Jump to content

ఆనందబజార్ పత్రిక

వికీపీడియా నుండి
ఆనందబజార్ పత్రిక
దస్త్రం:Anandabazar Patrika 9 December 2022 Front Page.jpg
9 డిసెంబర్ 2022 నాటి ఆనందబజార్ పత్రిక మొదటి పేజీ
రకందినపత్రిక
రూపం తీరుబ్రాడ్‌షీట్
యాజమాన్యంఎబిపి గ్రూప్
సంపాదకులుఇషానీ దత్తా రే[1]
భాషబెంగాలీ
కేంద్రంకోల్‌కతా, పశ్చిమ బెంగాల్, భారతదేశం
Circulation802,289[2] (as of జనవరి–జూన్ 2022)
OCLC number187024438

ఆనందబజార్ పత్రిక అనేది భారతదేశంలోని కోల్‌కతా నగరంలో ప్రచురితమవుతున్న బెంగాలీ భాష బ్రాడ్‌షీట్ దినపత్రిక. దీనిని ఎబిపి గ్రూప్ నిర్వహిస్తోంది.[3] ఇది మొదటిసారిగా 13 మార్చి 1922న నాలుగు పేజీల సాయంత్రం పత్రికగా విడుదలైంది. వలస పాలనకు వ్యతిరేకంగా సాహసోపేతమైన వైఖరిని ప్రదర్శించడం ద్వారా అప్పటి బ్రిటిష్ పత్రికలలో "ప్రమాద సంకేతం" (డేంజర్ సిగ్నల్) అనే పేరు తెచ్చుకుంది.[4] జనవరి-జూన్ 2022 నాటికి 802, 289 కాపీల ధృవీకరించిన సగటు సర్క్యులేషన్‌తో భారతదేశంలో అగ్రశ్రేణి ప్రాంతీయ భాషా పత్రికలలో ఒకటిగా ఎదిగింది.[5]

ప్రస్తుతం ఈ పత్రికకు ఇషానీ దత్తా రే సంపాదకత్వం వహిస్తున్నారు.[6] ప్రాంతీయ మీడియా సర్వేల ప్రకారం బర్తమాన్, ఈయ్ సమయ్, సంగ్బాద్ ప్రతిదిన్, ఆజ్‌కాల్, జాగో బంగ్లా, గణశక్తి, దైనిక్ స్టేట్స్‌మన్ పత్రికలు దీనికి ప్రధాన పోటీదారులు.

చరిత్ర

[మార్చు]

1871లో బ్రిటిష్ ఇండియాలోని (ప్రస్తుత బంగ్లాదేశ్) జెస్సోర్ జిల్లా, మాగురా అనే చిన్న గ్రామంలో తుషార్ కాంతి ఘోష్ తండ్రి సిసిర్ కుమార్ ఘోష్ ఒక బెంగాలీ వార్తాపత్రికను ప్రచురించారు. తుషార్‌కాంతి నానమ్మ సోదరి ఆనందమయి పేరు మీద దానికి ఆనంద బజార్ అని పేరు పెట్టారు. అయితే కొద్దికాలానికే ఆ పత్రిక మూతపడింది. 1868లో ఘోష్ తన నానమ్మ అమృతమయి పేరు మీద మరో పత్రికను ప్రచురించారు, అదే అమృత బజార్ పత్రిక.[7]

తరువాత 1922లో యజమాని సురేష్ చంద్ర మజుందార్, సంపాదకుడు ప్రఫుల్ల కుమార్ సర్కార్ ఆనందబజార్ పత్రికను పునఃప్రారంభించారు.[8] వారి యాజమాన్యంలో 13 మార్చి 1922న మొదటిసారిగా ముద్రించబడిన ఈ పత్రిక బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పనిచేసింది.[9][10] 1922లో ఇది నాలుగు పేజీల సాయంత్రం దినపత్రికగా ప్రచురితమైంది. ప్రఫుల్ల కుమార్ సర్కార్ మరణానంతరం ఆయన కుమారుడు అశోక్ కుమార్ సర్కార్ ఈ పత్రికను అభివృద్ధి చేశారు.[9][11] ఫీచర్స్ విభాగంలో మొట్టమొదటి కలర్ ప్రింటింగ్ ప్రారంభించారు. ఈ పత్రిక ఇంటర్నెట్ ఎడిషన్ 2001లో ప్రారంభమైంది, ఇది ప్రజలకు ఆన్‌లైన్ ద్వారా వార్తలను అందిస్తోంది. ముద్రిత పత్రికలో ప్రకటనలను కూడా అందిస్తుంది.[12] 2010లో ఫార్చ్యూన్ ఇండియా మ్యాగజైన్‌ను ప్రచురించేందుకు టైమ్ ఇంక్ సంస్థ ఎబిపి గ్రూప్‌తో ఒక లైసెన్స్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మ్యాగజైన్ ప్రతి సంవత్సరం ఫార్చ్యూన్ ఇండియా 500 జాబితాను ప్రచురిస్తుంది.[13]

విమర్శలు, వివాదాలు

[మార్చు]

బంగ్లాదేశ్ గురించి ప్రచురించిన వార్తల విషయంలో ఆనందబజార్ విమర్శలు ఎదుర్కొంది.[14][15] "దారుణమైన తప్పిదాలు" చేసిన దాని చరిత్రను ఉటంకిస్తూ 2017లో ది డైలీ స్టార్ (బంగ్లాదేశ్) ప్రచురించిన ఒక కథనం దీనిని "ఆల్ట్-జర్నలిజం" అని ఆరోపించింది.[16]

జూన్ 2020లో బంగ్లాదేశ్ గురించి అవమానకరమైన వ్యాఖ్యలు చేసినందుకు ఈ పత్రిక తీవ్ర విమర్శల పాలైంది. తరువాత అది బేషరతు క్షమాపణతో పాటు ముద్రిత సంచికలో సవరణను జారీ చేసింది.[17][18][19][20][21][22]

డిసెంబర్ 2024లో బంగ్లాదేశ్ సైన్యంపై ఆనందబజార్ ప్రచురించిన కథనాన్ని బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారు 'అబద్ధం' అని ప్రకటించారు.[23] ఈ కథనం "తప్పుదారి పట్టించేదిగా", "నిరాధారమైనదిగా" ఉందని బంగ్లాదేశ్ ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR) ఆక్షేపించింది. అంతేకాకుండా ప్రత్యుత్తరం ఇచ్చే హక్కును కల్పించనందుకు "సరైన జర్నలిస్ట్ పద్ధతిని" పాటించలేదని ఇస్పర్ పత్రికను విమర్శించింది. సున్నితమైన సమస్యలపై వార్తలు రాసే ముందు విశ్వసనీయ వర్గాల నుండి సమాచారాన్ని నిర్ధారించుకోవాలని వారు మీడియాను కోరారు.[24][25]

జనవరి 2025లో బంగ్లాదేశ్ సైన్యంపై ఆనందబజార్ రాసిన మరో కథనాన్ని బంగ్లాదేశ్ అధికారులు 'నకిలీ వార్త'గా గుర్తించారు. బంగ్లాదేశ్ సిఏ ప్రెస్ స్పందిస్తూ ఈ కథనానికి "బాలీవుడ్ రొమాంటిక్ కామెడీ సినిమా కంటే వాస్తవంలో ఎలాంటి ఆధారం లేదు" అని పేర్కొంది.[26][27] ప్రచురితమైన ఒక రోజు తర్వాత ఈ కథనాన్ని ఆన్‌లైన్ పోర్టల్ నుండి తొలగించారు.[28][29]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Ishani Dutta Roy – Editor, Anandabazar Patrika". WAN‑IFRA. Archived from the original on 20 జూలై 2025. Retrieved 5 July 2025.
  2. "Highest Circulated Daily Newspapers (language wise)" (PDF). Audit Bureau of Circulations. Retrieved 5 July 2025.
  3. "ABP Group – official site". Retrieved 5 July 2025.
  4. "Anandabazar Patrika: A perfect blend of tradition and modernity". Communication Today. Retrieved 5 July 2025.
  5. "Advertise in Anandabazar Patrika – releaseMyAd". releaseMyAd. Retrieved 5 July 2025.
  6. "Science Communicators Meet: Participant List" (PDF). Retrieved 5 July 2025.
  7. "The Tribune, Chandigarh, India – Nation". The Tribune. Archived from the original on 27 October 2020. Retrieved 10 September 2016.
  8. Chakrabarti, Kunal; Chakrabarti, Shubhra (22 August 2013). Historical Dictionary of the Bengalis (in ఇంగ్లీష్). Scarecrow Press. ISBN 978-0-8108-8024-5.
  9. 1 2 "Ananda Bazar Patrika Uniqueness: red ink printing" (PDF). Media Mimansa. 2009. Archived from the original (PDF) on 11 June 2012. Retrieved 13 March 2013.
  10. "আমাদের সম্পর্কে". Retrieved 12 June 2024.
  11. "A Centenary Tribute – Asoke Kumar Sarkar (1912–1983)". The Telegraph (India) (in ఇంగ్లీష్). Retrieved 11 September 2023.
  12. "Anandabazar Patrika | Purono". archives.anandabazar.com. Anandabazar Patrika. Archived from the original on 14 March 2014. Retrieved 14 March 2014.
  13. "India magazine". Archived from the original on 7 December 2021. Retrieved 17 January 2012.
  14. "The new face of disinformation in post-Hasina Bangladesh". The Business Standard (in ఇంగ్లీష్). 2024-10-21. Retrieved 2025-10-05.{{cite web}}: CS1 maint: deprecated archival service (link)
  15. "Anandabazar report on India's communication with US about AL baseless: Fakhrul". The Business Standard (in ఇంగ్లీష్). 2023-08-20. Retrieved 2025-10-05.{{cite web}}: CS1 maint: deprecated archival service (link)
  16. Ahasan, Nazmul (2017-04-07). "Anandabazar's alt-journalism". The Daily Star (in ఇంగ్లీష్). Retrieved 2025-10-05.{{cite web}}: CS1 maint: deprecated archival service (link)
  17. "Anandabazar apologizes for derogatory remarks on Bangladesh". Dhaka Tribune (in ఇంగ్లీష్). 2020-07-27. Retrieved 2025-10-05.{{cite web}}: CS1 maint: deprecated archival service (link)
  18. "Anandabazar apologises for using word 'charity' on Bangladesh". The Business Standard (in ఇంగ్లీష్). 2020-06-23. Retrieved 2025-10-05.{{cite web}}: CS1 maint: deprecated archival service (link)
  19. ""We're sorry," says Anandabazar Patrika". The Daily Observer. Retrieved 2025-10-05.{{cite web}}: CS1 maint: deprecated archival service (link)
  20. "Anandabazar aplogises for using derogatory remark about Bangladesh". Prothomalo (in ఇంగ్లీష్). 2020-06-23. Retrieved 2025-10-05.{{cite web}}: CS1 maint: deprecated archival service (link)
  21. "Anandabazar apologises for using 'khairati' in news on China-Bangladesh relation". The Daily Star (in ఇంగ్లీష్). 2020-06-23. Retrieved 2025-10-05.{{cite web}}: CS1 maint: deprecated archival service (link)
  22. "India our biggest friend, but their media's comments on our exports to China not ok: Bangladesh FM". The New Indian Express (in ఇంగ్లీష్). 2020-06-23. Retrieved 2025-10-05.{{cite web}}: CS1 maint: deprecated archival service (link)
  23. "CA press wing debunks Indian Anandabazar Patrika's report". New Age. 2024-12-28. Retrieved 2025-10-05.{{cite news}}: CS1 maint: deprecated archival service (link)
  24. "Bangladesh Army trashes India's Anandabazar report on 'Pakistan Army members' arrival'". The Business Standard (in ఇంగ్లీష్). 2024-12-28. Retrieved 2025-10-05.{{cite web}}: CS1 maint: deprecated archival service (link)
  25. "ISPR protests Anandabazar report on Bangladesh Army". Dhaka Tribune (in ఇంగ్లీష్). 2024-12-28. Retrieved 2025-10-05.{{cite web}}: CS1 maint: deprecated archival service (link)
  26. "CA Press Wing slams Anandabazar Patrika for false report on Bangladesh Army". Dhaka Tribune (in ఇంగ్లీష్). 2025-01-31. Retrieved 2025-10-05.{{cite web}}: CS1 maint: deprecated archival service (link)
  27. "CA press wing debunks Indian Anandabazar Patrika's report on Bangladesh army". The Daily Observer. 2025-01-31. Retrieved 2025-10-05.{{cite web}}: CS1 maint: deprecated archival service (link)
  28. "Indian Anandabazar Patrika removes false report on Bangladesh army". The Daily Observer. 2025-02-01. Retrieved 2025-10-05.{{cite web}}: CS1 maint: deprecated archival service (link)
  29. BSS (2025-01-31). "Chief Adviser's press wing debunks Ananda Bazar Patrika's report on Bangladesh army". Prothomalo (in ఇంగ్లీష్). Retrieved 2025-10-05.{{cite web}}: CS1 maint: deprecated archival service (link)

బయటి లింకులు

[మార్చు]