Jump to content

ఆనందవాణి

వికీపీడియా నుండి
ఆనందవాణి
ఆనందవాణి
రకంవారపత్రిక
రూపం తీరుడైజెస్ట్
ప్రచురణకర్తవి.కాళిదాసు
సంపాదకులువి.కాళిదాసు
సహ సంపాదకులుఆండ్ర శేషగిరిరావు, ముద్దా విశ్వనాథం
భాషతెలుగు
కేంద్రంమద్రాసు

ఆనందవాణి[1] వారపత్రిక ప్రతి ఆదివారం మద్రాసు నుండి వెలువడేది. ఉప్పులూరి కాళిదాసు ఈ పత్రికకు సంపాదకుడు, ప్రచురణకర్త. ఆండ్ర శేషగిరిరావు, ముద్దా విశ్వనాథంలు ఈ పత్రికకు అసోసియేట్ ఎడిటర్లుగా పనిచేశారు.శ్రీశ్రీ[2],ఆరుద్ర[3],రావి కొండలరావు[4] వంటివారు ఈ పత్రికలో సబ్‌ఎడిటర్లుగా పనిచేశారు. 1934లో తొలి సంచిక వెలువడింది. వారం వారం తెనుగువారికి అన్నిసంగతులూ కమ్మని మాటలతో, వన్నెలతో, బొమ్మలతో అందించే పత్రికగా ఇది పేర్కొనింది. ఈ పత్రికలో సంపాదకీయం, మీ నక్షత్రఫలం, భారత రాజకీయాలు: అవీ-ఇవీ-అన్నీ, విచిత్రాలు, మంచీచెడ్డా, పెద్దల పిన్న కథలు, హాస్యం మొదలైన శీర్షికలతో పాటు కథలు, జోకులు, వ్యాసాలు, పుస్తక సమీక్షలు ప్రచురించబడ్డాయి. దేవతల యుద్ధం, కొండయ్య వంటి నవలలు ధారావాహికగా ప్రచురితమయ్యాయి. ఇంటూరి వెంకటేశ్వరరావు, విశ్వనాథ కవిరాజు, కవికొండల వెంకటరావు, పఠాభి, గరిమెళ్ల సత్యనారాయణ, పురిపండా అప్పలస్వామి, అడపా రామకృష్ణారావు, శ్రీశ్రీ,భోగరాజు పట్టాభిసీతారామయ్య,బుచ్చిబాబు మొదలైన వారి రచనలు ఈ పత్రికలో చోటు చేసుకున్నాయి.

ఆనందవాణి పత్రికలో రచనలకు పారితోషికం ఇచ్చేవారు కాదు. అయితే వెంబడి ఉత్తరాలు వ్రాసి చివరకు తివిరి ఇసుమున తైలము తీసినట్లు ఆనందవాణి నుంచి పారితోషికం పొందినందుకు పారితోషిక వీరుడిగా పేరొచ్చేసిందని ప్రముఖ రచయిత, సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత భమిడిపాటి రామగోపాలం వ్రాసుకున్నారు.[5]

ఇతర లింకులు

[మార్చు]
  1. | ఇంగ్లీషు వికీపీడియాలో వ్యాసం

మూలాలు

[మార్చు]
  1. ఎడిటర్ (1944-08-20). "ఆనందవాణి". ఆనందవాణి. 10 (34). Archived from the original on 5 మార్చి 2016. Retrieved 15 January 2015.
  2. డా, రాజరామమోహన్‌రాయ్ (3 Mar 2013). "సినిమా పాటలు - శ్రీశ్రీ". విశాలాంధ్ర. Archived from the original on 14 ఆగస్టు 2020. Retrieved 15 January 2015.
  3. డా. ఎ., రవీంద్రబాబు. "ఆరుద్ర ఆనవాళ్లు". తెలుగువన్.కామ్. Retrieved 15 January 2015.
  4. ఎన్., తారక రామారావు (4 Jan 2015). "తారక రామారావు". ఆంధ్రజ్యోతి దినపత్రిక. Retrieved 15 January 2015.[permanent dead link]
  5. భమిడిపాటి, రామగోపాలం (March 1990). [[ఇట్లు మీ విధేయుడు]] (నేనెందుకు రాస్తున్నాను). విశాఖపట్టణం: విశాఖ సాహితి. Retrieved 10 March 2015. {{cite book}}: URL–wikilink conflict (help)
"https://te.wikipedia.org/w/index.php?title=ఆనందవాణి&oldid=4338981" నుండి వెలికితీశారు