISBN 0-415-90934-1
 30. రాట్‌క్లిఫ్ఫ్, కార్టర్. ది న్యూ ఇంఫార్మలిస్ట్స్, ఆర్ట్ న్యూస్, v. 68, n. 8, డిసెంబర్ 1969, p.72.
 31. బార్బారా రోస్. అమెరికన్ పేయింటింగ్. పార్ట్ టూ: ది ట్వెంటియత్ సెంచూరి . పబ్లిష్‌డ్ బై స్కీర - రిజ్జొలి, న్యూ యార్క్, 1969
 32. వాల్టర్ డర్బి బన్నార్డ్. "నోట్స్ ఆన్ అమెరికన్ పేయింటింగ్ ఆఫ్ ది సిక్స్టీస్." ఆర్ట్‌ఫోరం , జనవరి 1970, vol. 8, no. 5, pp.40-45.
 33. ఉదహరింపు పొరపాటు: సరైన <ref> కాదు; ReferenceA అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు
 34. సాస్, లూవి ఎ. (1992). మాడ్నెస్ అండ్ మాడర్నిజం: ఇన్సేనిటి ఇన్ ది లైట్ ఆఫ్ మాడర్న్ ఆర్ట్, లిటరేచర్, అండ్ థాట్. న్యూ యార్క్: బేసిక్ బుక్స్. సైటెడ్ ఇన్ బాయర్. అమి (2004). "కాగ్నిషన్, కన్స్‌ట్రెయింట్స్, అండ్ కాన్సెప్‌ట్యువల్ బ్లెండ్స్ ఇన్ మాడర్నిస్ట్ మ్యూసిక్", ఇన్ ది ప్లెజర్ ఆఫ్ మాడర్నిస్ట్ మ్యూజిక్. ISBN 1-58046-143-3.
 35. ఆస్క్ఆక్స్‌ఫార్డ్.కాం
 36. మెరియం-వెబ్‌స్టర్స్ డెఫినిషన్ ఆఫ్ పోస్ట్‌మాడర్నిజం
 37. రుత్ రెయిచల్. కుక్స్ నవంబర్ 1989; అమెరికన్ హెరిటేజ్ డిక్షనరి్'స్ డెఫినిషన్ ఆఫ్ ది పోస్ట్‌మాడర్న్ Archived 2009-02-25 at the Wayback Machine.
 38. పోస్ట్‌మాడర్నిజం జార్జ్‌టౌన్ విశ్వవిద్యాలయం
 39. వాగ్నర్, బ్రిటిష్, ఐరిష్ అండ్ అమెరికన్ లిటరేచర్, ట్రైయర్ 2002, p. 210-2

మరింత చదవడానికి[మార్చు]

 • ఆంస్ట్రాంగ్, కరోల్ అండ్ డి జెఘర్, కాథరీన్ (eds). విమెన్ ఆర్టిస్ట్స్ ఆస్ ది మిల్లెనియం, కేంబ్రిడ్జ్, MA. అక్టోబరు బుక్స్. MIT ప్రెస్, ౨౦౦౬. ISBN 978-0-262-01226-3
 • అస్ప్రే, విలియం అండ్ ఫిలిప్ కిచ్చర్, ఇడిఎస్., హిస్టరి అండ్ ఫిలాసఫి ఆఫ్ మాడర్న్ మాథమేటిక్స్, మిన్నేసోటా స్టడీస్ ఇన్ ది ఫిలాసఫి ఆఫ్ సైన్స్ వాల్ XI, మిన్నియాపోలిస్ : యూనివర్సిటీ ఆఫ్ మిన్నెసోటా ప్రెస్, 1988
 • బేకర్, హౌస్టన్ A., Jr., మాడర్నిజం అండ్ ది హార్లెం రినైసాన్స్, షికాగో, యూనివర్సిటీ ఒఫ్ఫ్ షికాగో ప్రెస్, 1987
 • బెర్మన్, మార్షల్, ఆల్ దట్ ఈజ్ సాలిడ్ మెల్ట్స్ ఇంటు ఏర్ : ది ఎక్స్పీరిఎన్స్ ఆఫ్ మాడర్నిటి . సెకండ్ ఎడ్. లండన్: పెంగ్విన్, 1988. ISBN 0-14-010962-5.
 • బ్రాడ్బరి, మాల్కం, అండ్ జేంస్ మెక్ ఫార్లేన్ (eds.) మాడర్నిజం : ఎ గైడ్ టు యూరోపియన్ లిటరేచర్ 1890–1930 (పెంగ్విన్ "పెంగ్విన్ లిటరరి క్రిటిసిసం" సీరీస్,1978, ISBN 0-14-013832-3) .
 • బ్రష్, స్టీఫన్ జి., ది హిస్టరి ఆఫ్ మాడర్న్ సైన్స్ : ఎ గైడ్ టు ది సెకండ్ సైంటిఫిక్ రెవల్యూషన్, 1800–1950, Ames, IA: ఐయొవా స్టేట్ యూనివర్సిటీ ప్రెస్, 1988
 • సెంటర్ జార్జ్ పాంపిడౌ, Face a l'Histoire, 1933-1996. ఫ్లామోరియన్, 1996. ISBN 2-85850-898-4.
 • క్రౌచ్, క్రిస్టఫర్, మాడర్నిజం ఇన్ ఆర్ట్ డిసైన్ అండ్ ఆర్కిటెక్చర్, న్యూ యార్క్, సేంట్. మార్టిన్స్ ప్రెస్, 2000
 • ఎవర్డెల్, విలియం ఆర్., ది ఫర్స్ట్ మాడర్న్స్ : ప్రొఫైల్స్ ఇన్ ది ఆరిజిన్స్ ఆఫ్ ట్వెంటియత్ సెంచురి థాట్, షికాగో: యూనివర్సిటీ ఆఫ్ షికాగో ప్రెస్, 1997
 • ఐస్టీన్సన్, అస్ట్రడర్, ది కాన్సెప్ట్ ఆఫ్ మాడర్నిజం, ఇథాక, NY: కొమెల్ యూనివర్సిటీ ప్రెస్, 1992
 • ఫ్రాస్కీనా, ఫ్రాన్సిస్, అండ్ చాల్స్ హారిసన్ (eds.). మాడర్న్ ఆర్ట్ అండ్ మాడర్నిజం : ఎ క్రిటికల్ ఆంథాలజి ది ఓపెన్ యూనివర్సిటీ యొక్క సహాయ సహకారంతో ముద్రించబడింది.లండన్: హార్పర్ అండ్ రో, లిమిటెడ్, రిప్రింటెడ్, లండన్ : పాల్ చాప్మన్, పబ్లిషింగ్ లిమిటెడ్, 1982.
 • గేట్స్, హెన్రి లూవిస్. "ది నార్టన్ ఆంథాలజి ఆఫ్ ఆఫ్రికన్ అమెరికన్ లిటరేచర్. W.W. నార్టన్ & కంపని, Inc., 2004.
 • హ్యూజస్, రాబర్ట్, ది షాక్ ఆఫ్ ది న్యూ : ఆర్ట్ అండ్ ది సెంచురి ఆఫ్ చేంజ్ (గార్డనర్స్ బుక్స్, 1991, ISBN 0-500-27582-3).
 • కెన్నెర్, హ్యూజ్, ది పౌండ్ ఎరా (1971), బర్కిలీ, CA: యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ప్రెస్, 1973
 • కెర్న్, స్టీఫన్, ది కల్చర్ ఆఫ్ టైం అండ్ స్పేస్, కేంబ్రిడ్జ్, MA: హార్వార్డ్ యూనివర్సిటీ ప్రెస్, 1983
 • Kolocotroni, Vassiliki et al. , ed.,{{0}మాడర్నిజం ఆన్ ఆంథోలొజి ఆఫ్ సోర్సస్ అండ్ దాక్యుమెంట్స్ (ఎడిన్బర్గ్ : ఎడిన్బర్గ్ యూనివర్సిటీ ప్రెస్, 1998).
 • లెవెన్సన్, మైకేల్ (ed.), ది కేంబ్రిడ్జ్ కంపానియన్ టు మాడర్నిజం (కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రెస్, "కేంబ్రిడ్జ్ కంపానియన్స్ టు లిటరేచర్" సీరీస్, 1999, ISBN 0-521-49866-X).
 • లూవి పెరికల్స్. ది కేంబ్రిడ్జ్ ఇంట్రొడక్షన్ టు మాడర్నిజం (కేంబ్రిడ్జ్ : కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రెస్, 2007).
 • నికోల్స్, పీటర్, మాడర్నిజంస్ : ఎ లిటరరి గైడ్ (హామ్షైర్ అండ్ లండన్ : మాక్మిల్లన్, 1995).
 • పెవ్స్నర్, నికలౌస్, పయనీర్స్ ఆఫ్ మాడర్న్ డిసైన్ : ఫ్రం విలియం మారిస్ టు వాల్టర్ గ్రోపియస్ (న్యూ హేవెన్, CT : యేల్ యూనివర్సిటీ ప్రెస్, 2005, ISBN 0-300-10571-1).
 • —, ది సోర్సస్ ఆఫ్ మాడర్న్ ఆర్కిటెక్చర్ అండ్ డిసైన్ (థేంస్ అండ్ హడ్సన్, "వర్ల్డ్ ఆఫ్ ఆర్ట్" సీరీస్, 1985, ISBN 0-500-20072-6).
 • పోలోక్, గ్రిసెల్డా, జెనెరేషన్స్ అండ్ జియోగ్రఫీస్ ఇన్ ది విజువల్ ఆర్ట్స్ . (రౌలెడ్జ్, లండన్, 1996. ISBN 0-415-14128-1)
 • పోలోక్, ఫ్రిసెల్డా అండ్ ఫ్లోరన్స్, పెన్ని, లుకింగ్ బాక్ టు ది ఫ్యూచర్ : ఎస్సేస్ బై గ్రిసెల్డ పోలోక్ ఫ్రం ది 1990s . (న్యూ యార్క్ : G&B న్యూ ఆర్ట్స్ ప్రెస్, 2001. ISBN 90-5701-132-8)
 • సాస్ లూవీ A. (1992). మాడ్నెస్ అండ్ మాడర్నిజం : ఇన్సేనిటీ ఇన్ ది లైట్ ఆఫ్ మాడర్న్ ఆర్ట్, లిటరేచర్, అండ్ థాట్ . న్యూ యార్క్ : బేసిక్ బుక్స్. సైటెడ్ ఇన్ బాయర్, ఎమి (2004). 'కాగ్నిషన్, కన్స్ట్రెయింట్స్, అండ్ కాన్సెప్ట్యువల్ బ్లెండ్స్ ఇన్ మాడర్నిస్ట్ మ్యూజిక్", ఇన్ ది ప్లెజర్ ఆఫ్ మాడర్నిస్ట్ మ్యూజిక్ . ISBN 1-58046-143-3.
 • స్క్వార్జ్, సాంఫొర్డ్, ది మాట్రిక్స్ ఆఫ్ మాడర్నిజం : పౌండ్, ఎలియట్, అండ్ అర్లి ట్వెంటియత్ సెంచురి థాట్ , ప్రిన్స్టన్, NJ : ప్రిన్స్టన్ యూనివర్సిటీ ప్రెస్, 1985
 • వాన్ లూ, సోఫీ (ed.), జార్జ్ (l). రాయల్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్స్, ఆంట్వెర్ప్, 2006. ISBN 90-76979-35-9; ISBN 978-90-76979-35-9.
 • వెస్టన్, రిచర్డ్, మాడర్నిజం (ఫైడొన్ ప్రెస్, 2001, ISBN 0-7148-4099-8).
 • డి ఝెఘర్, కాథరీన్, ఇన్సైడ్ ది విజిబుల్ . (కేంబ్రిడ్జ్, MA: MIT ప్రెస్, 1996).

బాహ్య లింకులు[మార్చు]

మూస:Modernism మూస:Aesthetics మూస:Philosophy topics